వివేక చూడామణి - 8 / Viveka Chudamani - 8


🌹. వివేక చూడామణి - 8 / Viveka Chudamani - 8 🌹

✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ


🌻 4. వివిధ మార్గాలు - 1 🌻


40. ఈ ప్రాపంచిక విషయ వాసనలనే మహాసముద్రమును దాటుటకు ఏ విధమైన మార్గాలను అనుసరించిన నా భవిష్యత్తు సాఫీగా జరుగుతుందో నాకు తెలియుటలేదు. నన్ను రక్షించుటకు, నా దుఃఖాలను అంతము చేయుటకు ప్రభూ మీరు నాకు ఏ విధముగా తోడ్పడగలరు.

41. సాధకుడు ఈ విధముగా తన మార్గదర్శకుని ప్రార్ధించినప్పుడు, ఈ ప్రపంచమనే అడవిలోని దావాలనము అడవిని దహించినట్లు, ఆ సాధువు తన మృదువైన కృపాదృష్టిని దయతో సాధకునిపై ప్రసరింపజేసి అతని భయాన్ని దుఃఖాన్ని తొలగించగల్గుతాడు.

42. ఏ సాధకునికి గురువు తన రక్షణ కవచాన్ని అందించాడో అతడు జనన, మరణ, దుఃఖాల నుండి విముక్తిని పొంది, గురువు యొక్క శాస్త్ర విహితమైన సూచనలు ఆమోదిస్తూ, పవిత్రమైన మన
స్సుతో ప్రశాంత స్థితిని పొందుటకు గురువు అతనికి దయతో సత్యబోధ చేయగల్గుతాడు.

43. జ్ఞాని అయిన ఓ సాధకుడా! భయపడకు నీకు చావులేదు ఈ సంసారసాగరమును దాటుటకు యోగులు మార్గమును చూపించినారు. అదే మార్గమును నేను నీకు చూపించెదను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹VIVEKA CHUDAMANI - 8 🌹

✍️ Swami Madhavananda
📚 Prasad Bharadwaj


🌻 4. Different Ways - 1 🌻


40. How to cross this ocean of phenomenal existence, what is to be my fate, and whichof the means should I adopt – as to these I know nothing. Condescend to save me, O Lord, and describe at length how to put an end to the misery of this relative existence.

41. As he speaks thus, tormented by the afflictions of the world – which is like a forest on fire – and seeking his protection, the saint eyes him with a glance softened with pity and spontaneously bids him give up all fear.

42. To him who has sought his protection, thirsting for Liberation, who duly obeys theinjunctions of the Scriptures, who is of a serene mind, and endowed with calmness – (to such a one) the sage proceeds to inculcate the truth out of sheer grace.

43. Fear not, O learned one, there is no death for thee; there is a means of crossing thissea of relative existence; that very way by which sages have gone beyond it, I shall inculcate to thee.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


31 Jan 2021


No comments:

Post a Comment