31-JANUARY-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 625 / Bhagavad-Gita - 625🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 260, 261 / Vishnu Sahasranama Contemplation - 260, 261🌹
3) 🌹 Daily Wisdom - 44 🌹
4) 🌹. వివేక చూడామణి - 08 🌹
5) 🌹Viveka Chudamani - 08 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 18🌹
7) 🌹. ధ్యానం మాత్రమే మీకు వాస్తవంతో ముఖాముఖీ జరిగేలా చేస్తుంది. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 15 / Bhagavad-Gita - 15🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 195 / Sri Lalita Chaitanya Vijnanam - 195🌹 
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538🌹  
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 625 / Bhagavad-Gita - 625 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 42 🌴*

42. శమో దమస్తప: శౌచం క్షాన్తిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ||

🌷. తాత్పర్యం : 
అనుభవపూర్వక జ్ఞానము; ఆస్తిక్యమ్ – ధర్మతత్పరత; బ్రహ్మకర్మ – బ్రాహ్మణుని ధర్మము;స్వభావజం – స్వీయప్రకృతిచే కలిగినది.

🌷. భాష్యము :
శాంతి, ఇంద్రియనిగ్రహము,తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితి, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనమనెడి సహజ లక్షణములను గూడి బ్రాహ్మణులు కర్మ నొనరింతురు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 625 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 42 🌴*

42. śamo damas tapaḥ śaucaṁ
kṣāntir ārjavam eva ca
jñānaṁ vijñānam āstikyaṁ
brahma-karma svabhāva-jam

🌷 Translation : 
Peacefulness, self-control, austerity, purity, tolerance, honesty, knowledge, wisdom and religiousness – these are the natural qualities by which the brāhmaṇas work.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 260, 261 / Vishnu Sahasranama Contemplation - 260, 261 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻260. వృషోదరః, वृषोदरः, Vr̥ṣodaraḥ🌻*

*ఓం వృషోదరాయ నమః | ॐ वृषोदराय नमः | OM Vr̥ṣodarāya namaḥ*

వర్షతి ఇతి వృషమ్ అని వ్యుత్పత్తి వర్షించునది కావున 'వృషమ్‍.' హరిర్వృషోదరో యస్య వర్షతీవోదరం ప్రజాః ఈతడు సకల జగత్సృష్టికర్త కావున ఈతని ఉదరము ప్రాణులను వర్షించుచున్నదో అనునట్లు కనబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 260🌹*
📚. Prasad Bharadwaj 

*🌻260. Vr̥ṣodaraḥ🌻*

*OM Vr̥ṣodarāya namaḥ*

As per the derivation Varṣati iti vr̥ṣam / वर्षति इति वृषम् As it showers it is 'Vr̥ṣam / वृषम्‌.' Harirvr̥ṣodaro yasya varṣatīvodaraṃ prajāḥ / हरिर्वृषोदरो यस्य वर्षतीवोदरं प्रजाः He rains as it were, the creatures from His womb and hence He is Vr̥ṣodaraḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः ।
वर्धनो वर्धमानश्च विविक्तश्श्रुतिसागरः ॥ २८ ॥

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః ॥ ౨౮ ॥

Vr̥ṣāhī vr̥ṣabho viṣṇurvr̥ṣaparvā vr̥ṣodaraḥ ।
Vardhano vardhamānaśca viviktaśśrutisāgaraḥ ॥ 28 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 261 / Vishnu Sahasranama Contemplation - 261🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 261. వర్ధనః, वर्धनः, Vardhanaḥ 🌻*

*ఓం వర్ధనాయ నమః | ॐ वर्धनाय नमः | OM Vardhanāya namaḥ*

వర్ధనో వర్ధయతి యో వృద్ధిని లేదా శుభములను కలుగజేయువాడు గావున విష్ణువు వర్ధనుడనబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 261🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 261. Vardhanaḥ 🌻*

*OM Vardhanaḥ namaḥ*

Vardhano vardhayati yo / वर्धनो वर्धयति यो 

One who augments. He who causes prosperity or bestows auspicious augmentation.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 24
Svīyaṃ vākyamr̥taṃ kartumavatīrṇo’si me gr̥he,
Cikīrṣurbhagavānjñānaṃ bhaktānāṃ mānavardhanaḥ. (30)

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
स्वीयं वाक्यमृतं कर्तुमवतीर्णोऽसि मे गृहे ।
चिकीर्षुर्भगवान्ज्ञानं भक्तानां मानवर्धनः ॥ ३० ॥

Kardama Muni said: You, my dear Lord, who are always increasing the honor of Your devotees, have descended in my home just to fulfill Your word and disseminate the process of real knowledge.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः ।
वर्धनो वर्धमानश्च विविक्तश्श्रुतिसागरः ॥ २८ ॥

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః ॥ ౨౮ ॥

Vr̥ṣāhī vr̥ṣabho viṣṇurvr̥ṣaparvā vr̥ṣodaraḥ ।
Vardhano vardhamānaśca viviktaśśrutisāgaraḥ ॥ 28 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 44 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. We Must Know Who is Our God 🌻*

Spiritual seekers are certainly after God. This is very well known. But we must know who is our God. God is the fulfilling counterpart of the present state of our evolution. Anything that is capable of making us complete is our God. Anything that allows us to remain partial is not going to satisfy us. 

That which completes our personality in any manner, in any degree of its expression, is to be considered as our necessity, and teachers like Patanjali, who were great psychologists, have taken note of this important suggestion to be imparted to students. 

The more internal we go, the greater is the need we will feel for guidance outwardly. One may look all right and not feel the need for any kind of assistance from others. But the internal forces are more difficult to subdue and handle. They are impetuous, uncontrollable. 

The desires which are of this character have to be sublimated with a great analytical understanding by the study of scriptures, resort to holy company, isolation and self-investigation, and methods of this nature.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 8 🌹*
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 4. వివిధ మార్గాలు - 1 🌻*

40. ఈ ప్రాపంచిక విషయ వాసనలనే మహాసముద్రమును దాటుటకు ఏ విధమైన మార్గాలను అనుసరించిన నా భవిష్యత్తు సాఫీగా జరుగుతుందో నాకు తెలియుటలేదు. నన్ను రక్షించుటకు, నా దుఃఖాలను అంతము చేయుటకు ప్రభూ మీరు నాకు ఏ విధముగా తోడ్పడగలరు.

41. సాధకుడు ఈ విధముగా తన మార్గదర్శకుని ప్రార్ధించినప్పుడు, ఈ ప్రపంచమనే అడవిలోని దావాలనము అడవిని దహించినట్లు, ఆ సాధువు తన మృదువైన కృపాదృష్టిని దయతో సాధకునిపై ప్రసరింపజేసి అతని భయాన్ని దుఃఖాన్ని తొలగించగల్గుతాడు.

42. ఏ సాధకునికి గురువు తన రక్షణ కవచాన్ని అందించాడో అతడు జనన, మరణ, దుఃఖాల నుండి విముక్తిని పొంది, గురువు యొక్క శాస్త్ర విహితమైన సూచనలు ఆమోదిస్తూ, పవిత్రమైన మనస్సుతో ప్రశాంత స్థితిని పొందుటకు గురువు అతనికి దయతో సత్యబోధ చేయగల్గుతాడు.

43. జ్ఞాని అయిన ఓ సాధకుడా! భయపడకు నీకు చావులేదు ఈ సంసారసాగరమును దాటుటకు యోగులు మార్గమును చూపించినారు. అదే మార్గమును నేను నీకు చూపించెదను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹VIVEKA CHUDAMANI - 8 🌹*
✍️ Swami Madhavananda
📚 Prasad Bharadwaj 

*🌻 4. Different Ways - 1 🌻*

40. How to cross this ocean of phenomenal existence, what is to be my fate, and whichof the means should I adopt – as to these I know nothing. Condescend to save me, O Lord, and describe at length how to put an end to the misery of this relative existence.

41. As he speaks thus, tormented by the afflictions of the world – which is like a forest on fire – and seeking his protection, the saint eyes him with a glance softened with pity and spontaneously bids him give up all fear.

42. To him who has sought his protection, thirsting for Liberation, who duly obeys theinjunctions of the Scriptures, who is of a serene mind, and endowed with calmness – (to such a one) the sage proceeds to inculcate the truth out of sheer grace.

43. Fear not, O learned one, there is no death for thee; there is a means of crossing thissea of relative existence; that very way by which sages have gone beyond it, I shall inculcate to thee.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 18 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 9. బిందువు 🌻*

శుద్ధచైతన్యము నుండి సంకల్ప ముద్భవించు క్షణమున చైతన్యమే బిందువుగ నేర్పడును. అనగా సంకల్ప బీజముగ తాను మొత్తము చైతన్యము నుండి వేరగును. బిందువేర్పడిన తక్షణమే దానికి పరిధి ఏర్పడును. అనగా సంకల్ప బిందువునకు కాలపరిమితి ఏర్పడును. 

సృష్టియందు మానవుని యందుకూడ ఇట్లే సంకల్పము లేర్పడుచుండును. మరల శుద్ధచైతన్యమున లీనమగుచుండును. కేంద్రమునుండి పరిధికి గల దూరము సంకల్పము యొక్క వైశాల్యమును నిర్ణయించినది. ఒక సంకల్పము నిర్వర్తింపబడు లోపల అందులో అంతర్భాగముగ మరియొక సంకల్పము మొలకెత్తును. 

అనగా ఆదిసంకల్పములలోని వివరములే అనుగత సంకల్పములుగ దిగి వచ్చుచుండును. ఈ అనుగత సంకల్పములన్నియు ఆది సంకల్పము వశమున నుండును. 

స్థూలముగ ఆది సంకల్పము నుండి ఏర్పడు అనుగత సంకల్పములు ఏడుగ పెద్దలు వర్గీకరింతురు. సూక్ష్మముగ మానవ మేధస్సునకు అందని వర్గీకరణము లున్నవి. ఆదిసంకల్పమునే మహా సంకల్పమని కూడ అందురు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ధ్యానం మాత్రమే మీకు వాస్తవంతో ముఖాముఖీ జరిగేలా చేస్తుంది. 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
📚. ప్రసాద్ భరద్వాజ

ఒకసారి జీవితమంటే ఏమిటో స్వయంగా మీరు తెలుసుకుంటే, మరణం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు. అంతేకాక, దానిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలరు. ఆ శక్తి మీలోనే ఉంది. అది మీ హక్కు. కానీ, అందుకు మీరు మీ మనసునుంచి మనోరహిత స్థితిలోకి చేరే చిన్నప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.

ఒక శిశువు జన్మించిన వెంటనే దాని జీవితం ప్రారంభమైనట్లు, ఒక వృద్ధుడు మరణించిన వెంటనే అతని జీవితం ముగిసిపోయినట్లు మీరు భావిస్తారు. కానీ, అది నిజంకాదు. జనన, మరణాలు జీవితం యొక్క రెండు చివరలు కావు. ఎందుకంటే, వాటికన్నా జీవితం చాలా పెద్దది. జీవితంలో అనేక జనన, మరణాలు జరుగుతూ ఉంటాయి. ఆద్యంతాలు లేనిదే జీవితం జీవిత, శాశ్వతత్వాలు రెండూ సమానమే. కానీ, జీవితం మరణంలోకి ఎలా మళ్ళుతుందో మీరు సులభంగా అర్థం చేసుకోలేరు. అలాగే, అది అసాధ్యమని కూడా మీరు అంగీకరించలేరు.

జీవితంలో అనూహ్యమైనవి కొన్ని ఉంటాయి. జీవితం మరణంలోకి మళ్ళడమనేది వాటిలో ఒకటి. ఎప్పుడు, ఎక్కడ జీవితం ముగిసి మరణంగా మారుతుందో అలాగే ఎప్పుడు, ఎక్కడ జీవితం మళ్ళీ ప్రారంభమవుతుందో మీరు గిరిగీసి చెప్పలేరు.

జీవితం ప్రారంభం శిశువు పుట్టినప్పుడా లేక గర్భధారణ జరిగినప్పుడా? గర్భధారణకు ముందే తల్లిగర్భంలోని బీజం, తండ్రి శరీరంలోని వీర్యకణాలు సజీవంగా ఉన్నాయే కానీ, మరణించలేదు. 

ఎందుకంటే, రెండు నిర్జీవాల కలయిక ఒక జీవాన్ని ఎప్పటికీ సృష్టించలేదు. మరి శిశువు ఎప్పుడు జన్మించినట్లు? ఈ విషయంలో విజ్ఞానశాస్త్రం కూడా ఒక కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది. అందుకు కారణం దాని దగ్గర ఎలాంటి ఆధారము లేదు. ఎందుకంటే, పుట్టుకనుంచే బీజాలను తల్లి తనలో మోస్తోంది.

ఒక విషయాన్ని మీరు ఇక్కడ అంగీకరించాలి. గర్భధారణకు ముందే మీ ఉనికిలోని సగం మీ తల్లిలో సజీవంగా ఉంది. మిగిలిన సగం మీ తండ్రి ద్వారా సజీవంగానే లభిస్తుంది. ఎందుకంటే, తండ్రి శరీరంనుంచి విడుదలైన వీర్యకణాలన్నీ సజీవంగానే ఉంటాయి. కానీ, వాటి జీవితకాలం కేవలం రెండు గంటలు మాత్రమే.

ఆ సమయంలోనే అవి తల్లి శరీరంలో ఉన్న బీజాన్ని కలుసుకోవాలి. ప్రతి వీర్యకణం కచ్చితంగా తన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. కొన్ని కణాలు బీజం వైపు పరిగెడుతుంటే, మరికొన్ని కణాలు సోమరిపోతుల్లా చాలా నిదానంగా నడుస్తూ ఉంటాయి. అందుకే అవి ఎప్పటికీ బీజాన్ని చేరుకోలేవు. ఇలాంటి లక్షణాలన్నీ పుట్టుకతోటే సంక్రమిస్తాయి. అలాంటి లక్షణాలు సంక్రమించిన వ్యక్తులు మరణించేందుకైనా సిద్ధపడతారే కానీ, పరుగెత్తలేరు. కనీసం ఏం జరుగుతోందో కూడా వారికి తెలియదు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 15 / Bhagavad-Gita - 15 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము 🌴
శ్లోకము 15

15. పాంచజన్యం హృషీకేశో 
దేవదత్తం ధనంజయ: |
పౌణ్డ్రం దధ్మౌ మాహాశంఖం
 భీమకర్మా వృకోదర: ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజనప్రియుడు, ఘన కార్యములను చేయువాడు అగు భీముడు పౌండ్రమనెడి తన మాహాశంఖము నూదెను.

🌷. బాష్యము :  
సర్వేంద్రియములకు ప్రభువైనందునే శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు హృషీకేషుడు తెలుపబడినాడు. జీవులందరును అతని అంశలు గావున జీవుల ఇంద్రియములు సైతము అతని ఇంద్రియములు అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి తెలియలేనందున వారికి ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు.

భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. కాని అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండును. శుద్ధభక్తుని విషయమున అతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించును. 

ఇచ్చట కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుని దివ్యేంద్రియములను ప్రత్యక్షముగా నియమించుటచే శ్రీకృష్ణభగవానునికి ప్రత్యేకముగా “హృషీ కేశుడు” అనెడి నామము వాడబడినది. వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధనామములను కలిగియుండును. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 15 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Verse 15 🌴

15. pāñcajanyaṁ hṛṣīkeśo
devadattaṁ dhanañ-jayaḥ
pauṇḍraṁ dadhmau mahā-śaṅkhaṁ
bhīma-karmā vṛkodaraḥ

🌷 Translation : 
Lord Kṛṣṇa blew His conchshell, called Pāñcajanya; Arjuna blew his, the Devadatta; and Bhīma, the voracious eater and performer of herculean tasks, blew his terrific conchshell, called Pauṇḍra.

🌷 Purport : 
Lord Kṛṣṇa is referred to as Hṛṣīkeśa in this verse because He is the owner of all senses. The living entities are part and parcel of Him, and therefore the senses of the living entities are also part and parcel of His senses. The impersonalists cannot account for the senses of the living entities, and therefore they are always anxious to describe all living entities as senseless, or impersonal. 

The Lord, situated in the hearts of all living entities, directs their senses. But He directs in terms of the surrender of the living entity, and in the case of a pure devotee He directly controls the senses. Here on the Battlefield of Kurukṣetra the Lord directly controls the transcendental senses of Arjuna, and thus His particular name of Hṛṣīkeśa. The Lord has different names according to His different activities. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 195 / Sri Lalitha Chaitanya Vijnanam - 195 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |*
*సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖*

*🌻195. 'దోషవర్జితా' 🌻*

శ్రీమాత దోషములు వర్ణించినదని అర్థము.

సృష్టికార్యము ఒక అగ్నికార్యము. అట్టి కార్యమున కొన్ని మలినముల పుట్టుక తప్పదు. ఆ మలినములను ఆమె విసర్జించి అమలగా సృష్టియందు విస్తరించి యుండును. అట్టి మలినముల నుండియే దోషములు పుట్టును. మలిన దోషముల యందు ఆమె ఉండదు. 

అన్నము, అశుద్ధము అనునవి గమనించినపుడు, అన్నము నందామె యుండును. అశుద్ధమున యుండదు. అశుద్ధము విసర్జించ వలసినదే. అన్నము వండినపుడు పొగ, మసి ఏర్పడును. పొగను పీల్చరాదు. మసిని పూసుకొనరాదు. పొగ, మసి వచ్చునని అన్నము వండుట మానరాదు. అశుద్ధము లేర్పడునని అన్నము తినుట, నీరు త్రాగుట మానుట వివేకము కాదు. 

అన్నమును, నీటిని గొని, మలమూత్రములను విసర్జించుట ప్రాణికోటికి సహజము. సృష్టి త్రిగుణాత్మకమగుటచే సత్వగుణమున కెంత ప్రాధాన్యత ఉన్నదో, రజోగుణమునకు, తమోగుణమునకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. మూడు గుణముల నుండి దోషములు పుట్టు చున్నవి. రజోగుణము లేనిదే ఎవ్వరునూ కార్యోన్ముఖులు కాలేరు.

అట్లే తమోగుణము లేనిదే విశ్రాంతి, నిద్ర యుండవు. సత్వ గుణము లేనిచో స్థిమిత ముండదు. మూడు గుణములూ ఆవశ్యకమే. మూడునూ దివ్యగుణములే. అవి శ్రీమాతనుండి ఉద్భవించినవి కదా! ఈ గుణములు నిర్వర్తింప బడుచున్నప్పుడు, అన్ని దోషములు కూడా ఏర్పడుచుండును. దోషములు ఎప్పటికప్పుడు నిర్మూలించుకొన వలెను.

దోష విసర్జనము చేయనిచో దోషములు బలమై గుణములు మసకబారును. ప్రతినిత్యము శరీర మలినములు నిర్మూలించు కొననిచో శరీరము రోగగ్రస్తమగును కదా! 

అట్లే వాక్కు, ఇంద్రియములు, మనస్సులను వినియోగించు చున్నపుడు కూడ దోషములు ఏర్పడవచ్చును.
దోషములేని భాషణము, ఇంద్రియ పరితృప్తి, మనో భాపన కలిగియున్నవాడు పూర్ణానందమును పొందగలడు. ఇట్లు మూడు లోకముల దోషములను నిత్యమూ విసర్జించుచూ జీవించువాడు దేవీ ప్రకాశము కలిగి విరాజిల్లును. 

అద్దమున్న చాలడు. దానిని నిత్యమూ పరిశుభ్రము చేసుకొను చుండవలెను. అప్పుడే ప్రతిబింబము స్పష్టముగా గోచరించును. జీవుడు దేవుని ప్రతిబింబమే. తనయందలి దైవము తనకు నిత్యమూ గోచరించవలెనన్నచో మనో ఇంద్రియ శరీరములందలి దోషములను నిత్యమూ విసర్జించు చుండవలెను. శ్రీమాత పరిపూర్ణ దోషవర్ణిత. అందువలన ఆమెయందు శివతత్త్వము పరిపూర్ణముగ ప్రతిబింబించ వచ్చును. అందులకే ఆమె 'శివా' అయినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 195 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Doṣa-varjitā दोष-वर्जिता (195) 🌻*

She is devoid of blemishes, yet another quality of the Brahman. Blemish arises out of hatred, desire, etc. Here, blemish refers to mind and not the gross body. She does not have any blemish and this has been discussed in earlier nāma-s in this Sahasranāma. 

With this nāma the effects of worshipping Her formless form (nirguna Brahman) ends. Nāma-s 196 to 248 discuss about Her various forms known as saguṇa Brahman or the Brahman with attributes. Worshipping God without form is called nirguṇa worship and considered as superior. Worshipping God in various forms is called saguṇa worship. Religious faiths are based on saguṇa worship (with forms and attributes).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 1 🌴*

1. శ్రీ భగవానువాచ
అభయం సత్త్వసంశుద్దిర్ జ్ఞానయోగవ్యవస్థితి: |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ భరతవంశీయుడా! భయరాహిత్యము, స్వీయస్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మికజ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము,

🌷. భాష్యము :
కడచిన పంచదశాధ్యాయపు ఆరంభమున ఈ భౌతికజగత్తు యొక్క సంసారవృక్షము (ఆశ్వత్తవృక్షము) వర్ణింపబడినది. ఆ వృక్షము యొక్క అదనపు వ్రేళ్ళు శుభాశుభములుగా తెలియబడు జీవుల కర్మలతో పోల్చబడినవి. దైవీస్వభావము కలిగిన దేవతల గూర్చియు, అసురస్వభావము కలిగిన దానవుల గూర్చియు నవమాధ్యాయమున కూడా వర్ణింపబడినది. 

ఇక ఇప్పుడు వేదముల ననుసరించి సత్త్వగుణకర్మలు ముక్తిపథమున పురోగమించుటకు దోహదములుగా భావించబడి “దైవీప్రకృతి” యని (స్వభావరీత్యా దివ్యములు) తెలియబడుచున్నది. అట్టి దివ్యస్వభావమున నిలిచినవారు ముక్తిమార్గమున నిశ్చయముగా పురోగతి సాధింపగలరు. కాని రజస్తమో గుణములందు వర్తించువారికి ఇందుకు భిన్నముగా ముక్తినొందు నవకాశమే లభింపదు. 

వారు మానవులుగా మర్త్యలోకమునందు నిలుచుటయో లేదా జంతుజాలమున జన్మించుటయో లేదా ఇంకను నీచమైన జన్మలను పొందుటయో జరుగును. ఈ షోడశాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు దైవీప్రకృతిని, దాని గుణములను, అలాగుననే ఆసురీప్రకృతిని, దాని గుణములను వర్ణించుచున్నాడు. ఈ దైవాసురగుణముల లాభనష్టములను సైతము భగవానుడు వివరింపనున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 538 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 1 🌴*

1. śrī-bhagavān uvāca
abhayaṁ sattva-saṁśuddhir
jñāna-yoga-vyavasthitiḥ
dānaṁ damaś ca yajñaś ca
svādhyāyas tapa ārjavam

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Fearlessness; purification of one’s existence; cultivation of spiritual knowledge; charity; self-control; performance of sacrifice; study of the Vedas; austerity; simplicity;

🌹 Purport :
In the beginning of the Fifteenth Chapter, the banyan tree of this material world was explained. The extra roots coming out of it were compared to the activities of the living entities, some auspicious, some inauspicious. In the Ninth Chapter, also, the devas, or godly, and the asuras, the ungodly, or demons, were explained. 

Now, according to Vedic rites, activities in the mode of goodness are considered auspicious for progress on the path of liberation, and such activities are known as daivī prakṛti, transcendental by nature. 

Those who are situated in the transcendental nature make progress on the path of liberation. For those who are acting in the modes of passion and ignorance, on the other hand, there is no possibility of liberation. 

Either they will have to remain in this material world as human beings, or they will descend among the species of animals or even lower life forms. In this Sixteenth Chapter the Lord explains both the transcendental nature and its attendant qualities and the demoniac nature and its qualities. He also explains the advantages and disadvantages of these qualities.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share 
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/     

Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

Join and Share 
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ 

Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  
www.facebook.com/groups/vishnusahasranam/

Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita 
www.facebook.com/groups/bhagavadgeetha/

Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA 
www.facebook.com/groups/yogavasishta/

Join and Share వివేక చూడామణి viveka chudamani 
www.facebook.com/groups/vivekachudamani/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment