🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 194 / Sri Lalitha Chaitanya Vijnanam - 194 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖
🌻194. 'దురాచార శమనీ' 🌻
తన భక్తుల దురాచారములను శమింపజేయునది శ్రీమాత అని అర్థము.
సత్పురుషుడైనను కాలమునకు, దేశమునకు, కర్మమునకు లోబడుట జరుగుచుండును. అట్టి సమయమున వారినుండి దురాచారములు జరుగవచ్చును. కాని వారు దేశభక్తులగుటచే, అసహజములైన వారి దురాచారములు, ఆమె త్వరితగతిని శమింపజేయును.
“జ్ఞానులు సైతము నా మాయకు లోబడియే యుందురు. నా మాయ నెవ్వరినీ దాటుటకు శక్యము కాడు. నా అనుస్మరణము వలన మాయను దాటుటకు వీలగును” అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపినాడు. మాయ క్రమ్ముట ఎప్పుడు ఎవ్వరి కెక్కడైననూ జరుగవచ్చును, అజ్ఞానులు మాయయందే జీవింతురు. జ్ఞానులకు సైతము మాయ క్రమ్ముట అనేకానేక గాథలలో గమనింతుము. కైకేయి ఒక రాత్రికి మాయలో పడినది.
జానకి దినములో కొంత సమయము మాయలో పడి లక్ష్మణుని దూషించినది. మాయ కమ్మినపుడు దురాచారము జరుగవచ్చును.
వస్తుతః దైవీ స్వభావము కలవారు మాయలో పడినపుడు దేవ్యారాధన బలమున మరల స్వస్థత పొందుదురు. కారణము దేవీ అనుగ్రహమే. తన భక్తుల దురాచారములను ఆమె శీఘ్రగతిని శమింపజేయును. దురాచారముల నన్నింటినీ శమింపజేసి, జీవుల నుత్తీర్ణులను చేయుటయే శ్రీమాత కారుణ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 194 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Durācāra-śamanī दुराचार-शमनी (194) 🌻
Performing those actions that are prohibited by scriptures is called ‘dur-ācāra’. Ācāra is known as customs or traditions. These customs are of two types.
The customs that are prescribed by Veda-s belong to the first type. In the second category are the customs that are introduced recently, not prescribed by Veda-s. The customs that were introduced in recent times do not have significant spiritual values.
A prayer done for a minute with deep devotion is much more powerful than performing expensive rituals. Veda-s never said that one should spend beyond his means to perform rituals, most of which are hyped in recent times.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Jan 2021
No comments:
Post a Comment