దేవాపి మహర్షి బోధనలు - 17


🌹. దేవాపి మహర్షి బోధనలు - 17 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 8. మా దివ్య శరీరము 🌻


మేము అగుపడుట, అదృశ్యమగుట చూచి దిగ్ర్భాంతి చెంద నవసరము లేదు. ఇది ఒక వైజ్ఞానిక శాస్త్రము. సూక్ష్మలోకమున స్వామిత్వము, శాశ్వతత్వము పొందిన వారికి ఈ విషయము క్రీడాప్రాయము. కొన్ని కిరణముల ప్రభావమున అగుపడుట జరుగును.

వాటిని మరల విడుదల చేయుట వలన అదృశ్య మగుట జరుగును. ఈ ప్రక్రియ అదృశ్యమగు సూక్ష్మశరీరము ద్వారా జరుగును. ఈ విధముగ అవసరమును బట్టి భూమిపై ఎక్కడైనా, ఎపుడైనా అవతరించ గలుగుట మాకు గల మంచి సౌకర్యము.

సూక్ష్మ శరీర మాధారముగ అంతర్ గ్రహ ప్రయాణములు కూడ మేము సలుపు చుందుము. ఇది అనేక జన్మల కృషి. అంతర్ గ్రహ ప్రయాణములకు వలసిన సూక్ష్మశరీరము అత్యంత తోజోవంతముగ నుండును. బహు పటుత్వము కలిగి యుండును. భౌతికచక్షువులతో ఈ మా శరీరమును దర్శించుట సాధ్యము కాదు.

అందువలననే భౌతిక శరీరమును కూడ ధరించి యుందుము. ఉత్తమ సాధకులకు కూడ మా వెలుగు శరీరము స్పష్టాస్పష్టముగ దర్శించుట యుండును కాని పూర్ణ దర్శనమునకు అవకాశము లేదు. మీ క్షేమము కోరి పూర్ణదర్శన మీయజాలము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


30 Jan 2021

No comments:

Post a Comment