దేవాపి మహర్షి బోధనలు - 31


🌹. దేవాపి మహర్షి బోధనలు - 31 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 22. కర్ణుడు - కుంతి 🌻

బృహస్పతి జీవనమునకు, జ్ఞానమునకు, సమర్థతకు, పవిత్రతకు, సద్గుణ సంపత్తికి, సృజనాత్మక శక్తికి, బ్రహ్మచర్యమునకు ప్రతీక. ఆకాశ శబ్దమునకు కూడ ప్రతీక. ఆకాశ శబ్దము “ఖం”.

కం, గం, కూడ ఈ శబ్దమునుండి ఉద్భవించినవే. శుక్రుడు అనుభూతికి, ఆనందమునకు, గ్రహించుటకు, అందమునకు, సౌకుమార్యమునకు, శీలమునకు, ప్రేమకు, కన్యాత్వమునకు ప్రతీక. పై సంకేతము నందలి ఉత్తర భాగము సూర్యుడు.

దక్షిణభాగము + సూక్ష్మ ప్రకృతి లేక కన్య శుక్ర సంకేతము సూర్యునిచే ప్రభావితమై వెలుగొందుచున్న సూక్ష్మ ప్రకృతిని లేక కన్యను సూచించును.

సూర్యోపాసనమున నిలచిన పవిత్రమైన కన్యగ మహా భారతమున కుంతిని పేర్కొనుట, ఈ రహస్యార్థమును వివరించుటయే. సూర్యుని ఆధారముగ కుంతి అను కన్య కర్ణుని పొందినది. కర్ణమే కర్ణుడు. అనగా వెలుగొందుచున్న సూక్ష్మ ప్రకృతినుండి సూర్యుని సహకారముతో దిగివచ్చిన వాడు. కర్ణములేని సృష్టి లేదు.

రూపాంతరమున ఈ సంకేతము బృహస్పతిగ తెలియ బడుచున్నది. కర్ణములేని సృష్టి లేదు అనుట, కర్ణుడులేని భారతము లేదు అనుట ఒకే అర్థమును సూచించగలవు. బృహస్పతి లేని జీవనమే లేదు కదా!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021

No comments:

Post a Comment