శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 208 / Sri Lalitha Chaitanya Vijnanam - 208


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 208 / Sri Lalitha Chaitanya Vijnanam - 208 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖



🌻 208. 'మహేశ్వరీ' 🌻

ఓంకారమున కతీతమైనది; గుణముల కతీతమైనది శ్రీదేవి అని అర్థము.

జీవులు ఈశ్వరత్వము చెందగలరు. అనగా స్వాలంబనము పొందగలరు. స్వతంత్రతను పొందగలరు. కాని జీవులకు ఈశ్వరత్వ మనుగంచు తత్త్వము మహేశ్వర తత్త్వము.

వేదమునందు, వేదాంతమునందు ప్రతిపాదింపబడినది ఓంకారము. అట్టి ఓంకారమునకు కూడ పరమైనది మహేశ్వర తత్త్వము. మహేశ్వర పదమునకు త్రిగుణాతీత తత్త్వమని అర్థము. త్రిగుణములు మహేశ్వరి తత్త్వము నుండే పుట్టుచున్నవి. ఓంకారము దాని ప్రథమ రూపము.

గుణములు దాని శక్తులు. ఓంకార మందలి అకారము సత్త్వగుణముగ ఆ తత్త్వమే దిగివచ్చును. “అకార మెరిగినవారే నన్నెరిగిన వారు.” అని శ్రీకృష్ణుడు బోధించెను.

అ కారము అక్షరములలో ప్రథమమైనది. అమ్మ అను పదము అకారము నుండియే పుట్టినది. అది తెనుఁగు భాష ప్రత్యేకత. అకారము నుండి ఓంకారము, ఓంకారము నుండి మహేశ్వరత్వము సోపానములుగ గ్రహించవలెను. మహేశ్వరీ దేవి గుణములకు కూడ అందనిది.

ఎవడు సత్యమగు బ్రహ్మచర్యముతో, మనశ్శుద్ధితో మహేశ్వర లింగమును పూజించునో అతడు మహేశ్వర అనుగ్రహమున ఈశ్వరత్వమును పొందును.

24 తత్త్వములతో కూడిన సృష్టికి కాలమే ఈశ్వరుడు. అట్టి కాలమునకు కూడ ఈశ్వరుడు మహేశ్వరుడు. మహేశ్వరునే యోగేశ్వరుడని కూడ అందురు. ఈశ్వరునకు ఈశ్వరుడు మహేశ్వరుడు. యోగీశ్వరుల కీశ్వరుడు యోగేశ్వరుడు. ఇదియే పరమ పదము. శ్రీదేవి నిజస్థితి ఇది. కావున ఆమె మహేశ్వరి మరియు యోగేశ్వరి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 208 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj



🌻 Māheśvarī माहेश्वरी (208) 🌻

Wife of Māhesvarā, a form of Śiva. Mahānārāyaṇa Upaniṣad (XII.17) says, “He is the Supreme Lord who transcends ॐ which is uttered at the commencement of the recital of the Veda-s and which is dissolved in the primal cause during contemplation.” His wife is Māheśvarī. Māheśvara form of Śiva is the Supreme form.

He is beyond the three guṇas- sattva, rajas and tamas. Liṅga form of Śiva is Māhesvara form. Liṅga Purāṇa says that all the deities are present in Liṅga form of Śiva, a resemblance to Śrī Cakra.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021

No comments:

Post a Comment