11) 🌹. శివ మహా పురాణము - 347🌹
12) 🌹 Light On The Path - 100🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 232🌹
14) 🌹 Seeds Of Consciousness - 296🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 171🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 26 / Bhagavad-Gita - 26🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 27 / Lalitha Sahasra Namavali - 27🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 27 / Sri Vishnu Sahasranama - 27 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -149 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 2
*🍀 2. దివ్య సంకల్పము - నిత్య నైమిత్తిక కర్మలను, కర్తవ్య కర్మను ఫలా పేక్షను ఆశ్రయింపక నిర్వర్తించువాడు, తనదైన యితర సంకల్పములు లేనివాడు యోగి యగును. కర్తవ్య కర్మలు ప్రారబ్దము నుండి, సంచితము నుండి కాలము రూపమున ఏర్పడుచుండును. కాలమందించిన కర్మమును ఫలాపేక్ష రహితముగ నిర్వర్తించుటయే సాధకునకు ప్రధానము. ఋణము, కర్మము తరుగవలెనన్నచో కర్తవ్య నిర్వహణమే గాని అందుండి మరల మొలకలు పుట్టించు కొనుట కాదు. దైవము స్వతంత్ర బుద్ధి నిచ్చెను. స్వతంత్ర బుద్ధిని బాధ్యతయని ఎరిగి నిర్వర్తింప వలెనే గాని, హక్కుగ భావించి దుర్వినియోగము చేయరాదు. 🍀*
యం సన్న్యాస మితి ప్రాహు ర్యోగం తం విద్ది పాండవ |
న హ్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన || 2
దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని గూడ నెరుగుము. సంకల్ప సన్యాసము చేయనివాడు యోగి కానేరడు. (అట్టివాడు సన్యాసియు కాదు.)
నిత్య నైమిత్తిక కర్మలను, కర్తవ్య కర్మను ఫలా పేక్షను ఆశ్రయింపక నిర్వర్తించువాడు, తనదైన యితర సంకల్పములు లేనివాడు యోగి యగును. సన్యాసియు అగును. పుట్టగొడుగుల వలె సంకల్పములు గలవారు సన్యాసులు కారు, యోగులు కారు. కోరికలు గలవారు, యిచ్ఛాద్వేషములు కలవారు యోగమును గూర్చి, సన్యాసమును గూర్చి భావించుట వ్యర్థము.
నిత్య నైమిత్తిక కర్మ లనగా దంతధావనము, స్నానము, ఆహార స్వీకరణము, నిద్ర మొదలగునవి. ఇవి ఎవ్వరికైనను తప్పని సరి. కర్తవ్య కర్మలు ప్రారబ్దము నుండి, సంచితము నుండి కాలము రూపమున ఏర్పడుచుండును. కాలమందించిన కర్మమును ఫలాపేక్ష రహితముగ నిర్వర్తించుటయే సాధకునకు ప్రధానము.
నిర్వర్తించు కర్మల నుండి, కర్తవ్యముల నుండి రజోగుణము కారణముగ నూతన సంకల్పములు, నూతన కర్మలను సాధారణముగ మానవుడు పెంచుకొను చుండును. బాకీలు తీర్చుచు, క్రొత్త బాకీలు ఏర్పరచు కొనువాడు తెలివిగలవాడను కొనుటకు వీలు లేదు. ఋణము, కర్మము తరుగవలెనన్నచో కర్తవ్య నిర్వహణమే గాని అందుండి మరల మొలకలు పుట్టించు కొనుట కాదు. పూర్వము చేసిన కామపూరిత సంకల్పముల కారణముగ ఋణము లేర్పడుటచే, ఆ ఋణములే ప్రస్తుత జన్మమున కర్తవ్యములుగ దరి చేరును.
శ్రద్ధాభక్తులతో వానిని నిర్వర్తించుటయేగాని నూతన కర్మల నేర్పరచుకొనరాదు. ఏది కర్తవ్యమో, ఆ కర్తవ్యము నెంతవరకు నిర్వర్తించవలెనో, తెలిసి నిర్వర్తించవలెను. తమది కాని కర్తవ్యము తమదనుకొనుట అవివేకము. రజోగుణ దోషము వలన ధనకాంక్ష, కీర్తి కాంక్ష, పదవీ కాంక్ష లేర్పడి, చేయుచున్న కర్తవ్యముల నుండి అనేకానేక కార్యములు పుట్టుచు నుండును. స్వకాంక్షకై నిర్వర్తించుట యుండును. గనుక చేయు పనులయందు అవకతవకలుండి, వాని నుండి కర్మఫలములు పుట్టి, మరల ఋణ రూపము ధరించి, కర్తవ్యములై కాలము రూపమున సమీపించును.
తన సంకల్పములే తన బంధనములకు కారణమని తెలియుటకు కొన్ని జన్మలు పట్టవచ్చును. సృష్టి యందు దివ్య సంకల్పమొకటి ఆరంభము నుండి నడచుచున్నది. సృష్టి కథ మధ్యమున మానవు డవతరించినాడు. అతడు జరుగుచున్న కథలో తన వంతు కర్తవ్యమును నిర్వర్తించినచో ఉత్తీర్ణు డగును. కృతకృత్యు డగును. లేనిచో బందీ యగును.
జరుగుచున్న కథలో తన కథను స్వంత సంకల్పములతో చేర్చుట వలన మానవుడు బద్దుడగుచున్నాడు. అతనికి దైవము స్వతంత్ర బుద్ధి నిచ్చెను. స్వతంత్ర బుద్ధిని బాధ్యతయని ఎరిగి నిర్వర్తింప వలెనే గాని, హక్కుగ భావించి దుర్వినియోగము చేయరాదు. అట్లు చేసినచో రజస్తమస్సులు తనయందు ప్రకోపించి, తనను శాశ్వత బందీని చేయును. విమోచనము కావలెనన్న తపన యున్నచో, స్వంతముగ సంకల్పించుట మాని కర్తవ్యము మాత్రమే ఆచరించుట నేర్వవలెను.
దీర్ఘకాలమట్లు నిర్వర్తించినపుడు, రజస్తమో గుణములు శాంతించి సత్వ మలవడును. సత్వమున నిలబడుటకు సంకల్ప సన్యాసము ముఖ్యము. అట్టివాడే సన్యాసమునకు గాని, యోగమునకు గాని అర్హత గలవాడు. వ్యక్తిగత సంకల్పములున్న వారు యోగమున, సన్యాసమున ప్రవేశింపలేరు. ఇది నిశ్చయము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 348 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
88. అధ్యాయము - 43
*🌻. దక్షయజ్ఞ పరిసమాప్తి -3 🌻*
శంకరుని మహిమ అనంతము.పండితులు కూడా తెలియజాలరు. కాని భక్తులు ఆయన యందు భక్తిన చేసి ఆయన అనుగ్రహముచే శ్రమ లేకుండగనే ఆయన ను తెలియగల్గుదురు (36). పరమాత్మయగు శివునకు ఒక్క వికారమైననూ లేదు. కాని విషాదమును పొందినాడు యన్నట్లు లోక గతిని అనుసరించి లీలను ప్రదర్శించును (37).
ఓ మహర్షీ! శివుని చరితమును చదివిన వాడు వినిన వాడు జ్ఞానియై సర్వమానవులలో ఉత్తముడగును. అట్టివాడు ఇహలోకములో ఉత్తమ సుఖమును పొంది దివ్యమగు సద్గతిని పొందును (38). ఈ విధముగా దక్ష పుత్రియగు సతి తన దేహమును విడిచిపెట్టి, హిమవంతుని భార్యయగు మేనకయందు జన్మించెనని పురాణాదులు యందు ప్రసిద్ధి గాంచెను (39).
ఆమె ఆ జన్మలో మరల తపస్సు చేసి శివుని భర్తగా వరించెను . ఆ ఉమాదేవి గౌరియై శివుని వామ భాగమును తనది చేసుకొని అద్భుతమగు లీలలను ప్రదర్శించెను (40).ఇంత వరకు పరమాద్భుతము, భుక్తి ముక్తులనిచ్చునది, దివ్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది అగు సతీ చరిత్రమును నీకు వివరించి చెప్పితిని (41).
ఇది నిర్దోషము, పవిత్రము, పరమ పావనము, స్వర్గ ప్రదము, కీర్తిని ఇచ్చునది, ఆయుర్దాయమునిచ్చునది, పుత్ర పౌత్రఫలమునిచ్చునది అగు గాథ (42).
వత్సా! ఎవరైతే ఈ గాథను భక్తితో విందురో, ఎవరైతే భక్తి గలవారై ఇతరులకు వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందుటయే గాక, పరలోకములో ఉత్తమగతిని పొందెదరు (43). ఈ శుభకరమగు గాథను చదివిన వారు, మరియు చదివించిన వారు కూడా ఇహలోకములో భోగములనన్నిటినీ అనుభవించి, దేహ త్యాగానంతరము మోక్షమును పొందెదరు (44).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షయజ్ఞ పరిసమాప్తి యను నలభై మూడవ అధ్యాయము ముగిసినది (43).
రుద్ర సంహితయందలి రెండవ సతీఖండ ముగిసినది (2).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 100 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 15th RULE
*🌻 17. Seek out the way - 2 🌻*
384. The force is poured through him in order that he may disseminate it, but he is not expected to be a mere machine in its distribution. He does lend to it something of himself, something of his own colouring; that is intended and expected, but it must be in perfect harmony with the Master’s attitude and feeling. That is possible because the pupil becomes one with the Master in a very wonderful way, as I have explained in The Masters and the Path.1 (1 Op. cit., Ch. V.)
It is not only that all that is in the consciousness of the pupil is also in the consciousness of the Master, but that everything that takes place in the presence of the pupil is also in the Master’s consciousness – not necessarily when it is happening, unless He chooses, but quite certainly within His memory.
If the Master happens to be busily engaged in some of His higher work for the moment, it does not necessarily follow that He is attending to a conversation which the pupil is carrying on at the time; but we have startling evidence that sometimes He may be, because occasionally He interjects a thought or a remark, and corrects something that is being said.
385. As I have explained elsewhere, any feeling which the pupil allows himself to have will react upon the Master; if it were such a feeling as annoyance or anger, the Master would shut it out in a moment; naturally the pupil does not want to give Him the trouble of doing that, though, perhaps, if one may say it with all reverence, it is not a very great trouble. Possibly the Master does this very quickly, in a single thought, but yet one does not wish to cause even that trifling interruption of His work.
386. Naturally also the pupil wants to avoid the shutting off of himself which necessarily happens at the same time: therefore he tries, as far as he may, to prevent any undesirable thought or feeling from entering his consciousness. He would keep away from a noisy crowd or from any place with exceedingly bad magnetism, unless he had to go there to do the Master’s work.
In that case he would put a shell round himself and see that no unpleasantness reached the Master. Still, purely physical things in the consciousness of the pupil are also in the consciousness of the Master. If, for example, the pupil is startled by a sudden sound, it gives him a little shock.
That little shock is communicated to the Master. He cares nothing for it; He puts it aside, but the fact remains that it is communicated, and that shows how close is the tie. A pupil who is wise tries to avoid any kind of shock; he is generally rather a gentle and quiet sort of person, for that reason.
387. It is one of the distinguishing marks of the pupil that he never forgets his Master, or the presence of his Master. So he does not allow within himself, if he can help it, except by inadvertence, any thought or feeling that he does not want recorded in the Master’s thought or feeling, and he even tries to avoid, as far as may be, exterior disturbances which might also be of a kind that would cause him to be temporarily shut off.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 232 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. దేవలమహర్షి - 3 🌻*
13. వినయశీలునిగా ఉండటము, తనకుతాను నిత్యతృప్తుడుగా ఉండటము, పరద్రవ్యాన్ని స్వప్నంలోకూడా కోరకుండా ఉండటము, తనను ఎవరైనా గౌరవించినా గౌరవించకపోయినా నిస్పృహతో ఉండటము – దీనినే యథార్థశీల సంపద కలిగి ఉండటమనవచ్చు.
14. కొన్ని విషయాలలో శీలము అనే మాటకు అర్థంచెప్పటం సులభమే! అంటే తనకు చెందని వస్తువు, తనకు ఆధ్యాత్మికమార్గంలో పొందరానివస్తువు ఏదయితే ఉన్నదో దానియొక్క స్మరణం కూడా శీలభ్రష్టత్వానికి హేతువవుతుంది.
15. ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి ఏదయినా ధ్యానంచేయదగని వస్తువు, ఉంటే దానిని కోరటము – ఏది కోరితే అది ఈ మార్గంలో పనికిరాదో దానిని కోరటము – శీలభ్రష్టత్వము అవుతుంది.
16. అందువల్లనే విశ్వామిత్రాది మహర్షులుకూడా తపస్సును వ్యయంచేసారు. అయితే వారు దుశ్శీలురు అంటానికి వీలులేదు. తమయొక్క తపోనిష్ఠకు, బ్రహ్మలోకప్రాప్తికి హేతువుకానటువంటి వస్తువు తననొచ్చి వరిస్తేకూడా దానిని చూడకూడదు. అదే సూత్రం యథార్థంగా తీసుకున్నారు. కాబట్టి శీలమే గొప్పది.
17. మానావమానాలగురుంచి భగవద్గీతలో కృష్ణభగవానుడు చెప్పాడు. అవమానము కలిగినపుడు దానిని అమృతంలాగా తీసుకోవచ్చు. తనలో ఏ దోషం ఉందో, ఏ పాపం ఏ సందర్భంలోనో ఎక్కడ చేసిఉన్న కారణంగా ఈ అవమానం తనకు లభించిందో అని అతడు అనుకోవాలి. “బాగుంది. ఈ అవమానం ఇప్పుడు పొందటంవలన ఆ పాపం పోయిందికదా! శభాష్ చాలా బాగుంది” అని అట్టివాడు సంతోషిస్తాడు.
18. ఎవరయినా ఆదరించి గౌరవించనప్పుడు, “అయ్యో! నా పుణ్యం క్షీణించిపోతున్నది. దీనివల్ల నా మనసు భ్రంశంపొంది నాకు అహంకారం వస్తుందేమో? ఈ గౌరవం నాకెందుకు?” దానిని భయంతో విషప్రాయంగా చూడమని చెప్పారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 296 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 145. You should identify yourself only with this indwelling knowledge 'I am'. That is all. 🌻*
Sever your links with everything that has just added onto the 'I am' and destroyed its purity. After doing this with surgical precision, just stay there and identify yourself with this pure indwelling knowledge 'I am'.
This knowledge is the only legacy you have, understanding and abiding in it is all that you have to do. If you do this earnestly, a moment will come when you go beyond the 'I am' into your natural state.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 171 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 9 🌻*
655. సద్గురువు శిష్యునకు పరిపూర్ణతను ప్రసాదించవలెనన్నచో మెఱపుకాలము చాలును. చెవిలో ఒక్క మాటను చెప్పి, పరిమితుడై యున్నవానిని అనంతుని చేయును.
656. ఇట్టి మార్పు, ప్రార్థనలపై ఉపవాసములపై ఆధారపడి జరుగదు.
657. సద్గురువు బ్రహ్మానుభూతిని ఎవరికైనను ఒక సెకనులో ప్రసాదించగలడు.
658. సద్గురువు వలన సెకనులో పొందబడిన బ్రహ్మానుభూతి, తనకే ఉపకరించును గాని పరులకు ఉపయోగపడదు.
659. సద్గురువు సేవలో కష్టములకు ఓర్చుకొని ముక్కాకలు తీరిన తరువాత సద్గురువు వలెనే పొందిన బ్రహ్మానుభూతి ఇతరులను కూడా అట్టివారిని చేయుటకు ఉపకరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 26 / Bhagavad-Gita - 26 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 26 🌴
26. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ: పిత్రూనథ పితామహాన్ |
ఆచర్యాన్మా తులాన్ భ్రాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా |
శ్వశురాన్ సుహ్రుదశ్చైవ సేనయోరుభయోరపి ||
🌷. తాత్పర్యం :
ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
🌷. భాష్యము :
రణరంగము నందు అర్జునుడు సమస్తబందువులను గాంచెను. తన తండ్రి కాలమునాటి భురిశ్రవుని వంటివారిని, తాతలైన భీష్ముడు మరియు సోమదత్తులను, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు మరియు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి స్నేహితులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు గాంచెను. పలువురు మిత్రులను గూడియున్న సైన్యమును సైతము అతడు చూడగలిగెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 26 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 26 🌴
26. tatrāpaśyat sthitān pārthaḥ
pitṝn atha pitāmahān
ācāryān mātulān bhrātṝn
putrān pautrān sakhīṁs tathā
śvaśurān suhṛdaś caiva
senayor ubhayor api
🌷 Translation :
There Arjuna could see, within the midst of the armies of both parties, his fathers, grandfathers, teachers, maternal uncles, brothers, sons, grandsons, friends, and also his fathers-in-law and well-wishers.
🌷 Purport :
On the battlefield Arjuna could see all kinds of relatives. He could see persons like Bhūriśravā, who were his father’s contemporaries, grandfathers Bhīṣma and Somadatta, teachers like Droṇācārya and Kṛpācārya, maternal uncles like Śalya and Śakuni, brothers like Duryodhana, sons like Lakṣmaṇa, friends like Aśvatthāmā, well-wishers like Kṛtavarmā, etc. He could see also the armies which contained many of his friends.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 27 / Sri Lalita Sahasranamavali - Meaning - 27 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 27. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |*
*జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ‖ 27 ‖ 🍀*
🍀 70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా -
కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.
🍀 71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా -
జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 27 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 27. kiricakra-rathārūḍha-daṇḍanāthā-puraskṛtā |*
*jvālā-mālinikākṣipta-vahniprākāra-madhyagā || 27 || 🌻*
🌻 70 ) Giri chakra ratharooda dhanda natha puraskrutha -
She who rides in the chariot with five stories and is served by goddess Varahi otherwise called Dhanda natha
🌻 71 ) Jwalimalika ksiptha vanhi prakara madhyaka -
She who is in the middle of the fort of fire built by the Goddess Jwalamalini.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 27 / Sri Vishnu Sahasra Namavali - 27 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మిధునరాశి- పునర్వసు నక్షత్ర 3వ పాద శ్లోకం*
*🍀 27. అసంఖ్యేయోఽ ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |*
*సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ‖ 27 ‖*
🍀 247) అసంఖ్యేయ: -
అనంతమైన నామరూపాదులు కలవాడు.
🍀 248) అప్రమేయాత్మా -
అప్రమేయమైన స్వరూపము కలవాడు.
🍀 249) విశిష్ట: -
శ్రేష్ఠతముడు. మిక్కిలి గొప్పవాడు.
🍀 250) శిష్టకృత్ -
శాసనము చేయువాడు.
🍀 251) శుచి: -
నిర్మలుడై, నిరంజనుడైనవాడు.
🍀 252) సిద్ధార్ధ: -
పొందదగినదంతయు పొందినవాడు.
🍀 253) సిద్ధసంకల్ప: -
నేఱవేరిన సంకల్పములు కలవాడు.
🍀 254) సిద్ధిద: -
జీవుల కర్మానుసారముగా ఫలముల నందిచువాడు.
🍀 255) సిద్దిసాధన: -
కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 27 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Midhuna Rasi, Punarvasu 3rd Padam*
*🌻 27. asaṅkhyeyō prameyātmā viśiṣṭaḥ śiṣṭakṛcchuciḥ |*
*siddhārthaḥ siddhasaṅkalpaḥ siddhidaḥ siddhisādhanaḥ || 27 || 🌻*
🌻 247. Asaṅkhyeyaḥ:
One who has no Sankhya or differences of name and form.
🌻 248. Aprameyātmā:
One whose nature cannot be grasped by any of the means of knowledge.
🌻 249. Viśiṣṭaḥ:
One who excels everything.
🌻 250. Śiṣṭakṛt:
One who commands everything. Or one who protects shishtas or good men.
🌻 251. Suciḥ:
Pure
🌻 252. Siddhārthaḥ:
One whose object is always fulfilled.
🌻 253. Siddhasaṅkalpaḥ:
One whose resolutions are always fulfilled.
🌻 254. Siddhidaḥ:
One who bestows Siddhi or fulfillment on all who practise disciplines, in accordance with their eligibility.
🌻 255. Siddhisādhanaḥ:
One who brings fulfillment to works that deserve the same.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment