భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 171


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 171 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 9 🌻


655. సద్గురువు శిష్యునకు పరిపూర్ణతను ప్రసాదించవలెనన్నచో మెఱపుకాలము చాలును. చెవిలో ఒక్క మాటను చెప్పి, పరిమితుడై యున్నవానిని అనంతుని చేయును.

656. ఇట్టి మార్పు, ప్రార్థనలపై ఉపవాసములపై ఆధారపడి జరుగదు.

657. సద్గురువు బ్రహ్మానుభూతిని ఎవరికైనను ఒక సెకనులో ప్రసాదించగలడు.

658. సద్గురువు వలన సెకనులో పొందబడిన బ్రహ్మానుభూతి, తనకే ఉపకరించును గాని పరులకు ఉపయోగపడదు.

659. సద్గురువు సేవలో కష్టములకు ఓర్చుకొని ముక్కాకలు తీరిన తరువాత సద్గురువు వలెనే పొందిన బ్రహ్మానుభూతి ఇతరులను కూడా అట్టివారిని చేయుటకు ఉపకరించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021

No comments:

Post a Comment