13-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 638 / Bhagavad-Gita - 638🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 286, 287 / Vishnu Sahasranama Contemplation - 286, 287🌹
3) 🌹 Daily Wisdom - 57🌹
4) 🌹. వివేక చూడామణి - 21🌹
5) 🌹Viveka Chudamani - 21🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 31🌹
7) 🌹. ప్రేమ భయాన్ని కలిగిస్తుందా! 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 208 / Sri Lalita Chaitanya Vijnanam - 208🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 549 / Bhagavad-Gita - 549🌹 
 
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 638 / Bhagavad-Gita - 638 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 55 🌴*

55. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వత: |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్ ||

🌷. తాత్పర్యం : 
కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసికొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా దామమున చేరగలడు.

🌷. భాష్యము :
పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని మరియు అతని ప్రధానాంశములైన విష్ణుతత్త్వములను అవగతము చేసికొనుట మనోకల్పనలచేగాని, అభక్తులకు గాని సాధ్యము కాదు. ఎవరేని ఆ దేవదేవుని అవగతము చేసికొనదలచినచో శుద్ధభక్తుని నిర్దేశమున భక్తియుతసేవను స్వీకరింపవలెను. లేనియెడల శ్రీకృష్ణభగవానుని తత్త్వమెల్లవేళలా గుప్తముగనే ఉండిపోగలదు. 

భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున (7.25) “నాహం ప్రకాశ: సర్వస్య” యని తెలుపబడినట్లు అతడు సర్వులకు వ్యక్తము కాడు. విద్యావైదుష్యముచే కాని, మనోకల్పనచే గాని ఎవ్వరును భగవానుని అవగతము చేసికొనజాలరు. 

వాస్తవముగా కృష్ణభక్తిరసభావితుడై భక్తిపూర్వక సేవయందు నిలిచినవాడే కృష్ణుడననేమో అవగతము చేసికొనగలడు. విశ్వవిద్యాలయ పట్టములు ఇందుకు ఏమాత్రము తోడ్పడవు.

కృష్ణపరజ్ఞానమునందు నిష్ణాతుడైనవాడు ఆధ్యాత్మికరాజ్యమగు కృష్ణలోకమును చేరుటకు యోగ్యుడగును. బ్రహ్మభావన పొందుట యనగా వ్యక్తిత్వమును కోల్పోవుట యని భావము కాదు. 

వాస్తవమునకు బ్రహ్మభావన యందును భక్తియుతసేవ నిలిచియే యుండును. ఆ రీతి భక్తియుతసేవ ఉన్నంతకాలము భగవానుడు, భక్తుడు, భక్తియోగమనెడి మూడు అంశములు కొనసాగుచునే యుండును. 

అట్టి జ్ఞానము ముక్తి పిదపయు నశించక నిలువగలదు. భౌతికభావన నుండి విడివడుటయే ముక్తి. కాని ఆధ్యాత్మికస్థితి యందును ఆత్మ, పరమాత్మల నడుమ భేదము, ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుచునే యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 638 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 55 🌴*

55. bhaktyā mām abhijānāti
yāvān yaś cāsmi tattvataḥ
tato māṁ tattvato jñātvā
viśate tad-anantaram

🌷 Translation : 
One can understand Me as I am, as the Supreme Personality of Godhead, only by devotional service. And when one is in full consciousness of Me by such devotion, he can enter into the kingdom of God.

🌹 Purport :
The Supreme Personality of Godhead, Kṛṣṇa, and His plenary portions cannot be understood by mental speculation nor by the nondevotees.

 If anyone wants to understand the Supreme Personality of Godhead, he has to take to pure devotional service under the guidance of a pure devotee. Otherwise, the truth of the Supreme Personality of Godhead will always be hidden. As already stated in Bhagavad-gītā (7.25), nāhaṁ prakāśaḥ sarvasya: He is not revealed to everyone. 

No one can understand God simply by erudite scholarship or mental speculation. Only one who is actually engaged in Kṛṣṇa consciousness and devotional service can understand what Kṛṣṇa is. University degrees are not helpful.

One who is fully conversant with the Kṛṣṇa science becomes eligible to enter into the spiritual kingdom, the abode of Kṛṣṇa. Becoming Brahman does not mean that one loses his identity. Devotional service is there, and as long as devotional service exists, there must be God, the devotee, and the process of devotional service. 

Such knowledge is never vanquished, even after liberation. Liberation involves getting free from the concept of material life; in spiritual life the same distinction is there, the same individuality is there, but in pure Kṛṣṇa consciousness. 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 286, 287 / Vishnu Sahasranama Contemplation - 286, 287 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻286. సురేశ్వరః, सुरेश्वरः, Sureśvaraḥ🌻*

*ఓం సురేశ్వరాయ నమః | ॐ सुरेश्वराय नमः | OM Sureśvarāya namaḥ*

సురేశ్వరః, सुरेश्वरः, Sureśvaraḥ

హరిః శోభనదాతౄణాం దేవానామపి చేశ్వరః ।
సురాణామీశ్వరత్వాత్స సురేశ్వర ఇతీర్యతే ॥

శోభనమగు దానిని ఇచ్చువారు అను వ్యుత్పత్తిచే అట్టి యోగ్యత గలవారు ఎవ్వరయినను సురాః అనబడుదురు. అట్టి బ్రహ్మాదులకును ఈశ్వరత్వమును ఇచ్చు ఈశ్వరుడు గావున హరి సురేశ్వరుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 286🌹*
📚. Prasad Bharadwaj 

*🌻286. Sureśvaraḥ🌻*

*OM Sureśvarāya namaḥ*

Hariḥ śobhanadātṝṇāṃ devānāmapi ceśvaraḥ,
Surāṇāmīśvaratvātsa sureśvara itīryate.

हरिः शोभनदातॄणां देवानामपि चेश्वरः ।
सुराणामीश्वरत्वात्स सुरेश्वर इतीर्यते ॥

Those who bestow good and whose benedictions are auspicious are called Surāḥ. Hari, since is the Lord of such, is called Sureśvaraḥ.

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 14
Tasmiṃstuṣṭe kimaprāpyaṃjagatāmīśvareśvare,
Lokāḥ sapālā hyetasmai haranti balimādr̥tāḥ. (20)

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे, चतुर्दशोऽध्यायः ::
तस्मिंस्तुष्टे किमप्राप्यंजगतामीश्वरेश्वरे ।
लोकाः सपाला ह्येतस्मै हरन्ति बलिमादृताः ॥ २० ॥

He is worshiped by the great gods, controllers of universal affairs. When He is satisfied, nothing is impossible to achieve. For this reason all the gods, presiding deities of different planets, as well as the inhabitants of their planets, take great pleasure in offering all kinds of paraphernalia for His worship.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अमृतांशूद्भवो भानुः शशबिन्दुस्सुरेश्वरः ।औषधं जगतस्सेतु स्सत्यधर्मपराक्रमः ॥ ३१ ॥

అమృతాంశూద్భవో భానుః శశబిన్దుస్సురేశ్వరః ।ఔషధం జగతస్సేతు స్సత్యధర్మపరాక్రమః ॥ ౩౧ ॥

Amr̥tāṃśūdbhavo bhānuḥ śaśabindussureśvaraḥ ।Auṣadhaṃ jagatassetu ssatyadharmaparākramaḥ ॥ 31 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 287 / Vishnu Sahasranama Contemplation - 287 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻287. ఔషధమ్‌, औषधम्‌, Auṣadham🌻*

*ఓం ఔషధాయ నమః | ॐ औषधाय नमः | OM Auṣadhāya namaḥ*

ఔషధమ్‌, औषधम्‌, Auṣadham

హర్తృ సంసార రోగస్య బ్రహ్మౌషధమితీర్యతే సంసారమను రోగవిషయమున విష్ణువు ఔషధము వంటి వాడు కావున బ్రహ్మము ఔషధమనబడును.

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అహం క్రతురహం యజ్ఞః స్వధామహమౌషధమ్ ।
మన్త్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ॥ 16 ॥

అగ్నిషోమాదిరూప క్రతువు నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, హవిస్సు నేనే, అగ్ని నేనే, హోమకర్మమున్ను నేనే, అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 287🌹*
📚. Prasad Bharadwaj 

*🌻287. Auṣadham🌻*

*OM Auṣadhāya namaḥ*

Hartr̥ saṃsāra rogasya brahmauṣadhamitīryate / हर्तृ संसार रोगस्य ब्रह्मौषधमितीर्यते As He is the medicine for the ailment of Samsāra or world existence, He is called Auṣadham.

Śrīmad Bhagavad Gīta - Chapter 9
Ahaṃ kraturahaṃ yajñaḥ svadhāmahamauṣadham,
Mantro’hamahamevājyamahamagnirahaṃ hutam. (16)

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::
अहं क्रतुरहं यज्ञः स्वधामहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥ १६ ॥

I am the kratu, I am the yajña, I am the svadhā, I am the auṣadha, I am the Mantra, I Myself am the ājya, I am the fire and I am the act of offering.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अमृतांशूद्भवो भानुः शशबिन्दुस्सुरेश्वरः ।औषधं जगतस्सेतु स्सत्यधर्मपराक्रमः ॥ ३१ ॥

అమృతాంశూద్భవో భానుః శశబిన్దుస్సురేశ్వరః ।ఔషధం జగతస్సేతు స్సత్యధర్మపరాక్రమః ॥ ౩౧ ॥

Amr̥tāṃśūdbhavo bhānuḥ śaśabindussureśvaraḥ ।Auṣadhaṃ jagatassetu ssatyadharmaparākramaḥ ॥ 31 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 57 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻26. The Ultimate Union 🌻*

This is the ultimate union of the soul with All-Being and this is the final stage, practically, of samapatti, where the river has entered the ocean and does not any more exist as the river. One does not know in the ocean which is Ganga, which is Yamuna, which is Amazon, which is Volga. 

No one knows what is where. Everything is everywhere at every time in every condition. One becomes the centre of the Being of all things, the heart of everything. One becomes the Immanent Principle of the cosmos. This is God-Experience, in the language of religion. 

This is the realisation of the Absolute, brahma-sakshatkara. Here the consciousness reverts to Itself and stands on Its own status. It has not become aware of something. It is aware only of Itself. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 21 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. పంచభూతాలు - 4 🍀*

82. నిజంగా నీవు విముక్తికై కోరుచున్నటైన, విషయ సుఖాలను, విషాన్ని దూరంగా ఉంచినట్లు ఉంచి, అమృతము వంటి సద్గుణాలను జాగ్రత్తగా అలవాటు చేసుకొని; తృప్తి, ప్రేమ, క్షమా గుణము, ముక్కుకు సూటిగా నడుచుకొనుట మరియు తనకు తాను అదుపులో ఉంచుకొనుట అను సద్గుణాలను పెంపొందించుకొనవలెను.

83. ఎవరైతే తాము ఎప్పుడూ అనుభవించే భౌతిక వాంఛలను పక్కన పెట్టి, అజ్ఞాన బంధనాల నుండి విముక్తులై మరల వాటి జోలికి పోనప్పటికి, శరీరముపై మోహముతో దానిని పోషించి ఇతరుల ఆనందానికై తోడ్పడిన చివరకు ఆత్మహత్య చేసుకొని కుక్కలకు రాబందులకు ఆహారమవుతారు. అనగా శరీరము పై మోహాన్ని తొలగించుకోవాలి.

84. ఎవరైతే ఆత్మను తెలుసుకోవాలని కోరుకుంటారో వారు తమ శరీర పోషణకు ప్రాధాన్యమిచ్చిన అట్టి వ్యక్తి కొయ్యదుంగ అనుకొని మొసలిని పట్టుకుని నదిని దాటినట్లు ఉంటుంది. అనగా తన వినాశనానికి తానే కారకుడవుతాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 21 🌹* 
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj 

*🌻 Five Elements - 4 🌻*

82. If indeed thou hast a craving for Liberation, shun sense-objects from a good distance as thou wouldst do poison, and always cultivate carefully the nectar-like virtues of contentment, compassion, forgiveness, straight-forwardness, calmness and self-control.

83. Whoever leaves aside what should always be attempted, viz. emancipation from the bondage of Ignorance without beginning, and passionately seeks to nourish this body, which is an object for others to enjoy, commits suicide thereby.

84. Whoever seeks to realise the Self by devoting himself to the nourishment of the body, proceeds to cross a river by catching hold of a crocodile, mistaking it for a log.

Continues..... 
🌹 🌹 🌹 🌹 🌹#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 31 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 22. కర్ణుడు - కుంతి 🌻*

బృహస్పతి జీవనమునకు, జ్ఞానమునకు, సమర్థతకు, పవిత్రతకు, సద్గుణ సంపత్తికి, సృజనాత్మక శక్తికి, బ్రహ్మచర్యమునకు ప్రతీక. ఆకాశ శబ్దమునకు కూడ ప్రతీక. ఆకాశ శబ్దము “ఖం”.

కం, గం, కూడ ఈ శబ్దమునుండి ఉద్భవించినవే. శుక్రుడు అనుభూతికి, ఆనందమునకు, గ్రహించుటకు, అందమునకు, సౌకుమార్యమునకు, శీలమునకు, ప్రేమకు, కన్యాత్వమునకు ప్రతీక. పై సంకేతము నందలి ఉత్తర భాగము సూర్యుడు. 

దక్షిణభాగము + సూక్ష్మ ప్రకృతి లేక కన్య శుక్ర సంకేతము సూర్యునిచే ప్రభావితమై వెలుగొందుచున్న సూక్ష్మ ప్రకృతిని లేక కన్యను సూచించును. 

సూర్యోపాసనమున నిలచిన పవిత్రమైన కన్యగ మహా భారతమున కుంతిని పేర్కొనుట, ఈ రహస్యార్థమును వివరించుటయే. సూర్యుని ఆధారముగ కుంతి అను కన్య కర్ణుని పొందినది. కర్ణమే కర్ణుడు. అనగా వెలుగొందుచున్న సూక్ష్మ ప్రకృతినుండి సూర్యుని సహకారముతో దిగివచ్చిన వాడు. కర్ణములేని సృష్టి లేదు. 

రూపాంతరమున ఈ సంకేతము బృహస్పతిగ తెలియ బడుచున్నది. కర్ణములేని సృష్టి లేదు అనుట, కర్ణుడులేని భారతము లేదు అనుట ఒకే అర్థమును సూచించగలవు. బృహస్పతి లేని జీవనమే లేదు కదా!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ప్రేమ భయాన్ని కలిగిస్తుందా? 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

నిజానికి, ప్రేమానుబంధం మీకు అనేక సమస్యలు సృష్టిస్తుంది. వాటిని ఎదుర్కోవడం మంచిదే. కానీ, అనుబంధాలకు అతీతులమని చెప్పుకునే తూర్పు దేశాలలోని వ్యక్తులు తమ ప్రేమను వ్యతిరేకిస్తూ, నిరాకరిస్తూ, అది సృష్టించే సమస్యల నుంచి తప్పించుకుని, ప్రేమరహితులుగా, నిర్జీవులుగా తయారయ్యారు. ఆ రకంగా తూర్పుదేశాలలో ప్రేమ దాదాపు అదృశ్యమై కేవలం ధ్యానం మాత్రమే మిగిలింది.

ధ్యానమంటే మీరు ఏకాంతంలో మీతో హాయిగా ఉండడమన్న మాట. అలా మీ వృత్తం మీతో పూర్తవుతుంది. అందులోంచి మీరు బయటకు వెళ్ళరు. దానివల్ల తొంభై తొమ్మిది శాతం సమస్యలు పరిష్కారమవడంతో మీరు అతి తక్కువ సమస్యలో ఉంటారు. కానీ, దాని కోసం మీరు చాలా చెయ్యవలసి ఉంటుంది.

తూర్పు దేశాలలో కళ్ళు మూసుకుని తన అంతరంగ కేంద్రంలో హాయిగా, సురక్షితంగా జీవించే వ్యక్తి తక్కువ ఆందోళన, తక్కువ ఉద్రిక్తతలతో ఉంటాడు. అతడు తన శక్తిని బయటకు ప్రవహించనివ్వకుండా తనలోనే ఇముడ్చుకుంటాడు. అందుకే అతడు ఆనందంగా ఉంటాడు. కానీ, అతని ఆనందం తక్కువ జీవంతో ఉంటుందే కానీ, పరమానంద పరవశంతో ఉండదు.

మహా అయితే, మీరు చాలా ఆరోగ్యంగా, హాయిగా ఉందని, ఎలాంటి రోగం లేదని చెప్తారు. కేవలం రోగం లేనంత మాత్రాన పూర్తి ఆరోగ్యం ఉన్నట్లు కాదు. అదే నిజమైతే, ఎలాంటి రోగం లేని శవం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా!

కాబట్టి, తూర్పు దేశాలలో ప్రపంచాన్ని పరిత్యజిస్తూ, ప్రేమరాహిత్యంతో జీవించే ప్రయత్నమే జరిగింది. అంటే, స్త్రీని ద్వేషించడం, పురుషుని ద్వేషించడం, ప్రేమను కాదనడం- ఇలా ప్రేమ వికసించే అవకాశాలన్నింటినీ పరిత్యజించడం జరిగింది.

నిజానికి, ఒంటరిగా ఉన్న స్త్రీతో మాట్లాడేందుకు, ఆమెను తాకేందుకు, చివరికి ఆమెను చూసేందుకు కూడా జైన, హిందూ, బౌద్ధ సన్యాసులకు అనుమతి లేదు. ఒకవేళ ఏదైనా అడిగేందుకు స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళు నేల చూపులు చూస్తూ మాట్లాడాలే కానీ, పొరపాటున కూడా ఆమె ముఖాన్ని చూడకూడదు. ఎవరికి తెలుసు? ఏదైనా జరగచ్చు. ఎందుకంటే, ప్రేమ చేతిలో అందరూ నిస్సహాయులే. అందుకే వారు ఎవరి ఇళ్ళల్లోను నివసించరు, ఒకే చోట ఎక్కువ కాలం ఉండరు. 

ఎందుకంటే, ప్రేమానుబంధాలు ఏర్పడే అవకాశముంటుంది. అందుకే వాటిని తప్పించుకునేందుకు వారు ఒకేచోట ఉండకుండా ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. అలా వారు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, తాము ఇబ్బంది పడకుండా ఒక రకమైన నిశ్చలత్వాన్ని సాధించారు. అయినా వారు సంతోషంగా లేరు, వేడుక చేసుకోలేరు. 

పాశ్చాత్య దేశాలలో దీనికి వ్యతిరేకంగా జరిగింది. ప్రేమకలాపాల ద్వారా సంతోషాన్ని సాధించే ప్రయత్నంలో వారు తమకు తాము దూరమై, ఇంటిదారి తప్పి, వెనక్కి ఎలా రావాలో తెలియక చాలా ఇబ్బందుల్లో పడ్డారు. దానితో వారు పిచ్చిపిచ్చిగా అన్నిరకాల ప్రేమకలాపాలలో పాల్గొంటూ స్వలింగ, భిన్నలింగ, యాంత్రిక సంపర్కులుగా తయారయ్యారు. అయినా వారిలో శాంతి లేదు. 

ఎందుకంటే, ప్రేమకలాపాలు కేవలం శారీరక సుఖాన్నిస్తాయే కానీ, అక్కడ ఎలాంటి నిశ్శబ్దము ఉండదు. అందువల్ల కావలసిన శారీరక సుఖాలు లభించినప్పటికీ ఏదో కోల్పోయిన భావన మీలో ఒక జ్వరంలా ఇంకా మిగిలే ఉంటుంది. దాని తీవ్రత వల్ల మీరు చాలా ఉద్రిక్తతకు లోనై అనవసరమైన దానికి అతిగా కంగారుపడుతూ ఉంటారు. అయినా, దానిని వెంటాడుతూ ఆయాసపడడం తప్ప మీకు దక్కేదేముండదు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 208 / Sri Lalitha Chaitanya Vijnanam - 208 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |*
*మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖*

*🌻 208. 'మహేశ్వరీ' 🌻*

ఓంకారమున కతీతమైనది; గుణముల కతీతమైనది శ్రీదేవి అని అర్థము.
జీవులు ఈశ్వరత్వము చెందగలరు. అనగా స్వాలంబనము పొందగలరు. స్వతంత్రతను పొందగలరు. కాని జీవులకు ఈశ్వరత్వ మనుగంచు తత్త్వము మహేశ్వర తత్త్వము. 

వేదమునందు, వేదాంతమునందు ప్రతిపాదింపబడినది ఓంకారము. అట్టి ఓంకారమునకు కూడ పరమైనది మహేశ్వర తత్త్వము. మహేశ్వర పదమునకు త్రిగుణాతీత తత్త్వమని అర్థము. త్రిగుణములు మహేశ్వరి తత్త్వము నుండే పుట్టుచున్నవి. ఓంకారము దాని ప్రథమ రూపము. 

గుణములు దాని శక్తులు. ఓంకార మందలి అకారము సత్త్వగుణముగ ఆ తత్త్వమే దిగివచ్చును. “అకార మెరిగినవారే నన్నెరిగిన వారు.” అని శ్రీకృష్ణుడు బోధించెను. 

అ కారము అక్షరములలో ప్రథమమైనది. అమ్మ అను పదము అకారము నుండియే పుట్టినది. అది తెనుఁగు భాష ప్రత్యేకత. అకారము నుండి ఓంకారము, ఓంకారము నుండి మహేశ్వరత్వము సోపానములుగ గ్రహించవలెను. మహేశ్వరీ దేవి గుణములకు కూడ అందనిది.

ఎవడు సత్యమగు బ్రహ్మచర్యముతో, మనశ్శుద్ధితో మహేశ్వర లింగమును పూజించునో అతడు మహేశ్వర అనుగ్రహమున ఈశ్వరత్వమును పొందును. 

24 తత్త్వములతో కూడిన సృష్టికి కాలమే ఈశ్వరుడు. అట్టి కాలమునకు కూడ ఈశ్వరుడు మహేశ్వరుడు. మహేశ్వరునే యోగేశ్వరుడని కూడ అందురు. ఈశ్వరునకు ఈశ్వరుడు మహేశ్వరుడు. యోగీశ్వరుల కీశ్వరుడు యోగేశ్వరుడు. ఇదియే పరమ పదము. శ్రీదేవి నిజస్థితి ఇది. కావున ఆమె మహేశ్వరి మరియు యోగేశ్వరి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 208 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Māheśvarī माहेश्वरी (208) 🌻*

Wife of Māhesvarā, a form of Śiva. Mahānārāyaṇa Upaniṣad (XII.17) says, “He is the Supreme Lord who transcends ॐ which is uttered at the commencement of the recital of the Veda-s and which is dissolved in the primal cause during contemplation.” His wife is Māheśvarī. Māheśvara form of Śiva is the Supreme form.  

He is beyond the three guṇas- sattva, rajas and tamas. Liṅga form of Śiva is Māhesvara form. Liṅga Purāṇa says that all the deities are present in Liṅga form of Śiva, a resemblance to Śrī Cakra.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 549 / Bhagavad-Gita - 549 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 12 🌴*

12. ఆశాపాశశతైర్బద్దా: కామక్రోధ పరాయణా: |
ఈహన్తే కామభోగార్థ మన్యాయేనార్థ సంచయాన్ ||

🌷. తాత్పర్యం : 
వేలాది ఆశాపాశములచే బద్ధులై, కామక్రోధములందు మగ్నులై ఇంద్రియభోగము కొరకు వారు అధర్మమార్గము ద్వారా ధనమును గడింతురు.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 549 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 12 🌴*

12. āśā-pāśa-śatair baddhāḥ
kāma-krodha-parāyaṇāḥ
īhante kāma-bhogārtham
anyāyenārtha-sañcayān

🌷 Translation : 
Bound by a network of hundreds of thousands of desires and absorbed in lust and anger, they secure money by illegal means for sense gratification.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment