శ్రీ మదగ్ని మహాపురాణము - 68

 

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 68 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 1 🌻

అథ ఏకోనత్రింశోధ్యాయః.

అథ సర్వతోభద్రమణ్డలవిధిః

నారద ఉవాచ :

సాధకః సాధయేన్మన్త్రం దేవతాయతనాదికే | శుద్ధభూమౌ గృహే ప్రాచ్యే మణ్డలే హరిమీశ్వరమ్‌. 1
చతురశ్రీకృతే క్షేత్రే మణ్డలాదీని వై లిఖేత్‌ | రసబాణాక్షికోష్ఠేషు సర్వతోభద్రమాలిఖేత్‌. 2
షట్త్రింశత్కోష్ఠకైః పద్మం పీఠం పఙ్త్క్యా బహిర్భవేత్‌ | ద్వాభ్యాం తు వీథికా తస్మాద్ద్వాభ్యాం ద్వారాణి దిక్షు చ. 3

సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను.

రెండు వందల ఏబదియారు(256) కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.

వర్తులం భ్రామయిత్వా తు పద్మక్షేత్రం పురోదితమ్‌ | పద్మార్ధే భ్రామయిత్వా తు భాగం ద్వాదశకం బహిః. 4

విభజ్య భ్రామయేచ్ఛేషం చతుః క్షేత్రం తు వర్తులమ్‌ |

వెనుక చెప్పన పద్మక్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశభాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను.

ప్రథముం కర్ణకాక్షేత్రం కేసరాణాం ద్వితీయకమ్‌. 5

తృతీయం దలసన్ధీనాం దలాగ్రాణాం చతుర్థకమ్‌ |

మొదటిది కర్ణకయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము.

ప్రసార్య కోణసూత్రాణి కోణదిఙ్మధ్యమం తతః. 6

నిధాయ కేసరాగ్రే తు దలసన్ధీంస్తు లాఞ్ఛయేత్‌ | పాతయిత్వాథ సూత్రాణి తత్ర పత్రాష్టకం లిఖేత్‌. 7

దలసన్ధ్యన్తరాలం తు మానం మధ్యేనిధాయ తు | దలాగ్రం భ్రమయేత్తేన తదగ్రే తదనన్తరమ్‌. 8

తదన్త రాలం తత్పార్శ్వే కృత్వా బాహ్యక్రమేణ చ కేసరే తు లిఖేద్ద్వౌ ద్వౌ దలమధ్యే తతః పునః. 9

పద్మలక్ష్మైతత్సామాన్యం ద్విషట్కదలముచ్చతే | కర్ణికార్ధేన మానేన ప్రాక్సంస్థం భ్రామయేత్‌ క్రమాత్‌. 10

తత్పార్శ్వే భ్రమయోగేన కుడ్ణల్యః షడ్భవన్తి హి | ఏవం ద్వాదశ మత్స్యాః స్యు ర్ద్విషట్కదలకం చ తైః.

కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగమువరకును దారము లాగి, కేసరముల అగ్రములందుంచి దళముల సంధులను గుర్తింపవలెను.

పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దళముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను. వాటి మధ్మమానమును వాటి పార్శ్వమునందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను.

ఇది పద్మయొక్క సామన్యలక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడుచున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పదిక్కు వైపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను.

దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దల కమలమేర్పడును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

#అగ్నిపురాణం


No comments:

Post a Comment