✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
"చూచితిని, చూచితిని! సంసార మహాసముద్రము దాటుటనగా నేమో దర్శించితిని! ఆశ్రయించిన వారి నతడు రక్షించుట యెట్లో గమనించితిని. యోగుల హృదయమున నాతడెట్లుండునో గ్రహించితిని. అందరికిని చుట్టమనగా నెవరో తెలిసికొంటిని. మూడుకన్నులు గలవానికి గూడ అంతుపట్టని ఒంటరిగాడెవడో తెలిసికొంటిని. ముక్తిమార్గము చక్కగా దర్శించి సుఖము ననుభవించితిని."
సంసార సాగరము దాటుట యనగా జరుగుచున్న సంఘటనల నడుమనుండి వానిలో మునగక దర్శింపగలుగుటయే గాని , వానిని విడిచిపోవుటకు యత్నించుట కాదని, కృష్ణుని అవతారము వలన ఉద్ధవుడు గ్రహించెను.
✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment