భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 84


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 84 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 3 🌻

9. ఈ మనుష్యుల్లో గొప్ప ప్రతిభ ఉంటేకూడా, అది ఒక తరం రెండు తరాలు ఉండటమంటేనే ఎక్కువ గొప్ప. ఈ కలియుగంలో మనవంశాలలో రెండు తరాలు బాగుంటే మూడోతరం సరిగా ఉంటుందో లేదో! అన్నీ ఉంటే, ఆస్తి పోగొట్టుకుంటారు. ఆస్తి ఉంటే, గుణం పోగొట్టుకుంటారు. గుణంపోతే, ఆయర్దాయం పోగొట్టుకుంటారు. ఇలా ఉన్నారు మనుష్యులు. దీనికి కారణం, మహర్షులు చెప్పిన ధర్మాచరణమార్గంలో మనం ఉండకపోవటమే.

10. అల్పత్వంవల్ల – క్షుద్రత్వంవల్ల – మనుష్యులు తేజస్సు, ఓజస్సు, శక్తి సామర్థ్యాలు పోగొట్టుకుంటారు ఆ తరాల్లో రెండు తరాలయేటప్పటికి ధన దారిద్య్రము, గుణదారిద్య్రము వీటిల్లో ఏదో ఒకటి వస్తుంది. ఈ రెండు ఉంటే, ఆరోగ్యదారిద్య్రము. ఏద్యితేనేం పోవటానికి? వివేకంతోకూడిన లక్షణాలు ఉండాలి. ధైర్యస్థైర్యాలుండాలి. ఐశ్వర్యముండాలి. ఇవన్నీ ధర్మ మార్గంలో లభిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే ఇవన్నీ వస్తాయి అని ఋషుల ఉద్దేశ్యం. ధర్మాచరణచేతనే వాళ్ళు అలాంటి పరంపరలో ఉన్నారు.
11. ఋషులు ఎదుటివారిలో ఏ గుణం చూస్తారో, ఏ దుర్గుణం చూస్తారో, ఆ గుణానికి – ఆ దుర్గుణానికి అనుగుణమయినటువంటి జన్మ ఎత్తమని అంటారు వాళ్ళు. అంతే! వారు అలా అంటే, ఆ గునంవల్ల జన్మ లభిస్తుంది. వాళ్ళు సత్యమే చెప్తారుకాబట్టి ఆ మాట నిజమవుతుంది.

12. జీవలక్షణం – అది ఏదయినా సరే – లేకపోతే అసలేరాదు, ఉన్నది ఎలాగూ పోదు. రెండూ అంతే! యోగబలం అనేది పొమ్మటే పోతుందా! నేను అందరిలాగా మామూలుగా బతకాలని ఒక మహాయోగి అనుకుంటే, అది కూడా సాధ్యంకాదు. ఉన్నవాడికి పోదు, లేనివాడికి రాదు.

13. మనుష్యగర్భంలోంచీ వచ్చేటప్పుడు శిశువులకు, పశువులకు భేదంలేకుండానే పుడతారు. వాళ్ళు బుద్దిగాని, జ్ఞానంగాని, తామెవరో తెలుస్కునేటటువంటి శక్తిగాని ఏమీలేకుండా ఉంటారు.

14. మనుష్యులుకూడా ఆ దశలో పశుప్రాయులై ఉంటారు. అజ్ఞానం, అవిద్య, పశువువంటి శరీరం, ప్రాణం మాత్రం కలిగి ఉంటారు. అలాగే పుట్టి పెరుగుతారు. ముందర లౌకికజ్ఞానం వస్తుంది. లోకజ్ఞానంలోంచి కాస్త వివేకం తెలుస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

No comments:

Post a Comment