✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 8, 9, 10 📚
ప్రపంచమున నున్న సమస్తమైన ప్రతికూల శక్తులను అణచి వేసినను, దేవతలపై ఆధిపత్యమును సంపాదించినను, సమస్త సంపదలను పొందినను, పదవులను ఆక్రమించినను, ఇవి ఏవియును మనుష్యుని మానసిక అశాంతిని తొలగింపలేవని భగవద్గీత బోధించుచున్నది.
న హి ప్రపశ్యామి మమాపనుద్యా ద్యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణామ్ |
అవాప్య భూమా వసపత్న మృద్ధం రాజ్యం సురాణా మపి చాధిపత్యమ్ || 8
సంజయ ఉవాచ :
ఏవ ముక్త్వా హృషీకేశం గుడకేశó పరంతపó |
న యోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ హ || 9
త మువాచ హృషీకేశó ప్రహస న్నివ భారత |
సేన యో రుభయోర్మధ్యే విషీదంత మిదం వచó || 10
''నహిః ప్రపశ్యామి మాం అపనుద్యాత్ శోకం, ఉచ్ఛోషణమ్'' (2-8) అని అర్జునుడు పలికినాడు.
అర్జునుడు మహావీరుడు. అతని నామమే వైభవోపేత సంపదను సూచించును. ఇంద్రునితో సమానముగ భూమిపై వైభవముల ననుభవించినాడు. ఇంద్రుని సింహాసనమున కూడ 5 సంవత్సరముల పాటు ఇంద్రునితో కలసి ఆసీనుడైనాడు.
స్వర్గలోకసుఖములను అన్నింని అనుభవించినాడు. మహావీరుడని పేరు పొందినాడు. సుందర రూపునిగ శ్లాఫిుంపబడినాడు.
ఇహ లోకమున అతను పొందని విజయము గాని, సౌఖ్యము గాని లేదు. అట్టివాడు 'ఉచ్ఛోషణం' అనగా మిగుల తాపము కలుగ చేయున్టి 'శోకం' అనగా దుóఖమును ఏ విధముగా పోగొట్టుకొనవలెనో? తెలియజాలక దీనుడై యుద్ధమున నిలబడి యున్నాడు. ఏది దుóఖమును పోగొట్టగలదో దానిని తెలియకున్నానని భగవానునితో పలికినాడు.
పదవులు, బాహ్యసంపద, ఆధిపత్యము ఇత్యాదివి, మనుష్యునికి శాంతి నియ్యజాలవనియు, శాంతముగ నుండువానికి మాత్రమే అవి విభూతులుగ యుండుననియు గీత యందలి ఈ శ్లోకము ద్వారా తెలియనగును. హిరణ్యకశిపుడు, రావణుడు, అర్జునుని మించిన పరాక్రమవంతులు. వారు స్వర్గమును కూడ ఆక్రమించినారు. అయినప్పికిని శాంతి కలుగలేదు.
బహిః కరణములద్వారా ప్రపంచమున సాధించబడునది ఏదియు అంతరంగమున శాంతిని స్థాపించలేదు. కేవలము అంతఃకరణ శుద్ధిచే పొందు ఆత్మానుభూతియే శాంతిని, తృప్తిని ఇచ్చును.
అంతః తృప్తిలేని వానికి బాహ్యపుష్టి, తుష్టి నియ్యజాలవు.
ఈ విషయమున ప్రాచీనులు ఎఱుక కలిగి నిర్మలము, నిరాడంబరము లగు జీవితము నేర్పరచుకొనినారు. నవీన యుగమున రజోగుణ దోషమున మానవుడు అంతులేని దాహమున పినాడు. తృప్తిని వదలి తృష్ణతో ఆరాటపడుచు తిరుగాడుచు అమూల్యమైన జీవనమును వ్యర్థము గావించు కొనుచున్నాడు.
ప్రాచీనులకన్న తనకెక్కువ తెలుసను గర్వమున పడినాడు. ఎక్కువ తెలిసి జీవితమున తక్కువ సుఖపుట మరింత మూర్ఖత్వము.
భగవద్గీత యందు ఈ శ్లోకమున, శ్లోకము యొక్క నిజస్వరూపము చక్కగ ప్రతిపాదింపబడినది. పరిశుద్ధ జీవనము, నిర్మలమైన మనస్సు, విశాల హృదయము, ఇత్యాది సద్గుణములను సాధించుకున్న వాడు అదృష్టవంతుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment