2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 246 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 126🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 148 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 62 / Sri Lalita Sahasranamavali - Meaning - 62 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 65 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 33🌹
8) 🌹. శివగీత - 31 / The Shiva-Gita - 31 🌹
9) 🌹. సౌందర్య లహరి - 73 / Soundarya Lahari - 73 🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 13 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372🌹
12) 🌹. శివ మహా పురాణము - 197🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 73 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 68 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 84 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 15 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 33🌹
18) 🌹. అద్భుత సృష్టి - 5 🌹
19) 🌹 Seeds Of Consciousness - 145🌹
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 27🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 4 📚
22)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 458 / Bhagavad-Gita - 458 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -16 🌴*
16. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ య: |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||
🌷. తాత్పర్యం :
ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.
🌷. భాష్యము :
భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు.
భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించియుండును.
వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును.
కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును.
ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 458 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 16 🌴*
16. anapekṣaḥ śucir dakṣa
udāsīno gata-vyathaḥ
sarvārambha-parityāgī
yo mad-bhaktaḥ sa me priyaḥ
🌷 Translation :
My devotee who is not dependent on the ordinary course of activities, who is pure, expert, without cares, free from all pains, and not striving for some result, is very dear to Me.
🌹 Purport :
Money may be offered to a devotee, but he should not struggle to acquire it.
If automatically, by the grace of the Supreme, money comes to him, he is not agitated. Naturally a devotee takes a bath at least twice in a day and rises early in the morning for devotional service. Thus he is naturally clean both inwardly and outwardly.
A devotee is always expert because he fully knows the essence of all activities of life and he is convinced of the authoritative scriptures. A devotee never takes the part of a particular party; therefore he is carefree.
He is never pained, because he is free from all designations; he knows that his body is a designation, so if there are some bodily pains, he is free. The pure devotee does not endeavor for anything which is against the principles of devotional service.
For example, constructing a big building requires great energy, and a devotee does not take to such business if it does not benefit him by advancing his devotional service.
He may construct a temple for the Lord, and for that he may take all kinds of anxiety, but he does not construct a big house for his personal relations.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 246 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 28
🌻 Sripada Himself is Sri Venkateswara - 1 🌻
Then Sripada said, “My Dear! My ‘kalaas’ are endless. My divine tatwam has the nature of expressing itself in many ways. Mahalaxmi and Padmavathi basically are same. But when she takes the tatwam of Mahalaxmi, Maha Vishnu form is emerging from Me as Her Prabhu.
When she takes Padmavathi tatwam, Venkateswara comes out of Me as Her Prabhu. When the tatwam takes a particular form and qualities, the necessary sensitivities, traditions and limits should be followed.
My divine sister, this Maha Shakti was born as yoga maya at the time of Krishna avathar and disappeared in the cosmos. The great tapaswis, yogis, Maharishis and Vysya Munis did intense penance and made Her take birth as Vasavee Kanyaka.
For some special reasons, I had to take avathar in Peethikapuram. You see the programme happening now. You will understand the philosophy of My avathar and divine leela filled with pleasure.
My Dear! Shankar Bhatt! you write in ‘Charithamrutham’, the details of the ‘leelas’ being done now in Panchadeva Pahad as you see and as it is. That will be the guide to the future generations. It will destroy all serious doubts. I will impart new power, devotion and enthusiasm in believers.”
While we both were looking stunned, Sripada Srivallabha form became luminous and from that Sri Padmavathi and Sri Venkateswara manifested. The divine baby became bigger and bigger as we looked and took the form of new young Sri Kanyaka Parameswari of 18 years.
The ‘goshala’ disappeared and in its place a magnificient palace appeared with luminous balls spreading divine light all over. As we looked, the royal couple and all their servants appeared.
We recognized the royal couple as Kusuma Shresti couple. The farmer we saw yesterday gave darshan in the attire of ‘Yuvaraj’ (prince). He asked me ‘Sir! What is meant by ‘Mushti in Mushti-Veera Mushti?’ I said I did not know.
Maha Prabhu in the form of Sri Venkateswara said, ‘My Dear! Shankar Bhatt! Have you seen the sensitivities and traditions while one is with a form and qualities? One should meticulously follow them. Slowly you will understand everything.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 126 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పద్మావతి దేవి
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
"చూచితిని, చూచితిని! సంసార మహాసముద్రము దాటుటనగా నేమో దర్శించితిని! ఆశ్రయించిన వారి నతడు రక్షించుట యెట్లో గమనించితిని. యోగుల హృదయమున నాతడెట్లుండునో గ్రహించితిని. అందరికిని చుట్టమనగా నెవరో తెలిసికొంటిని. మూడుకన్నులు గలవానికి గూడ అంతుపట్టని ఒంటరిగాడెవడో తెలిసికొంటిని. ముక్తిమార్గము చక్కగా దర్శించి సుఖము ననుభవించితిని."
సంసార సాగరము దాటుట యనగా జరుగుచున్న సంఘటనల నడుమనుండి వానిలో మునగక దర్శింపగలుగుటయే గాని , వానిని విడిచిపోవుటకు యత్నించుట కాదని, కృష్ణుని అవతారము వలన ఉద్ధవుడు గ్రహించెను.
✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 147 🌹*
*🌴 Rejecting and Accepting - 4 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Healing of Wounds 🌻*
Every hurt inflicted in the outer is a blockage of the inner process.
We may believe that our ajna or heart centres are functioning, but as long as the energies of the lower centres aren’t purified we cannot progress. For healing of emotional wounds the colours rose and light blue are helpful.
However, in order to transcend wounds and to connect with the higher consciousness, we can contemplate on the colour orange.
When we are hurt physically the wound is healing with time. But when we hurt someone with speech, this cuts a wound which goes deeper, hurts a long time and is difficult to be healed.
A Greek philosopher said, “Don’t care because of the poison of the tongue of the serpent, take care of the poison of the human tongue.” Often we know what we shouldn’t have said or shouldn’t have done.
After having done so, we find ourselves and regret it. Knowing is not the solution, for even if we know that we hurt others with our speech, it keeps on happening.
The solution lies in spiritual exercises, not in the feeling that I shouldn’t do this or that. If we are regular with our basic exercises, we become stronger and will be able to overcome these problems.
Discipleship is a discipline to carry out what we know in our speech and action as much as possible.
🌻 🌻 🌻 🌻 🌻
Sources: Master K.P. Kumar: Sarasvathi. The Word / notes from seminars.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 62 / Sri Lalita Sahasranamavali - Meaning - 62 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్లోకం 117
578. మహాకైలాస నిలయా -
గొప్పదైన కైలసమే నిలయముగా గలది.
579. మృణాల మృదుదోర్లతా -
తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది.
580. మహనీయా -
గొప్పగా ఆరాధింపబడునది.
581. దయామూర్తిః -
మూర్తీభవించిన దయాలక్షణము గలది.
582. మహాసామ్రాజ్యశాలినీ -
పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వసామ్రాజ్యమునకు అధినాయకురాలు.
🌻. శ్లోకం 118
583. ఆత్మవిద్యా -
ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు.
584. మహావిద్యా -
గొప్పదైన విద్యా స్వరూపురాలు.
585. శ్రీవిద్యా -
శ్రీ విద్యా స్వరూపిణి.
586. కామసేవితా -
కాముని చేత సేవింపబడునది.
587. శ్రీ షోడశాక్షరీ విద్యా -
సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి.
588. త్రికూటా -
మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.
589. కామకోటికా -
కామమునకు పై అంచునగలదాని స్వరూపిణి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 62 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 62 🌻*
578 ) Maha Kailasa nilaya -
She who sits on Maha Kailasa
579 ) Mrinala mrudhu dhorllatha -
She who has arms as tender as lotus stalk
580 ) Mahaneeya -
She who is fit to be venerated
581 ) Dhaya moorthi -
She who is personification of mercy
582 ) Maha samrajya shalini -
She who is the chef of all the worlds
583 ) Atma vidhya -
She who is the science of soul
584 ) Maha Vidhya -
She who is the great knowledge
585 ) Srividhya -
She who is the knowledge of Goddess
586 ) Kama sevitha -
She who is worshipped by Kama, the God of love
587 ) Sri Shodasakshari vidhya -
She who is the sixteen lettered knowledge
588 ) Trikoota -
She who is divided in to three parts
589 ) Kama Kotika -
She who sits on Kama Koti peetha
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 65 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 37
*🌻. 37. లోకేశపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ॥ - 3 🌻*
ప్రహ్లదుడేమన్నాడో చూడండి.
చిక్కడు వ్రతముల గ్రతువుల
జిక్కడు దానముల శౌచ శీల తపములం జిక్కడు యుక్తిని, భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండి !
మిత్రులారా ! వ్రతాల ద్వారాగాని, క్రతువుల ద్వారాగాని, దానాల వల్లగాని, శౌచ క్రియలు, సచ్చిలం వలన గాని, తవాల వల్లగాని, యుక్తితో గూడిన తర్మ వితర్మాల వలన గాని శ్రీహరి చిక్కడు. ఒకవేళ ఈ విధమైన వాటివలన అతి కష్టంతో చిక్కినా, చిక్కవచ్చునేమో! కాని భక్తి వలన చిక్కినంత సులభంగా మాత్రం ఏ ఇతర సాధనల వలన దొరకడు.
శ్రీహరిని చిక్కించుకోవాలంటే మానసిక భక్తియ నష్టం. బ్రాహ్మణత్వం వలన గాని, విద్యాప్రక్రియల వలన గాని, దెవతల దివ్యత్వంచే గాని, యోగుల ప్రశాంత సాధనలు మొదలైన వాటిచే శ్రీహరిని దొరక పుచ్చుకోవడానికి సరిపోవు.
ఆ శ్రీహరి కేవలం భక్త సులభుడు. భగవత్కళ్యాణ గుణాలను చింతన చేయడం, పలకడం సంకీర్తనమైతే, నామావళిని పఠించడం పారాయణ, ప్రణవ జపం, ఇతర మంత్ర జపాలు కూడా సంకీర్తనలోనే చేరుతాయి.
మననాత్ త్రాణనాచ్చెవ మద్రూపస్యావ బోధనాత్ ।
మంత్ర మిత్యుచ్యతే బ్రహ్మన్ మదధిష్టానతోపివా ॥
-యాజ్ఞవల్క్యోపనిషత్
మనన శక్తి వలన భగవత్తత్త్వం బోధ పడుతుంది. త్రాణశక్తి (ప్రాణ+మనః +బుద్ది) వలన భగవత్సాక్షాత్మారం కలుగుతుంది. కావున మంత్రం భగవన్నిలయం.
వచసా తజ్జపే నిత్యం వపుషా తత్సమభ్యసేత్
మననా తజ్జపే నిత్యం తత్పరం జ్యోతిరోమితి
శుచిర్వాప్య శుచిర్వాపియో జపెత్ ప్రణవం సదా
న సలిష్యతి పాపేన పద్మపత్ర మివాంభసా ॥|
-యోగ చూడామణ్యుపనిషత్
వచసా, మనసా జపం చెయడానికి అందరూ అర్హులే. దీనికి ఏ నియమం లేదు. మానసిక జపంచేత స్వరూపతత్త్వం బోధపడది, పరం జ్యోతిరూప భగవద్దర్శనం
కలుగుతుంది.
ప్రణవ జపం భక్తుడిని ఎల్లప్పుడూ బురద అంటని తామర పూవువల స్వచ్చంగా ఉంచుతుంది. సహజంగా ఉంచి, భక్తుదిని భగవత్మెంకర్యానికి తయారు చేస్తుంది. జప యజ్ఞానికి గురూపదేశం అవసరం లేదు. అశుచి దోషముండదు అని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది.
యత్రైకా గ్రతా తత్ర విశేషాత్ !
-బ్రహ్మ సూత్రాలు
ఎక్కడ నిలిపితే బుద్ధి ఏకాగ్రత చెందుతుందో, ఆ చోట జపయజ్ఞం చెసి మనోలయం నాధించమంటున్నది. మానసిక జప స్థితికి చెరుకునెవారు మనో నిరోధం చేసుకోవాలి.
ఇంకను శౌచం, మౌనం, మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం, అనిర్వేెదం మొదలగునవి వాటించి సిద్ధిని బడయాలి. ఏటిని పాటించడం వలన భక్తి వృద్ధి అవుతుంది. కార్య విఘ్నాలు హరిస్తాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 34 🌹*
✍️ Sri GS Swami ji
📚. Prasad Bharadwaj
*🌻 If you are following Guru's orders sincerely You will be Protected always not only by Nature and Devas but by Guru directly 🌻*
Guru Dhaumya asked Upamanyu, “In spite of giving away to me all the food that you collect, you are still looking smooth and stout. Tell me the reason.”
Upamanyu said, “There is no special trick here. I have been drinking cow’s milk.” Dhaumya thought, if he now tells Upamanyu to offer him whatever milk he obtains from a cow, he may come with some different strategy.
So he ordered, “You are forbidden from drinking cow’s milk.” Days went by. A fter several days Dhaumya saw Upamanyu again and saw that there was absolutely no change in him.
He questioned him, “What are you doing to remain so fat?” Upamanyu said, “After the calves have finished drinking all the milk, whatever foam remains, that is what I am consuming.”
Since there were hundreds of cows, the foam alone would perhaps fill two pots.
Dhaumya was totally losing patience. Yet, he controlled his anger and intolerance and said, “From today onwards I forbid you to touch any type of food.” He could have said this to begin with.
He had not anticipated that Upamanyu would resort to all kinds of strange tactics to circumvent his orders. Since that day Upamanyu did not touch any food. One day he took the cattle grazing in the forest. He was absolu tely starved.
All the stored food in his body got exhausted. He became thin. He was unable to withstand the pangs of hunger any longer. He somehow managed to wait until sunset.
Thereafter, he lost his selfwh control. In desperation, without even realizing at plant it was, he tore off some leaves from a tree and was about to consume them. As he was doing so, the milky sap from the leaves spilled and fell into his eyes.
He at once became blind. They were the leaves of the white arka plant. Unable to find his way, Upamanyu fell into an abandoned well. Dhaumya became concerned when his disciple did not return with the cattle.
He wondered if Upamanyu, unable to follow Guru’s impossible commands had absconded with the cows, wishing to eat to his heart’s content elsewhere in a different country. Guru became very anxious because his love for the disciple was boundless.
He did not send any other disciple to go looking for him. He himself set out looking for Upamanyu, calling out his name loudly. It was dark and to add to it, it began to rain heavily.
After some time, Guru heard Upamanyu’s voice, “O revered Guru, I am inside the well.” Guru said, “I am unable to find my way in this darkness.
You please offer prayers to the Aswini twins (celestial physicians). Guru already knew exactly what had happened. At once Upamanyu began chanting, “Stotum …
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 31 / The Siva-Gita - 31 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము
*🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 1 🌻*
సూత ఉవాచ :-
అధః ప్రాదుర భూత్తత్ర - హిరణ్య యరదో మహాన్,
అనేక దివ్య రత్నాంవు -కిమ్మీరి తది గంతరః 1
నద్యు పాంతిక పంకాడ్య - మహాచక్ర చతుష్టయః
ముక్తా తోరణ సంయుక్త - శ్శ్వేతచ్చత్ర శతావృ తః 2
శుద్ధ హేముఖ రైరాడ్య - తురంగ గణ సంయుతః,
ముక్తా వితాన విలస - దూర్ద్వదివ్యవృషద్వజః 3
మత్త వారణ కాయుక్తః - పంచ తత్త్వోప శోభితః,
పారిజాత తరూద్భూత - పుష్ప మాలాభి రంజితః 4
మృగ నాభి సముద్భూత - కస్తూరీ మద పంకిలః,
కర్పూరా గుదూ పోత్ద -గంధా కృష్ణ మధు వ్రతః 5
సంవర్త ఘన ఘోషాడ్యో - నానా వాద్స మన్వితః,
వీణా వేణు స్వనా సక్త - కిన్రీ గణ సంకులః 6
సూతుడు చెప్పుచున్నాడు :
పిదప శ్రీరాముని ముందట అతిశయించు రత్నముల కాంతులతో నలువంకల ప్రకాశింప చేయు చతుశ్చక్రంబులున్నది, ముత్యాల స్వచ్చమైన స్వర్ణ మయంబైన గిట్టలు గల యశ్వరాముల తోడ, నంది ద్వజముతోను, మదగజములు, పంచ తత్వములు,
పారిజాత పుష్పమాలల తోను, అగుర, కస్తూరి, జవ్వాది, ఇత్యాది సుగంధ వస్తువులు కలది. ప్రళయ కాలములో గర్జించు మేఘ ధ్వని వలె నిఖిల వాయిద్యముల తోడను, కిన్రులు, కింపురుషు లతో నిండినది యునగు దేదీప్యమానమగు రధము గన పడెను.
ఏవం కృత్వా రాధా శ్రేష్టం - వృషాదుత్తీర్య శంకరః,
అంబయా సమిత స్తత్ర - పటతల్పే విశత్తదా 7
సుర నీర జనే త్రాణాం - శ్వేత చామర చాలనై:
దివ్య వ్యజన వాతైశ్చ - ప్రహృష్టో నీల లోహితః 8
శంకరుడీ లాంటి రధమును కల్పించి ఉమా సహితుడై నంది వాహనము నుండి దిగి యా రధము నందలి వీలు శయ్యను ప్రవేశించెను.
దేవతాస్త్రీలు వీచే వింజామరములకు,సుఖముగా వీచెడు వాయువునకు పార్వతీ పతి యానందించిన వాడయ్యెను.
క్వణ త్కంక న నిద్వానై - ర్మంజు మంజీర శింజితై:,
వీణా వేణు స్వనై ర్గితై: - పూర్ణ మాసీ జ్జగత్త్రయమ్ 9
శుక వాక్య కలారావై - శ్శ్వేత పారావత స్వనై:,
ఉన్నిద్ర భూష ఫణి నా - దర్శ నాదేవ బర్హణః 10
నినదించు కర కంకణాల ధ్వని చేత, మనోహరములై చిన్న గజ్జెల ద్వనులతోడ, వీణా వేణు రావములతోడ ను , పారావత విరావముల తోడను, చిలుక పలుకల తోను జగము వ్యాపించెను . శివుని యాభరణము లైన సర్పములను చూచి మయూరములు తమ పురుగులనే అసంఖ్యాఖము లుగా నములుతూ నాట్యము చేసినవి.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 31 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 05 :
*🌻 Ramaya Varapradanam - 1 🌻*
Suta said:
Subsequently, Sri Rama sighted a divine chariot shining with exaggerated brilliance due to gems and diamonds, which has four wheels, covered with pearl garlands, having celestial umbrellas, having
white colored steeds ornamented with gold, had a flag bearing the banner of Nandi the bull, built with five divine elements, had decoration made of parijata flowers, and there were sighted numerous kimpurushas seated on that chariot playing diverse instruments and singing.
Lord Shankara having created such a celestial chariot, climbed down from his vehicle Nandi and stepped up that chariot and sat on the throne.
That Lord of Parvati comfortably sat there enjoying the comfort obtained by the breeze produced by the hand fans operated by the celestial maids and goddesses.
With pleasing tinkling sounds of anklets, Veena, flute, and other instruments entire surroundings started echoing.
Watching the snakes on the body of Shiva, distantly standing peacocks started dancing blissfully while chewing happily the worms which they held in their mouth
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 23 / Sri Gajanan Maharaj Life History - 23 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 5వ అధ్యాయము - 4 🌻*
ఇలా భాస్కరు అన్నది విని శ్రీమహారాజు నవ్వుకుని వెళ్ళిపోయారు. కొద్దిదూరంలో ఒకనుయ్యి చూసి ఆయన అక్కడికి వెళ్ళారు. భాస్కరు ఆయన అక్కడకు వెళ్ళడంచూసి, ఆనూతి దగ్గరకు వెళ్ళకు అది ఎండిపోయింది. రెండు మైళ్ళ పరిధిలో ఎక్కడా ఒక్కనుయ్యి కూడాలేదు అని భాస్కరు గట్టిగా అరుస్తాడు.
అది నిజమే కానీ అందులోకి నీళ్ళు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను. నీళ్ళకోసం నీవంటివారు కష్టపడుతూ ఉంటే, ఈసమాజానికి మేలు అయ్యేలా నేను ఏమయినా చెయ్యాలి.
నా ఈకోరిక నిజమయినది అయితే భగవంతుడు నాకు సహాయంచేస్తాడు అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ, అనూతి దగ్గరకు వెళ్ళి శ్రీగజానన్ దానిలోకి తొంగిచూసారు. అది పూర్తిగా ఎండిపోయి ఉంది.
నిర్వికారమయిన మనస్సుతో దగ్గరలో ఒక చెట్టు క్రింద రాయిపై కూర్చుని, కళ్ళు మూసుకొని కొంచెంసేపు ధ్యానంచేసి, భక్తిగా భగవంతుడిని ఉద్దేశిస్తూ
ఓభగవాన్ ! వామనా, వాసుదేవా, ప్రద్యుమ్నా, రాఘవా, విఠలా, నరహరి అకోలి ప్రజలు నీళ్ళకోసం చింతితులు. ఈగ్రామంలోని ఏ బావిలోను ఒక్కచుక్క నీరు మిగిలిలేదు. అన్ని విధములయిన మానవ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
కావున నీవే వారిని కాపాడేందుకు రావాలి. అసాధ్యమయిన కార్యాలు నీవు చెయ్యగలవు. పాండురంగా మండుతున్న అగ్నిగుండం నుండి పిల్లులను నీవు రక్షించావు, ప్రహ్లాదుని మాటనిలిపేందుకు నీవు స్తంభంనుండి వెలుపలికి వచ్చావు,
వైశ్వనారా ! నీవు 12 గ్రామాలను గోకులంలో కబళించావు, ఓమురారీ నీచిటికిన వేలిమీద పర్వతాన్ని ఎత్తావు, దామాజిపంతుకు నువ్వు మహారు అయ్యావు.
సవతామాలికి నీవు ఒక ద్వారపాలకుడిగా పనిచేసి అతని పక్షులను కాపాడావు. నామదేవ్ కోసం బంజరుభూమి ప్రదేశం అయిన మార్వాడలో నీళ్ళు సృష్టించారు.
నీవు కోరుకుంటే ఏపని అయినా జరుగుతుంది అని శ్రీమహారాజు అన్నారు. ఆవిధంగా భగవంతుడిని తపస్యించిన తరువాత, ఒక శక్తి వంతమయిన ధారఉబికి వచ్చి నిమిషాలలో ఆబావి నీటితోనిండింది.
భగవంతుని యొక్క అతీతమయిన శక్తి అయనకు కోరినదల్లా చేసేందుకు తోడ్పడుతోంది. శ్రీగజానన్ బావిలో నీరు త్రాగి దాహంతీర్చుకున్నారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 23 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 5 - part 4 🌻*
I have brought the pitcher of water on my head for me and not for you. I will not give water to you. Go away immediately from here, you rascal. Because of lazy people like you amongst us, we have become useless in the world. Hearing Bhaskar, Shri Gajanan Maharaj smiled and went away.
He saw one well at some distance and went there. Seeing Him go to that well, Bhaskar loudly shouted, Do not go to that well, it is dry. There is no well filled with water within two miles of radius from here.” Maharaj said, It is true, but I will try to fill water in it.
When People like you get tormented due to the lack of water, I must do something in the interest of the society. God will help me if my intentions are honest.
Saying so, Shri Gajanan went to the well and peeped into it. It was completely dry. In a dejected mood he sat on a nearby rock under the tree, closed his eyes, meditated for some time, and solemnly implored the Almighty to give water to the village.
Shri Gajanan Maharaj said, O God, Wamana, Vasudeva, Pradyumna, Raghava, Vithala, Narahari, the people of Akola are worried about drinking water. There is not a drop left in any of the wells nearby.
All human efforts have failed, so now You have to come to their rescue. You can do even the most impossible things. Panduranga, You saved cats in the burning furnace, You appeared out of a pillar to honour the words of Pralhad.
Vaishwanara, You swallowed twelve villages in Gokul, O Murari, You lifted a mountain on Your finger tip, You became a Mahar for Damajipant, You did the work of Chokha Mahar, and protected the birds of Savata Mali. You created water for Namdeo in the dry land of Marwad.
If You wish, anything can be done. After Gajanan Maharaj made such an imploration to the Almighty, a powerful spring burst in the well and in minutes it was full of water. The might of God is unlimited, enabling Him to do anything that is desired by His the devotees.
Shri Gajanan drank the water from the well and quenched His thirst.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 13 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 13 🌻*
39. పరమాత్మ యొక్క (B) స్థితిలో అనంత చైతన్యము, పరాత్పర స్థితిలోను పరమాత్మ స్థితిలోనుకూడా అనంతముగా ఎఱుకతో శాశ్వతముగా నిలిచియున్నది.
40. A = భగవంతుడు తన స్వీయ అనంత స్వభావత్రయమైన అనంత జ్ఞాన-శక్తి-ఆనందములను ఎరుకతో అనుభవించుటయు లేదు, పరులకై వినియోగించుటయు లేదు.
41. A == భగవంతునికి అనంతముగా ఎరుకలేని స్థితి.ఇది నిర్గుణ నిరాకారమును కాదు,సగుణ సాకారమును కాదు.ఇందు సృష్టియు, చైతన్యమును అంతర్నిహితములై యున్నవి.
42. ఆత్మ స్వీయ చైతన్యమును సంపాదించుటకు గాను,
1.పరిణామ క్రమము
2. పునరావృత్తి క్రమము
3. ఆధ్యాత్మిక మార్గము
అనునవి ఆవశ్యకమై యున్నవి.
43.ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండెను,
ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉన్నవి,
ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 73 / Soundarya Lahari - 73 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
73 వ శ్లోకము
*🌴. తల్లులకు పాలు సమృద్ధిగా ఉండుటకు, స్వయం జాగృతి శక్తి 🌴*
శ్లో: 73. అమూ తే వక్షౌజా వమృత రసమాణిక్యకుతుపౌ*
న సన్దేహాస్పన్దో నగపతిపతాకే మనసినః పిబన్తౌ తౌ యస్మా దవిదితవధూసజ్గరసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌll
🌷. తాత్పర్యం :
అమ్మా! పర్వత రాజు అయిన హిమవంతునుకి పేరు తెచ్చిన ఓ తల్లీ, నీ కుచములు అమృత రసముతో నిండి,మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు.ఎందుకు అనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి,కుమారస్వాములు ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో తల్లులకు పాలు సమృద్ధిగా ఉండుట, స్వయం జాగృతికి కావలసిన శక్తి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹Soundarya Lahari - 73 🌹*
📚. Prasad Bharadwaj
SLOKA - 73
*🌴 Production of Milk and Redemption - power to realise Brahman 🌴*
73. Amuu theey vakshoja vamrutharasa manikhya kuthupou Na sadhehaspatho nagapathi pathake manasi na Pibhanthou thow yasma dhavadhitha bhadusangha rasikou Kumara vadhyapi dwiradhavadhana krouncha dhalanou
🌻 Translation :
Oh, victory flag of the king of mountains,we never have any doubt in our mind,that your two breasts divine,are the nectar filled pot made of rubies,for the elephant faced one,and he who killed crownchasura,even today do not know the pleasure of women,and remain as young children. Crownchasura -God Subrahamanya
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 8 days, offering honey as prasadam, it is believed that there will be production of milk in abundance and power to realise Brahman.
🌻 BENEFICIAL RESULTS:
Increased flow of milk in females and in cows, power to realise Brahman.
🌻 Literal Results:
Peace and contentment.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 21 🌴
21. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ||
🌷. తాత్పర్యం :
నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.
🌷. భాష్యము :
ఆదిత్యులు పన్నెండురు కలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. అకాశమునందు ప్రకాశించువానిలో సూర్యుడు ముఖ్యమైనవాడు. అతడు దేవదేవుని సముజ్జ్వలనేత్రముగా బ్రహ్మసంహిత యందు అంగీకరింపబడినాడు. ఆకాశమున ఏబదిరకముల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టానదేవతయైన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి.
రాత్రిసమయమున నక్షత్రములందు ప్రదానుడైన చంద్రుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. చంద్రుడు ఒకానొక నక్షత్రమని ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. అనగా ఆకాశమునందు మెరయు నక్షత్రములు కూడా సూర్యునికాంతినే ప్రతిబింబించుచున్నవి. విశ్వమునందు అనేక సూర్యులు కలరనెడి సిద్ధాంతమును వేదవాజ్మయము అంగీకరింపదు. సూర్యుడొక్కడే. సూర్యునికాంతిని ప్రతిబింబించుట ద్వారా చంద్రుడు వెలుగునట్లు, నక్షత్రములు కూడా వెలుతురును ప్రసరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములలో ఒకడని భగవద్గీత ఇచ్చట తెలుపుచున్నందున ఆకాశమున మొరయు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కానేరవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 372 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 21 🌴
21. ādityānām ahaṁ viṣṇur
jyotiṣāṁ ravir aṁśumān
marīcir marutām asmi
nakṣatrāṇām ahaṁ śaśī
🌷 Translation :
Of the Ādityas I am Viṣṇu, of lights I am the radiant sun, of the Maruts I am Marīci, and among the stars I am the moon.
🌹 Purport :
There are twelve Ādityas, of which Kṛṣṇa is the principal. Among all the luminaries shining in the sky, the sun is the chief, and in the Brahma-saṁhitā the sun is accepted as the glowing eye of the Supreme Lord. There are fifty varieties of wind blowing in space, and of these winds the controlling deity, Marīci, represents Kṛṣṇa.
Among the stars, the moon is the most prominent at night, and thus the moon represents Kṛṣṇa.
It appears from this verse that the moon is one of the stars; therefore the stars that twinkle in the sky also reflect the light of the sun.
The theory that there are many suns within the universe is not accepted by Vedic literature. The sun is one, and as by the reflection of the sun the moon illuminates, so also do the stars.
Since Bhagavad-gītā indicates herein that the moon is one of the stars, the twinkling stars are not suns but are similar to the moon.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 197 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
43. అధ్యాయము - 18
*🌻. గుణనిధి సద్గతిని పొందుట - 4 🌻*
భక్తేన విధినా పూజా క్రియమాణా నిరీక్షితా | ఉపోషితేన భూతాయా మనేనాస్థిత చేతసా || 37
శివలోకమయం హ్యద్య గంతాస్మాభి స్సహైవ తు | కంచిత్కాలం మహాభోగాన్ కరిష్యతి శివానుగః || 38
కలింగరాజో భవితా తతో నిర్ధూతకల్మషః | ఏషద్విజవరో నూనం శివప్రియతరో యతః || 39
అన్యత్కించిన్న వక్తవ్యం యూయం యాత యథాగతమ్ | యమదూతాస్స్వలోకం తు సుప్రసన్నేన చేతసా || 40
భక్తుడు ఉపవాసముండి మనస్సును లగ్నము చేసి యథా విధిగా చేసిన పూజను ఈతడు చూచినాడు (37).
ఈతడిప్పుడు మాతో శివలోకమునకు వచ్చి, శివుని అనుచరుడై, కొంత కాలము మహాభోగముల ననుభవించగలడు.(38).
తరువాత, సర్వ దోషములు తొలగిన ఈ ద్విజశ్రేష్ఠుడు శివునకు మిక్కిలి ప్రీతి పాత్రుడగుటచే కళింగరాజు కాగలడు (39).
మీతో చెప్పదగినది మరి ఏదియూ లేదు. యమదూతలారా! మీరు ప్రసన్నచిత్తులై వచ్చిన దారిని మీలోకమునకు పొండు (40).
బ్రహ్మో వాచ |
ఇత్యాకర్ణ్య వచస్తేషాం యమదూతా మునీశ్వర |యథాగతం యయుస్సర్వే యమలోకం పరాఙ్ముఖాః || 41
సర్వం నివేదయామాసుశ్శమనాయ గణా మునే | తద్వృత్తమాదితః ప్రోక్తం శంభూదూతైశ్చ ధర్మతః || 42
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునిశ్రేష్ఠా! యమదూతలు వారి ఈ మాటలను విని వెనుదిరిగి యమలోకమునకు వచ్చిన దారిని అందరు వెళ్లిరి (41).
ఓ మహర్షీ! శంభుని దూతలు ధర్మము ప్రకారము చేసిన ఈ కార్యమునంతనూ యమునకు ఆ దూతలు ఆదినుండి అంతమువరకు విన్నవించిరి (42).
ధర్మరాజ ఉవాచ |
సర్వే శృణుత మద్వాక్యం సావధానతయా గణాః | తదేవ ప్రీత్యా కురుత మచ్ఛాసన పురస్సరమ్ || 43
యే త్రిపుండ్ర ధరా లోకే విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 44
ఉద్ధూలనకరా యే హి విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 45
యే రుద్రాక్షధరా లోకే జటా ధారిణ ఏవ యే | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 46
శివ వేషతయా లోకే యేన కేనాపి హేతునా | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 47
ధర్మరాజు ఇట్లు పలికెను -
ఓ గణములారా! మీరందరు సావధానముగా నా మాటలను విని, నా ఈ ఆజ్ఞను ప్రీతితో ఆచరించుడు (43).
లోకములో తెల్లని విభూతితో త్రిపుండ్రమును ధరించు వారిని (44),
తెల్లని విభూతితో శరీరమునంతయూ భస్మమయముగా చేసుకొను వారిని (45),
రుద్రాక్షలను ధరించువారిని, జటాధారులను (46),
కారణమేదైనా లోకములో శివవేషమును ధరించు వారిని ఇచటకు ఎన్నడునూ తీసుకొని రావలదు. వారికి దూరముగా నుండుడు (47).
ఉప జీవనహేతోశ్చ శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 48
దంభేనాపి చ్ఛ లేనాపి శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 49
ఏవ మాజ్ఞాపయామాస స యమో నిజకింకరాన్ | తథేతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్ శుచిస్మితాః || 50
జీవిక కొరకై శివవేషమును ధరించువారిని (48),
తాము ధర్మాత్ములమని చేప్పుకొనుట కొరకు గాని, లేదా ఇతరులను మోసగిచుట కొరకు గాని శివవేషమును ధరించు వారినైననూ ఇచ్చటికి ఏనాడు గొనిరావలదు. వారికి దూరముగా నుండుడు (49).
ఆ యముడు తన భటులనీ తీరున ఆజ్ఞాపించెను. వారందరూ చిరునవ్వులతో అటులనే చేసెదమని నిర్ణయించుకొని ఊరకుండిరి (50).
బ్రహ్మోవాచ |
పార్షదైర్యమదూతే భ్యో మోచితస్త్వితి స ద్విజః | శివలోకం జగామాశు తైర్గణౖ శ్శుచి మానసః || 51
తత్ర భుక్త్వాఖిలాన్ భోగాన్ సంసేవ్య చ శివాశి వౌ | అరిందమస్య తనయః కలింగాధిపతేరభూత్ || 52
దమ ఇత్య భిధానోsభూ చ్ఛివసేవాపరాయణః | బాలోsపి శిశుభిస్సాకం శివభక్తిం చకార సః || 53
క్రమాద్రాజ్య మవాప్యాథ పితర్యుపరతే యువా | ప్రీత్యా ప్రవర్త యా మాస శివధర్మాంశ్చ సర్వశః || 54
నాన్యం ధర్మం స జానాతి దుర్దమో భూపతిర్దమః | శివాలయేషు సర్వేషు దీప దానాదృతే ద్విజాః || 55
బ్రహ్మ ఇట్లు పలికెను -
యమదూతల నుండి ఈ తెరంగున శివగణములచే విడిపింపబడిన ఆ బ్రాహ్మణుడు శుద్ధమగు అంతఃకరణము గల వాడై వారితో గూడి శీఘ్రముగా శివలోకమునకు వెళ్లెను. (51).
అచట అతడు సమస్త భోగముల ననుభవించి, పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించి, కలింగరాజగు అరిందముని కుమారుడై జన్మించెను (52).
ఆతనికి దముడు అని పేరు. అతడు బాల్యము నుండియూ శివుని సేవించుట యందు శ్రద్ధ గలవాడై పిల్లలతో గూడి శివుని భజించెడివాడు (53).
కొంత కాలమునకు తండ్రి రాజ్యాధికారము నుండి నివృత్తుడయ్యెను. అపుడు యువకుడగు దముడు రాజు అయ్యెను. అతడు సర్వత్రా ప్రీతితో శివధర్మములను ప్రవర్తిల్ల జేసెను (54).
ఓ ద్విజులారా! జయింప శక్యము కాని ఆ దమ మహారాజునకు , శివాలయములన్నింటి యందు దీపములను వెలిగింపజేయుట తక్క మరియొక ధర్మము తెలియదు (55).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 73 🌹*
Chapter 21
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 The point in Eternity - 2 🌻*
Similarly, the dream of creation of everything and everyone is cosmic illusion. It has
a beginning and it must have an end. Anything that has a beginning has an end. That
which has a beginning and an end is non-existent.
So long as a human mind dreams the dream of creation, it cannot experience Eternity. In order to experience Eternity, the human mind must awaken from the dream of its own creation.
But how can a limited
human mind awaken from this dream of its own creation?
Man is asleep and the world is his dream; that is the condition of everyone.
Because of this condition of the human mind, God takes human form as the Avatar and he creates such a situation for each of us that we are helped to begin to awaken from the dream.
When each of us dreams while sleeping and there is a loud noise, one usually awakens
feeling very irritated.
The loud noise disturbs the mind which in turn disturbs the consciousness from focusing on the dream. The noise has produced an adverse effect on the dream consciousness, but such a situation produces no gain in consciousness, because once the noise has settled and the mind is calmed, one immediately goes back to sleep and starts dreaming again soon after .
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 68 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సర్వతో భద్ర మండల విధి - 1 🌻*
అథ ఏకోనత్రింశోధ్యాయః.
అథ సర్వతోభద్రమణ్డలవిధిః
నారద ఉవాచ :
సాధకః సాధయేన్మన్త్రం దేవతాయతనాదికే | శుద్ధభూమౌ గృహే ప్రాచ్యే మణ్డలే హరిమీశ్వరమ్. 1
చతురశ్రీకృతే క్షేత్రే మణ్డలాదీని వై లిఖేత్ | రసబాణాక్షికోష్ఠేషు సర్వతోభద్రమాలిఖేత్. 2
షట్త్రింశత్కోష్ఠకైః పద్మం పీఠం పఙ్త్క్యా బహిర్భవేత్ |
ద్వాభ్యాం తు వీథికా తస్మాద్ద్వాభ్యాం ద్వారాణి దిక్షు చ. 3
సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను.
రెండు వందల ఏబదియారు(256) కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.
వర్తులం భ్రామయిత్వా తు పద్మక్షేత్రం పురోదితమ్ | పద్మార్ధే భ్రామయిత్వా తు భాగం ద్వాదశకం బహిః. 4
విభజ్య భ్రామయేచ్ఛేషం చతుః క్షేత్రం తు వర్తులమ్ |
వెనుక చెప్పన పద్మక్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశభాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను.
ప్రథముం కర్ణకాక్షేత్రం కేసరాణాం ద్వితీయకమ్. 5
తృతీయం దలసన్ధీనాం దలాగ్రాణాం చతుర్థకమ్ |
మొదటిది కర్ణకయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము.
ప్రసార్య కోణసూత్రాణి కోణదిఙ్మధ్యమం తతః. 6
నిధాయ కేసరాగ్రే తు దలసన్ధీంస్తు లాఞ్ఛయేత్ | పాతయిత్వాథ సూత్రాణి తత్ర పత్రాష్టకం లిఖేత్. 7
దలసన్ధ్యన్తరాలం తు మానం మధ్యేనిధాయ తు | దలాగ్రం భ్రమయేత్తేన తదగ్రే తదనన్తరమ్. 8
తదన్త రాలం తత్పార్శ్వే కృత్వా బాహ్యక్రమేణ చ కేసరే తు లిఖేద్ద్వౌ ద్వౌ దలమధ్యే తతః పునః. 9
పద్మలక్ష్మైతత్సామాన్యం ద్విషట్కదలముచ్చతే | కర్ణికార్ధేన మానేన ప్రాక్సంస్థం భ్రామయేత్ క్రమాత్. 10
తత్పార్శ్వే భ్రమయోగేన కుడ్ణల్యః షడ్భవన్తి హి | ఏవం ద్వాదశ మత్స్యాః స్యు ర్ద్విషట్కదలకం చ తైః.
కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగమువరకును దారము లాగి, కేసరముల అగ్రములందుంచి దళముల సంధులను గుర్తింపవలెను.
పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దళముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను. వాటి మధ్మమానమును వాటి పార్శ్వమునందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను.
ఇది పద్మయొక్క సామన్యలక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడుచున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పదిక్కు వైపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను.
దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దల కమలమేర్పడును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 84 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. పరాశర మహర్షి - 3 🌻*
9. ఈ మనుష్యుల్లో గొప్ప ప్రతిభ ఉంటేకూడా, అది ఒక తరం రెండు తరాలు ఉండటమంటేనే ఎక్కువ గొప్ప. ఈ కలియుగంలో మనవంశాలలో రెండు తరాలు బాగుంటే మూడోతరం సరిగా ఉంటుందో లేదో! అన్నీ ఉంటే, ఆస్తి పోగొట్టుకుంటారు. ఆస్తి ఉంటే, గుణం పోగొట్టుకుంటారు. గుణంపోతే, ఆయర్దాయం పోగొట్టుకుంటారు. ఇలా ఉన్నారు మనుష్యులు. దీనికి కారణం, మహర్షులు చెప్పిన ధర్మాచరణ మార్గంలో మనం ఉండకపోవటమే.
10. అల్పత్వంవల్ల – క్షుద్రత్వంవల్ల – మనుష్యులు తేజస్సు, ఓజస్సు, శక్తి సామర్థ్యాలు పోగొట్టుకుంటారు ఆ తరాల్లో రెండు తరాలయేటప్పటికి ధన దారిద్య్రము, గుణదారిద్య్రము వీటిల్లో ఏదో ఒకటి వస్తుంది. ఈ రెండు ఉంటే, ఆరోగ్యదారిద్య్రము. ఏద్యితేనేం పోవటానికి? వివేకంతోకూడిన లక్షణాలు ఉండాలి. ధైర్యస్థైర్యాలుండాలి. ఐశ్వర్యముండాలి. ఇవన్నీ ధర్మ మార్గంలో లభిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే ఇవన్నీ వస్తాయి అని ఋషుల ఉద్దేశ్యం. ధర్మాచరణచేతనే వాళ్ళు అలాంటి పరంపరలో ఉన్నారు.
11. ఋషులు ఎదుటివారిలో ఏ గుణం చూస్తారో, ఏ దుర్గుణం చూస్తారో, ఆ గుణానికి – ఆ దుర్గుణానికి అనుగుణమయినటువంటి జన్మ ఎత్తమని అంటారు వాళ్ళు. అంతే! వారు అలా అంటే, ఆ గునంవల్ల జన్మ లభిస్తుంది. వాళ్ళు సత్యమే చెప్తారుకాబట్టి ఆ మాట నిజమవుతుంది.
12. జీవలక్షణం – అది ఏదయినా సరే – లేకపోతే అసలేరాదు, ఉన్నది ఎలాగూ పోదు. రెండూ అంతే! యోగబలం అనేది పొమ్మటే పోతుందా! నేను అందరిలాగా మామూలుగా బతకాలని ఒక మహాయోగి అనుకుంటే, అది కూడా సాధ్యంకాదు. ఉన్నవాడికి పోదు, లేనివాడికి రాదు.
13. మనుష్యగర్భంలోంచీ వచ్చేటప్పుడు శిశువులకు, పశువులకు భేదంలేకుండానే పుడతారు. వాళ్ళు బుద్దిగాని, జ్ఞానంగాని, తామెవరో తెలుస్కునేటటువంటి శక్తిగాని ఏమీలేకుండా ఉంటారు.
14. మనుష్యులు కూడా ఆ దశలో పశుప్రాయులై ఉంటారు. అజ్ఞానం, అవిద్య, పశువువంటి శరీరం, ప్రాణం మాత్రం కలిగి ఉంటారు. అలాగే పుట్టి పెరుగుతారు. ముందర లౌకికజ్ఞానం వస్తుంది. లోకజ్ఞానంలోంచి కాస్త వివేకం తెలుస్తుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 15 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*
STANZA IV
*🌻 The Gift of Mind - 3 🌻*
29. The Sons of God noticed that some of the mortals were now robed in seamless Immortal Garments.
Their Hearts were blazing, being reflected with all their fervour and purity in the Great Divine Fires. In them, the power of the animal principle had been obliterated forever, and all instincts of the past overcome.
These were Earthly Gods, created from ordinary people. Once they were qualified to replace the Higher Toilers of Light, the Sons of God left the Fields of the Earth and returned to the Gods on high.
30. Labour was transforming all living things. Wherever vigilance was abandoned, the darkness appeared at once, bringing her inner laws into play. But she could not approach a toiler, for she knew that Labour was a Prayer to the Light. Taking advantage of the departure of the Sons of God, evil began to invade the Souls of Light — those that had accepted the Heavenly Burden of Fire — with his countless legions of gloom.
The darkness endeavoured to confront these Souls of Light with equal, or even stronger, forces of evil. She had already found such people, catching them at the very moment when they had let go of the Sacred Labour which had been entrusted to them.
After tricking them into believing that one could enjoy the fruits of somebody else’s labour, the darkness did not allow them to work and instead put a sword into their dangling hands.
Evil permitted the forceful appropriation of that which had been given for the good of the whole world, as it had been cultivated for everyone.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 33 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 3 🌻*
ఇప్పుడు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. కుండలినీ శక్తిని జాగృతం చేయగలిగినవారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి వుంటుంది. అది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేలమంది వుండవచ్చు. కానీ కుండలినీశక్తిని జాగృతం చేయగలిగినవారు అతి తక్కువ.
కఠోరమైన సాధన ద్వారా కుండలినీ శక్తిని మేల్కొలపగలుగుతారు. ఇది హఠ యోగం వల్ల సాధ్యపడుతుంది. లేదా మంత్ర జపం వల్ల కూడా సాధ్యమే! మన ఋషులలో ఎక్కువమంది ఈ శక్తిని సాధించనవారే! అందువల్లే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు. వివిధ మహిమలను ప్రదర్శించేవారు.
మన మనస్సు సాధారణ వాంఛల వేపే మొగ్గుతుంది.ఎంతటి సన్యాసి అయినా, యోగి అయినా కొద్ది క్షణాలసేపు అయినా కామ వాంఛలకు లొంగని వాడుండడు. అంతటి చంచలమైన మనస్సుపై అదుపు సాధించి ధ్యానంలో నిమగ్నం చేయటం అనేది అతి కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగినవారు చాలా తక్కువ.
హఠయోగం ప్రకారం కుండలినీ శక్తి పీఠం గుదస్థానం మర్మస్థానం మధ్యలో వుంటుంది. స్త్రీలకు యోని స్థానంలో వుంటుంది. ఇది అండం ఆకారంలో వుంటుంది. సర్పం చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి వుంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొలిపితే ఆ భౌతికకాయం జీవంతో వున్నంతవరకు శక్తి వుంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది కుండలిని. మహా శక్తివంతమైన కుండలినీ శక్తిని జాగృతం చేయడమే యోగాభ్యాసంలోని అత్యున్నత స్థితి. మానవ శరీరమే దేవుని నిలయం. మన శరీరంలోనే ఎన్నో అధ్బుతాలున్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే వీటిని మనం దర్శించగలం" అని వివరించారు.
వీరబ్రహ్మంగారు తన శిష్యుడు సిద్దయ్యకి శరీరం గురించి, కుండలినీ శక్తిని గురించి వివరిస్తుండగా, కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహాస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో "బ్రహ్మంగారు చెప్పినదాని బట్టి శరీరం లో చాలా అధ్బుతాలు వున్నాయి. వాటిని నేను చూడాలి” అనుకుని ఇంటికి వెళ్లాడు.
అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్నికత్తితో నరికివేసి, అందులోతనకు ఏమైనా అద్భుతాలు కనబడతాయేమోనని చూశాడు. కానీ, కక్కయ్యకు రక్త మాంసాదులు తప్ప ఏమీ కనబడలేదు.
'అయ్యో ఆ అయ్యవారు చెప్పిన మాటలు విని నేను, నా భార్యను చంపాను. నాకు దేవుళ్ళు ఎవరూ కనబడకపోగా, పెండ్లాము ప్రాణం తీసిన వాడయ్యాను. దీనికంతటికీ కారణం బ్రహ్మంగారే! ఇదంతా నేను వెళ్లి ఆయననే అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికి చెబుతా' - అనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్లాడు. తర్వాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి, ఆయనను దూషించడం మొదలు పెట్టాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 5 🌹*
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 5 🌻*
🌟. ఈ విశ్వం యొక్క సమస్త జ్ఞానం... మానవ D.N.A.లో నిక్షిప్తమై సూక్ష్మరూపంలో దాగి ఉంది. దీనినే *"జన్యు సమాచారం"* అంటారు.
భౌతిక అసెన్షన్ పొందడానికి.. బాధలు, భయాలు, కష్టాలు వీటన్నింటినీ (ద్వంద్వత్వాన్ని ) దాటి ఎప్పుడైతే మానవుడు ముందుకు వస్తాడో.. అప్పుడు ఏకత్వం లోకి వస్తాడు. సకల జీవరాశికీ, ఇతర విశ్వాలకూ *"మార్గదర్శక ఆత్మ"* గా మానవుడు మారతాడు.
🌟. అప్పుడు ఈ భూమి అంతర్ విశ్వాల, విశ్లేషణ, వినిమయ, సమాచార, ప్రసరణా కేంద్రంగా మారి తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. భూమి లక్ష్యం పూర్తి అయ్యింది అంటే ..మన లక్ష్యం కూడా పూర్తి అయినట్లే!
🌟. ఈ సృష్టి యావత్తు.. భూమిపై ఉన్న వారికి ఎన్నో విశ్వాలలో ఉన్నవారితో అంతర్గత కలయిక( ఇంటర్ కనెక్షన్) కలిగి ఉంది. ఈ భూమిపై ఉన్న వారు మారితే.. ఎన్నో విశ్వాలలో ఉన్న ఇలాంటి భూములు కూడా మారడం జరుగుతుంది.
🌟. విశ్వం నిరంతరం సృష్టించబడుతూ, మార్పు చెందుతూ, పరిణతి చెందుతూ ముందుకు ప్రయాణిస్తూనే ఉంటుంది. దీనినే *"పరిణామక్రమం"* అన్నారు. ఈ పరిణామం కోసం కొన్ని కొలతలను మరి కాల గమనాలను సృష్టించడం జరిగింది. శక్తి ప్రసరణ కేంద్రాలనూ, శబ్దతరంగ భేరులనూ (ప్రకంపనలు) జ్ఞాన భాండాగారాలనూ, (కర్మ)చేసిన పని కోసం కర్మ ఫలితాలనూ, వాటి కోసం కర్మవర్కర్స్ నీ, కాంతి ప్రసరణకోసం 1,44,000 మంది కాంతి లోక వాసులనూ మరి వారి పై అధికారులను ఇలా ఎన్నో శక్తులతో మూల చైతన్యం తనని తాను సృష్టించుకుంది.
🌟. *దేవీ పురాణం మరి బ్రహ్మాండ పురాణాలల్లో సృష్టి రహస్యం గురించి అద్భుతంగా వెల్లడించబడింది!*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 149 🌹*
✍️ Nisargadatta Maharaj
📚. Prasad Bharadwaj
*🌻 The intensity of your meditation should be such that you become totally one with the ‘I am’. 🌻*
Just observe the tremendous potential of the ‘I am’ it has kept the whole world running, the entire manifestation has come from it, its perpetual stubbornness is astonishing.
To be free from it you have to understand it in its utmost purity and then meditate on it for a reasonable amount of time.
The intensity of your meditation should be such that you become totally one with the ‘I am’.
Then a moment will come when it merges into itself and you go beyond to your true being, which is the Absolute or the ‘Parabrahman’.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 28 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 16 🌻*
ఈ అవిద్యారూపములకు ఉపమానం చెప్తున్నాడు. స్త్రీ పుత్ర ధనాదులు. ఏమండీ, ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో స్త్రీలే ఎక్కువమంది వున్నారు.
మీరు స్త్రీలని బహిరంగంగా చెప్తున్నారు. మరి ఏ స్త్రీలు అని అడగవచ్చు మీరు. ఇందాకే చెప్పాను. స్త్రీలంటే ప్రకృతీ స్వభావం కలిగినటువంటి, జీవస్వభావం కలిగినటువంటి వారందరూ, శరీరమే నేనుగా జీవించేవారందరూ స్త్రీలే. పుత్ర అంటే మీ వారసులు.
పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండీ అనుకోవనక్కర్లా. పున్నామనరకం ఎవరికైతే కలుగుతుందో, ఆ పునః నామ నరకం పొందడానికి, జనన మరణ చక్రంలో భ్రమించడానికి, తిరగడానికి సిద్ధపడ్డవారందరూ కూడా మోహమును కలిగివున్నవారే. అందరూ మోక్షమునకు దూరమైనవారే. మోక్షం అంటే మోహక్షయం. విద్యారూపమగు శ్రేయోమార్గము చేత మోహము క్షయించిపోతుంది.
ఆత్మజ్ఞానవిశేషంచేత జరిగేటటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మోహము క్షయిస్తుంది. ఇది దాని యొక్క ప్రయోజనం.
ఆత్మవిశేషంచేత, ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించవు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలి. అవదు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి. అదీ అవదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. అదీ అవదు. మరి ఏమిటి దీనివల్ల ప్రయోజనం? నీలోపల ఆంతరిక పరిణామాన్ని పొందుతావు. నీకు దేనియందైతే, జగత్తుయందున్నటువంటి వస్తు, మానవ, జీవ సంబంధాలు ఏవైతే వున్నాయో వాటన్నింటి యెడల మోహము క్షయించిపోయేట్లు చేస్తుంది. అదొక్కటే ఈ ఆత్మవిచారణ వలన ప్రయోజనం.
విద్య - ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం, శ్రేయోమార్గము వల్ల ప్రయోజనం; ఏక ప్రయోజనం. ఏమిటంటే సత్య శాంత సమరస భావముచేత మోహక్షయం కలుగుతుంది. మోహము క్షయించి పోవడం ద్వారా నీవు ఉత్తమగతిని పొందుతావు. ఏమిటా ఉత్తమగతి అంటే? జననమరణ చక్రంలో పడకుండా వుంటావు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 4. తృష్ణ - తృప్తి - బాహ్యసంపద, ఆధిపత్యము, మనుష్యునికి శాంతి నియ్యజాలవు. శాంతముగ నుండువానికి మాత్రమే అవి విభూతులుగ యుండును 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 8, 9, 10 📚*
*ప్రపంచమున నున్న సమస్తమైన ప్రతికూల శక్తులను అణచి వేసినను, దేవతలపై ఆధిపత్యమును సంపాదించినను, సమస్త సంపదలను పొందినను, పదవులను ఆక్రమించినను, ఇవి ఏవియును మనుష్యుని మానసిక అశాంతిని తొలగింపలేవని భగవద్గీత బోధించుచున్నది.*
న హి ప్రపశ్యామి మమాపనుద్యా
ద్యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణామ్ |
అవాప్య భూమా వసపత్న మృద్ధం
రాజ్యం సురాణా మపి చాధిపత్యమ్ || 8
సంజయ ఉవాచ :
ఏవ ముక్త్వా హృషీకేశం గుడకేశó పరంతపః |
న యోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ హ || 9
త మువాచ హృషీకేశః ప్రహస న్నివ భారత |
సేన యో రుభయోర్మధ్యే విషీదంత మిదం వచః || 10
''నహిః ప్రపశ్యామి మాం అపనుద్యాత్ శోకం, ఉచ్ఛోషణమ్'' (2-8) అని అర్జునుడు పలికినాడు.
అర్జునుడు మహావీరుడు. అతని నామమే వైభవోపేత సంపదను సూచించును. ఇంద్రునితో సమానముగ భూమిపై వైభవముల ననుభవించినాడు. ఇంద్రుని సింహాసనమున కూడ 5 సంవత్సరముల పాటు ఇంద్రునితో కలసి ఆసీనుడైనాడు.
స్వర్గలోకసుఖములను అన్నింని అనుభవించినాడు. మహావీరుడని పేరు పొందినాడు. సుందర రూపునిగ శ్లాఫిుంపబడినాడు.
ఇహ లోకమున అతను పొందని విజయము గాని, సౌఖ్యము గాని లేదు. అట్టివాడు 'ఉచ్ఛోషణం' అనగా మిగుల తాపము కలుగ చేయున్టి 'శోకం' అనగా దుóఖమును ఏ విధముగా పోగొట్టుకొనవలెనో? తెలియజాలక దీనుడై యుద్ధమున నిలబడి యున్నాడు. ఏది దుóఖమును పోగొట్టగలదో దానిని తెలియకున్నానని భగవానునితో పలికినాడు.
పదవులు, బాహ్యసంపద, ఆధిపత్యము ఇత్యాదివి, మనుష్యునికి శాంతి నియ్యజాలవనియు, శాంతముగ నుండువానికి మాత్రమే అవి విభూతులుగ యుండుననియు గీత యందలి ఈ శ్లోకము ద్వారా తెలియనగును. హిరణ్యకశిపుడు, రావణుడు, అర్జునుని మించిన పరాక్రమవంతులు. వారు స్వర్గమును కూడ ఆక్రమించినారు. అయినప్పికిని శాంతి కలుగలేదు.
బహిః కరణములద్వారా ప్రపంచమున సాధించబడునది ఏదియు అంతరంగమున శాంతిని స్థాపించలేదు. కేవలము అంతఃకరణ శుద్ధిచే పొందు ఆత్మానుభూతియే శాంతిని, తృప్తిని ఇచ్చును.
*అంతః తృప్తిలేని వానికి బాహ్యపుష్టి, తుష్టి నియ్యజాలవు.*
ఈ విషయమున ప్రాచీనులు ఎఱుక కలిగి నిర్మలము, నిరాడంబరము లగు జీవితము నేర్పరచుకొనినారు. నవీన యుగమున రజోగుణ దోషమున మానవుడు అంతులేని దాహమున పినాడు. తృప్తిని వదలి తృష్ణతో ఆరాటపడుచు తిరుగాడుచు అమూల్యమైన జీవనమును వ్యర్థము గావించు కొనుచున్నాడు.
ప్రాచీనులకన్న తనకెక్కువ తెలుసను గర్వమున పడినాడు. ఎక్కువ తెలిసి జీవితమున తక్కువ సుఖపుట మరింత మూర్ఖత్వము.
భగవద్గీత యందు ఈ శ్లోకమున, శ్లోకము యొక్క నిజస్వరూపము చక్కగ ప్రతిపాదింపబడినది. పరిశుద్ధ జీవనము, నిర్మలమైన మనస్సు, విశాల హృదయము, ఇత్యాది సద్గుణములను సాధించుకున్న వాడు అదృష్టవంతుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment