అద్భుత సృష్టి - Ƽ

🌹. అద్భుత సృష్టి - 5 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 5 🌻

🌟. ఈ విశ్వం యొక్క సమస్త జ్ఞానం... మానవ D.N.A.లో నిక్షిప్తమై సూక్ష్మరూపంలో దాగి ఉంది. దీనినే "జన్యు సమాచారం" అంటారు.

భౌతిక అసెన్షన్ పొందడానికి.. బాధలు, భయాలు, కష్టాలు వీటన్నింటినీ (ద్వంద్వత్వాన్ని ) దాటి ఎప్పుడైతే మానవుడు ముందుకు వస్తాడో.. అప్పుడు ఏకత్వం లోకి వస్తాడు. సకల జీవరాశికీ, ఇతర విశ్వాలకూ "మార్గదర్శక ఆత్మ" గా మానవుడు మారతాడు.

🌟. అప్పుడు ఈ భూమి అంతర్ విశ్వాల, విశ్లేషణ, వినిమయ, సమాచార, ప్రసరణా కేంద్రంగా మారి తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. భూమి లక్ష్యం పూర్తి అయ్యింది అంటే ..మన లక్ష్యం కూడా పూర్తి అయినట్లే!

🌟. ఈ సృష్టి యావత్తు.. భూమిపై ఉన్న వారికి ఎన్నో విశ్వాలలో ఉన్నవారితో అంతర్గత కలయిక( ఇంటర్ కనెక్షన్) కలిగి ఉంది. ఈ భూమిపై ఉన్న వారు మారితే.. ఎన్నో విశ్వాలలో ఉన్న ఇలాంటి భూములు కూడా మారడం జరుగుతుంది.

🌟. విశ్వం నిరంతరం సృష్టించబడుతూ, మార్పు చెందుతూ, పరిణతి చెందుతూ ముందుకు ప్రయాణిస్తూనే ఉంటుంది. దీనినే "పరిణామక్రమం" అన్నారు. ఈ పరిణామం కోసం కొన్ని కొలతలను మరి కాల గమనాలను సృష్టించడం జరిగింది. శక్తి ప్రసరణ కేంద్రాలనూ, శబ్దతరంగ భేరులనూ (ప్రకంపనలు) జ్ఞాన భాండాగారాలనూ, (కర్మ)చేసిన పని కోసం కర్మ ఫలితాలనూ, వాటి కోసం కర్మవర్కర్స్ నీ, కాంతి ప్రసరణకోసం 1,44,000 మంది కాంతి లోక వాసులనూ మరి వారి పై అధికారులను ఇలా ఎన్నో శక్తులతో మూల చైతన్యం తనని తాను సృష్టించుకుంది.

🌟. దేవీ పురాణం మరి బ్రహ్మాండ పురాణాలల్లో సృష్టి రహస్యం గురించి అద్భుతంగా వెల్లడించబడింది!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment