✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
ప్రథమాధ్యాయం - సూత్రము - 37
🌻. 37. లోకేశపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ॥ - 3 🌻
ప్రహ్లదుడేమన్నాడో చూడండి.
చిక్కడు వ్రతముల గ్రతువుల జిక్కడు దానముల శౌచ శీల తపములం జిక్కడు యుక్తిని, భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండి !
మిత్రులారా ! వ్రతాల ద్వారాగాని, క్రతువుల ద్వారాగాని, దానాల వల్లగాని, శౌచ క్రియలు, సచ్చిలం వలన గాని, తవాల వల్లగాని, యుక్తితో గూడిన తర్మ వితర్మాల వలన గాని శ్రీహరి చిక్కడు. ఒకవేళ ఈ విధమైన వాటివలన అతి కష్టంతో చిక్కినా, చిక్కవచ్చునేమో! కాని భక్తి వలన చిక్కినంత సులభంగా మాత్రం ఏ ఇతర సాధనల వలన దొరకడు.
శ్రీహరిని చిక్కించుకోవాలంటే మానసిక భక్తియ నష్టం. బ్రాహ్మణత్వం వలన గాని, విద్యాప్రక్రియల వలన గాని, దెవతల దివ్యత్వంచే గాని, యోగుల ప్రశాంత సాధనలు మొదలైన వాటిచే శ్రీహరిని దొరక పుచ్చుకోవడానికి సరిపోవు.
ఆ శ్రీహరి కేవలం భక్త సులభుడు. భగవత్కళ్యాణ గుణాలను చింతన చేయడం, పలకడం సంకీర్తనమైతే, నామావళిని పఠించడం పారాయణ, ప్రణవ జపం, ఇతర మంత్ర జపాలు కూడా సంకీర్తనలోనే చేరుతాయి.
మననాత్ త్రాణనాచ్చెవ మద్రూపస్యావ బోధనాత్ ।
మంత్ర మిత్యుచ్యతే బ్రహ్మన్ మదధిష్టానతోపివా ॥
-యాజ్ఞవల్క్యోపనిషత్
మనన శక్తి వలన భగవత్తత్త్వం బోధ పడుతుంది. త్రాణశక్తి (ప్రాణ+మనః +బుద్ది) వలన భగవత్సాక్షాత్మారం కలుగుతుంది. కావున మంత్రం భగవన్నిలయం.
వచసా తజ్జపే నిత్యం వపుషా తత్సమభ్యసేత్
మననా తజ్జపే నిత్యం తత్పరం జ్యోతిరోమితి
శుచిర్వాప్య శుచిర్వాపియో జపెత్ ప్రణవం సదా
న సలిష్యతి పాపేన పద్మపత్ర మివాంభసా ॥|
-యోగ చూడామణ్యుపనిషత్
వచసా, మనసా జపం చెయడానికి అందరూ అర్హులే. దీనికి ఏ నియమం లేదు. మానసిక జపంచేత స్వరూపతత్త్వం బోధపడది, పరం జ్యోతిరూప భగవద్దర్శనం కలుగుతుంది.
ప్రణవ జపం భక్తుడిని ఎల్లప్పుడూ బురద అంటని తామర పూవువల స్వచ్చంగా ఉంచుతుంది. సహజంగా ఉంచి, భక్తుదిని భగవత్మెంకర్యానికి తయారు చేస్తుంది. జప యజ్ఞానికి గురూపదేశం అవసరం లేదు. అశుచి దోషముండదు అని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది.
యత్రైకా గ్రతా తత్ర విశేషాత్ !
-బ్రహ్మ సూత్రాలు
ఎక్కడ నిలిపితే బుద్ధి ఏకాగ్రత చెందుతుందో, ఆ చోట జపయజ్ఞం చెసి మనోలయం నాధించమంటున్నది. మానసిక జప స్థితికి చెరుకునెవారు మనో నిరోధం చేసుకోవాలి.
ఇంకను శౌచం, మౌనం, మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం, అనిర్వేెదం మొదలగునవి వాటించి సిద్ధిని బడయాలి. ఏటిని పాటించడం వలన భక్తి వృద్ధి అవుతుంది. కార్య విఘ్నాలు హరిస్తాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment