శివగీత - 31 / Ŧђε Şı√ɑ-Gı†ɑ - 31


🌹. శివగీత - 31 / Ŧђε Şı√ɑ-Gı†ɑ - 31 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

పంచామాధ్యాయము

🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 1 🌻

సూత ఉవాచ :-

అధః ప్రాదుర భూత్తత్ర - హిరణ్య యరదో మహాన్,
అనేక దివ్య రత్నాంవు -కిమ్మీరి తది గంతరః 1

నద్యు పాంతిక పంకాడ్య - మహాచక్ర చతుష్టయః
ముక్తా తోరణ సంయుక్త - శ్శ్వేతచ్చత్ర శతావృ తః 2

శుద్ధ హేముఖ రైరాడ్య - తురంగ గణ సంయుతః,
ముక్తా వితాన విలస - దూర్ద్వదివ్యవృషద్వజః 3

మత్త వారణ కాయుక్తః - పంచ తత్త్వోప శోభితః,
పారిజాత తరూద్భూత - పుష్ప మాలాభి రంజితః 4

మృగ నాభి సముద్భూత - కస్తూరీ మద పంకిలః,
కర్పూరా గుదూ పోత్ద -గంధా కృష్ణ మధు వ్రతః 5

సంవర్త ఘన ఘోషాడ్యో - నానా వాద్స మన్వితః,
వీణా వేణు స్వనా సక్త - కిన్రీ గణ సంకులః 6

సూతుడు చెప్పుచున్నాడు :

పిదప శ్రీరాముని ముందట అతిశయించు రత్నముల కాంతులతో నలువంకల ప్రకాశింప చేయు చతుశ్చక్రంబులున్నది, ముత్యాల స్వచ్చమైన స్వర్ణ మయంబైన గిట్టలు గల యశ్వరాముల తోడ, నంది ద్వజముతోను, మదగజములు, పంచ తత్వములు,

పారిజాత పుష్పమాలల తోను, అగుర, కస్తూరి, జవ్వాది, ఇత్యాది సుగంధ వస్తువులు కలది. ప్రళయ కాలములో గర్జించు మేఘ ధ్వని వలె నిఖిల వాయిద్యముల తోడను, కిన్రులు, కింపురుషు లతో నిండినది యునగు దేదీప్యమానమగు రధము గన పడెను.

ఏవం కృత్వా రాధా శ్రేష్టం - వృషాదుత్తీర్య శంకరః,
అంబయా సమిత స్తత్ర - పటతల్పే విశత్తదా 7

సుర నీర జనే త్రాణాం - శ్వేత చామర చాలనై:
దివ్య వ్యజన వాతైశ్చ - ప్రహృష్టో నీల లోహితః 8

శంకరుడీ లాంటి రధమును కల్పించి ఉమా సహితుడై నంది వాహనము నుండి దిగి యా రధము నందలి వీలు శయ్యను ప్రవేశించెను.

దేవతాస్త్రీలు వీచే వింజామరములకు,సుఖముగా వీచెడు వాయువునకు పార్వతీ పతి యానందించిన వాడయ్యెను.

క్వణ త్కంక న నిద్వానై - ర్మంజు మంజీర శింజితై:,
వీణా వేణు స్వనై ర్గితై: - పూర్ణ మాసీ జ్జగత్త్రయమ్ 9

శుక వాక్య కలారావై - శ్శ్వేత పారావత స్వనై:,
ఉన్నిద్ర భూష ఫణి నా - దర్శ నాదేవ బర్హణః 10

నినదించు కర కంకణాల ధ్వని చేత, మనోహరములై చిన్న గజ్జెల ద్వనులతోడ, వీణా వేణు రావములతోడ ను , పారావత విరావముల తోడను, చిలుక పలుకల తోను జగము వ్యాపించెను . శివుని యాభరణము లైన సర్పములను చూచి మయూరములు తమ పురుగులనే అసంఖ్యాఖము లుగా నములుతూ నాట్యము చేసినవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Ŧђε Şı√ɑ-Gı†ɑ - 31 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 05 :
🌻 Ramaya Varapradanam - 1 🌻

Suta said:
Subsequently, Sri Rama sighted a divine chariot shining with exaggerated brilliance due to gems and diamonds, which has four wheels, covered with pearl garlands, having celestial umbrellas, having

white colored steeds ornamented with gold, had a flag bearing the banner of Nandi the bull, built with five divine elements, had decoration made of parijata flowers, and there were sighted numerous kimpurushas seated on that chariot playing diverse instruments and singing.

Lord Shankara having created such a celestial chariot, climbed down from his vehicle Nandi and stepped up that chariot and sat on the throne.

That Lord of Parvati comfortably sat there enjoying the comfort obtained by the breeze produced by the hand fans operated by the celestial maids and goddesses.

With pleasing tinkling sounds of anklets, Veena, flute, and other instruments entire surroundings started echoing.

Watching the snakes on the body of Shiva, distantly standing peacocks started dancing blissfully while chewing happily the worms which they held in their mouth
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment