పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 1 / Dasarathi Satakam - 1 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 1వ పద్యము :
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా, అనంతమైన పరాక్రమముచే, పరశురాముని గర్వభంగ మొనర్చి, ఏక పత్నీ వ్రతమును తాల్చి, మేఘమువంటి శరీర ఛాయ కలిగి ఇక్ష్వాకు కుల వంశ చంద్రుడివై, రాక్షసులను చంపు వాడవు.
🌻. 2వ పద్యము :
శ్రీ రఘురామ, చారు తులసీ దళధామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ; జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
🌻. భావము :
ఈ పద్యములన్నియు భద్రాచలములో వెలసిన రామచంద్రుని మీదనే !
మంగళకరమైన ఇక్ష్వాకు వంశమున జన్మించి తులసి పేరులు మెడకొని, శమ క్షమాది శృంగార గుణములను తాల్చి వీరులైనటువంటి కబంధుడు మొదలైన రాక్షసుల సంహరించినటువంటి, లోకములను కాపాడు నటువంటి ఓ రామా! నీకు మంగళము, నీవు మా పాపములను బాపుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 1 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻. 1st Poem :
SrI raGurAma! cArutulasIdaLadAma SamakShamAdi SRuM
gAra guNABirAma! trijagannuta Saurya ramAlalAma du
rvAra kabaMdharAkShasa virAma! jagajjana kalmaShArNavO
ttArakanAma! Badragiri dASarathI karuNApayOnidhI
🌻. Meaning :
Oh Rama of Raghu Dynasty! You are adorned with a beautiful garland of Tulasi Dalas. You are endowed with noble qualities like patience and forgiveness.
You are well known in all the three worlds for your valour. You are the destroyer of Kabandha the supposedly invincible demon. (Chanting of) Your name ferries people of the world across the sea of sins. Oh Dasaradhi of Bhadrachala! Oh Ocean of compassion!
🌻. 2nd Poem
rAmAvisala vikrama parAjita BArgavarAm sadguNa
stOma parAMganAvimuKa suvrata kAma vinIla nIrada
SyAma kakutdhsavaMSa kalaSAMBudhisOma surAridOrBalO
ddAma virAma Badragiri dASarathI karuNApayOnidhI!
🌻. Meaning :
O Rama! With your valour you vanquished Parasurama. You are the embodiment of good qualities. You do not have any amorous attitude towards other women. You have a complexion similar to that of the dark clouds of the sky. You are like a moon to the sea of Kakuthsa Dynasty. You scared the Rakshasas by your valour. Oh Son of Dasaradha! Oh Ocean of Kindness!
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 2 / Dasarathi Satakam - 2 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 3వ పద్యము :
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నీవు సత్యమునే పలుకు వాడవు. శరణా గత రక్షణము నీకు వెన్నతో బెట్టిన విద్య, పాపాలను హరించువాడవు. బ్రాహ్మణులను బ్రోచు వాడవు. కరుణా సముద్రుడవు. ఆకాశగంగలోని పద్మములందలి పుప్పొడిచే అలంకరింపబడిన పాదములు కలిగి, ప్రకాశించే ఆభరణములు గలవాడవు.
🌻. 4వ పద్యము :
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ
🌻. భావము :
ఓ రామా! నీవు తేజోవంతులు, పరాక్రమముగల శత్రువులను జయించిన వాడవు. గరుత్మంతుడినే గుఱ్ఱముగా కలవాడవు. కష్టములనే కారు చీకట్ల తొలగించి, సజ్జనులతో స్నేహము చేసే దయాశీలివి. తామర వంటి సీతాదేవి హృదయమును తుమ్మెదవలె చూరగొని, తామరవంటి రాక్షసుని ఏనుగు వలె తుదముట్టించు వాడవు. మంగళప్రదమైన ఆకారము కలవాడవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 2 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 3rd Poem :
agaNita satyaBASha, SaraNAgatapOSha, dayAlasajGarI
vigata samastadOSha, pRuthivIsuratOSha, trilOka pUtakRu
dgaganadhunImaraMda padakaMja viSESha maNipraBA dhaga
ddhagita viBUSha Badragiri dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
You are ever truthful. You protect those who seek refuge in you. Your river of kindness washes away the sins of people. You make the Brahmins happy. Ganga, which sanctifies the three worlds, has originated in your feet. You are effulgent with jewels made of sparkling Ratnas.
🌻 4th Poem :
raMgadarAtiBaMga, Kaga rAjaturaMga, vipatparaMparO
ttuMga tamaHpataMga, pari tOShitaraMga, dayAMtaraMga sa
tsaMga dharAtmajA hRudaya sArasaBRuMga niSAcarAbjamA
taMga, SuBAMga, Badragiri dASarathI karuNApayOnithI
🌻 Meaning :
You have vanquished your enemies. Garuda transports you everywhere like a horse. You are like a Sun for those devotees whose mental horizon is darkened by worries and perils. You made Ranganadha happy. You are full of kindness. You are surrounded by pious people. You are like a brhamara (large black carpenter bee) for Seeta's lotus heart. You are a terror to the Rakshasas. You have a noble personality.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 3 / Dasarathi Satakam - 3 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 5వ పద్యము :
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ దశరథ రామా! కరుణా పయోనిధి! నీవు సర్వసంపదలు ఇచ్చువాడవు. సునందుడు మొదలైన ఋషులతో కొలవ బడ్డ పాదములుకలవాడవు. నీ కీర్తి కొలచుటకు కొలబద్దలేదు. రామ చంద్రుడవు. ఆటపాటలతో ఆనందించెడి వాడవు.
🌻. 6వ పద్యము :
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఈ శతకము రచించుట నా ప్రజ్ఞకాదు, వినయముతో శరీరమును వంచి, పుజ్యులయిన పెద్దలకు, రఘునాధ భట్టాచార్యులకు మ్రొక్కి, కవులను స్తుతించి చేసిన పని ఇది. దాని లోని లోపమునెంచక భక్తి చూసి గ్రహింపుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 3 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 5th Poem :
SrIda sanaMdanAdi munisEvita pAda digaMtakIrtisaM
pAda samastaBUta paripAla vinOda viShAda valli kA
cCEda dharAdhinAthakula siMdhusudhAmayapAda nRuttagI
tAdi vinOda Badragiri dASarathI karuNApayOnithI
🌻 Meaning :
You bestow riches on your devotees. Your feet are worshipped by Sages like Sananda. You are well known in all the corners of the world. You enjoy the act of protecting all the living beings. You remove unhappiness from the minds of people. You are like a moon illuminating the sea of Royal Dynasties. You relish music and dance.
🌻 6th Poem :
Aryulakella mrokkivina tAMguDanai raGunAdha BaTTarA
rAcAryula kaMjaletti kavi sattamulan vinutiMci kArya sau
karya melarpanokka SatakaMbona gUrci raciMtunEDutA
tparyamunan grahiMpumidi dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
I bow to all the Elders and prostrate before my Guru Raghunadhabhattu and pay respects to the great poets. I am writing a Sathakam for facilitating achievement as my humble offering to you. Please bless me.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 4 / Dasarathi Satakam - 4 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 7వ పద్యము :
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
కరుణాపయోనిధీ! దశరధరామా! రేగు పండ్లకు ఆశబడి ముత్యములను ఇచినట్లు, దుష్టుల యోగ్యత నెరుగక నా కవిత నంకితమిచ్చి మోసపోయినాను. నీవే నా జివ్హకు పరిశుద్ధత కలుగునట్లుగా నా నాలుక ఆనెడి రంగస్థలమున నీవు నిలిచి, నటించి నా పద్యములను రమణీయములుగా తీర్చిదిద్దుము.
🌻. 8వ పద్యము :
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఇంద్రియజేతవైన ఓ రామా! నీవు లక్ష్మీకాంతితో విలసిల్లుతున్న హారములు ధరించి, నీలి మేఘశ్యాముడవై, మాకోర్కెలను తీర్చుతూ మా పాపాలను హరించుతూ, ఖరాదులైప రాక్షసాటవికి గొడ్డలివంటి వాడవై మము ఎల్లవేళలా కాపాడుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 4 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 7th Poem :
masakoni rEgubaMDlakunu mauktikamul velavOsinaTludu
rvyasanamujeMdi kAvyamu durAtmulakiccitimOsa mayye nA
rasanaku bUtavRuttisuka raMbuga jEkurunaTlu vAksudhA
rasamulucilka padyumuKa raMgamunaMdunaTiMpa vayyasaM
tasamu jeMdi Badragiri dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Out of greed I dedicated my poetic works to wicked people and was deceived. It was like buying Regu fruits by giving away pearls. Please grant piety to my tongue and sweetness to my poems by treating my tongue as a stage and by dancing there.
🌻 8th Poem :
SrIramaNIyahAra yatasI kusumABaSarIra, Bakta maM
dAra, vikAradUra, paratattvavihAra trilOka cEtanO
dhdhAra, duraMta pAtaka vitAna vidUra, KarAdi daityakAM
tAra kuThAra Badragiri dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You wear resplendent necklaces. The complexion of your body is like that of Avisa flowers. You are like a kalpa vrisha (wishtree) to the devotees. You are unaffected by things or events. You are immersed in paratatwa. You nurture all the living beings in the three worlds. You wash away the sins. You are like an axe to the forest of khara and other Rakshasas.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 5 / Dasarathi Satakam - 5 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 9వ పద్యము :
దురితలతాలవిత్ర, ఖర దూషణకానన వీతిహొత్ర, భూ భరణకళా విచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి స్ఫురదర విందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ నీలిమేఘశ్యామా! నీవు పాపములనే తీగలను గొడ్డలితో నరకుతూ, రాక్షసాటవికి అగ్నిహోత్రుడవై చెలగి, మా సంసారబంధవిమోచన కావించి మమ్ము రక్షింపుము. భూభారము భరించే కళగలిగిన వాడవు. తేజోవంతమైన కమలముల వంటి కన్నులు కలవాడవు. మేఘచ్చాయగల పుణ్యచరితుడవు.
🌻. 10వ పద్యము :
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార సజ్జన పరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సంజనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చందన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ దాశరథీ! నీ రూపు వర్ణనాతీతము. బంగారు వస్త్రము ధరించి పదునైన గొడ్డలితో సంసారమనెడి అడవిని నాశనం చేసి సజ్జనులను రక్షించు వాడవు. దేవతలచే స్తుతించ బడునట్టి గుణములు కలిగినవాడవు. అగ్ని వంటి శౌర్యపరాక్రమములతో నిండి, శరత్కాల మేఘములు, మల్లెలు, మంచి గంధమువలె పరిమళించు, కర్పూరము వంటి స్వచ్చమైన కీర్తికలవాడవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 5 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 9th Poem :
duritalatAlavitra, Kara dUShaNakAnanavItihotra, BU
BaraNakaLAvicitra, Bava baMdhavimOcanasUtra, cAruvi
sPuradaraviMdanEtra, Gana puNyacaritra, vinIlaBUrikaM
dharasamagAtra, Badragiri dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You are like a sickle for cutting the creeper plant of sins. You are like fire to the forest of Khara and Dushana. You are adept in protecting the Earth. You are capable of releasing us from the shackles of the worldly existence. Your eyes are like a beautiful blossoming lotus. Your story is full of piety. Your complexion is akin to that of dark clouds.
🌻 10th Poem :
kanakAvisalacEla BavakAnana SAtakuThAradhAra sa
jjanaparipAlaSIla divijastuta sadguNa kAMDakAMDa saM
janita parAkramakrama viSArada SArada kaMdakuMda caM
dana GanasAra sArayaSa dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You wear golden- hued clothes. You are like the edge of an axe for tackling the forest of worldly existence. You protect the pious and righteous people. The Devas extol your great virtues. You are an expert in archery. Your fame is as pure as that of jasmines, chandana and the autumnal clouds.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 6 / Dasarathi Satakam - 6 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 11వ పద్యము :
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రఘువంశ సుధాంబుధి చంద్రా! శ్రీ రామా! సంసార బంధములనుండి తొలగించి జనులను తరింపజేయు నామము కలిగిన దాశరథీ! నీ పద పద్మములను ఉత్పల చంపకమాలిక లనెడి పద్యపు పూవుల పూజ జేయనిమ్ము.
🌻. 12వ పద్యము :
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
మంచి కావ్యము కేవలము రసజ్ఞులే ఆదరిస్తారు. కాని రసహీనులు ఆదరించలేరు కదా! అది ఎట్లన చంద్రుని కిరణములు కరుగునది చంద్ర కాంత శిలలే, కాని వింధ్య పర్వతము మీది రాళ్ళు కరిగి దద్రవించవు కదా!
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 6 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 11th Poem :
SrI raGuvaMSa tOyadhiki SItamayUKuDavaina nI pavi
trOrupadAbjamul vikasitOtpala caMpaka vRuttamAdhurI
pUritavAkprasUnamula bUjalonarceda jittagiMpumI
tArakanAma Badragiri dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
You are like a Moon for the sea of Raghu Dynasty. I want to offer at Your Lotus Feet sweet compositions composed using champaka and utpalamala (names of metres used in composing sanskrit/Telugu verses). Your very name can help us in crossing the sea of worldly existence. Please accept my humble offering.
🌻 12th Poem :
gurutaramaina kAvyarasa guMBanakabbura maMdimuShkarul
sarasulamADki saMtasila jUludurOTuSaSAMka caMdrikAM
kuramula kiMdu kAMtamaNi kOTisraviMcina BaMgiviMdhyaBU
dharamuna jArxunE Silalu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Can ignorant laymen appreciate the beauty of a great poetic work like a connosieur? Can the moon’s rays melt the rocks of vindhya the way they can melt the chandrakantha manis (moon stones)?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 7 / Dasarathi Satakam - 7 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 13వ పద్యము :
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
సూర్య వంశశ్రేష్టా! శ్రీ రామా! నీ పేరుతో రచింపబడిన కావ్యము ఎన్ని దోషము లయిన పలుకుతున్నప్పటికీ పవిత్ర మయినదే కదా! అది ఎట్లనగా ఆకాశగంగా జలము వంకరగా ప్రవహించినను, పైకి మురికిగా కనిపించును. ఆ గంగ యొక్క మహాత్యము లెక్కించుట సాధ్యమా!
14వ పద్యము :
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నీ నామము పాపములను బాపునది, సంసార సాగరమును దహించుచేయునది. విస్తృతముగా వ్యాపించిన దుఃఖజ్వాలలను ఆర్పివేసే అమృతవర్షము చెడుమతాచారములను ఖండించు గొడ్డలివంటిది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 7 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 13th Poem :
taraNikulESa nAnuDula dappulu galgina nIdunAma sa
dviracitamaina kAvyamu pavitramugAde viyannadIjalaM
baragucuvaMkayaina malinAkRuti bArxina danmahatvamuM
darame gaNiMpa nevvariki dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
In this work, which is being written about your name, even if there are mistakes, it will still be a sacred work. Is it not? If during the flow Akashaganga flows in a convoluted path or the water becomes dirty can anyone comment on its piety?
🌻 14th Poem :
dAruNapAta kAbdhiki sadA baDabAgni BavAkulArtivi
stAradavAnalArciki sudhArasavRuShTi duraMta durmatA
cAraBayaMka rATaviki jaMDakaThOrakuThAradhAra nI
tArakanAma mennukona dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Your name scorches the sea of sins like fire (badabagni) and it is like a rain of amritha for the rising fire of sufferings. It is like the sharp edge of an axe for destroying the forest of bad religious traditions.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 8 / Dasarathi Satakam - 8 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 15వ పద్యము :
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
పావనరామా! నీ నామము శివునకు, విభీషణునకు, పార్వతికి శ్రేష్టమైన మంత్రమైనట్లే, గజేంద్ర, అహల్య, ద్రౌపదులకు కష్టములను తొలగించు చుట్టమైనట్లే, నీ నామమును అన్ని వేళలా నా నాలుకపై నాట్యమాడునట్లు చేయుము.
🌻. 16వ పద్యము :
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! ఆపద సమయములోను, వృద్ధాప్యములోను, మరణము సంభవింప బోవునపుడు, గొంతు యందు కఫము నిండి యున్నప్పుడు, బంధువులు చుట్టుముట్టినపుడు నీ నామ స్మరణ చేయ గల్గుదునోలేదో, నాకు వీలైనపుడే నీ నామ స్మరణ జేసెదను. ఎంత చక్కగా సెలవిచ్చాడు? మనమంతా ఈ పై సమయాల్లో తల్చుకోవచ్చులే అనుకోని దైవ స్మరణకి దూరమవుతున్నాము. అందరము కంఠతా పట్టవలసిన శతకమిది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 8 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 15th Poem :
harunaku navviBIShaNunaka drijakuM dirumaMtra rAjamai
kariki nahalyakuM drupadakanyaku nArtihariMcucuTTamai
paraginayaTTi nIpatita pAvananAmamu jihvapai niraM
taramu naTiMpajEyumika dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Your sacred name served as a manthra to Siva, Parvathi and Vibhishana. It served as a saviour to Gajendra, Ahalya and Draupadi. May such a name dance on my tongue forever.
🌻 16th Poem :
muppuna gAlakiMkarulu muMgiTavaccina vELa, rOgamul
gopparamainacO gaPamu kuttuka niMDinavELa, bAMdhavul
gappinavELa, mIsmaraNa galguno galgado nATi kippuDE
tappakacEtu mIBajana dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
In old age when the messengers of Yama are waiting outside and aggravating diseases cause kapham(phlegm) to choke my voice and I am surrounded by relatives, I do not know whether I will be in a position to pray. Therefore let me pray now itself.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 9 / Dasarathi Satakam - 9 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 17వ పద్యము :
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ శ్రీరామా! పతితులను పావనము చేయు నామము కలిగిన రామా! నీ నామ స్మరణ జేయు భక్తుల పాద ధూళి నా శిరమున దాల్చెదను. ఎందుకంటే యమభటులు ఆ ధూళి వున్న చోటుకు రారు.
🌻. 18వ పద్యము :
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ పరిపూర్ణమూర్తి, శ్రీరామా! నువ్వు బ్రహ్మకు తండ్రివి, సనక సనందాది మునులకు ఉత్కృష్టమైన దైవమును గరుడ కేతనము కలవాడవు సూర్యవంశములలో రాజశ్రేష్టుడవు. అట్టి నిన్ను స్తుతించెదను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 9 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 17th Poem :
paramadayAnidhE patitapAvananAma harE yaTaMcu su
sdhiramatulai sadABajana sEyu mahAtmula pAdadhULi nA
SiramunadAltumIraTaku jErakuDaMcu yamuMDu kiMkarO
tkaramula kAna beTTunaTa dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
O Treasure house of compassion! I will wear the dust of the feet (paadadhuli) of the great devotees who always chant 'pathitha pavana nama' 'parama dayanidhe' and 'Hari'. It appears that Yama has instructed his messengers to keep away from such people.
🌻 18th Poem :
ajunaku taMDrivayyu sanakAdulakuM baratattvamayyusa
ddvijamunikOTikellagula dEvatavayyu dinESavaMSa BU
Bujulaku mETivayyubari pUrNuDavai veligoMdupakShirA
Ddhvajamimu brastutiMcedanu dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
You are the Father of Brahma. Sanaka and Sananda treat you as the embodiment of Paratatwa. You are the favourite deity of Rishis and Brahmins. You are the greatest of the kings of Surya Dynasty. O Garudadhwaja! You are the personification of perfection. Salutations to you !
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 9 / Dasarathi Satakam - 9 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 17వ పద్యము :
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ శ్రీరామా! పతితులను పావనము చేయు నామము కలిగిన రామా! నీ నామ స్మరణ జేయు భక్తుల పాద ధూళి నా శిరమున దాల్చెదను. ఎందుకంటే యమభటులు ఆ ధూళి వున్న చోటుకు రారు.
🌻. 18వ పద్యము :
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ పరిపూర్ణమూర్తి, శ్రీరామా! నువ్వు బ్రహ్మకు తండ్రివి, సనక సనందాది మునులకు ఉత్కృష్టమైన దైవమును గరుడ కేతనము కలవాడవు సూర్యవంశములలో రాజశ్రేష్టుడవు. అట్టి నిన్ను స్తుతించెదను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 9 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 17th Poem :
paramadayAnidhE patitapAvananAma harE yaTaMcu su
sdhiramatulai sadABajana sEyu mahAtmula pAdadhULi nA
SiramunadAltumIraTaku jErakuDaMcu yamuMDu kiMkarO
tkaramula kAna beTTunaTa dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
O Treasure house of compassion! I will wear the dust of the feet (paadadhuli) of the great devotees who always chant 'pathitha pavana nama' 'parama dayanidhe' and 'Hari'. It appears that Yama has instructed his messengers to keep away from such people.
🌻 18th Poem :
ajunaku taMDrivayyu sanakAdulakuM baratattvamayyusa
ddvijamunikOTikellagula dEvatavayyu dinESavaMSa BU
Bujulaku mETivayyubari pUrNuDavai veligoMdupakShirA
Ddhvajamimu brastutiMcedanu dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
You are the Father of Brahma. Sanaka and Sananda treat you as the embodiment of Paratatwa. You are the favourite deity of Rishis and Brahmins. You are the greatest of the kings of Surya Dynasty. O Garudadhwaja! You are the personification of perfection. Salutations to you !
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 10 / Dasarathi Satakam - 10 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 19వ పద్యము :
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నా కవిత్వమనే పూలదండలు నీ యొక్క కీర్తి కాంతకు అంకితమిస్తున్నాను. నీ కీర్తి కాంత ఎటువంటిదంటే నీవు రావణుడి తలలను ఒక్కవేటున తెగనరికిన విలు విద్యా ప్రవీణుడవని, దేవతా కోటి పూజలందే వాడవని, పాపాలను హరియించే వాడివని ఇన్ని సద్గుణాలు నావే అని పలికేటటువంటిది.
🌻. 20వ పద్యము :
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! భద్రగిరిలో వెలసి యున్న నీవు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తివే. అది ఎట్లనగా వైకుంఠమే భద్రగిరి. విరజానదియే గోదావరి. లక్ష్మిదేవియే సీత. అచటి పరివారమే వీరవైష్ణవమతస్థులు. అలాంటి నీవు మమ్ములనుద్ధరించుటకు ఇక్కడ శ్రీ రామ చంద్రుడివైనావు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 10 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 19th Poem :
paMDita rakShakuM DaKila pApavimOcanu DabjasaMBavA
KaMDala pUjituMDu daSakaMTha viluMThana caMDakAMDakO
daMDakaLA pravINuDanu tAvaka kIrti vadhUTi kittupU
daMDalu gAga nA kavita dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
You are the protector of scholars. You liberate/emancipate us from all kinds of sins. You are worshipped by Brahma and Indra. You have destroyed the ten heads of Ravana with your skill in archery. I want to offer my poetic work as a garland to the lady symbolizing your fame.
🌻 20th Poem :
SrIrama sItagAga nijasEvaka bRuMdamu vIravaiShNavA
cAra javaMbugAga virajAnadigautamigA vikuMTha mu
nnArayaBadra SailaSiKarAgramugAga vasiMcu cEtanO
ddhArakuDaina viShNuDavu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You have come to save us with Lakshmi as Seeta, Veera Vaishnavas as attendants, Viraja river as Gautami and Vaikuntha as Bhadrachala. You are Vishnu, the protector of all living beings.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 11 / Dasarathi Satakam - 11 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 21వ పద్యము :
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ దాశరధీ! నా జన్మ పరమ పావనమైనటువంటిది. అది ఎందుకంటావేమో నాకనుల పండుగగా ఇక్కడ(భద్రాచల) గొదవరీ నదివడ్డున వెలసిన శ్రీరామచంద్రుడ వైన నిన్ను, లక్ష్మణుని, నీ అంకస్థ అయిన సీతాదేవిని, గొప్పవైన మీ ధనుర్భాణములను, శంఖచక్రములను చూచితిని. (భద్రాద్రి రాముడికి శంఖ చక్రాలు ధనుర్భాణాలు ఉంటాయి.)
🌻. 22వ పద్యము :
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ దాశరధీ! నాకు అచంచలమైన భక్తి నిచ్చి రైతునకు నాగేటి చాలున ఫలితమిచ్చినట్లు, దాహార్తికి ఆకాశ గంగ నీరిచ్చినట్లు, మురికియైన వికారమైన మనస్సుగలవాడైన నన్ను సవరించి నీ మీద మనసు పెట్టునట్లు, నిన్ను కొలుచునట్లు చేసితివి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 11 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 21st Poem :
kaMTi nadItaTaMbuboDagaMTini BadranagAdhivAsamun
gaMTi nilAtanUjanuru kArmuka mArgaNaSaMKacakramul
gaMTini mimmu lakShmaNuni gaMTi kRutArdhuDa naiti nO jaga
tkaMTaka daityanirdaLana dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
I beheld the Godavari and Bhadrachala by its bank and felt very happy. I saw Seeta, yourself and Lakshmana ; Sankha, Chakra and your great bow and arrows. I attained life’s fulfilment. O Slayer of Rakshas who are tormenting the people of the world!
🌻 22th Poem :
halikunakun halAgramuna narthamu sEkuruBaMgi dappicE
nalamaTa jeMduvAniki surApagalO jala mabbinaTlu du
rmalina manOvikArinagu martyuni nannoDagUrci nIpayin
dalapu GaTiMpajEsitivi dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
Like a person discovering unexpected treasure while ploughing his land and a thirsty man suddenly finding the water of Ganga, a person like me with mind polluted by evil thoughts discovered the unexpected bliss of devotion to you.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 12 / Dasarathi Satakam - 12 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 23వ పద్యము :
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రంజిలద్రవ్వి కంగొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామచంద్రా! తర్కవాదముతో తవ్విననూ కనుగొనలేని నిధివంటివాడవు, ఈ రోజు భక్తితో తయారు చేయబడిన అంజనమునందు, నీవు నాకై దొరికితివి. నన్నెప్పుడు వదలకుండ నా హృదయ కమలమునందు నివసింపుము.
🌻. 24వ పద్యము :
రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నీవు దీన జనోద్ధరుడవు. పాతకవిరాముడవు. సద్గుణములకు కల్పతరువువు, కామక్రోధాలను జయించిన వాడవు, నిన్నే దైవముగా నమ్మిన మమ్ము ఉత్తమగుణములు కలవాడివైన నువ్వు కాపాడుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 12 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 23st Poem :
rAmuDu GOra pAtaka virAmuDu sadguNakalpavallikA
rAmuDuShaDvikArajaya rAmuDu sAdhujanAvanavratO
dhdhAmuDu rAmuDE parama daivamu mAkani mI yaDuMgu geM
dAmaralE BujiMcedanu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Rama is the liberator from sins ; kalpa vriksha of virtues ; conqueror of the shadgunas / six weaknesses and protector of the pious people. O Rama! I consider You as the prime deity and worship Your Lotus Feet.
🌻 24th Poem :
koMjakatarka vAdamanu guddalicE baratattvaBUsdhalin
raMjiladravvi kaMgonani rAmanidhAnamu nEDu Baktisi
ddhAMjanamaMduhastagata mayyebaLI yanagA madIyahRu
tkaMjamunan vasiMpumika dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
It is not possible to discover the treasure called Rama by ploughing the land called paratatwa with a plough called logic. However I have been fortunate to get hold of that Treasure by the simple expedient of an anjana (eyesalve) called Bhakti. Please reside in my heart.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 13 / Dasarathi Satakam - 13 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 25వ పద్యము :
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నిశ్చలమైన భక్తితో నిన్నే కొలిచెడి వారిని నీవు విడువవు. కాని ఇది తెలియక కొందరు హీనులు, పంచదారని విడిచి వేపచెదును రుచిచూసినట్లు, నిన్ను విడిచి అల్పదైవములను పుజించుచున్నారు.
🌻. 26వ పద్యము :
’రా’ కలుషంబులెల్ల బయలంబడద్రోచిన ’మా’క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
'రామా' అను నీ దివ్య నామాక్షరములు పాపములను హరియించుటకు పుట్టినిల్లు. 'రా' అన్న అక్షరం పలకటం వల్ల పాపములన్నీ బయటికి పోతాయి. 'మ' అన్న అక్షరం పలకటం వల్ల నోరు మూసుకొని తలపువలె కాడుతుంది. ఓ దయాసముద్రా అట్టి నీ నామము భజించని వాడు ముర్ఖుడే కదా!
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 13 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 25th Poem :
cakkeramAnivEmudina jAlinakaivaDi mAnavAdhamul
pekkuru pekku daivamula vEmarxugolcedaraTla kAdayA
mrokkinanIku mrokkavale mOkSha mosaMgina nIvayIvaleM
dakkinamATa lEmiTiki dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Ignorant people worship other deities in stead of worshipping you just as some people eat Neem fruit when there is plenty of sugar. If somebody has to bow he has to bow to you. You alone are capable of giving Salvation.
🌻 26th Poem :
'rA' kaluShaMbulella bayalaMbaDadrOcina 'mA'ka vATamai
DIkonibrOcunikka manidhIyutulennadadIya varNamul
gaikoni Bakti cE nuDuvagAnaru gAka vipatparaMparal
dAkonunE jagajjanula dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
When you pronounce 'RA' you open the mouth completely and all the sins are expelled through your mouth. When you pronounce 'MA' both the lips are closed and fresh sins are prevented from entering your body. This was told by the great Elders many times but laymen ignore this and invite easily preventable sufferings.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 14 / Dasarathi Satakam - 14 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 27వ పద్యము :
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
కాకుత్సవంశమున జన్మించిన శ్రీరామా! నీ నామము పలుమార్లు భజించిన ముక్తిదాయకమవును కదా! మోక్షము పొందుటవలన తిరిగి పుట్టనేరు కదా!
🌻. 28వ పద్యము :
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
రామనామస్మరణ అన్ని తీపి వస్తువులకన్న మధురాతి మధురమయినది. అవి ఏవనగా చక్కరలోని తీపిదనము, స్త్రీ ఎర్రని పెదవి. పట్టుతేనె. ప్రాపంచిక విషయాలలో ముంచి తేల్చే తీయని వస్తువులకన్నా ఆస్వాదించగలిగితే భగవానుని నామము ఎంతో మధురమని కవి చెప్పకనే చెప్పుతున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 14 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 27th Poem :
rAmaharE kakutdhsakula rAmaharE raGurAmarAmaSrI
rAmaharEyaTaMcu madi raMjila BEkagaLaMbulIla nI
nAmamu saMsmariMcina janaMbu BavaMbeDabAsi tatparaM
dhAma nivAsulauduraTa dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
If we chant 'Rama Hare Raghu rama rama SriRamaHare' like the croaking of a frog, we will be liberated from the shackles of worldly existence and become permanent residents of Vaikuntha.
🌻 28th Poem :
cakkera lappakun migula javvani keMjigurAku mOvikiM
jokkapujuMTi tEniyaku jokkilucuMgana lEru gAka nE
DakkaTa rAmanAmamadhu rAmRutamAnuTakaMTe sauKyAmA
takkinamAdhurI mahima dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
These days' people hanker over sugar packets, the lips of a woman and honey made by bees and fail to relish the nectarine juice of the name of Rama.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 15 / Dasarathi Satakam - 15 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 29వ పద్యము :
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
గరుత్మంతుని వాహనముగా గల ఓ రామా! నిన్ను మనస్పూర్తిగా నమ్మిన వారి కొండంత పాపములైనను కొనగోట మీటెదవు. వారికి అఖండ ఐశ్వర్యములు ఇచ్చెదవు. మరణానంతరము ముక్తి నొసగెదవు. నీ దయకు అవధి లేదుకదా!
🌻. 30వ పద్యము :
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! చిక్కని పాలమీదనున్నచక్కని మీగడను తియ్యని పంచదారతో కలిపి, ఎంచక్కా ప్రీతితో తినినట్లుగా, మీగడ వంటి నీ రూపము నా ప్రేమయనెడి పళ్ళెమునందు కూర్చబడినది. అది నాకు, దాస్యము అనేది దోసిళ్ళలో లభించినట్లుగా భావించి నిన్ను నా మనసులో నిలిపి నీ నామస్మరణ చేసెదను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 15 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 29th Poem :
aMDajavAha ninnu hRudayaMbunanammina vAri pApamul
koMDalavaMTivaina vesagUli naSiMpaka yunne saMta tA
KaMDalavaiBavOnnatulu galgakamAnune mOkSha lakShmikai
daMDayosaMgakunne tuda dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Oh Garudavahana! The mountains of sins of those who believe in you will collapse in no time. Your devotees will be bestowed with riches and splendour and in the end they will be blessed with Moksha.
🌻 30th Poem :
cikkanipAlapai misimi jeMdina mIgaDa paMcadAratO
mekkinaBaMgi mIvimala mEcakarUpa sudhArasaMbu nA
makkuva paLLeraMbuna samAhita dAsyamanETidOyiTan
dakkenaTaMcu jurxrxedanu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Just as you relish the cream of undiluted milk with sugar, I want to gulp down the nectar of your pure Rupa(personality) from my favourite plate called Bhakthi.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 16 / Dasarathi Satakam - 16 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 31వ పద్యము :
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ మహత్యముచే నీవు సీతాదేవిచే సిరి సంపదలు ఇప్పించుచు, హనుమంతునిచే బాధలు తొలగించుతూ, లక్ష్మణునిచే సంకటముల తొలగించుతూ, నీ నామముచే పాపహరణ చేయుచున్నావు. ఇదియంతయు నీవు నిర్మించిన వజ్రముతో కూడిన గూడువంటి రక్షణ వాసములె కదా!
🌻. 32వ పద్యము :
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
అహల్యను శాపవిముక్తను చేసిన మీ పాదములందు నాకు నిశ్చల భక్తి కల్గుగాత. నీ పాదములందు నగలు, వజ్రము, అంకుశము, ధ్వజము, విల్లు, చక్రము, కల్పవృక్షమువలె పద్మరేఖలు స్పష్టముగా కనపడుచు ప్రకాశించుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 16 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 31st Poem :
siruliDasIta pIDalega jimmuTakun hanumaMtuDArtisO
daruDu sumitrasUti duritaMbulumAnupa rAma nAmamun
garuNadalirpa mAnavulagAvaga bannina vajrapaMjarO
tkaramugadA Bavanmahima dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
In this Kaliyuga, Seeta will bestow devotees with riches; Hanuman provides relief from sufferings; Lakshmana emancipates people from sins and Rama's name saves people from all kinds of problems
🌻 32nd Poem :
halikuliSAMkuSadhvaja SarAsana SaMKarathAMga kalpakO
jvalajalajAta rEKalanu sAMkamulai kanupaTTucunna mI
kalitapadAMbuja dvayamu gautamapatni kosaMginaTlu nA
talapuna jErcikAvagade dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
The soles of Your Lotus Feet contain signs like conch, chakra, bow, sickle, flag, Vajrayudha and Kalpavrisha. You have blessed Ahalya with the touch of those feet. May I be blessed with the bliss of meditation on those Lotus Feet.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 17 / Dasarathi Satakam - 17 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 33వ పద్యము :
Poem
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
Meaning
ఓ దాశరధీ! రామా! కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ మూర్తివై పాపులనుద్ధరించిన వాడా సముద్రములో ప్రవేశించితివి, మందర పర్వతమును పైకెత్తితివి, భూమిని నీ కోరలతో పైకి ఎత్తితివి. హిరణ్యకశిపుడిని చీల్చితివి. బలిచక్రవర్తిని పాతాళమునకు తోసితివి. అట్టి నీవు నా మనస్సునందు నిలువగారావా!
🌻. 34వ పద్యము :
Poem
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
Meaning
శ్రీరాముని మించిన దైవము, పోటీకాగల వీరుడు లేడని ఏనుగుని అధిరోహించి దుందుభి మ్రొగించుచూ చాటించెదను. ఎందుకనగా నువ్వు యుద్ధమునందు అరవీరభయంకరుడివి, దుఃఖితులకు బంధువుకు, మేటి విలుకాడివి. ఈ పద్యములో శబ్దాలంకారము బాగుంది. దుందుభి మ్రోగితే వచ్చే శబ్దాన్ని పద్యములోనే చూపించాడు కవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 17 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 33st Poem :
jalanidhilOnadUrxi kula SailamumITi dharitrigommunaM
dalavaDamATirakkasuni yaMgamugITibalIMdrunin rasA
talamunamATi pArdhivaka daMbamugUlcina mETirAma nA
talapunanATi rAgadave dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You dived into the sea and lifted the Mandara Mountain (Matsyavatara) ; You lifted/raised the Earth in varahavatara and saved it from the clutches of the Rakshasa ; you pushed Bali into Pathala (Vamanavatara) ; You conquered the Kings who opposed you. May you ( the great Rama) reside in my heart and thoughts.
🌻 34nd Poem :
BaMDana BImuDA rtajana bAMdhavuDujjvala bANatUNakO
daMDakaLApracaMDa Buja tAMDavakIrtiki rAmamUrtikin
reMDava sATidaivamika lEDanucun gaDagaTTi BErikA
DAMDaDa DAMDa DAMDa ninadaMbulajAMDamu niMDamattavE
daMDamu nekkicATedanudASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
You are a terror to your enemies ; saviour to those in troubled waters . Your skill in archery is matchless. I will declare on the top of an elephant there is no God as powerful as Rama and raise the flag and beat the drums so that they make the sounds 'DANDA DADANDA DANDA' heard by the entire Universe.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 18 / Dasarathi Satakam - 18 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 35వ పద్యము :
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ
నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
సీతామనోహరడైన నిన్ను ఎల్లవేళలా సేవించుచుందును. నీవు సీతాదేవి నేత్రములనెడి పద్మముల వికసింపజేయు చంద్రుడివి. ఆమె వక్షములను ఎదుర్కొను మేఘముడవు. ఆమె యవ్వనమనే అరణ్యములో తిరుగాడే ఏనుగువు.
🌻. 36వ పద్యము :
ఖరకరవంశజా విను ముఖండిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
దీనజనోద్ధారకుడవైన నీవు నన్ను భయంకరమైన ఈ బాధలనుంచి కాపాడుము. భయంకర భూత, ప్రేత, పిశాచములవలన, వ్యాధులవలన సర్వభయములకు అడ్డుపడే నీ పాద పద్మములందున్న వజ్రపంజరములోనికి శరణార్థివై ప్రవేశించితిని.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 18 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 35th Poem :
avanija kannudOyi togalaMdu veliMgeDu sOma, jAnakI
kuvalayanEtra gabbicanukoMDala nuMDu GanaMba maithilI
navanava yauvanaMbanu vanaMbukun madadaMti vIvekA
davili BajiMtu nellapuDu dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
You are like a moon shining in the lotus eyes of Seeta. You are like a dark cloud in the valley of the two mounds of Seeta's bosom. You are like an elephant roaming in the forest of Seeta's youth. I will always worship you.
🌻 36th Poem :
KarakaravaMSajA vinu maKaMDita BUtapiSAcaDhAkinI
jvara paritApasarpaBaya vArakamaina BavatpadAbja ni
sPuraduruvajrapaMjaramujocciti, nIyeDa dIna mAnavO
dhdhara birudaMka mEmarxaku dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
O Rama born in Surya Dynasty! I have entered the diamond cage of Your Lotus Feet which are known to deter Bhutas, Pisachas, Dhakini, fever, sorrow and snakes. Don't forget that you are known as the saviour of Deena (the distressed).
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 19 / Dasarathi Satakam - 19 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 37వ పద్యము :
జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబ నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁగ రుచుల్ గనువారిపదంబు గూర్పవే
తుఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నీ కథలనే విని, నీ పాదపద్మములను కడిగిన నీటిని తాగెదను. నిత్యము నీ యందే భక్తి నిలిపి నీ లీలల యందే నా ధ్యాస నుంచి నీ భక్తుల తోనే నాకు సహవాస మొనర్చుము.
🌻. 38వ పద్యము :
ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ నామ మహత్యమే యమభటులను పారదోలి పిశాచ ఆకారము కలిగిన దరిద్రతను పారద్రోలి నిన్ను నిత్యము జపించు వారికి వైకుంఠ ద్వారముల తెరిపించును. అట్టి వారంటే యమభటులు కూడా భయకంపితులగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 19 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 37th Poem :
jurxrxedamIka thAmRutamu jurxrxedamIpadakaMjatO yamun
jurxrxeda rAmanAmamuna jobbilucunna sudhArasaMbu nE
jurxrxeda jurxrxajurxrxaga rucul ganuvAripadaMbu gUrpavE
tarxrxulatODi pottiDaka dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
I will drink in the nectar of your stories, the water emanating from Your Lotus Feet and the nectarine juice of your name. Let me join the ranks of those who have relished the above mentioned juices.
🌻 38th Poem :
GOrakRutAMta vIraBaTa kOTiki guMDedigul daridratA
kArapiSAca saMharaNa kAryavinOdi vikuMTha maMdira
dvAra kavATa BEdi nijadAsa janAvaLikella proddu nI
tArakanAma mennukona dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Your name strikes terror in the minds of the servants of Yama ; revels in eradicating poverty ; forces open the doors of Vaikuntha to your devotees.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 20 / Dasarathi Satakam - 20 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 39వ పద్యము :
విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నా విన్నపము శ్రద్ధగా విను. ముల్లోకాలు గాలించిననూ నా వంటి పాపాత్ముడు లేడు. దేవతలలో నీ వంటి దైవము లేడు. పాపాత్ముడనైన నా పాపములను పోగొట్టి నీ సన్నిధిని చేర్చుకోదగిన దైవము నీవే.
🌻. 40వ పద్యము :
పెంపునఁదల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర
క్షింపనుదండ్రివై మెయు వసించుదు శేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీవే నాకు తల్లివి, తండ్రివి, వైద్యుడవు, సర్వము నీవే అయి నన్ను నీ సన్నిధికి చేర్చుకొనుము. నన్ను పోషించుటలో తల్లిగా, చెడు సావాసములనుండి రక్షించు తండ్రిగా, దేహమునందలి ఇంద్రియ నిగ్రహమును కలిగించు వైద్యుడిగా నాకు నువ్వే దిక్కు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 20 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 39th Poem :
vinnapamAlakiMcu raGuvIra nahipratilOkamaMdu nA
kannadurAtmuDuM barama kAruNikOttama vElpulaMdu nI
kanna mahAtmuDuM batita kalmaShadUruDu lEDunAkuvi
dvannuta nIvenAku gati dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Please listen to my appeal! In this world there is nobody more wicked than myself and among the celestials nobody more powerful than yourself and nobody more committed in driving away the sins of the distressed. Therefore I take refuge in you only and in nobody else.
🌻 40th Poem :
peMpanudallivai kaluSha bRuMdasamAgama moMdakuMDa ra
kShiMpanudaMDrivai meyi vasiMcudaSEMdriya rOgamul nivA
riMpanu vejjuvai kRupa gurxiMci paraMbu diraMbugAga sa
tsaMpadali Diyya nIvegati dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You are like a Mother bringing up her child, like a Father protecting a child from amassing sins and like a Doctor inocculating against diseases related to the ten indriyas. You are the refuge for kindly granting everlasting assets of good qualities and Moksha.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 21 / Dasarathi Satakam - 21 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 41వ పద్యము :
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
జగముల నేలే దాక్షిణ్యమూర్తి! కడుపులో అనేక బ్రహ్మండములను పదిలముగా నిలిపినవాడవు. చేతనములను, అచేతనములను రక్షించు దైవానివి. నీ ప్రపంచములోని అణువునైన నన్ను నా పాతకములనుండి రక్షింపుము.
🌻. 42వ పద్యము :
గద్దరియో గిహృత్కమల గంధర సానుభవంబుఁజెందు పె
న్నిద్దవు గండుఁ దేఁటి థరణీసుత కౌఁగిలిపంజరంబునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! నీవు యోగి హృదయ కమలముల నుండెడి తుమ్మెదవు, సీతాదేవి బాహు పంజరమునకు రామచిలుకవు. వాటినుండి విముక్తుడవై నాకడకు వచ్చినన్ను కాపాడుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 21 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 41th Poem :
kukShinajAMDapaMktulona gUrci carAcarajaMtukOTi saM
rakShaNasEyu taMDrivi paraMpara nI tanayuMDanaina nA
pakShamu nIvugAvalade pApamu lenni yonarcinan jaga
drakShaka kartavIvekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You are like a Father to all the moving and nonmoving species of the world embedded in your stomach. Should you not be on my side as I am your son in some branch of the ancestral tree of rebirths? Should you not protect me even if I commit many sins?
🌻 42th Poem :
gaddariyOgihRutkamalagaMdharasAnuBavaMbujeMdu pe
nniddapugaMDudETi dharaNIsuta kaugilipaMjaraMbunan
muddulugulku rAciluka muktinidhAnamurAmarAgadE
taddayu nEDu nAkaDaku dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You are like a holy bee (Bhramara) relishing the nectar of the lotus of great yogis' hearts. You are like a parrot in the cage of Seeta's embrace. O Rama! You are a treasure house of Salvation. Be kind enough to stay by my side.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 22 / Dasarathi Satakam - 22 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 43వ పద్యము :
కలియుగ మర్త్యకోటినిను గంగొన రానివిధంబో భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో
బిలిచిన బల్క వింతమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
పిలిచినా పలుకవేమి నా దైవమా? కలియుగములో భక్తుల మొర వినగలేవా?మానవులను మరిచితివా? నీ వాత్సల్యము తొలగిపొయినదా! మమ్ము కరుణింప లేవా? సముద్రమనెడు ఆపదలో మునుగుతూ ఎంత పిలచినను పలుకవేమి? మా యందు ఇంత మారుపా? అనకూడదు కాని రావణుని చేత సీతాదేవి పొందిన చెర మరచినావా? కానగ రావా! ఓ రామా! శ్రీ రామా!
🌻. 44వ పద్యము :
జనవర మీక థాలి వినసైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగు దోసనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ కథలను వినలేక చెవులకు గంటలు కట్టుకున్న ఘంటాకర్ణుడి వంటి నీచులనే ఉద్దరించినవాడా ఓ శ్రీరామ చంద్రా! సనక సనందనాది మునులను కాపాడినట్లే నన్నుకాపాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 22 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 43th Poem :
kaliyuga martyakOTininu gaMgona rAnividhaMbo Baktava
tsalatavahiMpavO caTula sAMdravipaddaSa vArdhi gruMkucO
bilicina balka viMtamarxapE naruliTlanarAdu gAka nI
talapuna lEde sIta cerxa dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
Are you determined not to give Darshan to the people of Kaliyuga? Has your earnestness to help devotees dwindled? Why are you not responding to the prayers of people drowned in the sea of sufferings? It is difficult to imagine that you have changed since the kidnapping of Seeta must still be fresh in your mind..
🌻 44th Poem :
janavara mIka thAli vinasaipaka karNamulaMdu GaMTikA
ninada vinOdamul salupunIcunakun varamiccinAvu ni
nnanayamunammi kolcina mahAtmunakEmi yosaMgu dOsanaM
dananuta mAkosaMgumaya dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You have granted boons to a Rakshasa called Ghantikakarna who preferred hearing loud ringing of bells to your stories. O Rama praised by Sanandana ! Please grant us whatever you will bestow on the great devotees who always meditate on you.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 23 / Dasarathi Satakam - 23 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 45వ పద్యము :
పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మాంపి కాతురట దాశరథీ కరుణాపయోనిధి
🌻. భావము :
Meaning
సంకట హరణా! రామభద్రా! పాపములు సమీపించు వేళలయందు, సంగ్రామ వేళలయందు, సర్పభీతి పొందునప్పుడు, జ్వరముల వంటి దుఃఖములు కలుగునప్పుడు, నీ భక్తులను ఆయా కష్టములనుండి కాపాడావట కదా! నీవును, నీ సోదరులను నన్ను కాపాడేందుకు రక్షగా నిలువండి తండ్రీ!
🌻. 46వ పద్యము :
అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాంపవే
తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
సంసార సాగరమును, నా పూర్వజన్మ కర్మ పరిపక్వములను ఈదలేక నిన్ను వేడుకుంటున్నాను. దయ దలిచి నన్ను కాపాడు దయా శరధీ. నీ పాదముల వద్ద భక్తి ఆనెడి పడవచేత బైటపదవలనెను కొనుచుంటిని.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 23 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 45th Poem :
Poem
pApamu loMduvELa raNapannaga BUta BayajvArAdulaM
dApada noMduvELa BaratAgraja mimmu BajiMcuvArikin
brApuga nIvudammu Dirupakkiyalan jani tadvipatti saM
tApamu mAnpi kAturaTa dASarathI karuNApayOnidhi!
🌻 Meaning :
O Elder Brother of Bharata ! I heard that when people recite your name in times of retribution of sins, war, threat of snake bite, Bhutas, fear, fever or suffering, you and Lakshmana will come to their rescue and alleviate their suffering.
🌻 46th Poem :
agaNita janmakarmaduri tAMbudhilO bahuduHKavIcikal
degipaDanIDalEka jagatIdhava nIpadaBakti nAvacE
dagili tariMpagOriti badaMpaDi nadu BayaMBu mAnpavE
tagadani cittamaM diDaka dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
When I was unable to withstand the onslaught of the tidal waves of cumulative sins of my earlier births, I came across a ship of devotion to you which can ferry me across the sea of sins. Please don't treat me as an undeserving person and lend me your helping hand.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 24 / Dasarathi Satakam - 24 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 47వ పద్యము :
నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్
దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
పాపాల బ్రోచు దశరధ రామా! నేను పాపినైనను నీ నామామృతము పానకము వలె తియ్యగానున్నది. నీవు చిలుకను నీ నామ ముచ్చరించిన కాచినట్లే నీ నామానురక్తుడనైన నన్ను కుడా కాపాడుము.
🌻. 48వ పద్యము :
పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీఁదనగు మోసమెఱుంగదు మానసంబు
స్తరమదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
మేము పరాయి సొమ్ముకాసించినా, పరస్త్రీ వ్యామోహం పొందినా,పరాన్న భోజనము కోరినా, అవివేకులమై ఘోరాతి ఘోరములైన పాపములు చేసినను మము రక్షించటయే నీ వంతు. 'తప్పులు చేయుట మా వంతు, దండన పొందుట మా వంతు, దయ చూడటమే నీ వంతు' దయా శరధీ! దాశరధీ! మమ్ము కాపాడుము. యమదూతల శిక్షల నుంచి కాపాడుము స్వామీ.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 24 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 47th Poem :
nEnonariMcu pApamulanEkamulainanu nAdujihvakun
bAnakamayyemIparama pAvananAmamudoMTi cilkarA
mAnanugAvumanna tudi mATaku sadgati jeMdegAvunan
dAni dhariMpagOredanu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Though I am committing many sins, your name is like water mixed with sugar to my tongue. I heard that when a parrot sought your help on deathbed by uttering ‘RAMA’, you granted it salvation. I would like to chant your name always.
🌻 48th Poem :
paradhanamul hariMci paraBAmalanaMTi parAnna mabbinan
muripama kAnimIdanagu mOsamerxuMgadu mAnasaMbudu
staramadikAlakiMkara gadAhati pAlpaDanIka mammu nE
tarxidarijErci kAcedavo dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
My mind is enjoying pleasures like stealing other's money, the company of other women, and eating in other's houses little realising the eventual consequences of such acts. When will you save us from the consequent beating from the maces(clubs) of the messengers of Yama?
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 25 / Dasarathi Satakam - 25 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 49వ పద్యము :
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నే చేసిన నేరము లెంచక ఓ రామా! ఎన్నో ఘోరములు చేసితిని, భగవంతుని యందు తప్పులు చేసితిని, అన్యదేవతలను కొలచి వారి యొక్క స్నేహములు చేసితిని. అయినను నీ దాసుడనైన నన్ను కాపాడుము.
🌻. 50వ పద్యము :
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు త్తరువున గట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
పరాయి సోమ్ముమీద మక్కువ, పరస్త్రీ వ్యామోహం కలిగించే నా మనసనే దొంగను నీ సేవచే ప్రకాశించిన జ్ఞానము అనే తాళ్ళతో బంధించి, నీ పాదములనే కల్పవృక్షమునకు కట్టివేయుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 25 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 49th Poem :
cEsiti GOrakRutyamulu cEsiti BAgavatApacAramul
cEsiti nanyadaivamula jEri BajiMcina vAripoMdu nE
jEsina nEramul dalaci cikkulabeTTakumayyayayya nI
dAsuDanayya Badragiri dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
I have done many cruel things, offended your devotees and moved in the company of people who worshipped other Gods. Please forgive my mistakes and don't subject me to sufferings. I am now your servant(dasa).
🌻 50th Poem :
parula dhanaMbujUcipara BAmalajUci hariMpagOru ma
dgurutaramAnasaM baneDu doMganubaTTinirUDhadAsya vi
sPuritavivEka pASamula juTTi BavaccaraNaMbanE maru
ttaruvunagaTTivEyaga de dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
I have a bad tendency to steal other's money and lust for other's wives. Please tie the thief in my mind with spiritual rope and bind it to the Kalpa vriksha of Your Lotus Feet.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 26 / Dasarathi Satakam - 26 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 51వ పద్యము :
సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ లీలలు స్మరించి పొగడుట నా వశము కాదు. నేను కాశీపురమున నివసించు శివుడిని కాను, నీ పాదధూళి మహత్యము తెలుపగల అహల్యను, కాను, నీ నామ మహత్యము పొగడగల విభీషణుడను కాను. అయిననూ దయా శరధి వైన నీవు నన్ను కాపాడుట నీకు ధర్మమే.
🌻. 52వ పద్యము :
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వము నొందెగా వునందా తవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
కోరిన కోర్కెలను తీర్చే కల్పతరువైనటువంటి నీ నామ స్మరణ భాగ్యమును కలుగజేయును. రాయిగా మారిన అహల్యకు శాపవిమోచన కలిగెను. శత్రువు సోదరుడైన విభీషణునకు రాజ్యసౌక్యము కలిగెను. తక్కువ కులమునకు చెందిన శబరి, గుహనకు పుణ్యము కల్గెను. వానర జాతి మహత్యము పొందెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 26 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 51th Poem :
salalita rAmanAma japasAra merxuMganu gASikApurI
nilayuDagAnumIcaraNanIrajarENu mahApraBAvamuM
deliyanahalyagAnu jagatIvara nIdagu satyavAkyamuM
dalapaga rAvaNAsuruni tammuDagAnu BavadvilAsamul
dalacinutiMpa nAtarame dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
I am not Siva of Kasi to know the power of chanting of Rama's name ; I am not Ahalya to know the greatness of the dust of Your Lotus Feet and I am not Vibhishana to know the greatness of your commitment to truthfulness. I am not competent to realise your greatness.
🌻 52th Poem :
pAtakulaina mIkRupaku bAtrulu kAretalaMcicUDa ja
TrAtikigalge bAvana marAtiki rAjyasuKaMbugalge du
rjAtiki buNyamabbegapi jAtimahattvamunoMdegAvunan
dAtava yeTTivAralaku dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Sinners also received your blessings. A stone was sanctified by your touch (Ahalya). A brother of your enemy was blessed with kingdom (Vibhishana). People born of lower caste like Sabari and Guha were blessed by you. Even the monkeys received your grace and became famous. You are a benefactor to all .
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 27 / Dasarathi Satakam - 27 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 53వ పద్యము :
మామక పాతక వజ్రము మ్రాంపనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నా పాపములు లెక్కక అందనివి. చిత్రగుప్తుడు, యముడు, కాల కింకరులు ఏమిచేసినా అంతకు పూర్వమే భక్తి చింతామణి వయిన నీవు నన్ను కాపాడెదవు.
🌻. 54వ పద్యము :
దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
శబరి నీకు చుట్టమా? కాదే! అయినను ఆమె ఇచ్చిన ఎంగిలి పండ్లను తిని, ఆమెను మోక్షమొసగితివి. గుహుడు నీ దాసుడా? కాదే! అయినను అతనికి నీ సేవ చేయు భాగ్యమునిచ్చితివి. నేను ఏ పాపముచేసితినని నన్ను కాపాడకుంటివి. శబరి, గుహులు నీకు దగ్గర వారయినట్లే నన్ను కూడ నీ చెంత చేర్చుకొనుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 27 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 53th Poem :
mAmaka pAtaka vrajamu mrAnpanagaNyamu citraguptulE
mEmani vrAturO? SamanuDEmi vidhiMcuno? kAlakiMkara
stOma monarciTEmo? vinajoppaDa diMtakamunnedInaciM
tAmaNi yoTlu gAcedavo dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
Wishing stone of the distressed! It is impossible to wash away my innumerable sins. What will Chitragupta write? What punishment will Yama impose? What kind of violence will be inflicted by messengers of Yama on me? I am afraid even to think about it. I wonder how you will protect me.
🌻 54th Poem :
dAsina cuTTamA Sabari? dAni dayAmati nElinAvu; nI
dAsuni dAsuDA? guhuDu tAvakadAsya mosaMginAvu nE
jEsina pApamO! vinuti cEsinagAvavu gAvumayya! nI
dAsulalOna nEnokaDa dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
Is Sabari your near relative? You showered your compassion on her. Is Guha a servant of your servant? You blessed him by allowing him to serve you. What sin have I committed? I have only been praying you. Please accept me as one of your devout servants.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 28 / Dasarathi Satakam - 28 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 55వ పద్యము :
దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
లోక రక్షకుడైనటువంటి శ్రీరామా! ద్రుపద రాజ తనయ మొర వినిన వెంటనే అక్షయమైన వలువల నిచ్చి కాపాడిన రీతి నన్ను కుడా కాపాడుము. నా ప్రార్ధనను కూడా విని సాక్షాత్కరించుము.
🌻. 56వ పద్యము :
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్
జాలముసేసి ాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీల మేఘశ్యాముడవయిన నీ రూపము దాచుకొనగలవేమో కాని, నీ నామ మహిమను దాచలేవు కదా! అదే మాకు మోక్షకారకమవుతున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 28 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 55th Poem :
dIkShavahiMci nAkoladi dInula neMdarxi gAcitO jaga
drakShaka tolliyA drupada rAjatanUja talaMcinaMtanE
yakShayamaina valvaliDi takkaTa nAmorxajittagiMcipra
tyakShamu gAvavEmiTiki dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You came to the rescue of many people seeking refuge in you. O Protector of the World! When Draupadi just thought about you, you saved her dignity by providing inexhaustible supply of Saris. Why are you not responding to my entreaties and giving Darshan to me?
🌻 56th Poem :
nIlaGanABamUrtivagu ninnu ganuMgonakOri vEDinan
jAlamusEsi DAgedavu saMstuti kekkina rAmanAma mE
mUlanu dAcukOgalavu muktiki brApadi pApamUlaku
ddAlamugAde mAyeDala dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
O Rama with complexion of dark clouds! When I am entreating you for your Darshan, you are becoming invisible using your magical powers. But how can you prevent us from chanting your famous RamaNama? Is not your name like an axe which fells the tree of sins along with its root?
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 29 / Dasarathi Satakam - 29 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 57వ పద్యము :
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో
దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ
🌻. భావము :
దీనవత్సల బిరుదాంకితుడగు ఓ రామా! అన్ని వేళలా నిన్ను తలచే మాపట్ల నీకు పరాకు వలదు జాగ్రత్త సుమా! దీనవత్సలుడనే వజ్రము వంటి అభేద్యమైన బిరుదు వ్యర్ధము కాకూడదు. నా పాపసముద్రమందు నావవై నన్ను నిరంతరము కాపడవలెను స్వామీ!
🌻. 58వ పద్యము :
తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా
యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఏదో తెలియక తప్పులు చేశాను స్వామీ కాని నన్ను తండ్రివలె రక్షింపుము. అన్యదైవములను ఎరుగను. నీకు నచ్చిన నీ దాసజనులు మెచ్చిన నీ సేవకుని వంటివాడను. నీవే నన్ను నా తప్పులనుండి కాచవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 29 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 57th Poem :
valadu parAku Baktajanavatsala nI caritaMbu vammugA
valadu parAku nIbirudu vajramuvaMTidi gAna kUrakE
valadu parAku nAdurita vArdhiki deppavugA manaMbulO
dalatumekA niraMtaramu dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
O Lover of Devotees! Please don't be inattentive. The stories about you should not be considered unfounded. Your title is like a diamond (unbreakable). Don't be inattentive. I will always consider you as a ship which ferries me across the sea of sins.
🌻 58th Poem :
tappulerxuMga lEka duritaMbulu sEsitinaMTi nIvumA
yappavugAvu maMTi nikananyulakun nuduraMTanaMTinI
koppidamaina dAsajanu loppina baMTuku baMTanaMTi nA
tappula kella nIvegati dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
I admit that I have committed many sins indiscriminately. I consider you as my father and hope that you will come to my rescue. Hereafter I will not prostrate before any other God. Please accept me as a servant of your fervent devotees and forgive all my lapses.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 30 / Dasarathi Satakam - 30 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 59వ పద్యము :
ఇతడు దురాత్ముడంచుజను లెన్నఁగ నాఱడిఁగొంటినేనెపో
పతితుఁడ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేఁడనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నన్ను దుర్మార్గుడని, పాపాత్ముడని అంటే అననీ జనులు. పతితపావనుడవైన నీ కరుణ ఉండగా వేరెవరినీ పూజించను. నువ్వు ఇహలోక సుఖములు ఇస్తే ఇయ్యి. కాని నాకు కావలిసింది మోక్షము. రామ అనే మధురాక్షరములు సాటిలేని మోక్షమోసంగునని ధృడముగా నమ్మి నిన్ను కొలుస్తున్నాను.
🌻. 60వ పద్యము :
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించిన జాలుదాననిర సించెదనాదురితంబు లెల్లదూ
లించెద వైరివర్గ మెడలించెద గోర్కులనీదుబంటనై
దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ దయాసాగరా అత్యంత గొప్పదైన నీ దయ నామీద కొంచెం చిలికితే చాలు, ఆ అండ చూసుకొని నా పాపముల నెల్ల తిరస్కరించెదను, శత్రుసముదాయమును పారదోలెదను, కోర్కెలను తొలగించెదను. నీ నామస్మరణ చేస్తూ నీ బంటునై యమభటులను సైతం తరిమికొట్టెదను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 30 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 59th Poem :
itaDu durAtmuDaMcujanu lennaga nArxaDigoMTinEnepO
patituDa naMTinO patita pAvanamUrtivi nIvugalga nE
nitarula vEDanaMTi niha miccinanimmuparaMbosaMgumI
yatulita rAmanAma madhu rAkShara pALiniraMtaraMbu hRu
dgatamani nammikolcedanu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Everybody said that I was a bad person. When I have your blessing I will not try to propitiate other Gods. If you like, give me worldly pleasures but definitely give me spiritual achievement. I will forever chant the incomparable and sweet Rama Nama with the hope that you will come to my rescue.
🌻 60th Poem :
aMcitamainanIdu karuNAmRutasAramu nAdupaini brO
kShiMcina jAludAnanirasiMcedanAduritaMbu lelladU
liMceda vairivarga meDaliMceda gOrkulanIdubaMTanai
daMceda, gAlakiMkarula dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
If you just sprinkle a little bit of the nectarine juice of your compassion on me, all my sins will be washed away. I will get rid of enemies like lust, anger etc., I will overcome the desires. I will keep the servants of Yama at bay.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 31 / Dasarathi Satakam - 31 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 61వ పద్యము :
జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికిదెచ్చెశరంబు, ఱాతినిం
పలరఁగ జేసెనాతిగఁబ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ బాణము సప్తసముద్రములను ఒక్కచోటికి తెచ్చినది. నీ పాదధూళి రాతిని నాతిగ మార్చినది. నీ మహత్యము నెంచుటకు బ్రహ్మాదిదేవతలకు కూడ శక్యము కాదు మరి నేనెంతటి వాడను.
🌻. 62వ పద్యము :
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
దాశరధీ! కరుణా పయోనిధీ! నీ అద్భుత మహిమవలనే ఒక కోతి కోటిమంది రాక్షసులనుగెల్చి దావానలమును చల్లబర్చుకోగల్గింది. అట్టి నీ మహిమ, సీతాదేవి పాతివ్రత్య మహిమ, వర్ణింప బ్రహ్మకైనను సాధ్యమా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 31 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 61th Poem :
jalanidhu lEDunokka mogi jakkikidecceSaraMbu, rxAtiniM
palaraga jEsenAtigabadAbjaparAgamu, nI caritramun
jalajaBavAdi nirjarulu sannuti sEyaga lEru gAvunaM
dalapanagaNyamayya yidi dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Your arrow brought all the seven seas to one place. The dust of Your Lotus Feet transformed a stone into a woman. If Brahma and other deities are also not able to praise you, how can a mere mortal like me comprehend your greatness?
🌻 62th Poem :
kOtikiSakyamA yasurakOTula gelvanu gAlcebO nijaM
bAtanimEna SItakaruDauTa davAnalu DeTTiviMta? mA
sItapativratA mahimasEvaku BAgyamumIkaTAkShamun
dhAtaku SakyamA pogaDa dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Is it possible for a monkey to vanquish Rakshasa warriors? Even if you concede this, how is it that he is unaffected by fire when they tried to burn his tail? This was only possible because of the Pathivratya of Seeta and your grace for the service rendered by him. Is it possible even for Brahma to praise you?
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 32 / Dasarathi Satakam - 32 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 63వ పద్యము :
భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
శ్రీరామా! జానకీపతీ! రాజ శ్రేష్టుడయినటువంటి నీవు రఘువంశజులలో గొప్పవాడవు, ముల్లోకములలో రాజ్యములను స్థాపించెడి వాడవు, మోక్షము నిచ్చెడి వాడవు. అట్టి నీవు నా పాపములను పోగొట్టి నన్ను రక్షిమ్పుము.
🌻. 64వ పద్యము :
నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నిను సేవించే భక్తుల భాగ్యమే భాగ్యము. ఏలయన సత్వగుణ ప్రధానుడవయిన నీవు విశ్వరూపివి కదా! పాల సముద్రమే నీవిడిది, బ్రహ్మదేవుడు నీ తనయుడు. లక్ష్మీదేవి నీ భార్య. ఈ భూమి నీకు సింహాసనము. ఆకాశము గొడుగు. సూర్యచంద్రులు రెండు కళ్ళు. ఆదిశేషుడు పూలపాన్పు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 32 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 63th Poem :
BUpalalAma rAmaraGupuMgavarAma trilOka rAjya saM
sdhApanarAma mOkShaPaladAyaka rAma madIya pApamul
pApagadayyarAma ninu brastuti cEsedanayyarAma sI
tApatirAma Badragiri dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
O Rama! Famous among Kings! Most well reputed among Kings of Raghu Dynasty! Founder of kingdom spanning the three worlds! Bestower of Moksha! Please wash away my sins. I will recount your powers. O Rama ! Consort of Seeta!
🌻 64th Poem :
nIsahajaMbu sAtvikamu nIviDipaTTu sudhApayOdhi, pa
dmAsanuDAtmajuMDu, gamalAlayanI priyurAlu nIku siM
hAsanamiddharitri; goDugAka samakShulu caMdrabAskarul
nIsumatalpamAdiPaNi nIve samastamu golcinaTTi nI
dAsula BAgyameTTidaya dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You are gentle, amiable and kind (satwika). Your abode is the Celestial Sea of Milk. Brahma is your son. Lakshmi is your consort. The Earth is your throne. The sky is your umbrella. The Sun and Moon are your eyes. Adisesha is your bed of flowers. You are omnipresent. How fortunate are your devotees!
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 33 / Dasarathi Satakam - 33 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 65వ పద్యము :
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
రామా! రాతిని నాతిగ చేయుట ఒక వింత, నీటిలో మునగకుండ రాళ్ళను తెలునట్లు చేయుట మరొక వింతగావచ్చు గానీ, నిన్ను స్మరించిన వారికి నీవు మోక్షము నొసగుట ఆశ్చర్యము కానేకాదు.
🌻. 66వ పద్యము :
దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ లోకపావనమూర్తి! నాకు దైవము, తల్లి, తండ్రి, దాత, గురువు, మిత్రుడు నీవేయని భావించుచుండగా, నేను చేసిన పాపములు నాకు మనోవికారము కలిగించి, దుష్టచింతనను కలిగించుచున్నవి. దాశరధీ! నీ ఉతృష్టమయిన దయచే నాపాపపు ఆలోచనలను పోగొట్టి నన్ను కాపాడుము. అదే పదివేలు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 33 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 65th Poem :
caraNamu sOkinaTTi SilajavvanirUpaguTokkaviMta, su
sdhiramuga nITipai girulu dElinadokkaTi viMtagAni mI
smaraNa danarcumAnavulu sadgati jeMdinadeMtaviMta? yI
dharanu dharAtmajAramaNa dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Just by the very touch of your feet a stone was transformed into a woman. You caused hills to float on the sea (while going to Lanka). When such miracles have taken place, there is nothing surprising in your devotees attaining Salvation
🌻 66th Poem :
daivamu tallidaMDritagu dAta guruMDu saKuMDu ninne kA
BAvana sEyucunnatarxi pApamulella manOvikAra du
rBAvitujEyucunnavi kRupAmativainanu kAvumI jaga
tpAvanamUrti Badragiri dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
When I am visualising you as Mother, Father, Grandfather, Guru and Friend, bad thoughts are trying to disturb the harmony of my mind. O Jagatpavanamurty! Dispel those bad thoughts and save me.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 34 / Dasarathi Satakam - 34 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 67వ పద్యము :
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ రామా! ఇంద్రభోగములనుభవించినా ఆశకు అంతు ఉండదు. మేరు పర్వతమంత ఆస్తి ఉన్నాకూడా ఒక్క కాసు కూడా వెంటరాదు. తెలిసీ, తెలియక చేసిన పాపములు మాత్రము వదలవు. మరుజన్మనిష్టపడని నన్ను నా కర్మానుభవమును నాశనము చేసి రక్షింపుము.
🌻. 68వ పద్యము :
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగులే రకట దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
దశరధ నందనా! రామా! వివేకులు, దయాపరులు, సత్యసంధులు, అలుబ్దమానవులు, పతివ్రతా శిరోమణులు, బ్రాహ్మణులు, గోవులు, వేదములు భూభారము వహించు పుణ్యాత్ములు. వీరిని పూజించుట నావంటి అవివేకులు తెలిసికోలేకున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 34 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 67th Poem :
vAsava rAjyaBOga suKa vArdhini dElu praButvamabbinA
yAsakumEra lEdu kanakAdrisamAna dhanaMbugUrcinaM
gAsunu veMTarAdu kani kAnaka cEsina puNyapApamul
vIsarabOva nIvu padivElaku jAlu BavaMbunolla nI
dAsunigAga nElukonu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Even though someone is crowned as the King of Indraloka, there is no end to greed. Even if one amasses money equivalent to Meru, the mountain of gold, nothing accompanies a person when a person dies. Whatever good or bad you have done knowingly or unknowingly will have their consequences. Ten thousand will be enough for this life. I am your servant. Please bless me.
🌻 68th Poem :
sUrijanul dayAparulu sUnRutavAdu lalubdhamAnavul
vIrapatipratAMganalu viprulu gOvulu vEdamul mahI
BAramudAlpagA janulu pAvanamaina parOpakAra sa
tkAra merxuMgulErakaTa dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
Scholars, Kind-hearted people, truth-speaking people, nongreedy people, Pativratas, Brahmins, Cows and Vedas are carrying the burden of Earth. But the human beings do not show gratefulness to them. What a pity!
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 35 / Dasarathi Satakam - 35 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 69వ పద్యము :
మత్స్యావతారము:-
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఇక్కడనుండి దశావతార వర్ణన మొదలవుతుంది. మత్స్యావతారమున సముద్రములో చొచ్చుకుపోయి అతి కోపిష్టియైన, వీరుడైన వేదములను దొంగలించిన రాక్షసుని చంపి, వేదములను రక్షించి, బ్రహ్మకు వాటిని ఔదార్యముతో తిరిగి ఇచ్చినావు కదా. అట్టి నీవు నన్ను రక్షింపుము.
🌻. 70వ పద్యము :
కూర్మావతారము:-
కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో
ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
అత్యాశతో దేవదానవులు, పాలసముద్రమును అమృతం కొరకు చిలికారు. దానికి మందర పర్వతమును కవ్వముగా, ఆదిశేషుని త్రాడుగా చేసికొన్నారు. ఆ ధాటికి భూమి కంపించింది. అప్పుడు కూర్మావతారమెత్తి మందర పర్వతము మోసి అమృత సంపాదనకు తోడ్పడిన నీవు అదే విధముగా నా మనసులో కుడా అమృతము నింపుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 35 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 69th Poem :
vAricarAvatAramu vAridhilO jorxabArxi krOdha vi
stAraguDaina yA nigamataskaravIra niSAcarEMdrunin
jEri vadhiMci vEdamula cikkeDaliMci viriMcikin mahO
dArataniccitIvegada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
In the Matsyavatara you dived into the sea and rescued the vedas from the clutches of the angry Rakshasa warrior thief Somaka and returned them graciously to Lord Brahma.
🌻 70th Poem :
karamanura ktimaMdaramu gavvamugA nahirAjudrADugA
dorakoni dEvadAnavulu dugdhapayOdhimathiMcucunnacO
dharaNicaliMpalOkamulu tallaDamaMdaga gUrmamai dharA
dharamu dhariMcitIvekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
When the Devas and Rakshasas used Mandara mountain as a churning rod ( kavvam) for churning of the Celestial Sea of Milk with Vasuki as the churning rope, the Earth trembled and all the people were getting agitated. At that time, with great benevolence you assumed the shape of a tortoise and bore the weight of the Earth.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 36 / Dasarathi Satakam - 36 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 71వ పద్యము :
వరాహావతారము:-
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమున ధరించి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
పూర్వము హిరణాక్షుడను రాక్షసుడు భూమిని చాపగా చుట్టి ఎత్తికొని పోయి సముద్రములో దాక్కొనియుండగా, నీవు వరాహావతారము దాల్చి, ఆ రాక్షసుని చంపితివి. భూమిని నీ కుడిపంటి కోరయందు దాల్చి రక్షించితివి. అట్లే నన్ను కుడా రక్షింపుము.
🌻. 72వ పద్యము :
నరసింహావతారము:-
పెటపెటనుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళించి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
భయంకరమైన కోరలతో, గోళ్ళ కొనల మెరుపుతో కూడిన శక్తి కృపగా నృసింహ రూపుడవై హిరణ్యకశిపుని చీల్చి చెండాడి నట్లు, నా పాపములను భయంకరమైన, స్పష్టమైన, సామరస్యమైన శక్తితో చీల్చి చెండాడి, దయతో ప్రహ్లాదుని కాచినట్లు నన్నును కావుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 36 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 71th Poem :
dhAruNi jApajuTTina vidhaMbunagaikoni hEmanEtruDa
vvAridhilOnadAginanu vAnivadhiMci varAhamUrtivai
dhAruNidoMTikai vaDini dakShiNaSRuMgamuna dhariMci vi
stAra monarcitIvekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
When Hiranyaksha folded the Earth like a mattress and hid in the sea, You took the shape of a boar, killed him and bore the Earth on your right tusk and restored the Earth to its normal shape.
🌻 72th Poem :
peTapeTanukku kaMbamuna BIkaradaMta naKAMkura praBA
paTalamu gappa nuppatili BaMDanavIdhi nRusiMhaBIkara
sPuTapaTuSakti hEmakaSipu vidaLiMci surAripaTTi naM
taTagRupajUcitIvekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
You broke open the steel pillar with a deafening sound, came out with your shining teeth and claws and tore open Hiranyakasipu's stomach with your claws and blessed his son Prahlada.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 37 / Dasarathi Satakam - 37 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 73వ పద్యము :
Poem
వామనావతారము:-
పదయుగళంబు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొత్తిమే
లొదవజగత్త్రయంబు బురు హూతునికియ్యవటుండవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
Meaning
ఓ రామా! ఇంద్రభోగములనుభవించినా ఆశకు అంతు ఉండదు. మేరుపర్వతమంత ఆస్తి ఉన్నా కూడా ఒక్క కాసు కూడా వెంటరాదు. తెలిసీ, తెలియక చేసిన పాపములు మాత్రము వదలవు. మరుజన్మనిష్టపడని నన్ను నా కర్మానుభవమును నాశనము చేసి రక్షింపుము.
🌻. 74వ పద్యము :
Poem
పరశురామావతారము:-
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
Meaning
ఓ రామా! నీవు భృగు వంశమున జన్మించి, పరశురాముడవై తండ్రిని హతమార్చిన కార్తవీర్యార్జుని మీద కోపముతో దుష్ట క్షత్రియుల పీడను ధరిత్రికి తొలగించినావు. వారి నెత్తుటి ధారలతో పితృదేవతలకు తర్పణ ఇచ్చావు. అట్లు జయించిన భూమిని బ్రాహ్మణోత్తములకు దానము నొసిగావు. అదే విధంగా నా పాపములనే పీడను తొలగింపుము .
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 37 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 73th Poem :
padayugaLaMbu BUgagana BAgamula vesanUni vikramA
spadamagunabbalIMdrunoka pAdamunaMdalakriMdanottimE
lodavajagattrayaMbu buruhUtunikiyyavaTuMDavainaci
tsadamalamUrti vIvekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
With your two feet you quickly occupied the Earth and the Sky and with another foot pushed the powerful Balichakravarti into the Pathala with a view to present Indra with the three worlds. Are you not Vamana, the pure embodiment of truth and knowledge?
🌻 74th Poem :
iruvadiyokkamArxu dharaNISula nellavadhiMci tatkaLE
bara rudhira pravAhamuna baitRukatarpaNa moppajEsi BU
suravarakOTikinmudamu soppaDa BArgavarAmamUrtivai
dharaNinosaMgitI vekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Are you not the Bhargavarama who killed the Kings twenyone times and used the blood flowing from their bodies to perform funeral rites to his ancestors and then donated the lands to Brahmins and made them happy?
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 38 / Dasarathi Satakam - 38 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 75వ పద్యము :
రామావతారము:-
దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమంది తండ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఓ దాశరధ రామా! మానవుడే మహానీయుడనే విధంగా మాచరించి చూపిన నీవు మమ్ము ధర్మ మార్గము తప్పకుండనట్లు దీవింపుము. తాటకను సంహరించి, శివధనుర్భంగముకావించి, సీతను వివాహమాడి, తండ్రి ఆజ్ఞతో అడవులకేగి, రావణ, కుంభకర్ణాది దుష్టదానవుల సంహరించిన రామా! నీ చరిత్ర మాకాదర్శమగు నట్లుగా దీవింపుము. రామాయణ గాథనంతనూ సంక్షిప్తంగా ఒక్క శతకంలో ఎంత బాగా చెప్పాడో కదా!
🌻. 76వ పద్యము :
బలరామావతారము:-
అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
శ్రీకృష్ణుని సోదరునిగా, రొహిణీదేవి కుమారునిగా, బలరాముడవై దుష్టసమూహమును ఖండించిన నీ భుజబలము నన్ను బ్రోచుగాక.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 38 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 75th Poem :
duramuna dATakaMdunimi dhUrjaTivil dunumADisItanuM
bariNayamaMdi taMDripanupa Gana kAnanaBUmi kEgi du
starapaTucaMDakAMDakuliSAhati rAvaNakuMBakarNa BU
dharamula gUlcitI vekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Are you not the Rama who killed Thataka, bent the bow of Siva, married Seeta, went to the forest to honour your father's promise and slayed mountain-like Ravana and Kumbhakarna with diamond-like arrows?
🌻 76th Poem :
anupamayAdavAnvayasudhAbdhisudhAnidhi kRuShNamUrtinI
kanujuDugAjaniMci kujanAvaLinella naDaMci rOhiNI
tanayuDanaMga bAhubala darpamuna balarAmamUrtivai
tanarina vElpuvIvekada dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Are you not Balarama, brother of Krishna, the moon of the Yadava Dynasty? Are you not the son of Rohini? Did you not vanquish the evil and the wicked with your valour?
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 39 / Dasarathi Satakam - 39 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 77వ పద్యము :
బుద్ధావతారము:-
సురలునుతింపగా ద్రిపుర సుందరుల వరియింపబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
తరచి చూడగ దేవతలు పూజింపగ త్రిపురాపురి సుందరీ మణులను వరించుటకై బుద్ధావతారము ధరించితివి. త్రిపురాసుర సంహారమునకు పరమశివునకు తోడుగా, సాధనమును సమకూర్చిన నీవు బుద్ధుడవై మాకు సద్భుద్ధిని యొసగుము.
🌻. 78వ పద్యము :
కల్క్యవతారము:-
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ
రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
వర్ణసంకరము చేత ఛేదించుటకు వీలుకాని పాపములతో నిండి ధరిత్రిని మేలుజాతి గుర్రమును అధిరోహించి, చేతియందు కత్తిని పట్టుకొని కల్కి అవతారమున వీర భోగ వసంతరాయలవై సజ్జనుల బ్రోచెడి నీవు దురాచారములను ఖండింపుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 39 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 77th Poem :
suralunutiMpagA dripura suMdarulan variyiMpabuddharU
parayaga dAlcitIvu tripurAsurakOTi dahiMcunappuDA
harunakudODugA varaSa rAsana bANamuKOgrasAdhanO
tkara monariMcitIvukada dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
You are born at the request of Devas as Buddha to enchant the women of Tripurasura. You helped Siva in the destruction of Tripurasura by equipping Siva with very fine bows, arrows and other weapons.
🌻 78th Poem :
saMkaradurgamai durita saMkulamaina jagaMbujUci sa
rvaMkaShalIla nuttama turaMgamunekki karAsibUni vI
rAMkavilAsa moppa gali kAkRuta sajjanakOTiki nirA
taMka monartuvIvukada dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
When the world is affected by Varnasankara and enormous sins, You are born as Kalki and ride a horse effortlessly with a sword in your hand for protecting the good people and ridding them of all sufferings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 40 / Dasarathi Satakam - 40 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 79వ పద్యము :
మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ గురించి చింతన చేయక పోవడమే శరీరానికి గొప్ప శత్రువు వంటిది. ఊహాశక్తి నశింపక మునుపె, శరీరము రోగపీడితం కానప్పుడే నిన్ను నిశ్చలచిత్తుడనై ధ్యానించునట్లు జేయుము.
🌻. 80వ పద్యము :
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
'రామా!' అను నీ నామస్మరణ శాశ్వతానందము కల్పించునటువంటిది. మోక్షమునకు మూలము. ఆపదల సముద్రమునకు నావ. మొహమనెడి మదించిన ఏనుగును అంకుశము వలె పొడుచును. ఐశ్వర్యముల నిచ్చు ధనాగారము. కోరిన కోర్కెలను తీర్చును. సంగ్రామమున విజయమొసగునది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 40 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 79th Poem :
manamunanUhapOShaNalu marvakamunne kaPAdirOgamul
danuvunanaMTi mEnibigi dappakamunnenaruMDu mOkSha sA
dhana monariMpagAvalayu dattvavicAramu mAniyuMDuTa
ltanuvunaku virOdhamidi dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Before the mind loses its ability to discriminate between the good and bad thoughts and before the advent of diseases like kapha(phlegm) which immobilise the organs, a man should pursue the spiritual path. Not doing this is inimical to the person.
🌻 80th Poem :
mudamuna kATapaTTuBava mOhamadadviraAMkuSaMbu saM
padala koTAru kOrikala paMTa paraMbuna kAdi vairula
nnadana jayiMcutrOva vipadabdhikinAvagadA sadABava
tsadamalanAmasaMsmaraNa dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
Reciting your name is the source of happiness. It is like a goading rod for the elephant of infatuation for worldly objects. It is like a bank for storing your money. It fulfills all desires. It is the first step in the spiritual path and the guiding force for overcoming the enemies in time. It ferries us across the sea of adversity.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 41 / Dasarathi Satakam - 41 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 81వ పద్యము :
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ
కరతల హేతిచేఁ దెగి వకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
రామా! మండుచున్న అగ్నిపై దండెత్తిన మిడతల గుంపు ఆ అగ్నికి ఆహుతు అయినట్లుగా నీ నామస్మరణ మోక్షము నిచ్చుటయే కాక పలు జన్మ పాపములను ఖండించు కత్తి వంటిది.
🌻. 82వ పద్యము :
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఎల్లప్పుడూ విష్ణుమూర్తి పాదపద్మములయందు భక్తి కలిగి ఇంద్రియములను జయించిన వానిని ఉత్తముడందురు. ఇంద్రియములకు వశము కాకుండా నిగ్రహించుటకు ప్రయత్నించిన వానిని మధ్యముడందురు. ఇంద్రియములకు బానిస అయిన వానిని అధముడందురు. నేను చెడ్డ బుద్ధి కలవాడను, అట్టి నన్ను ఏరీతిగ కాపాడెదవో రామా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 41 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 81th Poem :
durita latAnusAri BavaduHKa kadaMbamu rAmanAmaBI
karatarahEticE degi vakAvakalai canakuMDa nErcunE
darikoni maMDucuMDu SiKa dArkoninan SalaBAdikITakO
tkaramu vilInamaicanade dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
The set of sins growing like a creeping plant are bound to be terminated by the fierce sword of Ramanama japa just as insects like grasshopper are burnt by fire.
🌻 82th Poem :
haripadaBaktiniMdriyaja yAnvituDuttamuDiMdrimaMbulan
marugaka nilpanUdinanu madhyamuDiMdriyapAravaSyuDai
paraginacO nikRuShTuDani palkaga durmatinaina nannu nA
daramuna neTlukAcedavo dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
A person who has conquered sense organs due to his devotion to Hari is the best. A person who tries to conquer the sense organs is second best. A person who is a slave of sense organs is the worst kind. I belong to the third category. Please save me with benevolence.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 42 / Dasarathi Satakam - 42 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 83వ పద్యము :
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిందెంతో ఉంది. పంచేంద్రియములకు బానిస అయితే, ఎంత నష్టపోతామో తెలుస్తుంది. అడవి ఏనుగు దేహ చాపల్యమునకు చిక్కెను. అది చర్మేంద్రియమునకు లొనయ్యెను. చేప ఎరను చూసి జిహ్వేంద్రియములకు ఆశపడి చిక్కెను. పాము, నాగస్వరము వినుచు, శ్రవణేంద్రియములకు లోనయి నశించెను. లేడులు నేత్రేంద్రియమునకు ఆశపడి నశించెను. తుమ్మెద పరిమళమునకాశపడి ఘ్రాణేంద్రియమునకు వశపడి నశించెను. ఈ పంచేంద్రియములను గెలుచుట నా తరమా? వానిని గెలుచుటకు నీవే తోడ్పడవలెను.
🌻. 84వ పద్యము :
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
చేతులు నీకు నమస్కరించుచున్నవి. కన్నులు నిన్నే చూచుచున్నవి. నాలుక నిన్నే స్మరించుచున్నది. వీనులు నీ కథామృతమును గ్రోలుచున్నవి. ముక్కు నీ పూలపరిమళములను ఆశ్వాదించుచున్నది. ఇట్లు చేయుట మోక్షమునకు గొప్ప మార్గము. అట్లు పంచేంద్రియములు నిన్నే తలచి మ్రోక్కేటటువంటి భక్తి నాకు అనుగ్రహింపుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 42 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 83rd Poem :
vanakaricikke mainasaku vAcavikiM jeDipOye mInu tA
vinikikijikkejilvaganu vEdurxu jeMdenu lELLu tAvilO
manikinaSiMce dETitara mAyirumUTini gelvanai dusA
dhanamulanIve kAvanagu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
An elephant is ambushed by its temptation for touching the skin of another elephant. A fish is caught by its weakness for the taste of the bait at the end of the fishing rod. The snakes are trapped by the sound of a snake charmer's trumpet. The deers are snared by their tendency to move towards light. Holy bee /black carpenter (Bhramara) is enticed by the fragrance of flowers. Please save me from the temptations of the sensory organs. (All the above are trapped from the temptations of touch, tongue, ears, eyes and nose respectively)
🌻 84th Poem :
karamulumIkumrokkuliDa kannulu mimmune cUDa jihva mI
smaraNadanarpavInuluBavatkathalan vinucuMDanAsa mI
yarxutanu beTTupUsarula kAsagonaM baramArtha sAdhanO
tkaramidi cEyavEkRupanu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Let our hands do obeisances to you ; let our eyes feast the sight of your handsome face ; let our tongue chant your sacred name ; let our ears listen to your glorious tales ; let our nose enjoy the fragrance of the garlands adorning you. Let me use these five sense organs to pursue the spiritual path.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 43 / Dasarathi Satakam - 43 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 85వ పద్యము :
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఒక్క తులసి దళము భక్తితో సమర్పించినంతనే వాడు గంధర్వ, గరుడ, పన్నగులయందు ఒక్కడై ప్రకాశించుచుండును. బహు కాలము నీ పదసేవ జేసిన వారు కుడా ఊర్ధ్వలోకములందు నివసించుచుందురు. ఎల్లవేళలా నీ పాదార్చన చేయు వారికి పరమపదము అరిచేతిలో ఉసిరిక.
🌻. 86వ పద్యము :
భానుడు తూర్పునందుగను పుట్టినఁ బావక చంద్ర తేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచులడంగకుండు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
రాక్షసుల గర్వమును హరించి, వారిని హతమార్చిన రామా! నీ అనితర కాంతిముందు, సూర్యుని ముందు చంద్రాగ్నుల కాంతి చిన్న బోయినట్లే, ఇతర దేవతల కాంతి క్షీణించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 43 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 85th Poem :
cirataraBakti nokkatuLasIdaLa marpaNa cEyuvADu KE
caragaru DOraga pramuKa saMGamulO velugan saDA Bavat
sphuradaravinda pAdamula bUjalonarcina vArikellada
tpara maracEtidhAtrigada dASarathI karuNApayOnidhI!
🌻 Meaning :
A person who has worshipped you with just one Tulasi leaf is blessed and is shining among the company of celestials like Khecharas, Garuda and Serpents. Therefore for those meditating on Your Lotus Feet, spiritual achievement is child's play.
🌻 86th Poem :
BAnuDu tUrpunaMduganu puTTina bAvaka caMdra tEjamul
hInata jeMdinaTlu jagadEka virAjitamaina nI pada
dhyAnamu cEyucunna bara daivamarIculaDaMgakuMDunE
dAnava garva nirdaLana dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
After the glorious sunshine during the daytime, the moonlight and light from fire look debilitated. In a similar way, after meditating on Your Lotus Feet people will find the other gods not worthy of worship. O Humiliator of the pride of demons!
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 44 / Dasarathi Satakam - 44 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 87వ పద్యము :
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ నామ నిశ్చల జపమునకు కోటి నదుల స్నానము, తీర్ధయాత్రలు సరికావు. నీ నామమే సర్వోత్కుృష్టమయినది. నీ మహనీయ మనెడి అమృత సాగరమునందు పూర్తిగా మునిగినచో జ్ఞానము చేకురును. మనస్సులోని మాలిన్యము నశించును.
🌻. 88వ పద్యము :
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భ క్తియోగ దహ నార్చిఁదగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ప్రకాశించు కర్ణాభరణములు దాల్చిన రామా! బంగారమునకు అంటుకొన్న మాలిన్యము తొలగించవలెనన్న ఆ బంగారమును పుటము వేయవలెను. మనో మాలిన్యములను తొలగించవలెనన్న ఆ మనసును నీయందు లీనము చేయవలెను. భక్తియొగమనెడి అగ్నిజ్వాలలో పుటము వేయకున్నచో, అందలి మాలిన్యములు నశించవు కదా?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 44 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 87th Poem :
nImahanIyatattva rasa nirNa yabOdha kathAmRutAbdhilO
dAmunugruMkulADakavRuthAtanukaShTamujeMdi mAnavuM
DI mahilOkatIrthamula nella muniMgina durvikAra hRu
ttAmasapaMkamul vidune dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
In stead of bathing in the sea of your great stories elucidating the supreme truth, men are frittering away their time and energy by dipping into all the thirthas little knowing that this cannot clean up the mud enveloping their minds.
🌻 88th Poem :
kAMcana vastusaMkalita kalmaSha magnipuTaMbu veTTivA
riMcinarIti nAtmanigiDiMcina duShkara durmalatrayaM
baMcita BaktiyOga daha nArcidagulpaka pAyunE kana
tkAMcanakuMDalABaraNa dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
O Rama adorned by golden ornaments! Just as the impurity in gold is removed by fire, the mud enveloping the Atma formed by the trio of Satwa, Rajas and Thamas can be washed away by the fire of Bhakthi Yoga alone.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 45 / Dasarathi Satakam - 45 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 89వ పద్యము :
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నీ భార్య లక్ష్మీదేవి సకల సంపదలనొసగును. నీ పుత్రిక గంగాదేవి సమస్త పాపములను తొలగించును. మీ కుమారుడు, సృష్టికర్తయైన బ్రహ్మ ఆయుర్దాయమునిచ్చును. నిన్నే కోరి భజించిన ప్రయోజనములుకలుగవే.
🌻. 90వ పద్యము :
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస
త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
తామరాకుపై నీటి బొట్టువలె బురదలో నివసించు కుమ్మరి పురుగుకు బురద అంటని మాదిరిగా మానవుడు జనక రాజర్షివలె సంసారియయ్యును విరాగివలె నుండవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 45 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 89th Poem :
nIsati pekku galmuliDanErpari, lOka makalmaShaMbugA
nIsuta sEyu pAvanamu nirmita kAryadhurINa dakShuDai
nIsutuDiccu nAyuvulu ninna BajiMcina galgakuMDunE
dAsulakIpsitArthamulu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Your consort Lakshmi bestows riches on people. Your daughter Ganga sanctifies the world. Your son Brahma discharges his duties as creator efficiently. With this kind of family background it is only to be expected that you will fulfill the desires of your devotees.
🌻 90th Poem :
vArijapatramaMdiDina vArividhaMbuna vartanIyamaM
dAraya roMpilOna danu vaMTani kummaripurvurIti saM
sAramunan melaMgucu vicAraguDaiparamoMdugAde sa
tkAra merxiMgi mAnavuDu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Just like a water drop on the leaf of a lotus, like the Kummari insect which dwells in mud but is devoid of mud on its skin, if a person lives with detachment he will surely attain Moksha.Just like a water drop on the leaf of a lotus, like the Kummari insect which dwells in mud but is devoid of mud on its skin, if a person lives with detachment he will surely attain Moksha.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 46 / Dasarathi Satakam - 46 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 91వ పద్యము :
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ
🌻. భావము :
తల్లిదండ్రులు, కుమారులు, భార్య, వీరంతా ఎక్కడినుంచి వచ్చారు? ఎన్నో జన్మలనెత్తుతూ, బంధములతగుల్కొని జీవించి మరణించునది దేహమే కాని, అన్నింట ప్రకాశించు జీవుడు ఒకడే. అన్ని జన్మల పాపపుణ్యములను జీవుడు తానే అనుభవించవలెను కాని ఎవరూ తోడురారు. నాకు మరు జన్మ మీద ఆశలేదు. హే రామా! నన్ను ఈ సంసార బంధములనించి విముక్తుని చేసి జీవన్ముక్తిని ప్రసాదించుము కరుణాసాగరా!
🌻. 92వ పద్యము :
దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము
ల్దరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
శరీరము వుర్ధాప్యములో శుష్కించినా, రాచరికములు, సిరులు అశాశ్వతములైనవివని తెలిసినా, తోటివారు చనిపోయినప్పుడు తాను కూడా ఒకరోజు చనిపోవలసిందేనని తెలిసినా మొహములో పడుతున్నాము. అట్టి ఈ వ్యామోహ పాశములను వదిలించి మా విముక్తి మార్గమును చుపవయా దేవా! దీనమందిరా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 46 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 91th Poem :
ekkaDi tallidaMDri sutulekkaDi vAru kaLatra bAMdhavaM
bekkaDa jIvuDeTTi tanu vettina buTTucu bOvucunna vA
DokkaDepApa puNya Pala moMdina nokkaDe kAnarADuvE
rxokkaDu veMTanaMTiBava mollanayAkRupa jUDavayya nI
Takkari mAyalaMdiDaka dASarathI karuNA payOnidhI.
🌻 Meaning :
The apparent relationships like mother, father, son, wife and relatives are all illusory. Except the sins and good things done by us nothing follows us after we die. Therefore please show compassion and prevent me from getting entrapped by your Maya.
🌻 92th Poem :
dorasinakAyamulmudimi tOcinajUcipraButvamulsirul
merxupulugAgajUcimarxi mEdinilOdamatODivArumuM
daruguTajUcicUci tagu nAyuverxuMgaka mOhapASamu
ldaruganivArikEmigati dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
Human beings observe people growing old, see that power and riches are not permanent, notice some of their contemporaries die before their own eyes, realise that their own life is coming to end soon and yet are unable to come out of the shackles of infatuation for worldly objects. What is the fate of such people? (What recourse should they take?).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 47 / Dasarathi Satakam - 47 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 93వ పద్యము :
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ
గెరలిన వేళఁదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఐశ్వరములలో తులతూగునాడు నేనే గొప్ప వాడినని విఱ్ఱవీగి నిన్నే మరిచితిని. దరిద్రదేవతలకు బానిసనైతిని ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనము? నీటి కోసము బావిని ముందు తవ్వవలనే కాని అగ్నిజ్వాలలు లేచినప్పుడో దాహముతోనున్నప్పుడో కాదు కదా! అట్టి నన్ను కాపాడవయా దేవదేవా! ఆశ్రితవత్సలా!
🌻. 94వ పద్యము :
జీవనమింకఁ బంకమున జిక్కిన మీను చలింపకెంతయు
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
చెరువు ఎండిపోయి బురద పడినాకూడా అందులోనే నీటిని కోరుకొను చేప మాదిరిగా ఎన్ని కష్టనష్టములు వచ్చిననూ, నిన్ను విడువలేక కొలుచు వానిని నీవును వదిలి పెట్టవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 47 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 93th Poem :
sirigalanADu maimarxaci cikkinanADudalaMci puNyamul
poribori sEyanaitinani pokkina galgu negAliciccupai
geralina vELadappikoni kIDpaDu vELa jalaMbu gOri ta
ttaramuna dravvinaM galade dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
When riches abound you forget about performing good things (punyamulu) and in penury you regret about it. It is like trying to dig a well when you are engulfed by fire and feeling thirsty.
🌻 94th Poem :
jIvanamiMka baMkamuna jikkina mInu caliMpakeMtayun
dAvunanilci jIvaname daddayu gOruvidhaMbu coppaDaM
dAvalamainagAni gurxi tappanivADu tariMcuvADayA
tAvakaBaktiyOgamuna dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
Just as a fish living in water awaits the return of water even after the water dries up and it is stuck up in mud, your devotees will not give up the worship of Your Lotus Feet even if they are swamped by sufferings with the hope of eventually attaining Salvation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 48 / Dasarathi Satakam - 48 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 95వ పద్యము :
సరసునిమానసంబుMeaning
తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలము వలన ఎవరిని యాచించకుండ, అడిగినవారికి లేదనకుండ, అసత్యము పలుకక, యుద్ధరంగమున జంకకనుండు గుణవంతుడయిన ఒక పుత్రుడు పుట్టినా తల్లిదండ్రులకే గాక వంశములకే, నీ వలెనే ఖ్యాతిదేగలడు. సర సఙ్ఞుడెరుంగును ముష్కరాధముం
డెఱిఁగిగ్రహించువాడె కొల నేకనిసముఁ గాగదుర్దురం
బరయఁగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
రసజ్ఞుని మనసును రసజ్ఞుడే గ్రహింపగలడు. కొలనులోనే నివసించు కప్ప ఆ కొలనులోని కమలముయొక్క తేనె గ్రహించలేనట్లే మూఢుడైన నీచుడు రసజ్ఞుని వూహ తెలిసికొనలేడు.
🌻. 96వ పద్యము :
నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే
చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో
రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలము వలన ఎవరిని యాచించకుండ, అడిగినవారికి లేదనకుండ, అసత్యము పలుకక, యుద్ధరంగమున జంకకనుండు గుణవంతుడయిన ఒక పుత్రుడు పుట్టినా తల్లిదండ్రులకే గాక వంశములకే, నీ వలెనే ఖ్యాతిదేగలడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 48 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 95th Poem :
sarasunimAnasaMbu sarasaj~juDeruMgunu muShkarAdhamuM
DerxigigrahiMcuvADe kolanEkanivAsamu gAgadarduraM
barayaga nErcuTeTlu vika cAbdamaraMda rasaika sauraBO
tkaramumiLiMda moMdukriya dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
A connoisseur can appreciate the mind of another connoisseur. An ignorant/foolish man cannot do it. Though a lotus and fish reside in the same pond, a fish cannot appreciate the sweet fragrance of a lotus the same way that a holy bee (Bhramara) can.
🌻 96th Poem :
nOcinatallidaMDriki danUBavuDokkaDecAlu mETicE
cAcanivADu vErxokaDu cAcina lEdana kiccuvADunO
rAcinijaMbakAni palu kADanivADu raNaMbulOna mEn
dAcanivADu Badragiri dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
Blessed are the parents whose son never begs from anybody ; does not say no when somebody seeks something from him; fights to the best of his ability in the battle field without fleecing and who never lies.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 49 / Dasarathi Satakam - 49 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 97వ పద్యము :
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నామనంబునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమందఁగ జేసి సత్కళా
దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
నిన్ను నేను జానకీపతీ! లక్ష్మీ వల్లభా! సంపద ప్రదాతా, చిన్మయ రూపా, రామా, నారాయణా అని అన్ని సమయములందు విడువక స్తోత్రము చేయుచుండును. దానికి ఫలముగా నీవు నా హృదయమునందు ఎల్లవేళలా కొలువు దీరుము. నా పాపములను నశింపజేయుము. నాకు ముక్తి నిమ్ము.
🌻. 98వ పద్యము :
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
శబరి ఎంగిలి పళ్ళు తిని, ఉడుత సహాయమునకు మెచ్చి దాని శరీరమున నీ గోటిచారలు గీసి, వారిని జీవన్ముక్తులు చేసిన నీ దయ నన్ను తప్పక రక్షించును. తక్కువ జన్మలకే మోక్షమొసంగిన నీకు ఉత్తమ జన్మలకు ముక్తిని ఒసగుట కష్టము కాదు. నీ మహత్యము నా లాంటి వారికి తెలియరాని వేదాంతమే కదా?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 49 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 97th Poem :
SrIyutajAnakIramaNa cinmayarUpa ramESarAma nA
rAyaNa pAhipAhiyani brastuti jEsiti nAmanaMbunan
bAyaka kilbiShavraja vi pATanamaMdaga jEsi satkaLA
dAyi PalaMbunAkiDave dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
O Consort of Lakshmi! Beloved of Janaki! Embodiment of knowledge! Rama! Narayana! I meditated on you for protection. Please stay in my mind and root out the sins I have accumulated and bless me with fruitful results.
🌻 98th Poem :
eMtaTipuNyamO Sabari yeMgiligoMTivi viMtagAde nI
maMtana meTTidO yuDuta maini karAgra naKAMkuraMbulan
saMtasamaMda jEsitivi satkulajanmamu lEmi lekka vE
dAMtamugAde nI mahima dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
How pious is Sabari whom you blessed by eating a fruit tasted by her prior to giving to you? How fortunate is the squirrel whom you blessed with your finger nails touching its body and leaving a permanent impression on its body? One can understand your greatness (mahattwamu) by learning the essence of vedas and not by being born in a high caste.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 50 / Dasarathi Satakam - 50 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 99వ పద్యము :
బొంకనివాఁడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం
జంకనివాఁడెజోదు రభసంబున నర్థి కరంబుసాఁచినం
గొంకనివాఁడెదాత మిముఁ గొల్చిభజించిన వాఁడె పోనిరా
తంక మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
ఉత్తముడే సత్యవాది. యుద్ధమున జంకని వాడే ధీరుడు. అర్ధిని వెనుకకు పంపనివాడే దాత మిమ్ము సేవించువాడే మంచి మనసుకలవాడు.
🌻. 100వ పద్యము :
భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ
🌻. భావము :
భ్రమర కీటక న్యాయమున నీ నామస్మరణ మమ్ముల పరమాత్మ స్వరూపునిగా జేయును. కీటకము చుట్టూ పరిభ్రమించి, భ్రమరము దానిని కూడా భ్రమరము చేయును. అట్లే నీ నామస్మరణ మా దుఃఖములనెడి అంధకారములను పారద్రోలును.
భద్రాచల రామదాసు తన భక్త్యావేశముతో రాముని పరి పరి విధాల వేడు కొనటమే ఈ శతక ముఖ్యోద్దేశము. రామ నామ మాధుర్యము చేత రామా! రామా! అని ఎన్నిమార్లు ఉచ్చరించిననూ విసుగు కలగదు. తృప్తి కలగదు. ఆ నామమే తిరిగి తిరిగి పునశ్చరణ చెయుదమని రామదాసు ఉవాచ. ఆ రామనామ మాధుర్యమును ఎన్నో రకాలుగా కీర్తించినాడు.
సమాప్తం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Dasarathi Satakam - 50 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
🌻 99th Poem :
boMkanivADeyOgyuDari bRuMdamu lettina cOTajivvakuM
jaMkanivADejOdu raBasaMbuna narthi karaMbusAcinaM
goMkanivADedAta mimu golciBajiMcina vADepO nirA
taMkamanasku Denna ganu dASarathI karuNApayOnidhI
🌻 Meaning :
One who never tells lies is noble ; one who is fearless in battle field is a hero ; one who never refuses help to those seeking it is a benefactor. A person who worships you is rid of all Thapathrayas
🌻 100th Poem :
BramaramugITakaMbu goni pAlpaDi JaMkaraNOpakAriyai
BramaramugAnonarcunani palkuTa jEsi BavAdi duHKasaM
tamanameDalci Baktisahi taMbuga jIvuni viSvarUpa ta
ttvamunadhariMcu TEmarudu dASarathI karuNApayOnidhI.
🌻 Meaning :
People say that a honey bee (black carpenter) picks an insect, keeps it in its nest and teaches it jhunkara and the insect is transformed to a honey bee. If a honey bee can do it what is so surprising about you enlightening a person with spiritual knowledge and relieving him from suffering and pain?
The End
🌹 🌹 🌹 🌹 🌹
🌻🌻🌻. సమాప్తం... 🌻🌻🌻
No comments:
Post a Comment