రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18
🌻. గుణనిధి సద్గతిని పొందుట - 4 🌻
భక్తేన విధినా పూజా క్రియమాణా నిరీక్షితా | ఉపోషితేన భూతాయా మనేనాస్థిత చేతసా || 37
శివలోకమయం హ్యద్య గంతాస్మాభి స్సహైవ తు | కంచిత్కాలం మహాభోగాన్ కరిష్యతి శివానుగః || 38
కలింగరాజో భవితా తతో నిర్ధూతకల్మషః | ఏషద్విజవరో నూనం శివప్రియతరో యతః || 39
అన్యత్కించిన్న వక్తవ్యం యూయం యాత యథాగతమ్ | యమదూతాస్స్వలోకం తు సుప్రసన్నేన చేతసా || 40
భక్తుడు ఉపవాసముండి మనస్సును లగ్నము చేసి యథా విధిగా చేసిన పూజను ఈతడు చూచినాడు (37).
ఈతడిప్పుడు మాతో శివలోకమునకు వచ్చి, శివుని అనుచరుడై, కొంత కాలము మహాభోగముల ననుభవించగలడు.(38).
తరువాత, సర్వ దోషములు తొలగిన ఈ ద్విజశ్రేష్ఠుడు శివునకు మిక్కిలి ప్రీతి పాత్రుడగుటచే కళింగరాజు కాగలడు (39).
మీతో చెప్పదగినది మరి ఏదియూ లేదు. యమదూతలారా! మీరు ప్రసన్నచిత్తులై వచ్చిన దారిని మీలోకమునకు పొండు (40).
బ్రహ్మో వాచ |
ఇత్యాకర్ణ్య వచస్తేషాం యమదూతా మునీశ్వర |యథాగతం యయుస్సర్వే యమలోకం పరాఙ్ముఖాః || 41
సర్వం నివేదయామాసుశ్శమనాయ గణా మునే | తద్వృత్తమాదితః ప్రోక్తం శంభూదూతైశ్చ ధర్మతః || 42
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునిశ్రేష్ఠా! యమదూతలు వారి ఈ మాటలను విని వెనుదిరిగి యమలోకమునకు వచ్చిన దారిని అందరు వెళ్లిరి (41).
ఓ మహర్షీ! శంభుని దూతలు ధర్మము ప్రకారము చేసిన ఈ కార్యమునంతనూ యమునకు ఆ దూతలు ఆదినుండి అంతమువరకు విన్నవించిరి (42).
ధర్మరాజ ఉవాచ |
సర్వే శృణుత మద్వాక్యం సావధానతయా గణాః | తదేవ ప్రీత్యా కురుత మచ్ఛాసన పురస్సరమ్ || 43
యే త్రిపుండ్ర ధరా లోకే విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 44
ఉద్ధూలనకరా యే హి విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 45
యే రుద్రాక్షధరా లోకే జటా ధారిణ ఏవ యే | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 46
శివ వేషతయా లోకే యేన కేనాపి హేతునా | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 47
ధర్మరాజు ఇట్లు పలికెను -
ఓ గణములారా! మీరందరు సావధానముగా నా మాటలను విని, నా ఈ ఆజ్ఞను ప్రీతితో ఆచరించుడు (43).
లోకములో తెల్లని విభూతితో త్రిపుండ్రమును ధరించు వారిని (44),
తెల్లని విభూతితో శరీరమునంతయూ భస్మమయముగా చేసుకొను వారిని (45),
రుద్రాక్షలను ధరించువారిని, జటాధారులను (46),
కారణమేదైనా లోకములో శివవేషమును ధరించు వారిని ఇచటకు ఎన్నడునూ తీసుకొని రావలదు. వారికి దూరముగా నుండుడు (47).
ఉప జీవనహేతోశ్చ శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 48
దంభేనాపి చ్ఛ లేనాపి శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 49
ఏవ మాజ్ఞాపయామాస స యమో నిజకింకరాన్ | తథేతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్ శుచిస్మితాః || 50
జీవిక కొరకై శివవేషమును ధరించువారిని (48),
తాము ధర్మాత్ములమని చేప్పుకొనుట కొరకు గాని, లేదా ఇతరులను మోసగిచుట కొరకు గాని శివవేషమును ధరించు వారినైననూ ఇచ్చటికి ఏనాడు గొనిరావలదు. వారికి దూరముగా నుండుడు (49).
ఆ యముడు తన భటులనీ తీరున ఆజ్ఞాపించెను. వారందరూ చిరునవ్వులతో అటులనే చేసెదమని నిర్ణయించుకొని ఊరకుండిరి (50).
బ్రహ్మోవాచ |
పార్షదైర్యమదూతే భ్యో మోచితస్త్వితి స ద్విజః | శివలోకం జగామాశు తైర్గణౖ శ్శుచి మానసః || 51
తత్ర భుక్త్వాఖిలాన్ భోగాన్ సంసేవ్య చ శివాశి వౌ | అరిందమస్య తనయః కలింగాధిపతేరభూత్ || 52
దమ ఇత్య భిధానోsభూ చ్ఛివసేవాపరాయణః | బాలోsపి శిశుభిస్సాకం శివభక్తిం చకార సః || 53
క్రమాద్రాజ్య మవాప్యాథ పితర్యుపరతే యువా | ప్రీత్యా ప్రవర్త యా మాస శివధర్మాంశ్చ సర్వశః || 54
నాన్యం ధర్మం స జానాతి దుర్దమో భూపతిర్దమః | శివాలయేషు సర్వేషు దీప దానాదృతే ద్విజాః || 55
బ్రహ్మ ఇట్లు పలికెను -
యమదూతల నుండి ఈ తెరంగున శివగణములచే విడిపింపబడిన ఆ బ్రాహ్మణుడు శుద్ధమగు అంతఃకరణము గల వాడై వారితో గూడి శీఘ్రముగా శివలోకమునకు వెళ్లెను. (51).
అచట అతడు సమస్త భోగముల ననుభవించి, పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించి, కలింగరాజగు అరిందముని కుమారుడై జన్మించెను (52).
ఆతనికి దముడు అని పేరు. అతడు బాల్యము నుండియూ శివుని సేవించుట యందు శ్రద్ధ గలవాడై పిల్లలతో గూడి శివుని భజించెడివాడు (53).
కొంత కాలమునకు తండ్రి రాజ్యాధికారము నుండి నివృత్తుడయ్యెను. అపుడు యువకుడగు దముడు రాజు అయ్యెను. అతడు సర్వత్రా ప్రీతితో శివధర్మములను ప్రవర్తిల్ల జేసెను (54).
ఓ ద్విజులారా! జయింప శక్యము కాని ఆ దమ మహారాజునకు , శివాలయములన్నింటి యందు దీపములను వెలిగింపజేయుట తక్క మరియొక ధర్మము తెలియదు (55).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment