శ్రీ మదగ్ని మహాపురాణము - 69
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 69 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సర్వతో భద్ర మండల విధి - 2 🌻
పఞ్చపత్రాభిసిద్ధ్యర్థం మత్స్యే కృత్వైవమబ్జకమ్ | వ్యోమరేఖా బహిఃపీఠం తత్ర కోష్ఠాని మార్జయేత్. 12
త్రీణి కోణషు పాదార్థం ద్విద్వికాన్యపరాణి తు | చతుర్దిక్షు విలిప్తాని పత్రకాణి భవన్త్యుత. 13
తతః పఙ్త్కిద్వయం దిక్షు వీథ్యర్థం తు విలోపయేత్ | ద్వారాణ్యాశాసు కుర్వీత చత్వారి చతసృష్వపి. 14
పంచదలాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్యచిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ##రేఖకు బైట నున్న పీఠభాగమునందలి కోష్ఠములను తుడిచివేయవలెను. పీఠభాగముయొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్ఠకములను ఆ పీఠముయొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను.
నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను, తుడిచి వేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పలక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను. పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను.
ద్వారాణాం పార్శ్వతః శోభా అష్టౌ కుర్యాద్విచక్షణః | తత్పార్శ్వ ఉపశోభాస్తు తావత్యః పరికీర్తితాః. 15
సమీప ఉపశోభానాం కోణాస్తు పరికీర్తితాః | చతుర్దిక్షు తతో ద్వే ద్వే చిన్త యేన్మధ్యకోష్ఠకైః. 16
చత్వారి బమ్యతో మృజ్యాదేకైకం పార్శ్వయోరపి | శోభార్థం పార్శ్వయోస్త్రీణి త్రీణి లుమ్పేద్దలస్య తు. 17
తద్వద్విపర్యయే కుర్యాదుపశోభాం తతః పరమ్ | కోణస్యాన్తర్బహిస్త్రీణి చిన్త యేద్ద్విర్విభేదతః. 18
విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగములందు ఎనిమిది శోభాస్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును. ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణము లని పేరు.
పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్యపంక్తిలోని, మధ్యకోష్ఠములను ద్వారనిర్మాణమునకై ఉపమోగింపవలెను. వాటి నన్నింటిని కలిపి తుడిచివేయగా నాలుగు ద్వారము లేర్పడును. ద్వారముయొక్క లెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభానిర్మాణార్థమై తుడిచి వేయవలెను.
శోభాపార్శ్వభాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను, లోపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్ఠమలు భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను.
ఏవం షోడశకోష్ఠం స్యా దేవమన్యత్తు మణ్డలమ్ | ద్విషట్కభాగే షట్త్రింశత్పదం పద్మం తు వీథికా. 19
ఏకా పఙ్త్కిః పరాభ్యాం తు ద్వారశోభాది పూర్వవత్ | ద్వాదశాఙ్గులిభిః పద్మమేకహస్తే తు మణ్డలే. 20
ద్విహస్తే హస్తమాత్రం స్యాద్వృద్ధ్యా ద్వారేణ వా చరేత్ | అపీఠం చతురస్రం స్యాద్ద్వికరం చక్రపఙ్కజమ్. 21
పద్మార్థం నవభిః ప్రోక్తం నాభిస్తు తిసృభిఃస్మృతా | అష్టాభిస్త్వరకాన్ కుర్యాన్నేమిం తు చతురఙ్గులైః. 22
త్రిధా విభజ్య చ క్షేత్రమన్తర్ద్వాభ్యామథాఙ్కయేత్ | పఞ్చాన్తరసద్ధ్యర్థం తేష్వాస్ఫాల్య లిఖేదరాన్. 23
ఇంతవరకును పదునారేసి కోష్ఠములతో ఏర్పడు రెండువలదల ఏబదిఆరు కోష్ఠములు గల మండలము వర్ణింపబడినది. ఇతర మండలనిర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును.
పండ్రెండేసి కోష్ఠములచే నూటనలభైనాలుగు కోష్ఠకముల మండలము ఏర్పడును. దానిలో కూడు మధ్యనున్న ముప్పదియారు పదముల (కోష్ఠముల)చే కమల మేర్పడును. దీనిలో వీథి ఉండదు. ఒక పంక్తి పీఠమునకై ఏర్పరుపబడును. మిగిలిన రెండు పంక్తులచే, వెనుక చెప్పన విధమున, ద్వారశోభలు కల్పిలంపబడును.
ఒక హస్తము ప్రమాణము గల మండలమునందు కమలక్షేత్రము పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును. రెండు హస్తములు ప్రమాణము గల మండలమునందు కమలస్థానము ఒక హస్తము వెడల్పు-పొడవులతో నుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండలనిర్మాణము చేయవలెను.
రెండు హస్తముల ప్రమాణము గల పీఠరహిత మగు చతురస్రమండలమునందు చక్రాకారకమలమును నిర్మించవలెను. పద్మార్థము తొమ్మిది అంగుళము లుండును. నాభి మూడు అంగుళములు. ఎనిమిది అంగుళముల ఆకులు, నాలుగు అంగుళముల నేమి ఏర్పరుపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment