శివగీత - 32 / 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 32

🌹. శివగీత - 32 / 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 32 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము

🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 2 🌻
ననృ తుర్దంశ యంత స్స్వాం -శ్చంద్ర కాన్కోటి సంఖ్యయా,
ప్రణ మంతం తతో రామ - ముత్దాప్య వృష భ ద్వజః 11

అనినాయ రధం దివ్యం - ఫ్రుష్టే నాంత రాత్మనా,
కమండలు జలై స్స్వచ్చై - స్స్వయ మాచమ్య యత్నతః 12

తమా చామ్యాధ పురత -స్స్వాం కే రామ ముపానయత్,
అధ దివ్యం ధను స్తస్మై - దదౌ తూణీ ర మక్షయమ్ 13

మహా పాశుపతం నామ - దివ్య మస్త్రం దదౌ తతః ,
ఉక్తశ్చ తేన రామోపి - పాదరం చంద్ర మౌళినా. 14

జగన్నాశ కరం రౌద్ర - ముగ్ర మస్త్ర మిదం నృప,
అతో నేదం ప్రయోక్తవ్యం - సామాన్య సమరాదికే .15

అన్యో నాస్తి ప్రతీ ఘాత - ఏతస్య భువన త్రయే,
తస్మా త్ప్రాణాత్యయే రామ! - ప్రయోక్తవ్య ముపస్తితే.16

తరువాత గొప్ప ధనస్సును తగ్గని అమ్ములపోదిని,
పాశుపతాశ్రమును ప్రసాదించెను. వెనువెంటనే మహాదేవుడు శ్రీరాముని గురించి యిట్లు బోధించెను:

ఓయీ రామా! ఈ మహాస్త్రము రౌద్రము (రుద్రునికి సంబందించినది ) జగత్ప్రలయము గావించును కావున సామాన్య యుద్దములలో ఈ మహాస్త్రము నుపయోగింపకుము.

స్వర్గ- మర్త్య -పాతాళము ఈ ముల్లోకములలో ను ఎ యొక్కడైనను ఈ మహాస్త్రము దాటిని భారించిప్రతీకారము చేయువాడు లేడు. కనుక తనకు ప్రాణాపాయము సంభవించు సందర్భము న మాత్రమే దీనిని ప్రయోగించాలి తక్కిన సమయాల్లో దీని నుపయోగింప తగదు. దీని నుల్లంఘించిన యెడల జగత్సంహారము జరుగును.

🌹 🌹 🌹 🌹 🌹

🌹  శివగీత - 32 / 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 32  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 05 :
🌻 Ramaya Varapradanam - 2 🌻

Then Lord Paramashiva donated to Sri Rama a celestial and great bow, an inexhaustible quiver of arrows, and the supreme weapon by name MahaPashupatastra and spoke to Rama saying:

O Rama! This Mahapashupatastra is supremely terrible weapon which can annihilate entire universe. Therefore do not hurl this devastating weapon in battles of lesser scale.

There is no one, O Rama, in the entire three worlds who can counter this weapon and remain alive if this is hurled against him.

Therefore this weapon needs to be hurled only and only if it's a matter of survival of the self and there is no other way around. If this rule is broken in any way, there would be total annihilation of the universe.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment