🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరాశర మహర్షి - 4 🌻
15. సదాశివుడిని స్తోత్రంచేస్తూ పరాశరుడు ఆయనను ఆనందబ్రహ్మాధిష్ఠాన దేవత్వు నీవు అన్నాడు. అంటే శివతత్త్వం అన్నమాట! ‘ఆనందోబ్రహ్మేతి వ్యజనాత్’ అని అంటూంటాం. దానికి అధిష్ఠానదేవతవు అన్నాడాయన. పంచ బ్రహ్మలలో రుద్రుడు అయిదవబ్రహ్మ.
16. ఆదివస్తువు- శివుడనేది- శుద్ధతత్త్వమే! శివనామాన్ని మనం ఉత్కర్షకోసం వాడతాము. అంటే సర్వప్రవృత్తిలక్షణ లక్షితులైన దేవతలందరికీ అతీతమైన వస్తువు ఇది. సృష్టిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. కాని అతడికి లక్షణమేలేదు. ఆనందమే – శుద్ధ ఆనందమే – ఉంది.
17. శివారాధన అంతాకూడా, రుద్రుడినే నిమిత్తమాత్రంగా చేసుకుని రుద్రస్తుతిచేసి, గమ్యస్థానాన్ని శివ తత్త్వంగా పెట్టుకోవడం అన్నమాట. రుద్రుని వర్ణనతోడి ఉపాసన లౌకికఫలాలకోసం చేయటం వేరు. ఏ కోరికా లేక చేసే రుద్రం జ్ఞానప్రదం. రుద్రుడు పూర్తి నివృత్తియందుంటాడు. లోకములందు నిస్పృహతో ఉంటాడు. అతడు దేనినీ చూడటంకానీ, దేనివిషయంలోనూ అతడిలో ఎలాంటి భావాలూ కలగటంకాని ఉండవు.
18. సమిధాధానం అని – ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే – ఆ అగ్నిహోత్రం (నిత్యాగ్నిహోత్రాన్ని) ఆరకుండా ఉండటానికి ఒక సమిధను ఆ అగ్నిహోత్రంలో కాల్చి, ‘ఈ సమిధలో ఉండు!’ అని చెప్పి దాన్ని చూరులోపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు పూర్వులు. సమిధాధానం అంటారు దాన్ని. సన్యాసం పుచ్చుకున్నప్పుడు, ఆ అగ్నిని తన ఆత్మలోనికి తీసుకుంటారు. ఈ అగ్నులన్నిటినీకూడా ఆత్మారోపణం చేసుకుంటారు. ఆత్మలోకి తీసుకుంటారు. విసర్జించడు. ఏదో పర్యవసానం ఉండాలి అగ్నికి.
19..అగ్నిముఖంగా సంకల్పంచేసిన తరువాత, మధ్యలో, “నేను ఇక మానుకున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యదలుచుకోలేదు, వెళ్ళిపో!” అని అంటే అలా మధ్యలో పో అంటే పోతాడా ఆ దేవత! ఆయనకు ఆగ్రహం వస్తుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment