అద్భుత సృష్టి - 6


🌹. అద్భుత సృష్టి - 6 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 2. భూమి - మానవ సృష్టి 🌟

💫. సృష్టిలో మిగతా అన్ని అంశాల లాగే.. ఈ భూమి కూడా సృష్టించ బడింది. ఈ భూమిపై ఇన్ని వనరులు ఉండటానికి కారణం - "ఈ భూమిని ఒక ప్రయోగశాల లాగా మరి స్వేచ్ఛా సంకల్ప సీమగా సృష్టించాలి" అనే ప్రాథమిక సృష్టికర్త యొక్క సంకల్పం. ఈ ప్రయోగశాలను "అంతర్ విశ్వాల సమాచార విశ్లేషణ, వినిమయ, ప్రసార కేంద్రం" గా మలచడం జరిగింది.

ఈ ప్రాజెక్టు కోసం.. ఎన్నో ఇతర విశ్వాల ప్రతినిధులు ఈ భూమిపై జన్మలు తీసుకునేలా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

అనంతవిశ్వంలో ఉన్న జన్యుశాస్త్ర నిపుణులు.. ఈ భూమిపై జన్మ తీసుకుంటున్న విశ్వ ప్రతినిధుల జన్యువులను తయారుచేసి అందులో విశ్వ సమాచారం, వంశ సమాచారాలను.. ప్రకంపనల రూపంలో, విద్యుత్ తరంగాల రూపంలో క్రోడీకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసి ..భూమిపై జీవించే ప్రాణులుగా సృష్టించడం జరిగింది. ఇతర విశ్వాలలో ఉన్న ఎంతో జన్యు పరిజ్ఞానాన్ని పొందుపరుస్తూ మానవులనూ మరి జంతువులనూ వైవిధ్యంగా తయారు చేశారు.

వీటి యొక్క జీవ పరిణామక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ (ఆకాషిక్ రికార్డ్స్ రూపంలో) వాటిని అధ్యయనం చేస్తూ ఈ భూమిని ఒక కాంతి కేంద్రంగా... ఒక సమాచార కేంద్రంగా... ఒక "సజీవ గ్రంథాలయం" గా తీర్చిదిద్దారు!

(సశేషం)
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment