నారద భక్తి సూత్రాలు - ⑥⑥

🌹. నారద భక్తి సూత్రాలు - ⑥⑥ 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము - సూత్రము - 38

🌻 38. ముఖ్య తస్తు మహత్కృపయైవ భగవత్కృపా లేశాత్‌ వా ॥ - 1 🌻

ఈ పరాభక్తికి మహాత్ముల, లేక భగవంతుని అనుగ్రహం కొంచెమైనా ఉండాలి.

ముఖ్యభక్తి సాధనకు ఫలంగా వచ్చి అవకాశముంది. ఎక్కడికక్కడ దైవాను గ్రహం కూడా ఉంటుంది. అయినా పరాభక్తిలో నిలవాలంటే మాత్రం భగవంతుని అనుగ్రహం తప్పనిసరి.

మహాత్ములు కూడా దైవ స్వరూపులె గనుక, మహాత్ముల అనుగ్రహం కూడా దైవానుగ్రహంతో సమానం. పరాభక్తిలో నిలవాలంటే మానవునికి స్వయం శక్తి చాలదు. ఎంత తీవ్ర సాధన జరిగినా, అదంతా అహంకారాదుల అద్దు తొలగించుకొనె వరక. పరాభక్తి సాధ్య వస్తువు కాదు. అది సిద్ద వస్తువు, దానికదే ఫలరూపం.

జ్ఞాన మార్దంలో కూడా ఇదే విధంగా పరాభక్తికి బదులు అపరోక్ష జ్ఞానమంటారు. దీనికి గురు కృప తప్పదంటారు. భక్తి మార్గంలో గురువు అనే పదానికి బదులుగా భాగవతోత్తముదని గాని, ఆచార్యుడని గాని అంటారు. ఇట్టివారు దొరికితే, వారికి సేవ చేసి వారి అనుగ్రహం పొందాలి.

శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఇలా చెప్పాడు. “మానవులకు భగవదున్ముఖత్వం స్వయంగా కలగాలి. అంతదాకా వేచి ఉండి అట్టి వారిని అనుగ్రహిస్తాను. కనుక సాధన వలన భగవదున్ముఖత్వం కలిగితే అట్టి వారిని, వారి సాధన చరమ దశలో భగవంతుడు అనుగ్రహిస్తాడు. తనలో ఐక్య పరచుకుంటాడు.

ఎలాగైతే ఇనుము తుప్పు పోగానే అయస్కాంతం ఆ ఇనుమును ఆకర్షిస్తుందో అంతవరకు తుప్పు వలన అయస్కాంతపు ఆకర్షణ శక్తికి ప్రభావం చెందలెదో, అదె విధంగా భక్తుని చిత్త మాలిన్యం తొలగే దాకా వేచిఉండి మాలిన్యం పోగానే భగవంతుడు భక్తుడిని తనలోకి ఆకర్షించుకొని ఐక్యత సిద్ధింపచేస్తాడు.

భగవదనుగ్రహం సర్వసామాన్యంగా సంసిద్ధమైన భక్తులందరికి అందుబాటులోనె ఉంటుంది. చిత్త మాలిన్యమే అనుగ్రహానికి ఆటంకం. భక్తుల లౌకికమైన అశుభ వాసనలు క్షయమైన వెంటనే, వారు భగవదున్మ్నుఖు అవుతారు. అంతవరకు సాధనలు జరుగుతూనే ఉందాలి.

భక్తులు వారి విషయాలతో కూడిన మనసును వారి మనసుతోనే సాధన చేసి పోగొట్టుకోవాలి. అలాగే జీవుడుగా ఉన్న నేనులో అహంకారాదులను పోగొట్టుకొనే సాధన ఆ నెనే చేయాలి. మనసు పోవడమంటే అది నిర్విియ మవడం. నెను జీవభావం నుండి విడుదలై వేరై ఉంటుంది.

ఇంకా నిర్విషయ మనసు, జీవభావం పోయిన నెను మిగిలే ఉన్నాయి. వీటిని పూర్తిగా తొలగించ డానికి భగవదనుగ్రహం కావలసి ఉన్నది. ఈ చరమ దశలో భక్తుడికి సాధనా శక్తి చాలదు. అందువలన చరమ దశలో భగవదనుగ్రహం కొంచెమైనా కావలసి ఉంటుందని ఈ సూత్రం చెప్పన్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment