గీతోపనిషత్తు -148


🌹. గీతోపనిషత్తు -148 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 1

🍀 1) కర్తవ్య కర్మ - ఎవడు చేయవలసిన కర్మములను, ఫలములం దాపేక్ష లేక చేయుచుండునో అట్టివాడే సన్యాసియు, యోగియు కాగలడు. అంతియే గాని అగ్ని సూత్రాది విహిత కర్మలను వదలినవాడు,

కర్తవ్య కర్మలను విడిచినవాడు ఎన్నటికిని సన్యాసియు, యోగియు కానేరడు. కర్తవ్య కర్మను ఫలాపేక్ష లేక నిర్వర్తించుట యోగమార్గమున కత్యంత ప్రధానము. వీనిని అశ్రద్ధ చేయువారు ఎవ్వరును ధ్యానయోగమున ప్రవేశింపజాలరు. కర్తవ్య కర్మల నాచరించుట ఋణమును తీర్చుట వంటిది. 🍀

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సన్న్యాసీ చ యోగీచ న నిరగ్ని ర్న చాక్రియః || 1

ఎవడు చేయవలసిన కర్మములను, ఫలములం దాపేక్ష లేక చేయుచుండునో అట్టివాడే సన్యాసియు, యోగియు కాగలడు. అంతియే గాని అగ్ని సూత్రాది విహిత కర్మలను వదలినవాడు,

కర్తవ్య కర్మలను విడిచినవాడు ఎన్నటికిని సన్యాసియు, యోగియు కానేరడు.

కర్తవ్య కర్మను ఫలాపేక్ష లేక నిర్వర్తించుట యోగమార్గమున కత్యంత ప్రధానము. “కార్యం కర్మ” అనునది తాను తప్పక నిర్వర్తించవలసిన కర్మ. అది నిర్వర్తించనివాడు వ్యర్ధుడే. ఐదవ సంవత్సరమున అక్షరాభ్యాసము మొదలుగ మానవునకు క్రమముగ కర్తవ్య కర్మ లేర్పడును.

మొదట దేహమునకు శిక్షణ నిచ్చుట, అటుపైన యింద్రియములకు శిక్షణ నిచ్చుట, ఆ తరువాత విద్యా భ్యాసము ద్వారా మనస్సునకు శిక్షణ నిచ్చుట, తమ తల్లిదండ్రులను, అధ్యాపకులను గౌరవించుట, పిదప జీవితమున కాలానుసారముగ ఏర్పడు బాధ్యతలను నిర్వర్తించుట, సంఘమున మైత్రీ భావమున మెలగుట యిత్యాది వన్నియు కర్తవ్య కర్మలే.

వీనిని అశ్రద్ధ చేయువారు ఎవ్వరును ధ్యానయోగమున ప్రవేశింపజాలరు. కర్తవ్య కర్మల నాచరించుట ఋణమును తీర్చుట వంటిది.

దేహ ఋణము, సంఘ ఋణము, కుటుంబ ఋణము, పితృ ఋణము, గురు ఋణము యిత్యాది ఋణము లన్నియు కర్తవ్యముల రూపమున సాధకుని దరి చేరును. వీనిని నిర్వర్తింప కుండుట, దాటవేయుట వలన కర్మము సాధన కడ్డుపడును.

నిర్వర్తించుట ఋణము తీర్చుట వంటిది గనుక ఫలముల నాశించుట అవివేకము. అప్పు తీర్చి, ఫలమాశించుట వలన అపహాస్యమునకే గురియగుదురు. ఈ విషయమున సాధకునకు

మొట్టమొదటగ గురి కుదరవలెను.

ఈ గురి కుదరక, ఈ సూత్రములను నిర్వర్తింపక ఎన్ని రకముల సాధనలు చేసినను నిరుపయోగమే. అందులకే సూత్రముతో ఆత్మ సంయమ యోగమ

ప్రారంభింపబడినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2021

No comments:

Post a Comment