భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 170
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 170 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 8 🌻
654. సద్గురువును గుర్తించగల వారెవరు?
నిష్కపటి, సహనశీలుడు అయినా సత్యాన్వేషకునుకు సద్గురువు తటస్థించినప్పుడు, నిర్దిష్టమైన కొన్ని బాహ్య చిహ్నములను బట్టి గుర్తించగల్గును. అవి :-
a. సద్గురువుయొక్క అంతరానుభవము స్వయముగా యాదృచ్చికముగా అతి సహజముగా ప్రేమరూపములో వ్యక్తమగుచుండును. అతడు కొందరిని చేరదీయడు, మరికొందరిని తోసిపుచ్చడు. అతనికి అందరు అన్నియు (ద్వంద్వములు) సమానమే; అవి అన్నియు అతని ఆవిష్కరములే.
మూర్తీభవించిన పూర్ణత్వము, ఏ సహజప్రాణినైనను ప్రేమించినను, లాలించినను లేక ఆహారమిడనను తననుతానే లాలించుచున్నట్లునులేక తనకు తానే ఆహార మిడుచున్నట్లును అనుభూతి నొందుచు ఆనందించుచుండును.
b. బ్రహ్మానంద భరితుడై, ప్రశాంతమూర్తి అయి కాన్పించును. అన్ని రకముల బాధల్లాను ఆ మహాప్రశాంతతలోనే అనుభవించుచుండును.
c. అన్ని తరహాల మానవులలోను తాను ఒకనిగా కలిసిమెలిసి వ్యవహరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment