11) 🌹. శివ మహా పురాణము - 346🌹
12) 🌹 Light On The Path - 99🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 231🌹
14) 🌹 Seeds Of Consciousness - 295🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 170🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 25 / Bhagavad-Gita - 25 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 26 / Lalitha Sahasra Namavali - 26🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 26 / Sri Vishnu Sahasranama - 26 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -148 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 1
*🍀 1) కర్తవ్య కర్మ - ఎవడు చేయవలసిన కర్మములను, ఫలములం దాపేక్ష లేక చేయుచుండునో అట్టివాడే సన్యాసియు, యోగియు కాగలడు. అంతియే గాని అగ్ని సూత్రాది విహిత కర్మలను వదలినవాడు,
కర్తవ్య కర్మలను విడిచినవాడు ఎన్నటికిని సన్యాసియు, యోగియు కానేరడు. కర్తవ్య కర్మను ఫలాపేక్ష లేక నిర్వర్తించుట యోగమార్గమున కత్యంత ప్రధానము. వీనిని అశ్రద్ధ చేయువారు ఎవ్వరును ధ్యానయోగమున ప్రవేశింపజాలరు. కర్తవ్య కర్మల నాచరించుట ఋణమును తీర్చుట వంటిది. 🍀*
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సన్న్యాసీ చ యోగీచ న నిరగ్ని ర్న చాక్రియః || 1
ఎవడు చేయవలసిన కర్మములను, ఫలములం దాపేక్ష లేక చేయుచుండునో అట్టివాడే సన్యాసియు, యోగియు కాగలడు. అంతియే గాని అగ్ని సూత్రాది విహిత కర్మలను వదలినవాడు,
కర్తవ్య కర్మలను విడిచినవాడు ఎన్నటికిని సన్యాసియు, యోగియు కానేరడు.
కర్తవ్య కర్మను ఫలాపేక్ష లేక నిర్వర్తించుట యోగమార్గమున కత్యంత ప్రధానము. “కార్యం కర్మ” అనునది తాను తప్పక నిర్వర్తించవలసిన కర్మ. అది నిర్వర్తించనివాడు వ్యర్ధుడే. ఐదవ సంవత్సరమున అక్షరాభ్యాసము మొదలుగ మానవునకు క్రమముగ కర్తవ్య కర్మ లేర్పడును.
మొదట దేహమునకు శిక్షణ నిచ్చుట, అటుపైన యింద్రియములకు శిక్షణ నిచ్చుట, ఆ తరువాత విద్యా భ్యాసము ద్వారా మనస్సునకు శిక్షణ నిచ్చుట, తమ తల్లిదండ్రులను, అధ్యాపకులను గౌరవించుట, పిదప జీవితమున కాలానుసారముగ ఏర్పడు బాధ్యతలను నిర్వర్తించుట, సంఘమున మైత్రీ భావమున మెలగుట యిత్యాది వన్నియు కర్తవ్య కర్మలే.
వీనిని అశ్రద్ధ చేయువారు ఎవ్వరును ధ్యానయోగమున ప్రవేశింపజాలరు. కర్తవ్య కర్మల నాచరించుట ఋణమును తీర్చుట వంటిది.
దేహ ఋణము, సంఘ ఋణము, కుటుంబ ఋణము, పితృ ఋణము, గురు ఋణము యిత్యాది ఋణము లన్నియు కర్తవ్యముల రూపమున సాధకుని దరి చేరును. వీనిని నిర్వర్తింప కుండుట, దాటవేయుట వలన కర్మము సాధన కడ్డుపడును.
నిర్వర్తించుట ఋణము తీర్చుట వంటిది గనుక ఫలముల నాశించుట అవివేకము. అప్పు తీర్చి, ఫలమాశించుట వలన అపహాస్యమునకే గురియగుదురు. ఈ విషయమున సాధకునకు
మొట్టమొదటగ గురి కుదరవలెను.
ఈ గురి కుదరక, ఈ సూత్రములను నిర్వర్తింపక ఎన్ని రకముల సాధనలు చేసినను నిరుపయోగమే. అందులకే సూత్రముతో ఆత్మ సంయమ యోగమ
ప్రారంభింపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 347 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
88. అధ్యాయము - 43
*🌻. దక్షయజ్ఞ పరిసమాప్తి -2 🌻*
బ్రహ్మయందు భక్తి లేనిదే, విష్ణువునందు భక్తి లేనే లేదు. విష్ణుభక్తి లేకుండా నా యందు భక్తి ఎక్కడైననూ పుట్టదు (19). ఇట్లు అందరు వినుచుండగా పలికి దయానిధి, పరమేశ్వరుడు అగు శంకర స్వామి మరల ఇట్లనెను (20). నన్ను నిందించు విష్ణు భక్తుడు, విష్ణువును నిందించు శివభక్తుడు కూడా సాపమును పొందెదరు. వారికి జ్ఞానము కలుగదు (21).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! మహేశ్వరుని ఈ సుఖకరములగు వచనములను విని అక్కడనున్న దేవతలు, మునులు మొదలగు వారందరు సంతసించిరి (22). కుటుంబ సమేతుడైన దక్షుడు మహా ప్రీతితో శివభక్తశ్రేష్ఠుడై సర్వదా శివుని సేవించెను. దేవతలు మొదలగు వారందరు అఖిలేశ్వరుడు శివుడేనని తలపోసిరి (23). అచట ఎవరెవరు ఏ విధముగా పరమాత్మయగు శంభుని స్తుతించిరో, వారివారికి సంతోషించిన మనస్సుగల శంభుడు ఆయా వరముల నిచ్చెను (24). ఓ మహర్షీ! శివభక్తుడు, ప్రసన్నమగు బుద్ధిగలవాడు అగు దక్షుడు శివునిచే ఆజ్ఞాపింపబడినవాడై శివానుగ్రహముతో యజ్ఞమును పూర్తి చేసెను (25).
అతడు దేవతలకు వారివారి యజ్ఞ భాగములను, శివునకు పూర్ణభాగమును ఇచ్చెను. బ్రాహ్మణులకు దానములను చేసెను. అతడీ తీరున శంభుని అనుగ్రహమును పొందెను (26). ఇట్లు దక్షప్రజాపతి శివదేవుని అనుగ్రహముచే ఆ మహాయజ్ఞమును ఋత్విక్కుల సహకరాముతో యథావిధిగా పూర్తిచేసెను (27). ఓ మహర్షీ! పరబ్రహ్మ స్వరూపుడగు శంకరుని అనుగ్రహముచే అచట దక్షుని యజ్ఞము ఈ విధముగా సంపూర్ణ మాయెను (28). అపుడు దేవతలు, ఋషులు అందరు శంకరుని కీర్తిని గానము చేయుచూ, తమ తమ ధామములకు చేరుకొనిరి. అపుడు ఇతరులు అందరూ కూడ శుఖశాంతులను పొందిరి (29).
నేను మరియు విష్ణువు మంగళములనన్నిటినీ ఇచ్చే శంభుని కీర్తిని నిరంతరముగా గానము చేయుచూ ఆనందముతో మా ధామములకు చేరుకుంటిమి (30). సత్పురుషులకు శరణ్యుడగు మహాదేవుడు కూడా దక్షునిచే సన్మానింపబడినవాడై, ఆనందించి, ప్రీతితో తన గణములను వెంటబెట్టుకొని తన ధామము అగు కైలాస పర్వతమునకు వెళ్లెను (31). శంభుడు తన పర్వతమునకు చేరుకొని తన ప్రియురాలగు సతీదేవిని స్మరించెను. ఆయన ప్రధానులగు గణాధ్యక్షులతో ఆమె వృత్తాంతమును విస్తారముగా వర్ణించుచూ చాల కాలమును గడిపెను (32). ఆ ప్రభుడు జ్ఞానియే అయిననూ, లోకపు పోకడననుసరించి విరహవ్యథను ప్రకటిస్తూ, ఆమె గాథలను వర్ణిస్తూ చిరకాలము గడిపెను (33).
ఓ మహర్షీ! పరబ్రహ్మ సత్పురుషులకు శరణ్యుడు అగు శివస్వామి నీతి లేని దనమును సహించడు. ఆయనకు మోహము గాని, శోకముగాని, వికారముగాని కలిగే ప్రసక్తియే లేదు (34). ఆయన .యొక్క సగుణ నిర్గుణ రూపములకు గల భేదమును నేను గాని, విష్ణువుగాని ఏనాడైననూ తెలియ లేకపోతిమి. మునులు, దేవతలు, యోగులు, మానవులు మొదలగు వారి గురించి చెప్పునదేమున్నది? (35)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 99 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 15th RULE
*🌻 17. Seek out the way - 1 🌻*
379. C.W.L. – The three short aphorisms to which we have now come are closely intertwined, and both in the comment by the Chohan and the notes by the Master Hilarion they are practically taken together.
For this reason it is hardly possible to arrange them in separate groups as has been done hitherto, and so I shall take them in the order in which they appear in the book. It is evident that we have come to a very important part of the teaching, because there is a longer comment from each of these Great Ones than on any of the previous sentences.
380. The Master Hilarion’s note to the seventeenth rule begins as follows:
381. These four words seem, perhaps, too slight to stand alone. The disciple may say: “Should I study these thoughts at all did I not seek out the way?” Yet do not pass on hastily.
Pause and consider awhile. Is it the way you desire, or is it that there is a dim perspective in your visions of great heights to be scaled by yourself, of a great future for you to compass? Be warned. The way is to be sought for its own sake, not with regard to your feet that shall tread it.
382. The spirit in which we should approach the Path is beautifully expressed in these words. All the way through the personality must be put aside, and one must work from the point of view of the Higher Self. To do that is to seek the way. We have already seen that even when the man has left ordinary ambition behind, he finds it again and again in subtler forms.
His ambition now is to reach a higher level; he has made up his mind to desire no longer anything for the personal self, to put whatever power he has entirely at the service of the Great White Lodge. He thinks only of being a good instrument, of bringing himself into such a position in relation to the Master that His forces may play through him with as little hindrance as possible.
383. All forces coming down from higher planes naturally meet with great constriction when they come to work on a lower plane. The force which comes through any disciple can never be more than a very small part of the influence which some Great One may send through him.
That must be so by the very nature of the case, but one who makes himself, with all the imperfections that naturally cling to us on the physical plane, as perfect an instrument as possible for the Master’s force, can do very useful work. The object of the disciple is to let as much as possible of that force flow through him, and to discolour it as little as he can.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 231 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. దేవలమహర్షి - 2 🌻*
7. తపస్సు, జ్ఞానము, యోగము కలిగినవాళ్ళు మోక్షార్హులవుతారు. కాని తపస్సు ఒక్కటే ఉన్నవాడుకాని, జ్ఞానం ఒక్కటే ఉన్నవాడుకాని, యోగం ఒక్కటే ఉన్నవాడుకాని మోక్షార్హుడు కాడు.
8. స్తోత్రంచేసినా, నిందించినా అందులో ఎలాంటి అప్రియత్వమూ మనసులో లేకపోవత్ము, కొట్టినా శరీరానికి నొప్పితో అమ్మో అనకపోవటము (అంటే తనను గురించిన విచారణలేనివాడు, విచారించనివాడు) ఇవన్నీ ధన్య గుణములు, సుగుణములు. అవే మోక్షానికి కావలసినవి. మోక్షదర్సనం ఎవరైతే కోరతారో అతడికి విధిగా ఉండతీరవలసిన లక్షణములివి.
9. శీలసంపద అతి ముఖ్యమైనటువంటిది. అతి పదిలంగా దాచుకోవలసినది శీలము. తన శీలాన్ని పోగొట్టుకోవడం అనేది జరగకూడదు. శీలము అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములలో ఎవరికీ ఎలాంటిహానీ తలపెట్టక, దేనియందుకూడా ఆశపెట్టుకోక, బయటిప్రపంచంతో సంబంధం లేనటువంటి శాంతిని తాను పొందటము.
10. ఇంద్రియ నిగ్రహంవలన ఎలాంటి చాపల్యమూ మనసులో, స్వప్నంలోకూడా కలగకుండా ఉండవలసిన శీలం అనేటటువంటి పరమ పవిత్రమైన వస్తువు ఒకటి వృద్ధిపొందుతుంది. దానికి భంగం కలిగితే తపస్సుకు భంగం కలిగినట్లే. దానికి భంగంకలిగితే తపస్సు నాశనమవుతుంది, పుణ్యం నశిస్తుంది, పతనము కలుగుతుంది.
11. ఎంతవాడికైనా, తాను రక్షించుకోవలసిన వస్తువు శీలమొక్కటే. ఎందుకంటే ఏ లక్షణంచేత మునులు తపస్సు ఫలించి ఉత్తమఫలాన్నిపొందారో గుర్తుపెట్టుకోవాలి. తపస్సు ఫలిస్తుంది. తపస్సుచేస్తే ఫలం ఎట్లా వచ్చింది? శీలరక్షణకొరకై వచ్చింది.
12. శీలరక్షణకొరకై, ఏ పరవస్తువునూ తాను కన్నెత్తి చూడకూడదు. దేనినీ ఆశించకూడదు. ఎన్నడూ ఎవరినీ దూషించకూడదు. పరమ సాత్వికమైన వృత్తిలో ఉండాలి. అహంకారంతో ఇంకొకడు అల్పుడిగా కనబడితే, అతడు యథార్థంగా అల్పుడే అయినప్పటికీ కూడా, అతనిని మనసావాచాకర్మణా అవమానించకపోవటమే ఉత్తమ లక్షణము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 295 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 144. Hang on to the 'I am', which is your only capital, meditate on it, and let that unfold all the knowledge that has to come. 🌻*
You have wandered a lot and here for the first time something so simple has been stated. The Guru has gone on trying to make you understand the 'I am' in every way he can.
He calls this knowledge 'I am' the only capital you have and remember, when he says so he is right, you really do not have anything else after all the wandering you have done.
Do what he says and now meditate on this knowledge 'I am'; the Guru says from his own experience that this knowledge itself will unfold whatever you want to know.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 170 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 8 🌻*
654. సద్గురువును గుర్తించగల వారెవరు?
నిష్కపటి, సహనశీలుడు అయినా సత్యాన్వేషకునుకు సద్గురువు తటస్థించినప్పుడు, నిర్దిష్టమైన కొన్ని బాహ్య చిహ్నములను బట్టి గుర్తించగల్గును. అవి :-
a. సద్గురువుయొక్క అంతరానుభవము స్వయముగా యాదృచ్చికముగా అతి సహజముగా ప్రేమరూపములో వ్యక్తమగుచుండును. అతడు కొందరిని చేరదీయడు, మరికొందరిని తోసిపుచ్చడు. అతనికి అందరు అన్నియు (ద్వంద్వములు) సమానమే; అవి అన్నియు అతని ఆవిష్కరములే.
మూర్తీభవించిన పూర్ణత్వము, ఏ సహజప్రాణినైనను ప్రేమించినను, లాలించినను లేక ఆహారమిడనను తననుతానే లాలించుచున్నట్లునులేక తనకు తానే ఆహార మిడుచున్నట్లును అనుభూతి నొందుచు ఆనందించుచుండును.
b. బ్రహ్మానంద భరితుడై, ప్రశాంతమూర్తి అయి కాన్పించును. అన్ని రకముల బాధల్లాను ఆ మహాప్రశాంతతలోనే అనుభవించుచుండును.
c. అన్ని తరహాల మానవులలోను తాను ఒకనిగా కలిసిమెలిసి వ్యవహరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 25 / Bhagavad-Gita - 25 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 25 🌴
25. భీష్మద్రోణప్రముఖత: సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||
🌷. తాత్పర్యం :
భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భుపలకుల సమక్షమున శ్రీకృష్ణుడు “ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము” అని పలికెను.
🌷. భాష్యము :
సకలజీవుల యందున్న పరమాత్మగా శ్రీకృష్ణుడు అర్జునిని మనస్సులోని ఆలోచనలను అవగతము చేసికొనగలిగెను. ఈ సందర్బమున ఉపయోగింపబడిన హృషీకేశుడు అనెడి పదము ఆ దేవదేవుడు సమస్తము నెరుగునని సూచించుచున్నది. పార్థా (కుంతీ తనయుడు లేదా పృథా తనయుడు) అనెడి పదము సైతము అర్జునిని విషయమున ప్రాధాన్యము కలిగియున్నది. పృథా (తన తండ్రియగు వసుదేవుని సోదరి) తనయుడు కనుకనే తాను సారథి యగుటకు అంగీకరించితినని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు మిత్రునిగా తెలియజేయగోరెను. ఇక “కురువంశీయులను గాంచుము” అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశ్యమేమి? యుద్ధము అచ్చటనే నిలిపివేయవలెనని అర్జునుడు కోరేనాయేమి? తన మేనత్తకుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడును ఊహించియుండలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోరణిలో దర్శించెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 25 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 25 🌴
25. bhīṣma-droṇa-pramukhataḥ
sarveṣāṁ ca mahī-kṣitām
uvāca pārtha paśyaitān
samavetān kurūn iti
🌷 Translation :
In the presence of Bhīṣma, Droṇa and all the other chieftains of the world, the Lord said, “Just behold, Pārtha, all the Kurus assembled here.”
🌷 Purport :
As the Supersoul of all living entities, Lord Kṛṣṇa could understand what was going on in the mind of Arjuna. The use of the word Hṛṣīkeśa in this connection indicates that He knew everything. And the word Pārtha, meaning “the son of Pṛthā, or Kuntī,” is also similarly significant in reference to Arjuna. As a friend, He wanted to inform Arjuna that because Arjuna was the son of Pṛthā, the sister of His own father Vasudeva, He had agreed to be the charioteer of Arjuna. Now what did Kṛṣṇa mean when He told Arjuna to “behold the Kurus”? Did Arjuna want to stop there and not fight? Kṛṣṇa never expected such things from the son of His aunt Pṛthā. The mind of Arjuna was thus predicted by the Lord in friendly joking.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 26 / Sri Lalita Sahasranamavali - Meaning - 26 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 26. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |*
*గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ‖ 26 ‖ 🍀*
🍀 68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా -
చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
🍀 69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా -
గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 26 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 26. cakrarāja-rathārūḍha-sarvāyudha-pariṣkṛtā |*
*geyacakra-rathārūḍha-mantriṇī-parisevitā || 26 || 🌻*
🌻 68 ) Chakra raja ratha rooda sarvayudha parishkridha -
She who is fully armed and rides in the Srichakra chariot with nine stories
🌻 69 ) Geya chakra ratha rooda manthrini pari sevitha -
She who rides in the chariot with seven stories and is served by manthrini who is the goddess of music
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 26 / Sri Vishnu Sahasra Namavali - 26 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మిధునరాశి- పునర్వసు నక్షత్ర 2వ పాద శ్లోకం*
*🍀 26. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |*
*సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ‖ 26 ‖ 🍀*
🍀 236) సుప్రసాద: -
చక్కని అనుగ్రహము కలవాడు.
🍀 237) ప్రసన్నాత్మా -
రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంత:కరణ కలవాడు.
🍀 238) విశ్వదృక్ -
విశ్వమునంతటిని ధరించినవాడు.
🍀 239) విశ్వభుక్ -
విశ్వమును భక్షించువాడు.
🍀 240) విభు: -
బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు.
🍀 241) సత్కర్తా -
సజ్జనులను సత్కరించువాడు.
🍀 242) సత్కృత: -
పూజ్యులచే పూజింపబడువాడు.
🍀 243) సాధు: -
ధర్మప్రవర్తన గలవాడు.
🍀 244) జుహ్ను: -
భక్తులను పరమపదమునకు నడిపించువాడు.
🍀 245) నారాయణ: -
నరులకు ఆశ్రయమైనవాడు.
🍀 246) నర: -
జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 26 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Midhuna Rasi, Punarvasu 2nd Padam*
*🌻 26. suprasādaḥ prasannātmā viśvadhṛgviśvabhugvibhuḥ |*
*satkartā satkṛtaḥ sādhurjahnurnārāyaṇō naraḥ || 26 ||🌻*
🌻 236. Suprasādaḥ:
One whose Prasada or mercy is uniquely wonderful, because He gives salvation to Sisupala and others who try to harm Him.
🌻 237. Prasannātmā:
One whose mind is never contaminated by Rajas or Tamas.
🌻 238. Viśvadhṛg:
One who holds the universe by his power.
🌻 239. Viśvabhug:
One who eats up or enjoys or protects the worlds.
🌻 240. Vibhuḥ:
One who takes various forms
🌻 241. Satkartā:
One who offers benefits.
🌻 242. Satkṛtaḥ:
One who is adored even by those who deserve adoration.
🌻 243. Sādhuḥ:
One who acts according to justice.
🌻 244. Jahnuḥ:
One who dissolves all beings in oneself at the time of dissolution.
🌻 245. Nārāyaṇaḥ:
Nara means Atman. Narayana, that is, one having His residence in all beings.
🌻 246. Naraḥ:
He directs everything, the eternal Paramatma is called Nara.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment