దేవాపి మహర్షి బోధనలు - 30


🌹. దేవాపి మహర్షి బోధనలు - 30 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 21. డమరుకము - శ్రీ చక్రము 🌻


సూర్య, చంద్ర, బుధాత్మకమైన త్రిభుజమును సత్యలోక మనియు; శని, కుజ, చంద్రాత్మకమైన త్రిభుజమును అసత్యలోక మనియు జ్యోతిషము తెలుపుచున్నది. పై త్రిభుజమును వెలుగు లోకమనియు లేక రజో లోక మనియు, క్రింది త్రిభుజమును తమోలోకమనియు, రెండింటిని సంధానపటుచు చంద్రాత్మక ప్రజ్ఞ విరజ అనియు తెలియవలెను.

కుజుని సంకల్ప శక్తి ఆధారముగ గొని యమనియమములతో జీవితమును గఱపువారు ప్రతిబింబ లోకమునుండి వెలుగు లోకముల లోనికి ప్రవేశింపగలరు. వెలుగు లోకమున ప్రజ్ఞకు స్థిరత్వము కలదు. ప్రతిబింబ లోకమున అస్థిరత్వము, అశాశ్వతము, నశించుట, మరణము ఇత్యాదులు కలవు. ఈ రెండి త్రిభుజముల ధ్యానమే ఋషులు శ్రీ చక్రముగ, యంత్రముగ సంకేతించినారు.

శివుని డమరుకము ప్రజ్ఞ. పదార్థలోకముల సంకేతము. సృష్టి చక్రమందు ప్రజ్ఞ పదార్థమును దమించు కాలము, పదార్థము ప్రజ్ఞను దమించుకాలము ఒకదాని వెంట మరియొకటి చక్రారముగ జరుగుచుండును.

పగలు, రాత్రి వాని సంకేతములు. జీవులు అవిరామముగ అందు పల్లటీలు కొట్టుచు జీవించు చుందురు. అట్టి చక్రమునందు స్థిత ప్రజ్ఞత్వము నొందుటకు శ్రీచక్రధ్యానము ఋషులు అనుగ్రహించిరి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2021

No comments:

Post a Comment