శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 207 / Sri Lalitha Chaitanya Vijnanam - 207


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 207 / Sri Lalitha Chaitanya Vijnanam - 207 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖


🌻 207. 'మనోన్మనీ' 🌻

మనస్సునకు అచంచలమగు స్థితిని ప్రసాదించునది శ్రీదేవి అని అర్థము.

మనస్సు సహజముగ చంచల; అనేకానేక భావములకు ఆటపట్టు. మనస్సును పట్టుట సులభము కాదు. పట్టిననూ పాద రసమువలె జారిపోవునది మనస్సు. ఇట్టి మనస్సు బాగుగ ఆకర్షింప బడినచో ఆకర్షిత విషయమందు లగ్నమై యుండును. మనస్సును ఆకర్షించు విషయములలో అందము ప్రధానమైనది.

అందమైన వస్తువునుగాని, ప్రదేశమునుగాని, వ్యక్తినిగాని, జంతువును గాని చూచినపుడు మనస్సు ఆకర్షిత మగును. తెల్లని పావురము, తెల్లని గుఱ్ఱములు, తెల్లని కుక్క, తెల్లని మబ్బు, ఇత్యాదివి చూచినపుడు మనసు అప్రయత్నముగ ఆకర్షింపబడును. అట్లే అందమైన వ్యక్తులను చూచినపుడు కూడ ఆకర్షింపబడును. సృష్టి యందలి ఈ ఆకర్షణ మనస్సును ఉన్మీలనము చేయును.

ఇట్లు ఉన్మీలనము చేయగల శక్తి ఉన్మని. శ్రీదేవి అందమే సృష్టి యందు భాసించు చున్నది. అందు వలననే జీవులు అందమునకు ఆకర్షింపబడుదురు. ఆమె అందమునకు మూలము. ఆనందమునకు కూడ మూలము. శ్రీదేవి అందము మొదటి 52 నామములలో తెలుపబడినది. శ్రీదేవి కన్న అందమైనది సృష్టిలో ఏమియునూ లేదు. ఆమె రూపమునందు మనస్సు లగ్న

మైనచో మనస్సు హరింపబడి ఆనందముతో నిండును. తన్మయ స్థితి కలుగును. అనగా తాను లేని స్థితి కలుగును. అపుడచట నుండునది ఆనందమే.

మనస్సు హరింపబడుటకు అత్యంత అందమగు రూపము నారాధించుట మన సంప్రదాయమున నున్నది. అందమైన రూపమునకు అలంకారములు గావించి ఆరాధించుట మన విధానము. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీ లలిత ఇత్యాది రూపములు అమిత ఆకర్షణీయములు. వీని ఆరాధనమున ఆరాధించువారు, ఆరాధనము, ఆరాధింపబడు అందమున లయ మగుదురు.

అపుడు భక్తి పారవశ్యము కలుగుట, తన్మయత్వము కలుగుట జరుగును. శ్రీ రామకృష్ణ పరమహంస ఆరాధనము తరచుగ ఈ స్థితిని చేరుకొనెడిది. దీనిని 'ఉన్మనీ' స్థితి అందురు.

మన శరీరమున భ్రూమధ్యము నుండి ఎగువగ ఎనిమిదవ స్థానమును ఉన్మనీ స్థాన మందురు. అటుపైన నుండునది బ్రహ్మ రంధ్రమే. ఉన్మనీ స్థానమునందే కారణములకు కారణము కలదు.

ఈ స్థితి చేరినవారే కారణ శరీరమును కూడ విసర్జించి బ్రహ్మత్వమును పొందగలరు.

ఉన్మనీ స్థితియందు, వ్యక్తిగత ఎఱుక యుండదు. కల యుండదు, కాలముండదు, దేవత యుండదు, ఆరాధకు డుండడు, కేవల ముండుటయే యుండును. దీనినే పరిపూర్ణత్వ మందురు. పరిపూర్ణ స్వాతంత్ర్యము అందురు. పరము, శుద్ధము, సత్యము, శివము, సుందరము అని ఇతర నామములు. నిరంజనము, నిస్సంకల్పము అని కూడ అందురు.

ఉన్మనీ ముద్ర యోగమున తెలుపబడినది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఊర్ధ్వగతి చెంది ఉదాన వాయువున స్థిరపడి కన్నులు ఉన్మేషములై స్థిరపడి యుండుట ఉన్మనీ ముద్ర. క్రియా యోగమున బాబాజీ ముఖ చిత్రము ఈ ముద్రనే ప్రకటించును. ఈ స్థితిని చేరిన వారికి తెలియని విషయ ముండదు. వారు సర్వ విదులు. శ్రీదేవి ఆరాధనము ఇట్టి తన్మయ స్థితిని కలిగించ గలదని మనోన్మనీ నామము తెలుపుచున్నది.

ఇదే శివపరముగ, విష్ణుపరముగ మనోన్మనాయ అని తెలుపుదురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 207 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Manonmanī मनोन्मनी (207) 🌻

She is in the form of manonmanī (beyond perception). There are eight smaller cakra-s between ājñā cakra and sahasrāra and the one, just below the sahasrāra is called manonmanī. It is also known as unmani.

As this cakra is closer to the sahasrāra, where She is going to conjugate with Śiva, no activity takes place in manonmanī, which is beyond time and space. This is the last point where She is known as Śaktī. In the next stage at sahasrāra She becomes Śiva-Śaktī. This point is also known as the mouth of Rudra. In Śrī Rudram, one of the forms of Śiva is called Manonmana and His wife is Manonmanī.

There is a mudrā called manonmanī, which is used in advanced stages of meditation. When this mudrā is used, one almost loses his consciousness, ready to merge with the Supreme. At this state the triad of meditation, meditator and the object of meditation are dissolved to form the Supreme oneness and the flow of ambrosia is realised.

Śiva is known as Manonmana. The supra mental śaktī of Paramaśiva in its primal movement towards manifestation, through inseparable from Him is known as unmanā or unmanī. This is beyond time and space and is immeasurable.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2021

No comments:

Post a Comment