🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
దానికి బదులు మీరు మీలో ఉన్న భయాన్ని గమనిస్తూ, దానిని అంగీకరించేందుకు ప్రయత్నించండి.
ఎందుకంటే, భయం సహజం. అది జీవితంలో ఒక భాగం. దానిని దాచవలసిన పనిలేదు. భయం లేనట్లు మీరు నటించవలసిన అవసరమూ లేదు.
ఎందుకంటే, భయం అందరిలోను ఉంటుంది. దానిని అంగీకరించండి. అలా అంగీకరించిన వెంటనే మీలో ఉన్న అహం మాయమవుతుంది. ఎందుకంటే, అప్పుడు అహం అక్కడ ఉండడంలో అర్థముండదు. దానితో పోరాడడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ, భయాన్ని అంగీకరించిన వెంటనే మీకు చాలా ప్రయోజనం లభిస్తుంది.
అవును. ఈ విశాల విశ్వంలో మన స్థానం చాలా చిన్నదని, మృత్యువు లోగిలిలో ఉన్న జీవితంలో భయపడకుండా ఉండడం అసాధ్యమని, ఏ క్షణంలో ఏ చిన్న తప్పు జరిగినా జీవితం ముగిసిపోతుందని, మీకు స్పష్టంగా తెలుస్తుంది.
కాబట్టి, భయాన్ని అంగీకరించండి. అలా చేస్తే మెల్లమెల్లగా మీలో ఉన్న భయం అదృశ్యమవుతుంది. ఎందుకంటే, ఒకసారి మీరు దానిని అంగీకరించిన తరువాత అది అక్కడ ఉండడంలో అర్థం లేదు. దానిని వ్యతిరేకించకండి, దాచేందుకు ప్రయత్నించకండి. అప్పుడు అది నిదానంగా తగ్గిపోతుంది.
మీకు భయం లేదని నేను చెప్పట్లేదు. ‘‘మీరు భయపడకండి’’ అని నేను చెప్తున్నాను. భయం ఎప్పుడూ ఉంటుంది. అయినా మీరు భయపడకూడదు. మీరు భయపడ్డారంటే అర్థం, భయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నట్లే, అది ఉండడం మీకు ఇష్టం లేనట్లే. అయినా అది ఉంటుంది. అప్పుడేం చెయ్యాలి? అందరూ మరణించక తప్పదు. భయం మృత్యువు నీడ. దాని నుంచి ఎవరూ తప్పించు కోలేరు. కాబట్టి, దానిని అంగీకరించండి. అంతకన్నా వేరే మార్గంలేదు.
‘‘ఏం జరిగినా ఏదో విధంగా సర్దుకుపోగలను’’ అని మనసులో భావిస్తూ ప్రేమించాలనే ఉద్దేశంతో ఎవరి దగ్గరకు వెళ్ళినా తలుపులు మూసుకుపోతున్నాయి. అసలైన వ్యక్తులను ప్రేమించడం చాలా కష్టం. ఎందుకంటే, అసలైన వ్యక్తి మీ అంచనాలను ఎప్పుడూ నెరవేర్చడు. అతడున్నది తన జీవితాన్ని జీవించేందుకే తప్ప, ఎవరి అంచనాలను నెరవేర్చేందుకు కాదు.
అందువల్ల అతడేం చేసినా అది మీకు వ్యతిరేకంగానే ఉంటుంది తప్ప, మీతో, మీ భావోద్వేగాలతో కలవదు.
ప్రేమ గురించి ఆలోచించడం చాలా సులభం. కానీ, ప్రేమించడం చాలా కష్టం. దేవుడిని, మానవాళిని, చివరికి ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రేమించడం చాలా సులభం. కానీ, ఒక వ్యక్తిని ప్రేమించడం మాత్రం చాలా కష్టం. అసలైన వ్యక్తి మీకు ఎదురైనప్పుడే అసలు సమస్య తలెత్తుతుంది.
ఎందుకంటే, గొప్ప మార్పు ద్వారా మాత్రమే మీరు అతడిని ఎదుర్కోగలరు. అతడిని ఎదుర్కోవడం గొప్ప సవాలుతో కూడుకున్న పని. అతడు మీకు బానిస కాడు, మీరు అతనికి బానిస కారు. అదే అసలు సమస్య. ఒకవేళ, మీరు అతనికి బానిసగా ఉన్నా లేక అతడు మీకు బానిసగా ఉన్నా ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే, అందరూ స్వేచ్ఛకు ప్రతినిధులే.
ఈ అస్తిత్వమంతా స్వేచ్ఛతో నిండి ఉంది. అందుకే మనిషి స్వేచ్ఛాజీవి. సమస్య వాస్తవమైనదే. దానికి ప్రేమతో, ప్రేమ ప్రపంచంతో పని ఉంది కానీ, మీ వ్యక్తిత్వంతో పనిలేదు.
కాబట్టి, దానిని ఒక వ్యక్తిగత సమస్యగా చెయ్యకండి. అలాచేస్తే మీరు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. అందరూ అదే సమస్యను ఎంతోకొంత ఎదుర్కోక తప్పదు. ప్రేమలో ఎలాంటి ఇబ్బంది లేని వ్యక్తి ఇంతవరకు నాకెదురవలేదు.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
12 Feb 2021
No comments:
Post a Comment