శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 34

🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 5🌻


కుండము మధ్య, బుతుస్నాత యగు లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల నున్న లక్ష్మికి కుండలక్ష్మీ అని పేరు. త్రిగుణాత్మిక యగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకలభూజములకును, సకలమంత్రములకును, విద్యలకును ఉత్పత్తిస్థానము.

వరమాత్మస్వరూప డగు అగ్నిదేవుడు మోక్షమునకు కారణ మైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కు వైపునను, భుజములు ఈశాన - ఆగ్నేయదిక్కులవైపునను, కాళ్ళు వాయవ్యనైరృతిదిక్కులవైపునకును ఉండును. కుండమే ఉదరము. కుండమునందలి యోనిస్థానము యోని. మూడు మేఖలలు సత్త్వరజస్తమోగుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టిముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను పిదప వాయవ్యదిక్కునుండు ఆగ్నేయదిక్కువరకును 'ఆధారములు' అనెడురెండు ఆహుతుల నివ్వవలెను.

ఇదే విధమున ఆగ్నేయమునుండి ఈశాన్యము వరకు ఆజ్యభాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలినుండు ఉత్తర-దక్షిణ-మధ్యభాగములనుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, అచటనే త్యాగము చేయవలెను. పిమ్మట ''భూః స్వాహా'' ఇత్యాదిక్రమమున వ్యాహృతిహోమము చేయవలెను. కమలమధ్యభాగమున సంస్కాసంపన్నుడగు అగ్నిదేవుని ధ్యానింపవలెను. ''

ఈ ఏడు జహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్ర సదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ నున్నవి''. ఈ విధముగ ధ్యానించి అగ్నిదేవునకు నూటఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూలమూలమంత్రముచే అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి యోనిమిది ఆహుతులమ ఇవ్వవలెను. అంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను.

ఆగ్ని మహాపురాణమున అగ్ని కార్యకథన మను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 111 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 34

🌻 Mode of performing oblation - 5 🌻


34. The oblation is made after having meditated on the lustrous (goddess) Lakṣmī at the middle of the pit. (She) is known as Kuṇḍalakṣmī (Lakṣmī of the sacrificial pit), the source of the material world composed of the three qualities.

35. She is the source of all beings as well as mystic learning and collection of mystic syllables. The fire is the cause of liberation. The supreme soul (Viṣṇu) is the conferer of emancipation.

36. (His) head is spoken as at the east, the two arms are situated at the corners north-east and south-east, the two thighs at the north-western and south-western corners.

37-38. The belly is called (the sacrificial) pit. The organ of generation is said to be the source. The three qualities are the girdle. Having meditated thus fifteen twigs should be placed in the fire (after reciting) Oṃ by showing muṣṭi-mudrā[9]. Oblations should be made again to the vessels and worship is offered (to the vessels) on the north-west to south-east.

39. Parts of oblations are offered (for the directions) upto the north-east with the basic mystic syllable. (Oblations are made) in the north with (the syllables) (forming) the end (of the) twelve syllables[10] and with the middle (of the mystic syllable) in the south.

40. The consecrated fire of Viṣṇu, possessing seven tongues and having the radiance of crores of sums and having the moon as its face and sun as the eye and situated in the middle of the lotus should be meditated upon with the vyāhṛtis. [11] Then one should offer one hundred and eight oblations (to this form). Then fiftyeight oblations (should be offered) and a tenth of it for the limbs.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment