శ్రీమద్భగవద్గీత - 428: 11వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 428: Chap. 11, Ver. 14

 

🌹. శ్రీమద్భగవద్గీత - 428 / Bhagavad-Gita - 428 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 14 🌴

14. తత: స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ: |
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ||

🌷. తాత్పర్యం : అంతట సంభ్రమమునకు గురుయైనవాడును, ఆశ్చర్యచకితుడైనవాడును, రోమాంచితుడైనవాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు అంజలిబద్ధుడై దేవదేవుని ప్రార్థింపదొడగెను.


🌷. భాష్యము : దివ్య దర్శనమైనంతట శ్రీకృష్ణార్జునుల నడుమ గల సంబంధము శీఘ్రమే మారిపోయెను. పూర్వము వారు స్నేహముపై ఆధారపడిన సంబంధము కలిగియుండిరి. కాని విశ్వరూపదర్శనమైనంతనే అర్జునుడు అత్యంత గౌరవముతో వందనమొసగుచు, దోసలి యెగ్గి శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు. అనగా ఇప్పుడు అర్జునుని సంబంధము స్నేహరసపూర్ణము కాక అద్భుతరసముగా మార్పునొందెను. పరమభక్తులు శ్రీకృష్ణుని సమస్త సంబంధములకు (రసములకు) నిధిగా నెరిగియుందురు. శాస్త్రములందు పండ్రెండు రకములైన మూల రసములు పేర్కొనబడినవి.

అవియన్నియు శ్రీకృష్ణుని యందే కలవు. ఇరువురు జీవుల నడుమ, దేవతల నడుమ లేదా భగవానుడు మరియు భక్తుల నడుమ పరస్పరము వినిమయము జరుగు సర్వసంబంధములకు అతడే నిధి వంటివాడని చెప్పబడినది. ఇచ్చట అర్జునుడు అద్భుతరస సంబంధముచే ఉత్తేజితుడయ్యెను. స్వభావికముగా సమచిట్టుడును, శాంతుడును అయినప్పటికిని ఆ అద్భుతరసభావమునందు అతడు పరవశుడై, రోమాంచితము కాగా దోసలియొగ్గి పరమపురుషునికి వందనముల నొసగ నారంభించెను. అతడు దేవదేవుని అద్భుతములచే ప్రభావితుడయ్యెనే గాని భయమునకు గురి కాలేదు. అనగా అచట వ్యక్తమైన భావము అద్భుతరసము. దానిచే అతని సహజ సఖ్యసంబంధము ప్రభావితము కాగా అతడు ఆ విధముగా ప్రవర్తించెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 428 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 14 🌴

14. tataḥ sa vismayāviṣṭo hṛṣṭa-romā dhanañ-jayaḥ
praṇamya śirasā devaṁ kṛtāñjalir abhāṣata

🌷 Translation : Then, bewildered and astonished, his hair standing on end, Arjuna bowed his head to offer obeisances and with folded hands began to pray to the Supreme Lord.


🌹 Purport : .Once the divine vision is revealed, the relationship between Kṛṣṇa and Arjuna changes immediately. Before, Kṛṣṇa and Arjuna had a relationship based on friendship, but here, after the revelation, Arjuna is offering obeisances with great respect, and with folded hands he is praying to Kṛṣṇa. He is praising the universal form. Thus Arjuna’s relationship becomes one of wonder rather than friendship. Great devotees see Kṛṣṇa as the reservoir of all relationships. In the scriptures there are twelve basic kinds of relationships mentioned, and all of them are present in Kṛṣṇa. It is said that He is the ocean of all the relationships exchanged between two living entities, between the gods, or between the Supreme Lord and His devotees.

Here Arjuna was inspired by the relationship of wonder, and in that wonder, although he was by nature very sober, calm and quiet, he became ecstatic, his hair stood up, and he began to offer his obeisances unto the Supreme Lord with folded hands. He was not, of course, afraid. He was affected by the wonders of the Supreme Lord. The immediate context is wonder; his natural loving friendship was overwhelmed by wonder, and thus he reacted in this way.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment