12-DECEMBER-2021 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 12, డిసెంబర్ 2021 శనివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 127 / Bhagavad-Gita - 127 3-08🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 524 / Vishnu Sahasranama Contemplation - 524 🌹
4) 🌹 DAILY WISDOM - 202🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 41🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 108🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 12, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ సూర్య స్తుతిః - 3 🍀*

*జ్ఞానైకధామభూతాయ నిర్ధూతతమసే నమః |*
*శుద్ధజ్యోతిస్స్వరూపాయ విశుద్ధాయామలాత్మనే || 5 ||*

*వరిష్ఠాయ వరేణ్యాయ పరస్మై పరమాత్మనే |*
*నమోఽఖిలజగద్వ్యాపి స్వరూపాయాత్మమూర్తయే || 6 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల-నవమి 20:04:32 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 24:01:00
వరకు తదుపరి రేవతి
యోగం: వ్యతీపాత 29:45:20 వరకు
తదుపరి వరియాన
కరణం: బాలవ 07:33:20 వరకు
వర్జ్యం: 08:43:12 - 10:25:04
దుర్ముహూర్తం: 16:14:07 - 16:58:33
రాహు కాలం: 16:19:40 - 17:42:59
గుళిక కాలం: 14:56:21 - 16:19:40
యమ గండం: 12:09:42 - 13:33:01
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31
అమృత కాలం: 18:54:24 - 20:36:16
సూర్యోదయం: 06:36:24
సూర్యాస్తమయం: 17:42:59
వైదిక సూర్యోదయం: 06:40:18
వైదిక సూర్యాస్తమయం: 17:39:06
చంద్రోదయం: 13:20:20
చంద్రాస్తమయం: 00:49:24
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం 
24:01:00 వరకు తదుపరి 
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 127 / Bhagavad-Gita - 127 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 8 🌴*

*నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణ: |*
*శరీరయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణ: ||*

🌷. తాత్పర్యం :
*నీ విధ్యుక్తధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయన అది అకర్మ కన్నను ఉత్తమమైనది. కర్మ నొనరింపకుండా దేహపోషణము సైతము మనుజుడు చేసికొనజాలడు.*

🌷. భాష్యము :
ఉత్తమవంశమునకు చెందినవారమని తప్పుగా ప్రకటించుకొను కపటధ్యానపరులు మరియు ఆధ్యాత్మికోన్నతికై సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యాప్రదర్శనమును కావించు ఘనులు పలువురు కలరు. కాని అర్జునుడు ఆ విధమైన మిథ్యావాది కారాదని శ్రీకృష్ణభగవానుడు తలచెను. పైగా క్షత్రియులకు నిర్దేశింపబడిన కర్మలను అర్జునుడు పాటింపవలెనని భగవానుడు కోరెను. 

అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియోధుడు కావున తన స్థానమందే నిలిచి, గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమకార్యము. అట్టి కర్మలు లౌకికుని హృదయమును శుభ్రపరచి భౌతికకల్మషము నుండి అతనిని ముక్తుని చేయగలదు. జీవనార్థమై ఆచరింపబడు నామమాత్ర సన్యాసము శ్రీకృష్ణభగవానుడు కాని, ఏ ధర్మశాస్త్రము కాని అంగీకరించు అవకాశము లేదు. 

వాస్తవమునకు ఏదియో ఒక కర్మ ద్వారా మనుజుడు దేహమును పోషింపవలసియుండును. భౌతికభావనల నునిడ్ శుద్ధిపరుపకనే కర్మను చపలత్వముతో త్యజింపరాదు. భౌతికజగము నందున్న ప్రతియోక్కరికిని ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెననెడి కల్మషభవములు ( వేరుమాటలలో ఇంద్రియభోగవాంచలు) తప్పకయుండును. అటువంటి కలుషితభవములు తప్పక నశింపవలెను. విధ్యుక్తధర్మముల ద్వారా అట్టి కార్యము సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగి వలె అగుటకు ఎవ్వరును యత్నింపరాదు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 127 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 8 🌴*

*8. niyataṁ kuru karma tvaṁ karma jyāyo hy akarmaṇaḥ*
*śarīra-yātrāpi ca te na prasidhyed akarmaṇaḥ*

🌷Translation :
*Perform your prescribed duty, for doing so is better than not working. One cannot even maintain one’s physical body without work.*

🌷 Purport :
There are many pseudo meditators who misrepresent themselves as belonging to high parentage, and great professional men who falsely pose that they have sacrificed everything for the sake of advancement in spiritual life. Lord Kṛṣṇa did not want Arjuna to become a pretender. Rather, the Lord desired that Arjuna perform his prescribed duties as set forth for kṣatriyas. 

Arjuna was a householder and a military general, and therefore it was better for him to remain as such and perform his religious duties as prescribed for the householder kṣatriya. Such activities gradually cleanse the heart of a mundane man and free him from material contamination. So-called renunciation for the purpose of maintenance is never approved by the Lord, nor by any religious scripture. After all, one has to maintain one’s body and soul together by some work. Work should not be given up capriciously, without purification of materialistic propensities. 

Anyone who is in the material world is certainly possessed of the impure propensity for lording it over material nature, or, in other words, for sense gratification. Such polluted propensities have to be cleared. Without doing so, through prescribed duties, one should never attempt to become a so-called transcendentalist, renouncing work and living at the cost of others.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 524 / Vishnu Sahasranama Contemplation - 524🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 524. జితాఽమిత్రః, जिताऽमित्रः, Jitā’mitraḥ 🌻*

*ఓం జితామిత్రాయ నమః | ॐ जितामित्राय नमः | OM Jitāmitrāya namaḥ*

*జితా అమిత్రా యేనాం తర్వర్తినో దుఃఖహేతవః ।*
*రాగద్వేషాదయో బాహ్యాశ్చాపి వా రావణాదయః ।*
*స శ్రీ విష్ణుర్జితామిత్ర ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥*

*అంతఃకరణవర్తులైన రాగద్వేషాదులును, బాహ్యులగు రావణాది శత్రువులను జయించిన శ్రీ విష్ణుదేవుడు జితాఽమిత్రః అని చెప్పబడును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 524🌹*

*🌻 524. Jitā’mitraḥ 🌻*

*OM Jitāmitrāya namaḥ*

जिता अमित्रा येनां तर्वर्तिनो दुःखहेतवः ।
रागद्वेषादयो बाह्याश्चापि वा रावणादयः ।
स श्री विष्णुर्जितामित्र इति सङ्कीर्त्यते बुधैः ॥

Jitā amitrā yenāṃ tarvartino duḥkhahetavaḥ,
Rāgadveṣādayo bāhyāścāpi vā rāvaṇādayaḥ,
Sa śrī viṣṇurjitāmitra iti saṅkīrtyate budhaiḥ.

*Since He has conquered the internal enemies of attachment, aversion etc., and also the external enemies like Rāvaṇa, Lord Viṣṇu is called Jitā’mitraḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 202 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 20. The World is the Face of God 🌻*

*In the Ramayana, Tulsidas gives a beautiful description of Rama, Sita and Lakshmana walking, with Sita in the middle, and gives the image by saying that Sita was there as maya between brahma and jiva. Likewise, there is this world before us, which we are likely to unintelligently ignore in our enthusiastic aspiration for God.*

*The world is the face of God; it is the fingers of the hands of God Himself moving, and the so-called appearance of the world is rooted in the reality of the Absolute. There is a very unfortunate aftermath of this interesting analysis, namely, we ourselves are a part of this appearance; and to put on the unwarranted status of the reality in ourselves, while we are looked at as appearance, would be to disregard the law that operates in the realm in which we are placed.*

*Appearance is, after all, an appearance of reality—it is not an appearance of nothing. If it had been nothing, the appearance itself would not be there. Inasmuch as the appearance is of reality, it borrows the sense of reality. The snake is in the rope, yes, but we must know that the rope is not absent. Though the way in which the rope is seen may be an erroneous perception, the fact of the rope being there cannot be ignored—that is the reason why the snake is seen at all.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 41 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 29. దాన యజ్ఞము 🌻*

*తనకున్నది పంచువాడు పుణ్యమూర్తి. తనను కూడా పంచు వాడు సాధువు. అతడు పంచుటకు ప్రకృతి కూడా తోడ్పడి అనంతమైన సంపదను పంచగలదు. సాధువు సంపద అపారము. అనగా హద్దులు లేనిది. ఆ సంపద పదార్థమయమే కాదు, వాజ్మయము, విజ్ఞాన, జ్ఞానమయము గూడ. తనకు లేనిది పంచువాడు డంబాచారి. తనది కాని సంపదను, తనకు లేని జ్ఞానమును యితరులకు పంచు ప్రయత్నము మోసముతో కూడినదే. అందుండి పుట్టునది ప్రకోపమే.*

*దాన యజ్ఞము గొప్పది. మహత్తరమైనది. దానిని నిర్వర్తించు టకు వలసినది అంతః శుచి. హృదయమున దైవమును అనునిత్యము ప్రతిపాదించుకొనుట వలన అట్టి శుచి ఏర్పడగలదు. అట్టివాని హృదయమున దైవము ప్రతిష్ఠితుడై దానమును నిర్వర్తించును. దానము చేయువాడు, హృదయమున దైవమును ప్రతిపాదించు కొనుట వలన విశేషమైన దాన యజ్ఞమును నిర్వర్తింపగలడు. బలిచక్రవర్తి అట్టివాడు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 108 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమకు సంబంధించిన సమస్త రహస్యమదే. లక్ష్యాలు లేని ప్రేమ. నీ సమస్త అస్తిత్వాన్ని ప్రేమ శక్తిగా మారుస్తుంది. ప్రేమ శక్తి దైవశక్తిగా మారుతుంది అంతకు మించి ఏమీ అవసరం లేదు. 🍀*

*ప్రేమ అన్నది నీ లక్షణం కావాలి. నువ్వు ప్రేమిస్తే ఒక రోజు నువ్వు కేవలం ప్రేమగా మారుతావు. ప్రేమించడంగా గాక ప్రేమగా మారుతావు. అది నీ గొప్ప రోజు. జ్ఞానోదయమయిన రోజు. ఏ క్షణం మంచుబిందువు మాయమై సముద్రంలో అప్పుడది సముద్రంగా మారుతుంది.*

*ప్రేమకు సంబంధించిన సమస్త రహస్యమదే. లక్ష్యాలు లేని ప్రేమ. నీ సమస్త అస్తిత్వాన్ని ప్రేమ శక్తిగా మారుస్తుంది. ప్రేమ శక్తి దైవశక్తిగా మారుతుంది అంతకు మించి ఏమీ అవసరం లేదు. మనిషి కోరదగింది అదే. మనిషి స్వప్నించాల్సింది అదే. అది కేవలమైన సంపూర్ణతని , సమగ్రతని యిస్తుంది. అది చివుళ్ళు తొడుగుతుంది. పూలు పూస్తుంది. నీలో చైతన్య సుమాలు వికసించడం ఆరంభిస్తాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

*🌻 328-1. 'కళాలాపా'🌻* 

*కళల రూపమున ప్రకటింపబడునది శ్రీదేవి అని అర్థము. 'ఆలాప' మనగా మధుర ధ్వని. 'కళ' లనగా విద్యలని కూడ భావము. మధురముగా విద్యలను ప్రకటించునది శ్రీమాత అని తెలియ
వలెను. విద్యలన్నియూ వికాసము కొరకే. అట్టి వికాసము మధురముగ సాగినచో తదనుగుణమైన ఆనందముకూడ ప్రకటింపబడును. విద్యా లేక కళ ప్రకటింపబడుచున్నప్పుడు, ప్రకటించువానికి దర్శించువానికి కూడ ఆనందము కలుగవలెను. వికాసము కలుగవలెను. ఇట్లు ఆనంద వికాసములు కలాపములుగ విద్యలు సాగవలెను. తన్మూలమున జీవులు చైతన్య స్వరూపులై ఆనందించుచు నుండవలెను. ఇది అంతయూ శ్రీమాత ప్రణాళిక.*

*జీవుల నుద్ధరించు ప్రణాళిక యందు కళాలాపము ప్రధానకార్యమై యుండును. ఏ విద్యయూ లేని మానవుడు పశువు గాని పశువు. అట్టి వానిని వింత పశువు అని పెద్దలు నిర్వచించిరి. శ్రీమాత అనుగ్రహము వలన నోటియందు లాలాజలము మారినట్లు విద్యలన్నియూ ఊరగలవు. కళాలాప అను పదమును కళ ఆలాప అని ముందు వివరించ బడినది. ఆ పదమును కం, లాలాప అని కూడ వివరించవచ్చును. 'కం' అనగా సృష్టికర్త లేక చతుర్ముఖ బ్రహ్మ.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 328-1🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*

*🌻 328-1. Kalālāpā कलालापा (328) 🌻*

*Her speech itself is an art. Lalitā Triśatī nāma 156 is also ‘Kalālāpā’. Kalā generally means sixty four types of fine arts. But, kala refers melodious voice. Ālāpa also means speech. This nāma refers to Her melodious voice as art or Kalā.*

*Saundarya Laharī (verse 38) mentions eighteen types of arts “as a result of whose conversation, the maturation of the eighteen arts takes place”. These eighteen arts are interpreted in different ways. The first one says, that the sixteen bīja-s of ṣodaśī mahā mantra, Devi and one’s guru make the eighteen. This is called aṣṭādaśaguṇitavidyā अष्टादशगुणितविद्या. Another interpretation refers to eighteen types of vidyā-s - śikṣā, kalpa, vyākaraṇa, nirukta, jyotiṣa, candas, Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, pūva and uttara mīmāṁsā, nyāya, purāṇa, dharma śāstra, Āyurveda, dhaṇurveda, gāndharva and nīti śāstra. This means, that from the melodious speech of Devi, the eighteen vidya-s originate and by attaining these vidya-s a person is able to distinguish between good and bad through the means of his mind.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment