మైత్రేయ మహర్షి బోధనలు - 41


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 41 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 29. దాన యజ్ఞము 🌻

తనకున్నది పంచువాడు పుణ్యమూర్తి. తనను కూడా పంచు వాడు సాధువు. అతడు పంచుటకు ప్రకృతి కూడా తోడ్పడి అనంతమైన సంపదను పంచగలదు. సాధువు సంపద అపారము. అనగా హద్దులు లేనిది. ఆ సంపద పదార్థమయమే కాదు, వాజ్మయము, విజ్ఞాన, జ్ఞానమయము గూడ. తనకు లేనిది పంచువాడు డంబాచారి. తనది కాని సంపదను, తనకు లేని జ్ఞానమును యితరులకు పంచు ప్రయత్నము మోసముతో కూడినదే. అందుండి పుట్టునది ప్రకోపమే.

దాన యజ్ఞము గొప్పది. మహత్తరమైనది. దానిని నిర్వర్తించు టకు వలసినది అంతః శుచి. హృదయమున దైవమును అనునిత్యము ప్రతిపాదించుకొనుట వలన అట్టి శుచి ఏర్పడగలదు. అట్టివాని హృదయమున దైవము ప్రతిష్ఠితుడై దానమును నిర్వర్తించును. దానము చేయువాడు, హృదయమున దైవమును ప్రతిపాదించు కొనుట వలన విశేషమైన దాన యజ్ఞమును నిర్వర్తింపగలడు. బలిచక్రవర్తి అట్టివాడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2021

No comments:

Post a Comment