1) 🌹 02 - DECEMBER - 2022 FRIDAY,శుక్రవారం, భృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 98 / Kapila Gita - 98 🌹 సృష్టి తత్వము - 54
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 690 / Vishnu Sahasranama Contemplation - 690 🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 137 / Agni Maha Purana - 137 🌹 🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 3 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 272 / Osho Daily Meditations - 272 🌹 పాత మరియు పేలవం - OLD AND MEAN
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 416-3 🌹 ‘చిచ్ఛక్తి’ - 3 - 'Chichhakti' - 3
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹02, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -22 🍀*
*22. లక్ష్మీతి పద్మనిలయేతి దయాపరేతి భాగ్యప్రదేతి శరణాగతవత్సలేతి ।*
*ధ్యాయామి దేవి పరిపాలయ మాం ప్రసన్నే శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అపకృతుల మన్నింపు - నీకు జరిగిన అపకృతులను నీవు మన్నించడం ఘనతే కాని, ఇతరులకు జరిగిన అపకృతులను మన్నించడంలో అంత ఘనత లేదు. అయితే, వీటిని గూడా మన్నించ వచ్చుగాని, అవసరం పట్టినప్పుడు ప్రశాంత చితంతో కావలసిన కార్యం చెయ్యి.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల-దశమి 29:40:24 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 29:46:47
వరకు తదుపరి రేవతి
యోగం: వజ్ర 07:30:50 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: తైతిల 17:57:41 వరకు
వర్జ్యం: 15:20:48 - 16:56:56
మరియు 24:11:30 - 41:02:54
దుర్ముహూర్తం: 08:44:20 - 09:28:59
మరియు 12:27:37 - 13:12:16
రాహు కాలం: 10:41:33 - 12:05:17
గుళిక కాలం: 07:54:05 - 09:17:49
యమ గండం: 14:52:45 - 16:16:29
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:27
అమృత కాలం: 24:57:36 - 26:33:44
మరియు 29:19:54 - 46:11:18
సూర్యోదయం: 06:30:22
సూర్యాస్తమయం: 17:40:13
చంద్రోదయం: 13:47:46
చంద్రాస్తమయం: 01:13:43
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు : ధ్వజ యోగం - కార్య సిధ్ధి
29:46:47 వరకు తదుపరి శ్రీవత్స యోగం
- ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 98 / Kapila Gita - 98🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 54 🌴*
*54. నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోఽభవత్|*
*వాణ్యా వహ్నిరథో నాసే ప్రాణతో ఘ్రాణ ఏతయో॥*
*అందుండి మొట్టమొదట ముఖము ప్రకటమయ్యెను. దానియందు వాగింద్రయము, వాక్కునకు అధిష్టానదేవతయైన అగ్ని రూపొందెను. పిదప నాసారంధ్రములు వ్యక్తములయ్యెను. వాటినుండి ప్రాణసహితమైన ఘ్రాణేంద్రియము ఏర్పడెను.*
*పరమాత్మ మొదలు బ్రహ్మ యొక్క ముఖమునూ (నోటిని), అందులో ఇంద్రియాన్ని (రసనము, వాక్కు అనే రెండు ఇంద్రియాలు) ఏర్పరచాడు. వాక్కు అనే ఇంద్రియానికి అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. నాసికలో ఉండే ఇంద్రియాన్ని ఘ్రాణేంద్రియము అంటాము. దీనికి అధిష్ఠాన దేవత వాయువు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 97 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 54 🌴*
*54. nirabhidyatāsya prathamaṁ mukhaṁ vāṇī tato 'bhavat*
*vāṇyā vahnir atho nāse prāṇoto ghrāṇa etayoḥ*
*First of all a mouth appeared in Him, and then came forth the organ of speech, and with it the god of fire, the deity who presides over that organ. Then a pair of nostrils appeared, and in them appeared the olfactory sense, as well as prāṇa, the vital air.*
*With the manifestation of speech, fire also became manifested, and with the manifestation of nostrils the vital air, the breathing process and the sense of smell also became manifested.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 690 / Vishnu Sahasranama Contemplation - 690🌹*
*🌻690. మనోజవః, मनोजवः, Manojavaḥ🌻*
*ఓం మనోజవాయ నమః | ॐ मनोजवाय नमः | OM Manojavāya namaḥ*
*యన్మనసో జవో వేగ ఇవ వేగోఽస్య చక్రిణః ।*
*సర్వగతస్యేతి మనోజవ ఇత్యుచ్యతే హరిః ॥*
*సర్వగతుడు కావున విష్ణువు మనోవేగ సమాన వేగముగలవాడు. ఇందుచేత ఆ చక్రికి మనోజవః అను నామము కలదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 690🌹*
*🌻690.Manojavaḥ🌻*
*OM Manojavāya namaḥ*
यन्मनसो जवो वेग इव वेगोऽस्य चक्रिणः ।
सर्वगतस्येति मनोजव इत्युच्यते हरिः ॥
*Yanmanaso javo vega iva vego’sya cakriṇaḥ,*
*Sarvagatasyeti manojava ityucyate hariḥ.*
*Since is all pervading, He is as swift as as the mind is and hence He is called Manojavaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 137 / Agni Maha Purana - 137 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 42*
*🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 3🌻*
ద్వారము నాల్గవ భాగమున చందుడు, ప్రచండుడు, విష్వక్సేనుడు, వత్సదండుడు అను నాలుగు ద్వార పాలకుల మూర్తులను నిర్మింపవలెను | ఉందుంబర శాఖ సగభాగమున సుందరమగు లక్ష్మీవిగ్రహము నిర్మింపవలెను. ఆమె చేతిలో కమలముండవలెను. దిగ్గజములు కలశములతో ఆమెను స్నానము చేయించు చుండవలెను. ప్రాకారము ఎత్తు ఆలయము ఎత్తులో నాల్గవవంతు ఉంచవలెను. ఆలయ గోపురముఎత్తు ఆలయము ఎత్తకంటె నాల్గవవంతు తక్కువ ఉండవలెను. దేవతా విగ్రహము ఐదు హస్తముల విగ్రహమైన చోదాని పీఠిక ఒక హస్తముండవలెను.
విష్ణ్వాలయము ఎదుట ఒక గరుడ మండపము, భౌమాది ధామములను నిర్మింపవలెను. మహావిష్ణువు విగ్రహామునకు చుట్టు, ఎనిమిదివైపులందును విష్ణుప్రతిమకంటె రెట్టింపు ప్రమాణముగల అవతారమూర్తులను నిర్మింపలెను. తూర్పున వరాహాము, దక్షిణమున నృసింహమూర్తి, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున హయగ్రీవుడు, ఆగ్నేయమున పరశురాముడు, నైరృతి దిక్కునందు శ్రీరాముడు, వాయవ్యమున వామనుడు, ఈశానమున వానుదేవుడు-వీరిమూర్తులను నిర్మింపవలెను. ఆలయ నిర్మాణమును ఎనిమిది, పండ్రెండు మొదలగు సరిసంఖ్యల స్తంభములతో చేయవలెను. ద్వారము అష్టమాద్యంశలు తప్ప కలుగు వేధచేదోష మేమియును ఉండదు.
అగ్ని మహాపురాణమునందు ఆలయ ప్రాసాద నిర్మాణమును నలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 137 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 42*
*🌻 Construction of a temple - 3 🌻*
20-21. (Forms of) Caṇḍa and Pracaṇḍa should be carved on the door-frame occupying a fourth (of its space), (possessing) a staff like that of Viṣvaksena (Viṣṇu) and at the threshhold of the branch beautiful (Goddess) Śrī (Lakṣmī) (should be carved) as being bathed by the elephants of the quarters with (waters from) the pitchers. The height of enclosing wall should be onefourth of that of the temple.
22. The height of the tower should be a quarter lesser than that of the temple. The pedestal (of the image) of the deity of five cubits should be of a cubit.
23. A shed known as the Garuḍamaṇḍapa and shed for Bhauma (Mars) and other (planets) (should be made). In the eight directions above (the chamber housing) one should make (the images as follows):
24-25. (The images of) Varāha (boar) in the east, Nṛsiṃha (man-lion) in the south, Śrīdhara (a form of Viṣṇu) in the west, Hayagrīva (horse-necked form of Viṣṇu) in the north, Jāmadagnyaka (Paraśurāma, a manifestation of Viṣṇu) in the south-east, Rāma in the south-west, Vāmana (the short-statured manifestation ofViṣṇu) in the north-west (and) Vāsudeva in the north-east. The temple should be decorated with gems all around. Leaving out one-eighth of the door if that is done, it is not defective.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 272 / Osho Daily Meditations - 272 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 272. పాత మరియు పేలవం 🍀*
*🕉. మనస్సు కుంచించుకు పోతుంది - మీరు పెద్దయ్యాక, మనస్సు చిన్నదిగా, మరియు హీనంగా మారుతుంది. వృద్ధులు కొద్దిగా చికాకుగా ఉండటం ప్రమాదమేమీ కాదు. 🕉*
*చాలా మంది వృద్ధులు ప్రత్యేక కారణం లేకుండా ఎప్పుడూ కోపంగా, చిరాకుగా, చిరాకుగా ఉంటారు. కారణం వారు తమ జీవితంలో హృదయాన్ని కోల్పోయారు. వారు మనస్సు ద్వారా మాత్రమే జీవించారు, ఇది విస్తరించడానికి మార్గం లేదు; ఎలా కుదించుకు పోవాలో మాత్రమే తెలుసు. మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీ మనస్సు అంత చిన్నది అవుతుంది. జ్ఞానం లేని వ్యక్తికి, జ్ఞానం ఉన్న వ్యక్తి కంటే పెద్ద మనస్సు ఉంటుంది, ఎందుకంటే అజ్ఞాని మనస్సులో ఏమీ ఉండదు. ఖాళీగా ఉంటుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి చాలా జ్ఞానంతో నిండి ఉంటాడు; ఖాళీ లేదు. హృదయం అనేది అంతర్గత ప్రదేశానికి మరొక పేరు.*
*బాహ్య అంతరిక్షంలో ఆకాశానికి హద్దు లేదు, దానికి పరిమితి లేదు - సరిగ్గా అదే విధంగా అంతర్గత ఆకాశం కూడా అపరిమితంగా ఉంటుంది. బాహ్యం అనంతం అయితే, అంతర్భాగం అంతం కాదు. ఇది బాహ్య సమతుల్యతను కూడా తనలో కలిగి ఉంటుంది; అది దాని యొక్క ఇతర ధ్రువం. లోపలి ఆకాశం బయటి అంత పెద్దది, లేదా సరిగ్గా అదే నిష్పత్తిలో ఉంటుంది. ధ్యానం తలలో జరగకూడదు - అది అక్కడ జరగదు, కాబట్టి అక్కడ ఏది జరిగినా అది ధ్యానం యొక్క అనుకరణ మాత్రమే. నిజం కాదు, సత్యమైనది కాదు: నిజమైనది ఎల్లప్పుడూ హృదయంలో జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి: నేను మేల్కొలుపు గురించి మాట్లాడేటప్పుడు నేను హృదయ మేల్కొలుపు గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒక సిద్ధాంతంగా మాత్రమే అర్థం చేసుకోవలసిన అవసరం లేదు; అది అనుభవించాలి, అది నీ అస్తిత్వ స్థితిగా మారాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 272 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 272. OLD AND MEAN 🍀*
*🕉. The mind goes on shrinking--as you grow older, the mind becomes smaller and smaller and meaner and meaner. It is no accident that old people start being a little mean. 🕉*
*So many old people are always angry, irritated, annoyed for no particular reason. The reason is that they have missed the heart in their life. They have lived only by the mind, which knows no way to expand; it knows only how to shrink. The more you know, the smaller the mind you have. The ignorant person has a bigger mind than the knowledgeable person, because the ignorant person has nothing in the mind. There is space. The knowledgeable person is too full of knowledge; there is no space. But the heart is another name for the inner space.*
*Just as there is outer space--the sky unbounded, there is no limit to it-exactly in the same way is the inner sky also unbounded. It has to be-if the outer is infinite, the inner cannot be finite. It has to balance the outer; it is the other pole of it. The inner sky is as big as the outer, exactly in the same proportion. Meditation has not to happen in the head--it cannot happen there, so whatever happens there is only an imitation of meditation. Not true, not the real: The real always happens in the heart. So remember: When I talk of awakening I am talking about the heart's awakening. It has not to be understood only as a doctrine; it has to be experienced, it has to become your existential state.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 416 -3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 416. ‘చిచ్ఛక్తి’ - 3🌻*
*శ్రీమాత చిత్శ్శక్తి నెరిగిన జ్ఞానేశ్వరుడు ప్రతిష్ఠానపురమున పండితులగు సభికుల నడుమ గోముఖము నుండి వేదములను పలికించెను. జ్ఞానేశ్వరుడు రూపు కట్టుకొని వచ్చిన జ్ఞానము. అతడు ఈశ్వరుడు అగుటచేత గోవు నందలి చిత్ శక్తికి ప్రేరణ కలిగించి వేదములను ఉచ్చరింపజేసెను. జంతువులు యందుకూడ చితశక్తి యుండునని తెలుపు తార్కాణమిది. అట్లే వృక్షములు మాటలాడుట, శిలలు సందేశమిచ్చుట, పక్షులు పలుకుట- ఇత్యాది వన్నియూ సంభవములే. అసంభవ మనునది అమ్మ చిత్ శక్తికి లేదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 416 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 416. 'Chichhakti' - 3🌻*
*Srimata Chitshakti was blessed in Gnaneshwar who recited the Vedas from the gomukha in the midst of a gathering of scholars at Pratishthanapuram. Gnana is the form of Gnyaneshwar. He, being the lord, inspired the Chit Shakti in the cow and recited the Vedas. This proves that animals also have Chitshakthi. Trees talking, sculptures sending messages, birds speaking- these are all similar phenomena. Amma ChitShakti does not have the impossibility.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment