శ్రీమద్భగవద్గీత - 331: 08వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 331: Chap. 08, Ver. 21

 

🌹. శ్రీమద్భగవద్గీత - 331 / Bhagavad-Gita - 331 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 21 🌴

21. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు: పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||


🌷. తాత్పర్యం :

వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము సర్వకోరికలు ఈడేరునటువంటి “చింతామణి” ధామముగా బ్రహ్మసంహిత యందు వర్ణింపబడినది. గోలోకబృందావనముగా తెలియబడు ఆ శ్రీకృష్ణదామము చింతామణి భరితమైన సౌధములతో అలరారుచుండును.

కోరిన ఎత్తి భక్ష్యమునైనను సమకూర్చు కల్పవృక్షములను మరియు అక్షయముగా పాలనొసగు సురభినామ గోవులను కలిగియుండెడి ఆ ధామమున శ్రీకృష్ణుడు లక్షలకొలది లక్ష్ములచే సేవించబడుచుండును. ఆదిదేవుడును మరియు సర్వకారణకారణుడును అగు గోవిందునిగా అచ్చట అతడు పిలువబడును.

మధురముగా వేణువునూదును (వేణుంక్వణన్తమ్) అతని దివ్యరూపము సర్వజగన్మోహనమై యుండును. అతని కన్నులు కలువపూల రెక్కలను బోలి, దేహఛాయ నీలమేఘవర్ణమును బోలియుండును.

పరమాకర్షకుకుడైన అతని సౌందర్యము వేలాది మన్మథులను అతిశయించునంత మనోహారముగా నుండును. పీతాంబారమును ధరించియుండు ఆ భగవానుడు మెడలో దివ్యమైన పూమాలను, శిరమున పింఛమును దాల్చియుండును.

ఆధ్యాత్మికజగమున అత్యంత ఉన్నతమైన తన ధామము (గోలోకబృందావనము) గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇచ్చట సూచనగా మాత్రమే తెలిపియున్నాడు. దాని విస్తృతవివరణము బ్రహ్మసంహిత యందు ఒసగబడినది.

భగవద్ధామమునకు పరమైనది వేరొకటి లేదనియు, అదియే పరమగమ్యస్థానమనియు వేదవాజ్మయము (కఠోపనిషత్తు 1.3.11) తెలియజేయుచున్నది (పురుషాన్నపరం కిఞ్చిత్ సా కాష్టా పరమా గతి:).

దానిని పొందినవాడు ఈ భౌతికజగమునకు తిరిగిరాదు. ఒకే లక్షణములను కలిగియున్నందున ఆ ధామమును మరియు శ్రీకృష్ణునకు ఎట్టి భేదము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 331 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 21 🌴

21 . avyakto ’kṣara ity uktas tam āhuḥ paramāṁ gatim
yaṁ prāpya na nivartante tad dhāma paramaṁ mama


🌷 Translation :

That which the Vedāntists describe as unmanifest and infallible, that which is known as the supreme destination, that place from which, having attained it, one never returns – that is My supreme abode.

🌹 Purport :

The supreme abode of the Personality of Godhead, Kṛṣṇa, is described in the Brahma-saṁhitā as cintāmaṇi-dhāma, a place where all desires are fulfilled. The supreme abode of Lord Kṛṣṇa, known as Goloka Vṛndāvana, is full of palaces made of touchstone.

There are also trees, called “desire trees,” that supply any type of eatable upon demand, and there are cows, known as surabhi cows, which supply a limitless supply of milk.

In this abode, the Lord is served by hundreds of thousands of goddesses of fortune (Lakṣmīs), and He is called Govinda, the primal Lord and the cause of all causes. The Lord is accustomed to blow His flute (veṇuṁ kvaṇantam).

His transcendental form is the most attractive in all the worlds – His eyes are like lotus petals, and the color of His body is like the color of clouds. He is so attractive that His beauty excels that of thousands of Cupids.

He wears saffron cloth, a garland around His neck and a peacock feather in His hair. In the Bhagavad-gītā Lord Kṛṣṇa gives only a small hint of His personal abode, Goloka Vṛndāvana, which is the supermost planet in the spiritual kingdom.

A vivid description is given in the Brahma-saṁhitā. Vedic literatures (Kaṭha Upaniṣad 1.3.11) state that there is nothing superior to the abode of the Supreme Godhead, and that that abode is the ultimate destination (puruṣān na paraṁ kiñcit sā kāṣṭhā paramā gatiḥ).

When one attains to it, he never returns to the material world. Kṛṣṇa’s supreme abode and Kṛṣṇa Himself are nondifferent, being of the same quality.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment