1) 🌹 కపిల గీత - 1 - కపిల దేవహూతి సంవాదం - కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము - భాగము 1 - కపిల భగవానుని అవతరణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత 🌹
2) 🌹 Kapila Gita - 1 - Lord Kapila Devahuti's Conversation. - The Purpose of Lord Kapila's Advent - Part 1 - Lord Kapila’s Advent and The Importance of Transcendental Knowledge 🌹
3) *🌹 कपिल गीता - 1 - कपिल और देवहूति संवाद - कपिल भगवान का अवतरण उद्देश्य - भाग 1 - कपिल भगवान का अवतरण और आध्यात्मिक ज्ञान का महत्व 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 591 / Bhagavad-Gita - 591 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 20 / Chapter 16 - The Divine and Demoniac Natures - 20 🌴
5) *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 987 / Vishnu Sahasranama Contemplation - 987 🌹*
🌻 987. వైఖానః, वैखानः, Vaikhānaḥ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 564 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 1 🌹
🌻 564. 'మృడానీ’ - 1 / 564. 'Mrudani' - 1🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 కపిల గీత - 1 - కపిల దేవహూతి సంవాదం - కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము - భాగము 1 - కపిల భగవానుని అవతరణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*ఈ వీడియోలో, కపిల గీత నుండి కపిల భగవానుని ఉపదేశాలను మనం అన్వేషిస్తాము. కపిల భగవానుడు, పరమాత్మ యొక్క అవతారంగా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనుషులకు అందించడానికి అవతరించారు. తన తల్లి దేవహూతితో సంభాషణ ద్వారా, ఆయన ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రాముఖ్యతను, ఆత్మ మరియు భౌతికత మధ్య తేడాను, మరియు ఉన్నతమైన సత్యాలకు అనుగుణంగా జీవించడం ఎంత ముఖ్యమో వివరించారు. కపిల భగవానుని అవతార ఉద్దేశం లోతుగా అన్వేషించడానికి మాతో చేరండి, మరియు ఆయన ఉపదేశాలు మనల్ని విముక్తి మరియు ఆత్మసాక్షాత్కార వైపు ఎలా నడిపిస్తాయో తెలుసుకోండి. మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ప్రియమైన వారితో షేర్ చేయండి!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Kapila Gita - 1 - Lord Kapila Devahuti's Conversation. - The Purpose of Lord Kapila's Advent - Part 1 - Lord Kapila’s Advent and The Importance of Transcendental Knowledge 🌹*
*Prasad Bharadwaj*
*In this video, we explore the teachings of Lord Kapila from the Kapila Gita. Lord Kapila, an incarnation of the Supreme Personality of Godhead, descended to impart transcendental knowledge to humanity. Through his conversation with his mother, Devahuti, he explains the significance of spiritual enlightenment, the distinction between the soul and material reality, and the importance of living in accordance with higher truths. Join us as we dive deeper into the purpose of Lord Kapila's advent and how his teachings guide us toward liberation and self-realization. Like, subscribe, and share for more insights!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 कपिल गीता - 1 - कपिल और देवहूति संवाद - कपिल भगवान का अवतरण उद्देश्य - भाग 1 - कपिल भगवान का अवतरण और आध्यात्मिक ज्ञान का महत्व 🌹*
*प्रसाद भारद्वाज *
*इस वीडियो में, हम कपिल गीता से कपिल भगवान की शिक्षाओं का अन्वेषण करते हैं। कपिल भगवान, परमात्मा के अवतार के रूप में, मानवता को आध्यात्मिक ज्ञान प्रदान करने के लिए अवतरित हुए। अपनी माता देवहूति के साथ संवाद के माध्यम से, उन्होंने आध्यात्मिक जीवन के महत्व, आत्मा और भौतिकता के बीच के अंतर, और उच्च सत्य के अनुसार जीने की महत्ता को समझाया। कपिल भगवान के अवतार के उद्देश्य को गहराई से समझने के लिए हमारे साथ जुड़ें, और उनके उपदेश कैसे हमें मुक्ति और आत्मसाक्षात्कार की ओर ले जाते हैं, यह जानें। अधिक जानकारी के लिए, लाइक करें, सब्सक्राइब करें और अपने प्रियजनों के साथ साझा करें!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 591 / Bhagavad-Gita - 591 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 20 🌴*
*20. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని |*
*మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్ ||*
*🌷. తాత్పర్యం : ఓ కొన్తేయా! అసుర యోనుల యందే మరల మరల జన్మించి అట్టివారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనము నొందుదురు.*
*🌷. భాష్యము : భగవానుడు పరమకరుణా మయుడనెడి విషయము తెలిసినదే. కాని అతడు అసురస్వభావము గలవారి యెడ మాత్రము ఎన్నడును దయాస్వభావమును చూపడని ఈ శ్లోకమున మనము గాంచుచున్నాము. అసురస్వభావులు ప్రతిజన్మ యందును అవే అసురయోనుల యందు ఉంచబడుదురనియు, భగవానుని కరుణను పొందజాలక వారు పతనము నొందుదురనియు స్పష్టముగా తెలుపబడినది. ఆ విధముగా వారు చివరకు శునక, సూకర, మార్జాలముల వంటి హేయజన్మలను పొందుదురు.*
*అట్టి దానవస్వభావులు తరువాతి జన్మలో ఎట్టి స్థితి యందును భగవత్కరుణను పొందు అవకాశమే లేదని ఇచ్చట స్పష్టముగా వివరింపబడినది. అట్టివారు క్రమముగా పతనము నొంది శునక, సూకరములుగా జన్మింతురని వేదములందు తెలుపబడినది. భగవానుడు దానవస్వభావుల యెడ దయాళువు కానిచో అతనిని దయాపూర్ణుడని ప్రకటించరాదు కదాయని ఎవరైనను వాదించు నవకాశము కలదు. అట్టి ప్రశ్నకు సమాధానముగా పరమపురుషుడు ఎవ్వరియెడను ద్వేషమును కలిగియుండడని వేదాంత సూత్రము లందు మనము గాంచవచ్చును. అనగా అసురస్వభావులను అతి నీచజన్మల యందు పడద్రోయుట యనునది ఆ భగవానుని కరుణకు వేరొకరూపమై యున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 591 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 20 🌴*
*20. āsurīṁ yonim āpannā mūḍhā janmani janmani*
*mām aprāpyaiva kaunteya tato yānty adhamāṁ gatim*
*🌷 Translation : Attaining repeated birth amongst the species of demoniac life, O son of Kuntī, such persons can never approach Me. Gradually they sink down to the most abominable type of existence.*
*🌹 Purport : It is known that God is all-merciful, but here we find that God is never merciful to the demoniac. It is clearly stated that the demoniac people, life after life, are put into the wombs of similar demons, and, not achieving the mercy of the Supreme Lord, they go down and down, so that at last they achieve bodies like those of cats, dogs and hogs. It is clearly stated that such demons have practically no chance of receiving the mercy of God at any stage of later life.*
*In the Vedas also it is stated that such persons gradually sink to become dogs and hogs. It may be then argued in this connection that God should not be advertised as all-merciful if He is not merciful to such demons. In answer to this question, in the Vedānta-sūtra we find that the Supreme Lord has no hatred for anyone. The placing of the asuras, the demons, in the lowest status of life is simply another feature of His mercy. Sometimes the asuras are killed by the Supreme Lord, but this killing is also good for them, for in Vedic literature we find that anyone who is killed by the Supreme Lord becomes liberated. There are instances in history of many asuras – Rāvaṇa, Kaṁsa, Hiraṇyakaśipu – to whom the Lord appeared in various incarnations just to kill them. Therefore God’s mercy is shown to the asuras if they are fortunate enough to be killed by Him.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 987 / Vishnu Sahasranama Contemplation - 987 🌹*
*🌻 987. వైఖానః, वैखानः, Vaikhānaḥ 🌻*
*ఓం వైఖానాయ నమః | ॐ वैखानाय नमः | OM Vaikhānāya namaḥ*
*విశేషేన ఖనతీతి వైఖాన ఇతి కీర్త్యతే ।*
*వారాహం రూపమాస్థాయ విశేషేణ భువం హరిః ॥*
*పాతాలవాసినం దైత్యం హిరణ్యాక్షం జఘాన సః ।*
*ఇతి పౌరాణికీ గాథా ప్రసిద్ధా శ్రూయతేఽసకృత్ ॥*
*విశేషేన ఖనతీతి వైఖానః అనగా మిక్కిలిగా త్రవ్వినవాడు వైఖానః. శ్రీ విష్ణువు వారాహరూపమును ఆశ్రయించి ధరణిని మిక్కిలిగా త్రవ్వి పాతాళమున వసించుచు ఉండిన హిరణ్యాక్షుడనబడు దైత్యుడిని చెంపెను అను కథ పురాణమున ప్రసిద్ధమై యున్నది.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 987🌹*
*🌻 987. Vaikhānaḥ 🌻*
*OM Vaikhānāya namaḥ*
विशेषेन खनतीति वैखान इति कीर्त्यते ।
वाराहं रूपमास्थाय विशेषेण भुवं हरिः ॥
पातालवासिनं दैत्यं हिरण्याक्षं जघान सः ।
इति पौराणिकी गाथा प्रसिद्धा श्रूयतेऽसकृत् ॥
*Viśeṣena khanatīti vaikhāna iti kīrtyate,*
*Vārāhaṃ rūpamāsthāya viśeṣeṇa bhuvaṃ hariḥ.*
*Pātālavāsinaṃ daityaṃ hiraṇyākṣaṃ jaghāna saḥ,*
*Iti paurāṇikī gāthā prasiddhā śrūyate’sakrt.*
*Viśeṣena khanatīti Vaikhānaḥ - The One who digs especially is Vaikhānaḥ. It is well-known in the purāṇas that the Lord dug especially into the earth assuming the form of the boar and killed a daitya by the name Hiraṇyākṣa who had his abode in the nether world.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 564 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*
*🌻 564. 'మృడానీ’ - 1 🌻*
*సుఖము నొసగు శివుని భార్య శ్రీమాత అని అర్ధము. మృడు డనగా శివుడు. మృడానీ అనగా శివుని భార్య. శుభముల నిచ్చువాడు గనుక శివుడని సంబోధించిరి. అతడు పరమ కరుణామయుడు. కరుణకు అతను పెట్టినది పేరు. శీఘ్రముగనే అనుగ్రహించుట, వరములిచ్చుట, క్షమించుట, దయచూపుట ఇట్టి గుణములు మృడ అను శబ్దమున కర్థము. ఇవి అన్నియూ అతని గుణములనగా శ్రీమాతయే. గుణ రహితుడగు శివుని శ్రీమాత యిట్లు ఆవరించి యుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻*
*🌻 564. 'Mrudani' - 1 🌻*
*The wife of Shiva, who bestows happiness, is Śrī Māta. "Mṛḍu" refers to Shiva, and "Mṛḍānī" refers to the wife of Shiva, Śrī Māta. Shiva is called the giver of auspiciousness, and because he bestows blessings, he is addressed as "Shiva." He is full of supreme compassion. His name itself is synonymous with compassion. The qualities of swiftly granting grace, bestowing boons, forgiving, and showing mercy are all contained in the word "Mṛḍu." These qualities of Shiva are, in essence, Śrī Māta herself. Śrī Māta envelops and encompasses Shiva, who is beyond all attributes.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment