శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 144, 145 / Sri Lalitha Chaitanya Vijnanam - 144, 145

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 77 / Sri Lalitha Sahasra Nama Stotram - 77 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 144, 145 / Sri Lalitha Chaitanya Vijnanam - 144, 145 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖



🌻144. 'నిత్యముక్తా' 🌻

శ్రీదేవి నిత్యముక్తురాలని భావము. త్రిగుణములకు లోబడిన వారు బద్ధులు. త్రిగుణముల కతీతముగ నుండువారు ముక్తులు. గుణ బంధనమే ప్రథమ బంధనము. అటుపైన పంచభూతముల బంధనము. వెరసి అష్ట బంధనములు జీవుల కేర్పడు చున్నవి.

త్రిగుణములు, పంచభూతములు, సృష్టి కార్యమునకు శ్రీదేవి వినియోగించు సామాగ్రి. అహంకార స్వరూపులైన జీవులు ఈ ఎనిమిది బంధనములలో యిమిడి వుందురు. అహంకార మనగా 'నేను ప్రత్యేకముగా వున్నాను' అని అనిపించుట, ఇట్లు అనిపించినపుడు, నేను, యితరులు అను భావము తప్పదు. ఈ అహంకారమే జీవులకు మూలము.

దీని వలన తాను, యితరులు అను ప్రథమ మగు బంధ మేర్పడును. దీనిని దాటుటకే “యితరములుగ కనిపించుచున్నది కూడ నేనే” అని భావన చేయుట దీనినే 'అనన్య చింతన' మందురు. అనగా చింతనమున అన్యము లేదు. ఈ భావన సిద్ధించిన వారే ముక్తులు. జీవులు ఈ ముక్త స్థితిని చేరుటకే వేయి సాధనా మార్గముల ననుసరింతురు.

కోటి మనుషులలో నొకడు ఈ సాధన యందు స్థితి పొందును. అట్టివారే సిద్ధులు. సాధన యందలి సత్త్వ గుణమును బట్టి శ్రీదేవి ముక్త స్థితిని అనుగ్రహించు చుండును. అనగా త్రిగుణముల త్రిభుజము నుండి ఆవలకు గొనిపోవును. త్రిమూర్తులతో కూడి సమస్త దేవకోట్లు త్రిగుణముల వలననే నడిపింపబడుచున్నారు.

అట్టి త్రిగుణములను దాటి యెప్పుడునూ వుండునది శ్రీమాతయే. పరతత్త్వము, పరాప్రకృతి త్రిగుణముల నేర్పరచి సృష్టి కథను నిర్వర్తించు చున్నప్పుడు వారు త్రిగుణములకు అతీతముగనే యుందురుగదా! వారే నిజమగు ముక్తులు. ఇతరులీ స్థితిని వారి అనుగ్రహమున పొందుటకే సమస్త ఆరాధనలు, సాధనలు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 144 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nitya-muktā नित्य-मुक्ता (144) 🌻

She is eternally free, another quality of the Brahman. To realise the Brahman, one has to be free from bondage.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 145 / Sri Lalitha Chaitanya Vijnanam - 145 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻145. 'నిర్వికారా' 🌻

వికారము లేనిది శ్రీమాత అని భావన.

వికారమనగా మార్పునకు గురి యగునది. మార్పులు జరుగుచున్ననూ శ్రీమాత మార్పు చెందక వుండును. సృష్టి నిర్వహణమనగా నొక మహత్తరమగు అగ్ని కార్యము. అగ్నివలన మార్పులు సంభవించి ప్రకృతి పురుషుల నుండి పదునాలుగు లోకము లేర్పడును. అయినను అగ్ని అగ్నిగనే యుండునుగదా!

మార్పులకు స్వామిత్వము వహించువారు అట్టి మార్పులకు అతీతముగ వుండినచో మాత్రమే సంకల్పించిన మార్పులు వలసిన ప్రయోజనమును సిద్ధింప చేయగలవు, అట్లు కానిచో స్వామిత్వమే లేదు.

మూలవస్తువు మారక దాని ఆవరణల యందు మార్పులు జరుగుట ఆత్మ లక్షణము. అట్టి ఆత్మస్వరూపిణియైన శ్రీమాత సృష్టికోలుకై తననుండి ఇరువది మూడు తత్త్వ వికారములను కల్పించి నప్పటికిని అందు వికారము చెందక ఆమె ఇరువదినాలుగవదిగా యుండును. అందులకే ఆమె 'గాయత్రి' అని కొనియాడబడుచున్నది. ఎట్టి వికారములు లేక ఒకే విధముగ ప్రకాశించు తత్త్వము గలది శ్రీమాత అగుటచే ఆమె నిర్వికార. పరమపురుషుడు నిర్వికారుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 145 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirvikārā निर्विकारा (145) 🌻

She is devoid of modifications (vikāra means modification). Brahman does not change. There are two aspects of creation viz. puruṣa and prakṛtī. Puruṣa is the Supreme consciousness that is free of bondage, full of knowledge and creative power. This can be interpreted as the divine or active principles from the minute portions of which the universe was formed.

If one has the power to create, he has to possess the requisite knowledge for creation. If creator does not possess sufficient knowledge, his creation goes haywire. Puruṣa is not associated with body, senses and mind. It does not undergo modification but constantly witnessing those countless modifications that happens around it. Prakṛtī is opposite of puruṣa. It is the root cause of creation and undergoes changes continuously. It is associated with three gunas. When puruṣa and prakṛtī conjoin, universe is created.

Devoid of changes here mean with regard to twenty three tattva-s. They are mahat [It is a product of prakṛti. It the great principle, of buddhi, the Intellect, or the intellectual principle. According to the Sāṃkhya philosophy the second of the twenty three principles produced from prakṛti and so called as the great source of ahaṃkāra, (ego) self-consciousness and manas, the mind], ego and five tanmātra-s (sound, taste, smell, light and touch). These seven are called cause.

Five organs of perception, five organs of action, five basic elements and mind make the balance sixteen. These sixteen are called action. Therefore prakṛti is made up of cause and action and puruṣa is devoid of this. But for creation both puruṣa and prakṛti are required. This points out to Śiva-Śaktī union.

But, in this nāma She is addressed as puruṣa, the Brahman. Puruṣa and prakṛti are discussed in detail in later nāma-s.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Dec 2020



No comments:

Post a Comment