సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 4



🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 4 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 4 🍀


భావే వీణ భక్తి భక్తి వీణ ముక్తి!
బళే వీణ శక్తి బోలూ నయే!!

కైసేని దైవత్ ప్రసన్న త్వరీత్!
ఉగా రాహే నివాంత్ శిణసీ వాయా!!

సాయాస్ కరీసీ ప్రపంచ్ దిన నిశీ!
హరిసీ న భజసీ కోణ్యా గుణే!!

జ్ఞానదేవ ఘ్రాణే హరిజప కరణే!
తుటేల్ ధరణే ప్రపంచావే!!!

భావము:

భావన లేక భక్తి, భక్తి లేక ముక్తి, బలములేకున్న శక్తివంతుడను అని

చెప్పకూడదు. ఏ విధముగా నీకు దైవం త్వరగ ప్రసన్నం కాగలదనుకొను చున్నావు? ఊరుకో ప్రశాంతంగా ఉండు లేనిచో అలసిపోతావు. ప్రపంచము కోసం రాత్రి పగలు వృధా ప్రయాసము చేయు చున్నావు. ఏ గుణము ఆధారముగా హరి భజన చేయుట లేదు? (బలమా? ధనమా?).

హరి జపము చేయుట వలన భవబంధాలు తొలగి మాయ ప్రపంచపు

పట్టు తెగిపోవునని జ్ఞాన దేవులు తెలిపినారు.


🌻. నామ సుధ -4 🌻

భావన లేక భక్తులము కాలేము

భక్తి లేక ముక్తులము కాము

బలము లేక శక్తివంతులము కాము

చేయకూడదు అధిక ప్రసంగము

ఏ విధముగా దైవ ప్రసన్నము

త్వరిత గతిన అదియు సాధ్యము

అల్లరి చేయక ఊరకుండుము

అనవసరముగ అలసి పోకుము

రాత్రి పగలు ప్రపంచము కోసము

చేస్తున్నావు వృధా ప్రయాసము

ఏ గుణము అది నీకాధారము

హరిని భజించవు ఏమి కారణము?

జ్ఞాన దేవుడి మాటలు వినుము

హరినామమునే జపము చేయుము

పట్టు వదులును ఈ ప్రపంచము

తెగి పోగలదు భవబంధనము

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



13 Dec 2020

No comments:

Post a Comment