శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 287 / Sri Lalitha Chaitanya Vijnanam - 287



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 287 / Sri Lalitha Chaitanya Vijnanam - 287 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀

🌻 287. 'నిజాజ్ఞా రూపనిగమా'🌻


దేవి ఆజ్ఞా రూపములే వేదములు అని అర్థము. మహాచైతన్య ముద్భవించిన వెనుకనే వేదముల ప్రసక్తి. ప్రళయమున వేదములు మహా చైతన్యములోనికి, మహాచైతన్యము ప్రళయములోనికి ఇమిడి యుండును. అపుడేమియు లేనట్లుండును. లేనట్లుండుటయేగాని లేకుండుట కాదు. లేనట్లున్న స్థితియే ఆది. అందుండి ఉద్భవించునది మహాచైతన్యము లేక శ్రీమాత. ఆమె ఇచ్ఛయే వేదములకు మూలము.

మన యందలి సంకల్పముల పుట్టుకకు కూడ ఈ ఇచ్ఛయే కారణము. పుట్టిన సంకల్పము భావ రూపము, భాషా రూపము, కర్మ రూపము దాల్చును. ఇచ్ఛయే కారణముగ ప్రాణస్పందనముకూడ కలుగును. సంకల్పము ఋగ్వేదము కాగా, భావ మయము, చేత మయము అగుట యజుర్వేద మగును. వీని కాధారముగ సామవేదమై ప్రాణములు స్పందించును. అవతరించు సృష్టి అధర్వణ వేదమై నిలచును.

ఇట్లు శ్రీమాత ఇచ్ఛయే అన్ని వేదములకు మూలము. నాలుగు వేదములు ఆమె ఆజ్ఞా రూపములే. నిగమము లనగా వేదానుసారమైన తంత్రములు, తంత్రము లనగా విధానములు. ఏ మానవుని యందైననూ ఈ నాలుగు వేదములే వ్యక్తమగు చుండును. మానవునికి కలుగు స్ఫురణ, భావము, ఉచ్చారణ ఋగ్వేదము. అతని యందలి ప్రాణ ప్రవృత్తులు సామ వేదము. భావనను తీరుగ అమర్చుకొని కార్యములు యజ్ఞార్థముగ నిర్వర్తించుట యజుర్వేదము. ఇట్లు నిర్వర్తింపబడిన కార్యములు భూమిపై అవతరించుట అధర్వణ వేదము.

ఇట్లు నాలుగు వేదములు మానవుల యందు ప్రకాశించు చున్నవి. ఇట్లు ప్రకాశించుటకు మూలము మన యందలి శ్రీదేవి ప్రకాశమే. ఆమె చైతన్య స్వరూపిణిగ మన యందుండుట వలన మానవుడు ఆ చైతన్యము, తన చైతన్యమని భ్రమపడు చుండును. అట్లే తన సంకల్పమని, తన ప్రాణమని, తన తెలివితేటలని, తాను సృష్టించెనని భావించును. కాని అన్నిటికీ మూలమైన స్ఫురణ కలుగనిచో ఏమి చేయగలడు? శ్రీమాత ఆజ్ఞగనే నాలుగు వేదములు, సృష్టి యందు మానవుని యందు వర్ధిల్లుచున్నవి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 287 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |
nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🍀

🌻 Nijājñā-rūpa-nigamā निजाज्ञा-रूप-निगमा (287) 🌻


She conveys Her commands through Veda-s. Derivatives of Veda-s prescribe the actions to be done and not to be done. Such actions depend upon the classifications based on the previous nāma. If all men perform all the actions prescribed in Veda-s, there can be no perfection. For example, a person cannot be an expert in medical, legal and financial fields all at the same time. To attain proficiency in one’s field, more experience is required. This is the reason behind nāma 286.

Though Veda-s themselves do not discuss much on such acts, (karma kāṇḍa -s of Veda-s discuss certain gross actions) the derivatives of Veda-s like śāstra-s and Purāṇa-s clearly spell out the kriya-s (performance towards atonement) and karma-s (actions causing future reactions afflicting karmic account) to be done and not to be done. But it is widely believed that śāstra-s are of later origin and do not derive significantly from the teachings of Veda-s and Upaniṣads. By and large this argument is to be accepted, as they do not typically teach the ways to realising the Self within. Therefore it is to be understood that there is a huge difference between Her commands through Veda-s directly, and through śāstra-s indirectly.

Here it means Her commands are only through Veda-s. Following śāstra-s depends upon one’s outlook, tradition and lineage. Her commands through Veda-s are conveyed to those who are exponents of Veda-s such as sages and saints. It is also believed that such sages and saints prescribed śāstra-s. Many are of the view that śāstra-s initiate a person to pursue religious path and later into spiritual path.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Jul 2021

No comments:

Post a Comment