🌹. వివేక చూడామణి - 99 / Viveka Chudamani - 99🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 22. కోరికలు, కర్మలు - 9 🍀
336. విద్యావంతడైన వ్యక్తి ఎచ్చట ఉంటే అచ్చట ఆ వ్యక్తి సత్యాసత్యముల విచక్షణా జ్ఞానముతో వేదాలను నమ్మి తన దృష్టిని అతని వైపు మళ్ళించగలుగుతాడు. అదే అత్యున్నతమైన సత్యము. సాధకుడు అట్టి స్థితిని పొందిన తరువాత చిన్న పిల్లల వలె కాక జాగ్రత్తగా అసత్యమైన విశ్వానికి దూరముగా ఉంటాడు. లేనిచో అది అతని పతనానికి కారణమవుతుంది.
337. శరీరానికి కట్టుబడి ఉన్న వ్యక్తికి విముక్తి లేదు. అలానే విముక్తి పొందిన వ్యక్తికి శరీరముతో ఏవిధమైన గుర్తింపు ఉండదు. నిద్రించు వ్యక్తి మెలుకవలో ఉండడు. మెలుకవలో ఉన్న వ్యక్తి నిద్రించడు. ఈ రెండు వ్యతిరేక ప్రభావము కలిగి ఉన్నవి.
338. ఎవడైతే తన మనస్సుతో తన ఆత్మను తెలుసుకొంటాడో అతడు స్వేచ్ఛను పొందుతాడు. అలా కాక కదులుచున్న, స్థిరముగా ఉన్న వస్తు సముదాయముపై దృష్టిని ఉంచి గమనిస్తుంటాడో, అది అతని పతనము. అందువలన అన్ని మోసాలను అధికమించి వ్యక్తి తన యొక్క ఆత్మిక స్థితిలో స్థిరపడాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 99 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 22. Desires and Karma - 9 🌻
336. Where is the man who being learned, able to discriminate the real from the unreal, believing the Vedas as authority, fixing his gaze on the Atman, the Supreme Reality, and being a seeker after Liberation, will, like a child, consciously have recourse to the unreal (the universe) which will cause his fall ?
337. There is no Liberation for one who has attachment to the body etc., and the liberated man has no identification with the body etc. The sleeping man is not awake, nor is the waking man asleep, for these two states are contradictory in nature.
338. He is free who, knowing through his mind the Self in moving and unmoving objects and observing It as their substratum, gives up all superimpositions and remains as the Absolute and the infinite Self.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
08 Jul 2021
No comments:
Post a Comment