నిర్మల ధ్యానాలు - ఓషో - 42


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 42 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు వర్తమాన క్షణంలో వుంటే దైవత్వంలో వున్నట్లే. ధ్యానానికి అదే అర్థం. ప్రార్థనకు అదే అర్థం. 🍀


దైవత్వానికి దారి హఠాత్ సంభవమైంది. ప్రతిస్పందనతో వుండడమంటే దైవత్వంతో వుండటం. మనసు ఎప్పుడూ ప్రతిస్పందన గుణంతో వుండదు. సహజంగా వుండదు. ఈ క్షణంలో వుండదు. ఎక్కడో గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఒకటేమో యిపుడు లేనిది, యింకొకటేమో యింకా రానిది. వాటి మధ్య అది అసలయిన దారిని కోల్పోతూ వుంటుంది.

వర్తమాన క్షణమన్నది కాలంలో భాగం కాదు. అందువల్ల వర్తమాన క్షణమన్నది మనసుకందదు. మనసు, కాలం ఒక్కలాంటివే. అది నీలోని భాగమని నువ్వనవచ్చు. కానీ కాలం, మనసు నీకు బయట వున్నాయి.

నువ్వు వర్తమాన క్షణంలో వుంటే దైవత్వంలో వున్నట్లే. ధ్యానానికి అదే అర్థం. ప్రార్థనకు అదే అర్థం. ప్రేమకు అదే అర్థం. వర్తమానంలో నువ్వు తీసుకునే చర్య నీ చర్య కాదు. అది నీ నించీ దైవత్వం నిర్వహించే చర్య. అది నీ గుండా ప్రవహించే దైవత్వం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


08 Jul 2021

No comments:

Post a Comment