శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 288 / Sri Lalitha Chaitanya Vijnanam - 288


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 288 / Sri Lalitha Chaitanya Vijnanam - 288 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀

🌻 288. 'పుణ్యాపుణ్య ఫలప్రదా'🌻


పుణ్యఫలము, అపుణ్యఫలము ప్రసాదించునది శ్రీమాత అని అర్థము. ధర్మమాచరించిన పుణ్యము. అధర్మాచరణము పాపము, ధర్మము నాచరించిన వారికి స్థిరత్వముండును. అధర్మము నాచరించు వారికి స్థిరముండదు. జీవితమున పుణ్యాత్ములు కాలమును, దేశమును బట్టి వచ్చు సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయాపజయములు స్థిరచిత్తముతో ఎదుర్కొనుదురు. ఇట్లు స్థిరముగ నుండుటకు లోబలము ధర్మమే. ధర్మము నాచరించని వారికే మతి స్థిమిత ముండదు. భయ భ్రాంతములు కలుగుచుండును.

రాగద్వేషములు, కామక్రోధములు, మదమాత్సర్యములు, ఈర్ష్యాసూయలు, లోభ మోహములు తరచూ వీరిని స్పృశించు చుండును. ధర్మమాచరించని వారికి లోబలము తక్కువ. ధర్మమాచరించు వారికి లోబలము ఎక్కువ. కష్ట నష్టములు, దుఃఖములు ధర్మమాచరించిన వారికి కూడ కలుగునని పురాణ గాథలు తెలుపుచున్నవి. కాని వారు కష్ట సమయమున లోబడక ధర్మమునందు నిలచి దాటుదురు.

శ్రీమాత మహా చైతన్య స్వరూపిణి. కార్యకారణముల కతీతముగ నుండును. జీవులు కార్యముల ద్వారా కారణములను సృష్టించుకొందురు. ఉదాహరణకు ఒక దీపపు వెలుగులో సభ్రంథ పఠనము, సద్భాషణము, సత్కర్మాచరణము చేయవచ్చును. అట్లే అదే దీపపు వెలుగులో దుర్భాషణము, దుష్కార్యములు చేయవచ్చును.

ఒకరు సద్భాషణము సత్కార్యము చేయుటకు, మరొకరు దుర్భాషణము దుష్కార్యము చేయుటకు వెలుగు కారణము కాదు కదా! ఇట్లు శ్రీమాత అందించిన సమస్త సృష్టి సౌకర్యములను సద్వినియోగము చేసుకొను వారు సత్పలములను పొందుచుందురు. దుర్వినియోగము చేయువారు దుష్ఫలములను పొందుదురు. ఇట్టి అమరికను సృష్టి యందేర్పరచినది శ్రీమాత. వర్ణ ధర్మము, ఆశ్రమ ధర్మము విహిత కర్మలుగ శాస్త్రము చెప్పుచున్నది. వీని ననుసరించక పోవుట వలన జీవులు పతనము చెందుచుందురు. అనుసరించు వారు వృద్ధి చెందుచు నుందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 288 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |
nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🍀

🌻 Puṇyāpuṇya-phalapradā पुण्यापुण्य-फलप्रदा (288) 🌻


Puṇyāpuṇya consist of two words puṇya + a-puṇya. Puṇya means the good or right, virtue, purity, good work, meritorious act, moral or religious merit, and a-puṇya means the illusionary puṇya. Illusionary puṇya or apuṇya is not exactly pāpa. Apuṇya is done out of ignorance and it is not as bad as committing sins or pāpa. Such discriminations are made based upon the teachings of Vedas. Brahma Sūtra (II.i.34) says, “No partiality and cruelty because of His taking other factors into consideration. For so the Veda-s show.”

What is sown in is reaped. Results arising out of such actions are transferred to one’s karmic account. The end result of karmic account is rebirths and its associated pains and sufferings. Such results accrue at Her command as She is the Lord of karma-s.

Brahma Sūtra (III.ii.7) confirms this. It says, “फलमत् उपपतेः (phalamat upapateḥ)” which means “The fruit of action is from Him, this being the logical position.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 Jul 2021

No comments:

Post a Comment