నిర్మల ధ్యానాలు - ఓషో - 43
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 43 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అనంతం గురించి, శాశ్వతత్వం గురించి మాత్రమే ఆలోచించు. దానికి తక్కువగా ఆలోచిస్తే ఎవర్నీ సంతృప్తి పరచలేవు. సంతోష పెట్టలేవు. 🍀
అన్ని సరిహద్దుల్ని వదిలిపెట్టు. అనంతంగా వుండు. అనంతం గురించి, శాశ్వతత్వం గురించి మాత్రమే ఆలోచించు. దానికి తక్కువగా ఆలోచిస్తే ఎవర్నీ సంతృప్తి పరచలేవు. సంతోషపెట్టలేవు. శరీర సరిహద్దుల్ని వదులుకోవాలి. మనం మరీ ఎక్కువగా శరీరాన్ని బట్టి గుర్తింపు పొందుతున్నాం. మనం మన శరీరమే మనమని అనుకుంటున్నాం. ఒకటి గుర్తించు, మనం మన శరీరం కాదు. ఈ పొరపాటు అభిప్రాయాన్ని వదులుకోవాలి. దీనివల్ల మరిన్ని తప్పులకు అవకాశం వుంది.
శరీరం పొందితే అతను వృద్ధాప్యం గురించి, రోగాల గురించి, మరణం గురించి భయపడాల్సి వుంటుంది. శరీర హద్దుల్ని అధిగమించాలి. నిన్ను నువ్వొక స్వచ్ఛమైన చైతన్యంగా భావించు. నువ్వు శరీరానివి కావు, శరీరస్పృహ వున్న వాడిగా భావించు. నువ్వు మనసు కూడా కావు ద్వారా మొదట శరీరంతో నిర్వహించు. తరువాత పెళుసయిన మనసు దగ్గరికి వెళ్ళినపుడు నీలో గొప్ప స్వేచ్ఛా ఆరంభమవుతుంది. గోడలు కూలిపోతాయి. నీ ముందు అనంత విశ్వం విస్తరించి వుంటుంది.
మొదట శరీరం, రెండోది మనసు, మూడోది హృదయం. వ్యక్తి జ్ఞానోదయాన్ని పొందాలంటే హృదయాన్ని కూడా వదులుకోవాలి. ఒకసారి నువ్వు శరీరం, మనసు, హృదయం ఏదీ కాదని తెలుసుకుంటే నువ్వెవరో నీకు తెలిసి వస్తుంది. అస్తిత్వమంటే ఏమిటో ఈ జీవితమంటే ఏమిటో తెలిసివస్తుంది. అన్ని రహస్యాలూ పూలు విచ్చుకున్నట్లు విడిపోతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
10 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment