శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 328-2. 'కళాలాపా'🌻

లాలాప మనగా లాలా జలము వలె ఊరునది. నోటి యందు లాలాజలము అపయత్నముగనే ఊరుచుండును. చతుర్ముఖ బ్రహ్మకు ఈ విధముగ ఇచ్ఛాశక్తిగ శ్రీమాతయే నిరంతరమై ప్రవహించు చుండును. నిజమునకు శ్రీమాత సంకల్ప ప్రవాహమునకు చతుర్ముఖ బ్రహ్మ వాహికయే గాని కర్త కాదు. చతుర్ముఖ బ్రహ్మను సంకల్పశక్తి భరించువానిగ నియమించి
ఇచ్ఛా స్వరూపిణియై శ్రీమాత వ్యక్త మగుచుండును.

భరించు వాడు గనుక చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి (ఇచ్ఛాశక్తి)కి భర్త యని కీర్తింప బడినాడు. భర్త అనగా భరించువాడని అర్థముగాని, యజమాని యని అర్థము లేదు. భరించువాడే తరించువాడు కూడ. సరస్వతిని భరించి సృష్టి భర్తయై చతుర్ముఖ బ్రహ్మ శాశ్వత కీర్తి పొందెను. సత్పురుషులు, అవతారమూర్తులు భరించుట నిర్వర్తించి చూపించిరి. ఈ ఒక్క కారణముగనే వారు పూజ్యులైరి. భరించుటను బట్టియే పూజార్హత. భరించుటను బట్టియే తరించుట కూడ నుండును. శ్రీమాత ప్రప్రథమముగ ఇచ్ఛాశక్తియై చతుర్ముఖ బ్రహ్మనుండి వ్యాప్తి చెంది సమస్త సృష్టి నిర్మాణమును గావించినది. 'కళారూపా' అను నామము మహత్తరమగు నామము అని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 328-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻

🌻 328-2. Kalālāpā कलालापा (328) 🌻

Her speech itself is an art. Lalitā Triśatī nāma 156 is also ‘Kalālāpā’. Kalā generally means sixty four types of fine arts. But, kala refers melodious voice. Ālāpa also means speech. This nāma refers to Her melodious voice as art or Kalā.

Saundarya Laharī (verse 38) mentions eighteen types of arts “as a result of whose conversation, the maturation of the eighteen arts takes place”. These eighteen arts are interpreted in different ways. The first one says, that the sixteen bīja-s of ṣodaśī mahā mantra, Devi and one’s guru make the eighteen. This is called aṣṭādaśaguṇitavidyā अष्टादशगुणितविद्या. Another interpretation refers to eighteen types of vidyā-s - śikṣā, kalpa, vyākaraṇa, nirukta, jyotiṣa, candas, Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, pūva and uttara mīmāṁsā, nyāya, purāṇa, dharma śāstra, Āyurveda, dhaṇurveda, gāndharva and nīti śāstra. This means, that from the melodious speech of Devi, the eighteen vidya-s originate and by attaining these vidya-s a person is able to distinguish between good and bad through the means of his mind.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2021

No comments:

Post a Comment