మైత్రేయ మహర్షి బోధనలు - 42


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 42 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 30. కృతజ్ఞత 🌻

సూటియైన ప్రవర్తనము, త్రికరణ శుద్ధి, ఔదార్యము, గంభీరత, మౌనము, కదలికలయందు రీతి, సింహ లక్షణములు. ధర్మము సింహము యొక్క ఆయువుపట్టు. నీచబుద్ధి అణుమాత్రము గూడా లేనిది సింహము. సింహ లక్షణములు లేనివారు మా ప్రణాళికా మార్గమున ప్రవేశింపలేరు. మా గురుపరంపర అంతయూ సింహరాశి ప్రభావముతో కూడినదే! కృతజ్ఞత, విశ్వాసము రెండు రెక్కలుగ ధర్మము ననుసరించు వారు మా కిష్టులు. ఇవి లేనివారు అధర్మపరులు. కలికి బానిసలు.

మా మార్గమున కృతజ్ఞత అత్యావశ్యకము. కృతజ్ఞత గలవారికి మా తోడ్పాటు కలదు. కృతజ్ఞత దివ్యమైన లక్షణమేగాక, సుందరమైనది కూడాను. కృతజ్ఞత హృదయపద్మ వికాసమునకు దోహదకారి. కేవలము కృతజ్ఞతా లక్షణమునుపాసించి దైవ సాన్నిధ్యమును చేరవచ్చును. కృతజ్ఞత జీవునకు అలంకార భూషణము. కృతఘ్నుడు పతితుడు. అతనికి సమస్త ద్వారములూ మూయబడును. కేవలము అసూర్య లోకముల దారి మాత్రమే తెరువబడి యుండును. కృతజ్ఞుడు విశ్వాసపాత్రుడు. అట్టివాడు గురు కార్యమునకు అర్హుడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2021

No comments:

Post a Comment