నిర్మల ధ్యానాలు - ఓషో - 109


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 109 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం తెలుసుకోవడం నించీ అనుభూతి దాకా చేసే యాత్ర. ధ్యానం లోపలికి చూడడాన్ని నేర్పుతుంది. ధ్యానం నిన్ను అంతిమమైన అడుగు వెయ్యడానికి నీకు శక్తి నిస్తుంది. కాబట్టి నీ సమస్త శక్తుల్ని, ప్రయత్నాల్ని ఒకదాని పైనే కేంద్రీకరించు. 🍀

ధ్యానం నిన్ను తలుపు దాకా తీసుకెళుతుంది. అది గొప్ప ప్రయాణం. అది మెదడు నించీ హృదయం దాకా చేసే యాత్ర. మీమాంస నించి ప్రేమ దాకా సాగేయాత్ర. తెలుసుకోవడం నించీ అనుభూతి దాకా చేసే యాత్ర. అందువల్లే ధ్యానానికి సైంటిస్టు కన్నా కవి సన్నిహితుడు, రాజకీయవాడి కన్నా నాట్యకారుడు సన్నిహితుడు, వ్యాపారవేత్త కన్నా ప్రేమికుడు, సన్నిహితుడు. కేవలం ధ్యానం గుండా కవి ఒక అడుగు ముందు వుంటాడు. లేని పక్షంలో తలుపు బయటే వుంటాడు. కవి ఆలయం ద్వారం ముందుంటాడు. కానీ బయటికి చూస్తాడు. మార్మికుడు కూడా తలుపు ముందే వుంటాడు కానీ లోపలికి చూస్తాడు.

ఒకే దగ్గర యిద్దరూ నిల్చున్నా ధ్యానం యిద్దర్లో తేడా చూపిస్తుంది. ధ్యానం లోపలికి చూడడాన్ని నేర్పుతుంది. కవి, మార్మికుల దృక్కోణాలు భిన్నమైనవి. ఒకరు బయటకు చూస్తారు. ఒకరు లోపలికి చూసారు. వున్నది ఒకే చోటు. అదే తేడా. ఒకసారి మార్మికుడు లోపలికి చూస్తే యిక ఆగడు. లోపలికి వెళతాడు. అతన్ని ఏదీ ఆపలేదు. అతని ఆకాంక్ష అంత బలీయమైంది. ధ్యానం నిన్ను అంతిమమైన అడుగు వెయ్యడానికి నీకు శక్తి నిస్తుంది. కాబట్టి నీ సమస్త శక్తుల్ని, ప్రయత్నాల్ని ఒకదాని పైనే కేంద్రీకరించు. ఒకటే గుర్తుంచుకో. అది ధ్యానం. అదే నీకు ఏకైక యథార్థంగా మారనీ.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2021

No comments:

Post a Comment