21-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 434 / Bhagavad-Gita - 434🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 222 / Sripada Srivallabha Charithamrutham - 222 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 102🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 125🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 38 / Sri Lalita Sahasranamavali - Meaning - 38 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 65🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 42 🌹 
8) 🌹. శివగీత - 7 / The Shiva-Gita - 7🌹 
9)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 12 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 49 / Soundarya Lahari - 49🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 348 / Bhagavad-Gita - 348 🌹

12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 176🌹 
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 53 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 49 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 64 🌹 
16) 🌹 Seeds Of Consciousness - 128 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 68 🌹
18) 🌹 Guru Geeta - Datta Vaakya - 10🌹
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 7 🌹
20) 🌹. భక్తి వలన ప్రయోజనం - అర్హత - ఏది సరైన సమయం? 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 434 / Bhagavad-Gita - 434 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 44 🌴*

44. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయమ్
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితవే పుత్రస్య సఖేవ సఖ్యు:
ప్రియ: ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ప్రతిజీవికిని పూజనీయుడైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు, నీ యెడ నొనరించిన నా తప్పులను దయతో సహింపుము.

🌷. భాష్యము : 
కృష్ణభక్తులు శ్రీకృష్ణునితో పలువిధములైన సంబంధములను కలిగియుందురు. ఒకరు కృష్ణుని పుత్రునిగా భావించవచ్చును, ఇంకొకరు కృష్ణునిగా భర్తగా భావించవచ్చును, మరియొకరు అతనిని మిత్రునిగా లేదా ప్రభువుగా తలచవచ్చును. ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణునితో మిత్రత్వ సంబంధమును కలిగియున్నాడు. తండ్రి, భర్త లేదా యజమాని సహనగుణము కలిగియుండునట్లుగా శ్రీకృష్ణుడు సైతము సహనగుణమును కలిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 434 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 44 🌴*

44. tasmāt praṇamya praṇidhāya kāyaṁ
prasādaye tvām aham īśam īḍyam
piteva putrasya sakheva sakhyuḥ
priyaḥ priyāyārhasi deva soḍhum

🌷 Translation : 
You are the Supreme Lord, to be worshiped by every living being. Thus I fall down to offer You my respectful obeisances and ask Your mercy. As a father tolerates the impudence of his son, a friend the impertinence of a friend, or a husband the familiarity of his wife, please tolerate the wrongs I may have done You.

🌹 Purport :
Kṛṣṇa’s devotees relate to Kṛṣṇa in various relationships; one might treat Kṛṣṇa as a son, or one might treat Kṛṣṇa as a husband, as a friend, or as a master. 

Kṛṣṇa and Arjuna are related in friendship. As the father tolerates, or the husband or a master tolerates, so Kṛṣṇa tolerates.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 222 / Sripada Srivallabha Charithamrutham - 222 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 42

*🌻. మొట్టమొదటిసారిగా పీఠికాపురవాసుల చేత దత్త దిగంబర ! దత్త దిగంబర ! శ్రీపాద వల్లభ దత్త దిగంబర ! " అనే నామస్మరణ ప్రారంభించబడి, విశ్వమంతా విఖ్యాతమవడం. 🌻*

భాస్కరశాస్త్రి ఇంకా ఇలా చెప్పసాగారు : 

శ్రీపాదులవారు ఏకరాత్రి దత్త దీక్షలను శూద్ర గృహంలో ఇవ్వడం, అంతర్ధానం అవడం, పీఠికాపురంలో చర్చనీయాంశమయ్యింది.

కొందరు బ్రాహ్మణులు పైకి సానుభూతి ప్రకటిస్తూ, బాపనార్యులవారి, శ్రీపాదులవారి, శ్రేష్ఠిగారి. వర్మగారి ఇళ్ళకు వెళ్ళి, ప్రతిచోటా అందరూ మహదానందంతో ఉండడం, ఇంకా శ్రీపాదులు తమతో నిరంతరం స్థూల దేహంతో వారి వద్దనే ఉన్నారని చెప్పడంతో, పరిస్థితులు ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయని భావించారు. దత్త దీక్షలను ఇచ్చిన సన్యాసికి ఇది అంతా గుండెలలో గుబులు పుట్టించసాగింది.

ఇంతలో సన్న్యాసి దగ్గరకు మహారాష్ట్ర దేశం నుంచి నరసింహఖాన్ అనే వృద్ధ
బ్రాహ్మణుడు వచ్చి, తన దగ్గర ఉన్న వరహాలను దక్షిణగా సమర్పించి, దత్త దీక్షను కోరాడు. సన్న్యాసి దీక్షను ఇవ్వడానికి అతని చేతిలో నీటిని పోయగానే ఒక తేలు కూడా వచ్చింది.

వృద్ధ బ్రాహ్మణుడు సన్న్యాసితో... అతని తపఃఫలాన్ని అతడు తనకు ధారపోశాడు, తాను దానిని పీఠికాపురానికే ధారపోస్తున్నానని చెప్పి... అదృశ్యుడయ్యాడు. 

ఇంతలో ఒక బ్రాహ్మణుడు తేలు కుట్టిందని అరిచాడు. తేలు మంత్రం వేసినా, అభిషేకాలు చేసినా, ఎన్ని
ప్రయత్నాలు చేసినా బాధ తగ్గలేదు. అతని నోటిలో నుండి నురగలు వచ్చి, కుట్టింది తేలు కాదు పాము అనుకున్నారు. రకరకాల వదంతులు మొదలైనాయి. చివరకు దయ్యం అన్నారు. ఆ దెయ్యం నుంచి తప్పించుకోడానికి ప్రతి ఇంటి ముందు ఓదెయ్యమా ! రేపు రా! అని వ్రాసారు. 

వెంకయ్య అనే పంటకాపు... శ్రీపాదులవారు ఇచ్చిన మంత్రాక్షతలను తేలు కరచిన వాడికివ్వగానే... అతడు బాగయ్యాడు.దీనితో అందరికీ ఆ సన్యాసి మీద నమ్మకం పోయి,అతని దగ్గర ఉన్న దక్షిణ అంతా తీసుకొని పంపించేశారు.

ఆ ధనంతో అష్టాదశ వర్ణాల వారికి కుక్కుటేశ్వర ఆలయానికి ఎదురుగా , అన్న సంతర్పణ జరిగింది. మొట్ట మొదటిసారి జనులందరూ *" దత్తదిగంబర!దత్తదిగంబర!శ్రీపాద వల్లభ దత్త దిగంబర!"* అనే దివ్యనామాన్ని జపించారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 222 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

*🌻 Sripada can prevent prarabdha karma and death also 🌻*

Thus he explained. My Dear! Shankar Bhatt! The same Maha Tejas (the grand effulgence) the dharma jyothi, which took birth in Peethikapuram is now making this Kurungadda sacred.  

The planets give results according to the ‘will’ of Sripada. There is no rule that the results in horoscope will materialize in a particular physical time or a physical place. That will be decided by the yoga kalam and yoga desam.

Sripada can make the incidents, which are supposed to happen after 1000 years according to horoscope, happen now itself. 

 That means he can decide the yoga kalam now itself. Things that are destined to happen in a some far of place, will happen here if He wills.  

That means he can decide the yoga desam also. All incidents happen in ‘time and place’ (kaalam and desam). Sripada can change those ‘times and places’ at His ‘will’.  

Once in Shresti’s house, at the time of breaking a coconut while worshipping God, Sripada Himself broke the coconut into pieces. The coconut was full of blood. 

Sripada said, ‘Thatha! Today there is a death yogam to you. Your head was supposed to break into pieces and blood should have flowed. 

 I invoked those ‘time and place’ into this coconut and saved you. Every one was surprised.’ Meanwhile it became dusk.  

All three of us took leave of Sripada, left Kurungadda and reached the other shore of Krishna river.   

End of Chapter 22

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 102 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 2 🌻*

రెండవ మంత్రం ఏమనగా "జీవో దేవః సనాతనః" ఈ జీవుడూ సనాతనుడైన దేవుడే గాని జీవుడు కాడు. జీవుడు సనాతనుడైన దేవుడు కనుక "త్యజేదజ్ఞాన నిర్మాల్యం" అజ్ఞాన నిర్మాల్యము తొలగించుకొనుట. అజ్ఞానము అనే మాసిన వస్ర్తమును అట్టే పెట్టుకోవాలి. 

అజ్ఞానము అంటే ఏమిటి? ఈ విషయం ప్రతి వెధవకి తెలుసు‌ జేబుకొట్టేస్తున్న వాడికి కొట్టేయకూడదని తెలియదా అందుకని ఎవరు చూడకుండా చేయిపెడతాడు. కొట్టేయకూడదని తెలియకపోతే అందరూ చూస్తుండగానే పెట్టేస్తాడు కదా. 

కనుక తెలియక ఏమాయ రోగం లేదు. ఎవరిని గురించి అయినా చెడ్డ విషయాలు చెప్పుకునేటప్పుడు చాటుగా వెళ్ళి ఎవరూ వినకుండా ఎందుకు చెప్పుకుంటాం. 

మనం చేస్తున్నది వెధవపని అని మనకు తెలుసు. లేకపోతే చాటుకు వెళ్ళి చెప్పుకోం కదా. దీని నుండి తొలగించటానికి చదువులు లాభం లేదు. మనం చేసే తప్పులన్నీ చదువుకునే చేస్తున్నాం కదా. 

ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే చేస్తున్నది తప్పు అని తెలియక కాదు. దీనికి పరిష్కారం ఏమనగా మనం మారడమనే శాస్ర్తీయ పద్ధతి ఉన్నది. 

మంచి మంచి పుస్తకాలన్ని పెట్టెలో పెట్టుకుని, అది నెత్తిన పెట్టుకుని అది మోసే Licence కూలీ కంటే మనం బాగా చదువుకున్న వాళ్ళము గొప్పవాళ్ళము ఏమీ కాదు. తలకాయ, మెడ ఆ పుస్తకాల వల్ల కుంగిపోతుంది తప్ప మరేమి ఉపయోగం లేదు. 

అందుకే వీరిని గురించి ప్రాచీనులైన పెద్దలు చక్కెర బస్తాలు, కలకండ బస్తాలు మోసే గాడిద లాంటి వారు అన్నారు. అంటే గాడిదకి బరువు తప్ప దాని తీపి తెలియదు కదా...
....✍ *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 124 🌹*
*🌴 The Pulsation - 2 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Mind and Respiration 🌻

The pulsation is more subtle than the objective mind, it continues to work even when we are sleeping. 

In the evening our awareness is absorbed by the pulsating principle and comes out again at the awakening. Respiration, circulation, and digestion happen in us without being consciously perceived. 

The mind contributes nothing to their functioning except disturbing their rhythm through a wrong way of living and thus causing disease.

This shows us that the mind is more an outer product. When it is talkative and agitated, the respiration is increased. 

By consciously aligning the mind with the respiration, the breathing rhythm slows down. The more the respiration slows down the more also the mind is decelerated. 

Finally it is absorbed by it and we remain just as the pulsating principle. When mind and respiration merge with the pulsation, the silence of existence only remains. 

Respiration and even heartbeat cease for a while. Many yogis and masters have repeated this state of being and even demonstrated it over a longer time.

In order to get to the state of pulsation it is recommended to observe the respiration 2-3 times a day for 27 breathes. 

We don’t have to do special breathing exercises; it is only registering how you breathe. Breathing is a happening within and not a doing. 

We have to observe how the inhalation transforms at a certain point into exhalation and how the exhalation into inhalation. 

There the thoughts stop. When we keep on contemplating over this point over years and listen to the sound of pulsation, SO-HAM, we are drawn into pulsation. 

Then the double sound is trans-formed into the monosyllabic sound OM, and the thought-less state expands from the breathing pause into the time of breathing.

In this state of meditation we are without body consciousness and only conscious of the pulsation. 

With the time and with alert observation we realise that the resonance of pulsation has the ability to move upward in the spine. 

At first we experience the resonance in the heart, then in the little cavity at the throat centre and later in the Ajna centre. 

In such an advanced contemplation the awareness can move via the Ajna centre out of the body and experience the etheric existence. In times of old people have consciously left the body at transition.

🌻 🌻 🌻 🌻 🌻 
Master K.P. Kumar: Listening to the Invisible Master / notes from seminars / Master E. Krishnamacharya: Spiritual Psychology.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 41 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

*🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 4 🌻*

దైవభక్తి ఉండి, దైవమంటే ఏమో తెలుసుకున్న జ్ఞానులకు యోగమార్గం సులభం. చిత్తవృత్తులాగిన స్థితిలో జడత్వానికి బదులు స్వీయ చైతన్యానుభవం కలగాలంటే ఇతర మార్గాల సహాయం అవసరమవుతుంది. 

స్వామి వివేకానందుల వారిలా అన్నారు. ‘‘భక్తి లేని వేదాంతం వెఱ్ఱియే. వేదాంతం లేని భక్తి మూఢ నమ్మకం మాత్రమే’’.

            భక్తి విషయంలో జ్ఞానం లోపిస్తే అది గౌణభక్తిగా, లేక బాహ్య భక్తిగానే ఉండిపోతుంది. ముఖ్యభక్తిగా మారదు. 

భక్తి సాధకులు అహం కారాదుల ప్రతి బంధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన జ్ఞాన సముపార్జన చేయాలి. లేకపోతే బాహ్య భక్తిలో వినోదిస్తూ కాలక్షేపం చేస్తారు. వీరికి పరాభక్తి సిద్ధించదు. 

సాధన చతుష్టయ సంపత్తిలో భాగంగా వివేక వైరాగ్యాలు, శమించడం, దమించడం, ద్వంద్వ రూప ప్రపంచంలో సమదృష్టి మొదలైనవి తెలుసుకుని ఆచరించాలి. అప్పుడే భక్తి సాఫల్యమవుతుంది.

            వీనిని బట్టి తేలిందేమంటే ఏ ఒక్క మార్గం అవలంబించినా ఇతర మార్గాల సహాయం తీసుకొనవలసిన అవసరముంటున్నది. అందువలన ఏది గొప్ప మార్గమనే దానిని అందరికీ సరిపోయేటట్లు నిర్ణయం చేయలేము.

            శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో నిరాకార బ్రహ్మంను సేవించడం కంటే సగుణారాధనయే శ్రేష్ఠమని తెలిపాడు. 

నిరాకార బ్రహ్మను జ్ఞాన, యోగ పద్ధతులతో గ్రహించడం శ్రమతో కూడినదని తెలిపాడు. ఈ మూడు మార్గాలలోను దేహాభి మానమే అడ్డుగా నిలుస్తున్నదని తెలుస్తున్నది.  

భక్తి మార్గంలో అయితే భక్తుల కర్మలు, కర్మ ఫలితాలు అన్నీ ఆ పరమాత్మకే అర్పిస్తే శీఘ్రమే మోక్ష ప్రాప్తి కలుగు తుంది అని గీతాచార్యులు తెలిపారు. 

దీనికోసం అభ్యాస యోగం, అది కుదరకపోతే భగవదర్పిత బుద్ధితో కర్మల నాచరించడం, అదీ వీలుకాకపోతే కర్మ ఫలత్యాగం చేయడం, ఇలా అర్థమయ్యే సాధనలను చేయవలసిన ప్రయత్నాలను భక్తియోగం తెలియచేస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 38 / Sri Lalita Sahasranamavali - Meaning - 38 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. శ్లోకం 71

305. రాజరాజార్చితా - 
రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.

306. రాఖినీ - 
కామేశ్వరునికే రాణి.

307. రమ్యా - 
మనోహరమైనది.

308. రాజీవలోచనా - 
పద్మములవంటి కన్నులు కలది.

309. రంజనీ - 
రంజింప చేయునది లేదా రంజనము చేయునది.

310. రమణీ - రమింపచేయునది.

311. రస్యా - రస స్వరూపిణి.

312. రణత్కింకిణి మేఖలా - 
మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 38 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 38 🌻*

305 ) Raja rajarchitha -   
She who is being worshipped by king of kings

306 ) Rakhini -   
She who is the queen of Kameshwara

307 ) Ramya -   
She who makes others happy

308 ) Rajeeva lochana -   
She who is lotus eyed

309 ) Ranjani -   
She who by her red colour makes Shiva also red

310 ) Ramani -   
She who plays with her devotees

311 ) Rasya -   
She who feeds the juice of everything

312 ) Ranath kinkini mekhala -   
She who wears the golden waist band with tinkling bells

Continues..
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 65 🌹*
*🌻 1. Annapurna Upanishad - 26 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-61. 'This is a friend; that is a foe; this is mind; that is a stranger' - this sort of knowledge does not occur to me, O Brahmin; no affection touches me. 

V-62. Rid of all latent impressions, the mind is liberated from old age and death. Mind with latent impressions inherent in it is knowledge. What is to be known is the mind rid of all latent impressions. 

V-63. When the mind is rejected, this duality on all sides is dissolved; but remains the tranquil supreme One, pure and untrammeled. 

V-64. The endless, unborn, un-manifest, un-ageing, tranquil, un-lapsing, non-dual, beginningless and endless which (nevertheless) is the first Apprehension. 

V-65. One, devoid of beginning and end, wholly spirit, pure, pervasive and subtler far than the sky; thou art that Brahman indubitably. V-66. Undetermined by space, time, etc.; superlatively pure, ever arisen, omnipresent, this one End is all-in-all; be thou that pure Spirit. 

V-67. 'All is this tranquil one, devoid of beginning, middle and end. All is unborn, both Being and nonbeing' - so thinking, be happy. 

V-68. I am not bound nor liberated. I am indeed the untrammeled Brahman. I am free from duality. I am being, Intelligence, bliss. 

V-69. Keeping far away the entire multitude of objects, be you ever devoted to the Self, your mind all cooled. 

V-70. 'This is fine; this is not! -- Such (feeling) is the seed of your extended sorrow. When that is burned in the fire of impartiality, where is the occasion for sorrow?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 7 / The Siva-Gita - 7 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 7 🌻*

శివ భక్తిశ్చ సర్వేషాం - సర్వదా సర్వతో ముఖా,
తస్యాం చ లిష్య మానాయాం - యస్తు మర్త్యో విముచ్యతే .22
సంసార బంధ నాత్తస్మా - ధన్యః కో వావి మూడది :

శివ భక్తి ఎవరి యందు దృడ పడునో వారలకు (శివ భక్తులకు ) ఎల్లప్పుడు కోరికలను దీర్చును. దానిలో పూర్తిగా ఆసక్తి గలవాడు ఈ సంసార పాశ బంధముల నుండి విడువ బడుచున్నాడు.

నియ మాద్యస్తు కుర్వీత - భక్తిం వాద్రో హమేవ వా ;
తస్యాపి చేత్ప్ర సన్నో సౌ - ఫలం యచ్ఛతి వాంచితమ్ 23
బుద్దిం కించిత్స మాదాయ - క్షుల్లకం జలమేవ నా ,
యోదత్తే నియమేనా సౌ - తస్మై దత్తే జగత్ప్రయమ్ 24

ఏనాడు నియమము తప్ప కుండా పరమ శివుని పై భక్తితో గాని, చెడ్డ తనము చేయకుండగా గాని ఆచరించునో అట్టి భక్తునకు పరమాత్ముడు ప్రత్యక్షమై సంతోషించిన వాడై సర్వాభీష్టములను సఫల మొనర్చును. బిల్వ దళము గాని, జలము గాని, అనన్య భక్తితో సమర్పించునో అతనికి నా పరమశివుడు త్రైలోకాదిపత్యము నొసంగును.

తస్యాప్య శక్తి నియమా - న్నమస్కారం ప్రదక్షిణామ్,
యః కరోతి మహేశస్య - తస్మై తుష్టో భవేచ్చినః 25
ప్రదక్షిణా స్వవక్తోపి - యస్స్వాంతే చింత యేచ్చినమ్,
గచ్చన్స ముపవిష్టో వా - తస్యా భీష్టం ప్రయచ్ఛతి.26

అట్లు చేయుట కవకాశము లేనిచో ప్రదక్షిణ నమస్కారముల మనస్పూర్తిగా సమర్పించినను అందుకు ప్రసన్నుడై మృత్యుంజయు డానం దించును. అందుకును అవకాశముఅధవా సామర్ధ్యము లేని యెడల తానున్న చోటనే పరమ శివుని మనస్సులో ధ్యానించ వలెను. దాన శివుడు కోరిన కోరికల తీర్చును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 7 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 7 🌻*

22. One whose Shiva Bhakti becomes strong, such people would get all theyr desires fulfilled by it. But for those who are totally submitted in Shiva Bhakti, would get liberated out of the birthrebirth cycle and would attain Salvation.

23. 24. One who is devoted to Paramashiva with veneration, or devoted to him without doing any sins, with such kind of devotee Lord would be highly pleased, would fulfill all his wishes. 

One who dedicates Shiva the Bilva leaves, or water with full devotion; with him lord would be so pleased that he can bestow the devotee the empire of the three worlds. (Such a kind hearted Lord is our Lorrd Shiva).

25. 26. One who is unable to worship Shiva (as described in previous slokas), if he circumambulates and offers Namaskara (Salute) to the Lord, the Lord would get pleased and would become happy. 

Even to this simple thing as well, if someone doesn't have time or is unable to do, he can simply think of lord Shiva from the same place where he is. 

With this insignificantly seeming prayer also Lord Shiva would shower all the boons which the devotee is desirous of!! (That shows the generosity of Lord Shiva. How much he loves us, we can understand from the above Verse!!).

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 12 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

వీరబ్రహ్మేంద్రస్వామి తనకు తెలిసిన భవిష్యత్ విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు.

అంతే కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామి వివిధ ఊళ్లు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారు, విశ్రమించేవారు. కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు.

అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు.

వీరబ్రహ్మేంద్రస్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లెలో ఒకచోట పాతిపెట్టారు. తర్వాత దానిపైన ఒక చింతచెట్టు మొలిచింది. ఈ చింతచెట్టు వయసు 4, 5 వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు.

ఈ చింతచెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టునుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని, స్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం.

వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సౌందర్య లహరి - 49 / Soundarya Lahari - 49 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

49 వ శ్లోకము

🌴. అన్నింటా విజయం, జీవితంలో సంపన్నత అవకాశాలు, విశేష జ్ఞానం 🌴

శ్లో: 49. విశాలా కల్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయైః 
కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికాl 
అవన్తీ దృష్టిస్తే బహునగర విస్తార విజయా* 
ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతేll 
 
🌻. తాత్పర్యం :  
అమ్మా ! నీ చూపు విశాలమయి విశాల అను పేరు గల నగరముగానూ. మంగళ కరమై కళ్యాణి అను నగరముగానూ, చక్కని కాంతి కలిగి నల్లకలువలతో పోల్చుటకు వీలుకానిదయి అయోధ్య అను నగరముగానూ, కరుణారస ధారలకు అనువై ధారా నగరముగానూ, అతి మధురమై మధుర గానూ, లోపల వైశాల్యము కలదై భోగవతి నామముగల నగరముగానూ, కోరి వచ్చిన వారిని రక్షించు అవంతి అను నామము కలదై ఇలా అనేక నగరములతో కూడి విజయ నగరమై వర్తించు చున్నది కదా !.
  
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 10 రోజులు జపం చేస్తూ, తేనె, పొంగలి నివేదించినచో అన్నింటిలో విజయం మరియూ జీవితంలో సంపన్నతకు అవకాశాలు, విశేష జ్ఞానము లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 SOUNDARYA LAHARI - 49 🌹 
📚. Prasad Bharadwaj 

SLOKA - 49 

🌴 Victory in Everything, locating of Treasures in life and Great Wisdom 🌴

49. Vishala kalyani sphuta-ruchir ayodhya kuvalayaih Kripa-dhara-dhara kimapi madhur'a bhogavatika; Avanthi drishtis the bahu-nagara-vistara-vijaya Dhruvam tattan-nama-vyavaharana-yogya vijayate 
 
🌻 Translation : 
The look from your eyes, oh goddess is all pervasive, does good to every one, sparkles everywhere, is a beauty that can never be challenged, even by blue lily flowers, is the source of rain of mercy, is sweetness personified, is long and pretty, is capable of saving devotees, is in the several cities as its victory.and can be called by several names, according to which aspect one sees.

Chanting procedure and Nivedyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 10 days, offering honey and pongal as prasadam, it is believed that they are assured of locating all riches and treasures in life get Great wisdom.

🌻 BENEFICIAL RESULTS: 
Discovery of hidden treasures, gaining of lost property, cure of eye diseases. 
 
🌻 Literal Results: 
Visiting number of big towns and metropolitan cities, extensive travel and heights of luxury. Ability to clear misunderstanding of situations and people. Great wisdom.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 348 / Bhagavad-Gita - 348 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 29 🌴*

29. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియ: |
యే భజన్తి తు మాం భక్యా మయి తే తేషు చాప్యహమ్ ||

🌷. తాత్పర్యం :
నేనెవరిని ద్వేషింపను, ఎవరి యెడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల యెడ సమముగా వర్తింతురు. కాని భక్తితో నాకు సేవనొసగెడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణుడు సర్వుల యెడ సమముగా వర్తించువాడైనచో మరియు అతనికి ఎవ్వరును ప్రత్యేక స్నేహితులు కానిచో తన దివ్యసేవలో సదా నిమగ్నులై యుండెడి భక్తుల యెడ ఎందులకై ప్రత్యేకశ్రద్ధ వహించుననెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. కాని వాస్తవమునకు ఇది సహజమేగాని భేదభావము కాదు. 

ఉదాహరణకు జగమునందు ఎవరేని మనుజుడు గొప్పదాత యని పేరుగాంచినను, తన సంతానము యెడల అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును. 

అదే విధముగా భగవానుడు వివిధరూపములలో నున్న సర్వజీవులను సంతానముగ భావించి వారి జీవితావాసరమునకు కావలసిన సర్వమును ఉదారముగా సమకూర్చును. 

భూమియని గాని, కొండయని గాని, జలమని గాని ఎట్టి భేదభావము లేకుండా వర్షమును కురిపించెడి మేఘము వంటివాడు ఆ దేవదేవుడు. కాని తన భక్తుల యెడ మాత్రము అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును. 

అట్టి భక్తిపరాయణులైనవారే ఈ శ్లోకమునందు పేర్కొనబడినవారు. కృష్ణభక్తిభావనలో సదా నిలిచియుండుటచే ఆ భక్తులు నిత్యము కృష్ణుని యందే స్థితిని కలిగియుందురు. 

కనుకనే కృష్ణభక్తిభావనము నందున్న మహాత్ములు దివ్యాత్ములై ఆ శ్రీకృష్ణభగవానుని యందు నిలిచియున్నట్టివారని “కృష్ణభక్తిరసభావనము” అనెడి పదము సూచించుచున్నది. తత్కారణముగనే శ్రీకృష్ణుడు “మయితే” (వారు నాయందున్నారు) అని స్పష్టముగా పలికియున్నాడు. 

అనగా భగవానుడు వారియందున్నాడు. ఇట్టి పరస్పరానుభవమే “యే యథా మామ్ ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్” అనెడి భగవానుని వాక్యములను సైతము వివరించును. 

అనగా “ఎవరు ఏ విధముగా నన్ను శరణు పొందుచున్నారో, వారి యెడ తదనుగుణముగా నేను వారి రక్షణభారమును వహింతును” అని దాని భావము. 

భగవానుడు మరియు భక్తుడు ఇరువురును చైతన్యవంతులే గనుక వారి నడుమ ఇట్టి దివ్య పరస్పరానుభూతి, ఆశ్రయత్వము సమంజసమే. ఉదాహరణకు ఒక వజ్రము బంగారపు ఉంగరములో పొదగబడినప్పుడు ఆకర్షణీయముగా నుండును. బంగారము శ్లాఘింపబడినపుడు వజ్రము సైతము శ్లాఘింపబడును. 

వాస్తవమునకు భగవానుడు మరియు జీవుడు ఇరువురును నిత్యకాంతి శోభితులు. అట్టి జీవుడు భగవానుని సేవించుటకు ఆసక్తుడైనచో బంగారమువలె శోభించును. అట్టి యెడ వజ్రమువంటి భగవానునితో అతని కలయిక అత్యంత సుందరమై అలరారును. 

అట్టి శుద్ధస్థితిలో గల జీవులే భక్తులనబడుదురు మరియు భగవానుడు అటువంటి భక్తునికి స్వయముగా తాను భక్తుడగును. భగవానుడు మరియు భక్తుల నడుమ ఇట్టి సంబంధము లేనిచో సాకారతత్త్వమునకు మనుగడయేలేదు. 

నిరాకారతత్త్వమున భగవానుడు మరియు భక్తుల నడుమ అట్టి పరస్పర వినిమయ సంబంధము లేకున్నను సాకారతత్త్వమున మాత్రము అట్టి దివ్యసంబంధము నిశ్చయముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 348 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 29 🌴*

29. samo ’haṁ sarva-bhūteṣu
na me dveṣyo ’sti na priyaḥ
ye bhajanti tu māṁ bhaktyā
mayi te teṣu cāpy aham

🌷 Translation : 
I envy no one, nor am I partial to anyone. I am equal to all. But whoever renders service unto Me in devotion is a friend, is in Me, and I am also a friend to him.

🌹 Purport :
One may question here that if Kṛṣṇa is equal to everyone and no one is His special friend, then why does He take a special interest in the devotees who are always engaged in His transcendental service? But this is not discrimination; it is natural. Any man in this material world may be very charitably disposed, yet he has a special interest in his own children. 

The Lord claims that every living entity – in whatever form – is His son, and so He provides everyone with a generous supply of the necessities of life. He is just like a cloud which pours rain all over, regardless of whether it falls on rock or land or water. 

But for His devotees, He gives specific attention. Such devotees are mentioned here: they are always in Kṛṣṇa consciousness, and therefore they are always transcendentally situated in Kṛṣṇa. 

The very phrase “Kṛṣṇa consciousness” suggests that those who are in such consciousness are living transcendentalists, situated in Him. The Lord says here distinctly, mayi te: “They are in Me.” 

Naturally, as a result, the Lord is also in them. This is reciprocal. This also explains the words ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham: “Whoever surrenders unto Me, proportionately I take care of him.” 

This transcendental reciprocation exists because both the Lord and the devotee are conscious. When a diamond is set in a golden ring, it looks very nice. The gold is glorified, and at the same time the diamond is glorified. 

The Lord and the living entity eternally glitter, and when a living entity becomes inclined to the service of the Supreme Lord he looks like gold. The Lord is a diamond, and so this combination is very nice. Living entities in a pure state are called devotees. 

The Supreme Lord becomes the devotee of His devotees. If a reciprocal relationship is not present between the devotee and the Lord, then there is no personalist philosophy. 

In the impersonal philosophy there is no reciprocation between the Supreme and the living entity, but in the personalist philosophy there is.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 176 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
39. అధ్యాయము - 14

*🌻. శివపూజ - 9 🌻*

జ్వరప్రలాప శాంత్యర్థం జలధారా శుభావహా || 67

శతరుద్రియ మంత్రేణ రుద్రసై#్యకాదశేన తు | రుద్ర జాప్యేన వా తత్ర సూక్తేన పౌరుషేణ వా || 68

షడంగేనాథ వా తత్ర మహామృత్యుం జయేన చ | గాయత్ర్యా వా నమోంతైశ్చ నామభిః ప్రణవాది భిః || 69

మంత్రైర్వాథాగమోక్తైశ్చ జలధారాదికం తథా | సుఖసంతానవృద్ధ్యర్ధం ధారాపూజనముత్తమమ్‌ || 70

నానాద్రవ్యైశ్శు భైర్దివ్యైః ప్రీత్యా సద్భస్మధారిణా | ఘృతధారా శివే కార్యా యావన్మంత్ర సహస్రకమ్‌ || 71

జ్వరము, దానిలో కలిగే ప్రలాపము శాంతించి, శుభములు కలుగవలెనన్నచో, శివునిపై జలధారను అభిషేకించవలెను (67).

 శతరుద్రీయమును పదకొండు సార్లు , లేదా పురుషసూక్తమును పఠించి అభిషేకించవలెను (68). 

ఋషి, దేవత, ఛందస్సు, బీజము, శక్తి, కీలకము అను ఆరు అంగములతో కూడిన మహామృత్యుంజయ మంత్రముతో గాని, గాయత్రీ మంత్రముతో గాని, తేదా ఓం కారముతో మొదలిడి నమః తో అంతమయ్యే నామములతో గాని అభిషేకించవలెను (69). 

లేదా, ఆగమోక్త మంత్రములచే జలధారను శివునిపై అభిషేకించినచో, అది ఉత్తమమగు అభిషేకమగును. దానివలన చక్కని సంతానము కలుగును (70).

 భక్తుడు మంచి భస్మను ధరించి, శుభద్రవ్యములతో శివుని పూజించవలెను. సహస్రనామములను పఠిస్తూ నేతిధారతో శివుని అభిషేకించవలెను (71).

తథా వంశస్య విస్తారో జాయతే నాత్ర సంశయః | ఏవం మదుక్త మంత్రేణ కార్యం వై శివపూజనమ్‌ || 72

బ్రహ్మ భోజ్యం తథా ప్రోక్తం ప్రాజాపత్యం మునీశ్వరైః | కేవలం దుగ్ధధారా చ తదా కార్యా విశేషతః || 73

శర్కరామిశ్రితా తత్ర యదా బుద్ధిర్జడో భవేత్‌ | తస్యా సంజాయతే జీవసదృశీ బుద్ధిరుత్తమా || 74

యావన్మంత్రాయుతం న స్యా త్తావద్ధారాప్ర పూజనమ్‌ |

అపుడు వంశము విస్తరించుననుటలో సందియము లేదు. ఈ విధముగా నేను చెప్పిన మంత్రముతో శివుని పూజించవలెను (72). 

మరియు బ్రాహ్మణులకు భోజనమునిడి, ప్రాజాపత్యవ్రతము నాచరించవలెనని మునిశ్రేష్ఠులు చెప్పినారు. బుద్ధి మాంద్యము గల భక్తుడు శివునిపై పంచదార కలిపిన పాలతో ధారారూపముగా అభిషేకించినచో (73), 

అట్టి భక్తునకు తగిన ఉత్తమమగు బుద్ధి కలుగును (74). 

పదివేల మంత్ర జపము పూర్తియగు వరకు ధారతో నిరంతరము అభిషేకించవలెను.

సశేషం.. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 53 🌹*
Chapter 15
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

🌻 THE PATH TO TRUTH - 2 🌻

Gross sanskaras are made of gros s matter; subtle sanskaras are made of subtle matter; and mental sanskaras are made of mental matter. Naturally, gross sanskaric matter is dense, subtle sanskaric matter is fine, and mental sanskaric matter is the very finest. Subtle and mental sanskaric m atter cannot be seen by gross eyes, but for the sake of example so you see how the sanskaras unwind along the path, let us visualize this: 

First, the path is straight like a strong rod. Second, the gross sanskaras are like rope, subtle sanskaras are fine mental sanskaras are finest like thread. 
Are like a cord, and Third, the unnatural sanskaras are at the end of the rod, twisted in every which way, and thereby are knotted into a mess. Thus one sees here unnatural sanskaras cannot be unwound; they must be cut.  

One sees that when unnatural sanskaras disappear, the natural gross sanskaras twist themselves along the rod becoming thinner and thinner, until they are a subtle cord.  

The subtle sanskaras twist themselves around the rod, becoming thinner and thinner, until they in turn become mental threads.  

These mental sanskaric threads twist themselves around and around the rod, until they gradually become so fine that they disappear altogether. 

 In this diagram one visualizes the process of the straight path and th e gradual sanskaric annihilation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 49 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 23
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆదిమూర్త్యాది పూజావిధి - 3 🌻*
*సర్వకార్య జయమునకు*

వనమాలాం చ శ్రీవత్సకౌస్తుభౌ దికృతీన్‌ బహిః | స్వమన్త్రైరరచ్చయేంతృర్వాన్విష్ణోరర్భావసాగతుః 17

వ్యస్తేన చ సమస్తేన అఙ్గేర్భీజేన వై యజేత్‌ | జప్త్వా ప్రదక్షిణీకృత్య స్తుత్వార్ఘ్య చ సమర్ప్యచ 18

హృదయే విన్యసేద్ధ్యాత్వా అహం బ్రహ్మహరిస్త్వితి |

వనమాలను, శ్రీ వత్సమును, కౌస్తుభమును కూడ ఉంచవలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. 

ఈ అంగదేవతల నందరిని వారి వారి మంత్రములచే పూజించవలెను. విష్ణుపూజ పూర్తియైన పిమ్మట అంగదేవతలను వ్యస్తరూపమునను, నమస్తరూపమునను బీజాక్షరయుక్త మంత్రములతో పూజింపవలెను. 

జపించి, ప్రదక్షిణముచేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి "నేనే బ్రహ్మను, నేనే హరిని" అని ధ్యానము చేసి హృదయమునందు ఉంచుకొనవలెను. 17-18

ఆగచ్ఛావాహనే యోజ్యం క్షమస్వేతి విసర్జనే. 19

ఏవమష్టాక్షరాద్వైశ్చ పూజాం కృత్వా విముక్తిభాన్‌ |

అవాహనము చేయు నపుడు 'అగచ్ఛ' అనియు, ఉద్వాననము చెప్పునపుడు 'క్షమస్వ' అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజ చేసి ముక్తిని పొందును. 19

ఏకమూర్త్యర్చనం ప్రోక్తం నవవ్యూహార్చనం శృణు. 20

అఙ్గష్ఠద్వయకే న్యస్య వాసుదేవం బలాదితన్‌ | తర్హన్యాదౌ శరీరే7థ శిరోలలాటపవక్త్రకే. 21

హృన్నాభిగుహ్యజాన్వఙ్ఘ్ర మధ్యే పూర్వాధికం యజేత్‌ |

ఏకపీఠే నవవ్యూహం నవపీఠం చ పూర్వవత్‌. 22

నవాబ్జే నవమూర్త్యా చ నవవ్యూహం చ పూర్వవత్‌ | పద్మమధ్యే చ తత్థ్సాని వాసుదేవం చ పూజయేత్‌. 23

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఆదిమూర్త్యాదిపూజావిధిర్నామ త్రయోవింశోధ్యాయః

ఇంతవరకును ఏకమార్త్యర్చనము చెప్పబడినది. ఇపుడు నవ వ్యూహార్చనమును వినుము. అంగుష్ఠద్వయము నందును తర్జన్యాదులందును వాసుదేవుని, బలాదులను న్యానము చేయవలెను. 

పిమ్మట శిలస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటియందు న్యాసము చేసి మధ్యయందు పూర్వాదిక్‌ పూజా చేయవలెను. 

ఏకపీఠముపై. క్రమముగ, నవ వ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుకటివలెనే పూజించవలెను. 

నవాబ్జములందు నవమూర్తుల నావాహనము చేసి నవవ్యూహపూజ వెనుకటివలెనే చయవలెను. పద్మ మధ్యమునందు వాటి యందున్న దేవతను, వాసుదేవుని పూజించవలెను.

అగ్ని మహాపురాణమున ఆదిమూర్త్యాది పూజావిధి యను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 64 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 9 🌻*

18. సంప్రదాయంలో – పట్టాల మీద రైలులాగ - మనిషి ఉండవచ్చు. తన అనుష్ఠానం విషయంలో అలాగే ఉండాలి కూడా. అయితే Research కాని, దాన్ని గురుంచిన పరిశోధన విషయంలోకాని స్వేఛ్ఛగా ఆలోచించవచ్చు. అన్ని విషయములను, దానిపై విమర్శలనుకూడా పరిశీలించే బాధ్యత తీసుకోవచ్చు. అందులో తప్పులేదు. తన సంప్రదాయాన్ని క్రియాకలాపంలో తాను అనుష్ఠిస్తూ, బుద్ధికి పదును పెట్టే విమర్శచేయటంలో తప్పేమిటి? అయితే ఆ దృష్టి మనవారికి లేకపోయింది. ఆ దృష్టి లేకపోవటంచేతనే మన ప్రాచీనవిజ్ఞానం నశించిపోయింది.

19. ఒక మార్గంలో ఏదో ఒక యజుశ్శాఖలోనో, మరొక శాఖలోనో వ్యక్తి తన సంప్రదాయపరంగా ఉండవచ్చు. తనకుతాను తన ఆచారంలో విధించబడిని విధంగా కర్మకాండ తను చేసుకోవచ్చు. పూర్వమీమాంసకుడు కావచ్చు. కాని పరిశోధన చేయటానికి అభ్యంతరమేమిటి? తన పరిధికి బయటనున్న విషయములు తెలుసుకోవచ్చు కదా! సంప్రదాయం అనుభవంలో ఉన్నవాడికి, ఆ విశేషమయిన దృష్టితో ఇతరవిషయములన్నీ, విమర్శ్లన్నీ అర్థమై, అవగాహనమయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది కదా! అయితే అలాంటివాళ్ళు మనకు లేకపోయారు. దురదృష్టవశాత్తు పండితులంటే – గ్రంథమంతా ముఖస్థం చేసినవాళ్ళు అనే పేరువచ్చిందితప్ప, స్వతంత్రభావంతో విమర్శనాదృష్టితో ఏదయినా ఒక విషయం తెలియచెప్పిన వాళ్ళలాగా ఎవరూ కనబడటం లేదు. అందుకని అనుష్ఠానపరులు కాని వాళ్ళు, సంప్రదాయంలో ఉన్నాలేకపోయినా కేవలం academic దృష్టితో విమర్శిస్తున్నారు. 

20. అలాగే కొందరు విదేశీయులు, ఇతరులుకూడా దానిని అలాగే విమర్శిస్తున్నారు. సంప్రదాయంలో ఉన్నవాడేమో సంప్రదాయం లేనివాడి విమర్శను అంగీకరించడంలేదు. అందుకే ఈ సంకటమంతా వచ్చింది. ఏది నిజమో తెలియదు. కనుక పరిశీలన అవసరం. కాబట్టి కొంత పరిశీలన ఆవశ్యం జరుగుతుంది. జరగాలి కూడా. భవిష్యత్తులో ఎప్పటికప్పుడు మళ్ళీ వేదభాష్యాలను ఉద్దరించి చదువుతారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 10 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 Even You Found your Guru, You should not relax too much. You are still on the edge. It is easy for you to slip and fall. Remain as disciplined as possible 🌻*

OM. Obeisance to Sadguru. “Since he is anyway going to come, why should we make any deliberate effort to go in search of Guru?” It is a false argument put forth by some, who are nothing but lazy. 

The reason is that out of His infinite compassion the foremost Guru assumes innumerable forms to suit the innumerable differences in his disciples. 

Not all of the forms are suitable for you. Not all of them are useful for you. Only some of those are of use to you. While you are still preparing to qualify for Guru, the Sadguru who is a match for you will be within proximity but will not reveal himself to you until the right time comes. It is only when you become eligible that his presence will become disclosed. 

All your evil ways should leave you. That yearning that burns within you which makes you search for Guru with eagerness and zeal, qualifies you to receive Guru in your life. 

You have not remained complacent and idle. Only when your heart is pure, attentive, committed, calm, devout, gentle, earnest, knowledgeable, and sincere, you become eligible to find Guru. 

It is not enough if you simply close your eyes and tell yourself that you are seeking Guru. He, who has all along been close to you, then becomes recognizable in your heart. If you assume that since Guru has entered your life, all your troubles and responsibilities are at an end, that you do not have to worry about children or other obligations any more, you have made a huge mistake, and you will take a big toss. Yes, you have climbed a huge step. You have in fact reached the next higher level. But you are still on the edge. It is easy for you to slip and fall. 

Now a certain peace and calm have entered into you. Because of the spiritual zeal and agony with which you have searched for Guru, you have now found Guru. You now feel a certain respite and solace. 

Your thoughts are more at ease now. Your sense organs have earned some strength and courage. These are the benefits you have acquired by the entry of Guru into your life. 

But because you have now become free from fear, your grip on your sense organs may loosen. Because of that, all the suppressed worldly desires may once again raise their heads. Your lack of self-restraint may resurface. 

You must not relent in your tough determination in your pursuit. If your intellect becomes relaxed, your mental frailties will once gather strength. 

If you think, “Sadguru is there now to take care. Why should I continue with my efforts and why should I struggle anymore? I can now behave as I please. 

I do not need to follow strict austerities. Now that Guru has taken charge of my life, let me eat what I want, let me talk as I please, let me indulge in entertaining myself as my heart desires,” you are going to invite big trouble upon yourself. 

Only if you remain as disciplined, as austere, and as self-restrained and committed as you were, while you were anxiously searching for Guru, only then, you will be successful. Otherwise you will not.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 67 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 Q 61:--మానవ దేహ, జంతు చరిత్ర - 1 🌻*

Ans :--
1) ఆట్లాంటిస్, లెమోరియా నాగరికతల్లో మనకంటే ఎన్నో వేల రేట్లు తెలివైన వాళ్ళు వున్నారు. వాళ్ళు అభివృద్ధి చేసిన సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ ఇప్పటికంటే కొన్ని వేల రెట్లు మెరుగ్గా ఉండింది.

2) కొన్ని నాగరికతల్లో జంతుజాతులు మనకంటే ఎంతో తెలివిగా ఉండి వాహనాలు నడిపేవి, పనిముట్లు తయారు చేసేవి, యుద్ధాలు చేసేవి, అవి కూడా సైన్స్, మెడిసిన్,
టెక్నాలజీ ని అభివృద్ధి చేశాయి. అవి ఎంతో మానసికంగా అభివృద్ధి చెందాయి. మనుష్యజాతి జంతువుల దగ్గరకు వెళ్లి ఎన్నో విషయాలు నేర్చుకునేవి.

3) వైద్యశాస్త్రంనకు సంబంధించిన విషయాలు,దేహఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మానవుడు జంతుజాతి నుండి నేర్చుకునేవాడు. ఇవన్నీ చదువుతుంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏమంటే ఆత్మశకలాలు ఏ దిశలోనైన, ఏ దేహంతో నైనా చైతన్య పరిణామం చెందగలవు.

4) మత్స్యకన్యలు, నాగకన్యలు మనిషితల+చేప దేహం,
మనిషితల+పాముదేహం ఇలాంటి combinations తో కూడా జీవజాతులు అవతరించి జీవించి నిష్క్రమించాయి.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 128 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 You cannot fight pain and pleasure on the level of consciousness.... 🌻*

To go beyond them you must go beyond consciousness, which is possible only when you look at consciousness as something that happens to you and not in you, as something external, alien, superimposed.

Then, suddenly you are free of consciousness, really alone, with nothing to intrude. And that is your true state.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 7 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

కామమునకు అధిపతి మన్మథుడు. ఈ మన్మథుని చేతిలో ఐదు బాణములు వుంటాయి. పంచపుష్పబాణుడు అంటారు వీటినే. పంచచామరములు. 

ఆ పంచపుష్పబాణుడు ఏం చేస్తాడంటే, ఆ పుష్పబాణాలను ప్రయోగిస్తాడు. అవి కామప్రేరణ కలుగుతుంది. కోర్కె కలుగుతుందన్నమాట! ఆ కోర్కె ప్రభావం చేత, గుణ ధర్మాలు కలుగుతాయి. 

గుణ ధర్మాల చేత విషయవాసనలు ప్రకోపిస్తాయి, ఆ ప్రలోభం చేత సుఖదుఃఖ ప్రలోభితులు కలుగుతుంది. ఆ సుఖదుఃఖ స్మృతుల ప్రభావం చేత, వాసనాబలం ప్రేరితమై తత్ రీతిగా మానవుడు జీవిస్తూ వుంటాడు. 

ఇది జీవభావంలో వున్నటువంటి ప్రతిబంధకం. ఈ ప్రతిబంధకాన్ని పోగొట్టాలి అంటే, అనురాగం అనేటటువంటి స్థితినుంచీ ప్రేమ అనేటటువంటి స్థితికి మారాలి.

            ఈశ్వరానుగ్రహం లేకుండా ఏ మానవుడు ఈ ప్రేమ అన్న స్థితిని తెలుసుకోలేడు. ఎవరికైతే ఈ నిర్వాణానుభవం లేదో, వారికి ప్రేమ మృగతృష్ణ వంటిది. అంటే అర్థం ఏమిటి? 

ఎండమావిలో నీరు ఎంత సత్యమో, జీవభావంలో ప్రేమ అంత సత్యము. ఆత్మభావనలో, నిర్వాణ సుఖంలో, నిర్వాణానందంలో ఏ స్థితి అయితే కదలక, మెదలక స్థిరంగా, సమంగా ద్వంద్వ ప్రవృత్తులకు లోబడకుండా వుంటుందో, దాని పేరే ‘ప్రేమ’. ఈ ‘ప్రేమ’ చాలా విలువైనది. ఈ ప్రేమ చాలా రకాల విశాల భావనలతో, విస్తృత అర్థంతో ప్రయోగించబడుతోంది ఈ తత్త్వజ్ఞానంలో. ఈ ‘ప్రేమ’ అనేటటువంటి లక్షణమే లేకుండా నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరగలేవు. 

ఈ సౌర కుటంబం విశ్వంలో... తన స్థానంలో తాను నిలబడలేదు. విశ్వమంతా వ్యాపకమై దాని దాని స్థానములలో, వాటి వాటి పనులను నిర్వహించే కూడా ఈ ప్రేమ వల్లనే!! కాబట్టి ఈ ప్రేమ విశ్వజనీనమైనది, విశ్వవ్యాపకమైనది.

         వ్యాపక ధర్మంతో కూడినటువంటి ‘ప్రేమ’ అనేటువంటి లక్షణాన్ని జీవభావంలోకి వచ్చేటప్పటికి ‘నేనొక వస్తువును ప్రేమించాను’ అనే అభిమానయుతమైనటవంటి అహంకార మమకార మిశ్రితంగా మానవుడు వినియోగించుకుంటున్నాడు. తత్‌ ప్రభావం చేత అది ప్రతిబంధకమై, అనురాగమై మమకారాన్ని బలవత్తరంగా ప్రేరేపిస్తుంది. 

తత్‌ ప్రభావం చేత ఆ వస్తువు కనబడకపోయినా, ఆ మనిషి కనబడకపోయినా, లేదా తత్‌ స్మృతి ప్రభావం చేత అయినా సరే, నీవు దుఃఖాన్ని పొందుతావు. ఈ రకంగా ప్రతిబంధకమై కూర్చొంటుంది అనురాగము. కాబట్టి మానవులందరూ తప్పక ప్రయత్నించి ఈ అనురాగ బంధ విముక్తులవ్వాలి. 

తప్పనిసరిగా ప్రేమ భావంతో మానవులందరూ సమత్వభావంతో వ్యవహరించాలి. వైరం లేకుండా వుండాలి, ద్వేషం లేకుండా వుండాలి. రాగద్వేషాలు అనే ద్వంద్వ ప్రకృతి నుంచీ విముక్తులవ్వాలి. ఈ ప్రేమ రాగద్వేషములకు అతీతమై వుంటుంది. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భక్తి వలన ప్రయోజనం - అర్హత - ఏది సరైన సమయం? 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

(1) భక్తి అంటే మానవుని కష్టాలను శాశ్వతంగా నివారించడానికి చేసేది. భగవంతుని నుండి వేరైన జీవుడిని తిరిగి భగవంతునిలో ఐక్యం చేయడానికి చేసేది. భక్తి అంటే కలయిక, అనగా యోగం. అందువలన భక్తి సాధన భక్ యోగం అని పిలువబడుతుంది.

 భగవంతుని నుండి జీవుడు దూరమవడానికి కారణం జీవునిలో తలెత్తిన అహంకార మమకారాలు. వీటిని తొలగించుకుంటే జీవుడె దేవుడు. దినికి మారం భక్తి. జీవుడు దేవుడైతే శాశ్వత ఆనందం, పరమశాంతి నిలుస్తాయి. భక్తి అనెది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికైనా తప్పదు.

భక్తిని వాయిదా వేసె వారు చివరికి కష్టాలతో కొట్టబడ్డప్పుడు వారి దుఃఖ నివృత్తి కొరకు తప్పనిసరిగా ఏదో విధంగా ఆ దేవదేవుని ఆశ్రయించక తప్పదు.

(2) అనేకమైన కష్టాలను చవిచూచినవారు గత్యంతరం లేక ఈ భక్తిని స్వీకరిస్తారు. పూర్వ జన్మలలో చేసిన సాధనల పర్యవసానంగా కొందరికి చిన్న వయస్సులోనే భక్తి భావం కలుగుతుంది. దీనికి ధృవుడు, ప్రహాదుడు ఉదాహరణీయం. పెద్దల సలహాతో కొందరికి భక్తి భావం కలిగి సాధన మొదలు పెడతారు. కష్టాలు సంభవించినప్పుడు ప్రారంభించే భక్తి ఎలాంటిదంటే అగ్ని
ప్రమాదం సంభవించాక ఆ అగ్నిని చల్లార్చుటకు బావి త్రవ్వడం ప్రారంభించడం లాంటిది.

 ముందుచూపుతో బావి త్రవ్వుకునే వారిలాగా, భక్తి సాధనను ముందుగానే ప్రారంభించడం ఉత్తమం. కుల, మత రహితంగా మానవులంతా భక్తి చేయడానికి యోగ్యులు. అన్ని వయసుల ప్రీ పురుషులు యోగ్యులే.

(3) భక్తి వలన ప్రయోజనం ఏమిటంటే భగవంతుని అనుగ్రహం పొందడం. భగవదనుగ్రహం వలన జనన మరణ రహితమైన ముక్తి కలగడం.
పరమశాంతి, శాశ్వతానందం అనె పరాభక్తి సిద్ధించడం. సంసార దుఃఖం నుండి బంధం నుండి విముక్తి చెందదం.

(4) భక్తి సలపడానికి అందరూ యోగ్యులైనప్పటికి ప్రత్యేకంగా భక్తి
ఫలితాన్ని పొందాలంటే లక్ష్యమెరిగి చేయాలి. కోరికలు తీరదడానికో బాధల
నివారణకో కాక, భక్తి అనెది భగప్రీతి కొరకు మాత్రమె చేయాలి.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment