*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 7 🌻*
శివ భక్తిశ్చ సర్వేషాం - సర్వదా సర్వతో ముఖా,
తస్యాం చ లిష్య మానాయాం - యస్తు మర్త్యో విముచ్యతే .22
సంసార బంధ నాత్తస్మా - ధన్యః కో వావి మూడది :
శివ భక్తి ఎవరి యందు దృడ పడునో వారలకు (శివ భక్తులకు ) ఎల్లప్పుడు కోరికలను దీర్చును. దానిలో పూర్తిగా ఆసక్తి గలవాడు ఈ సంసార పాశ బంధముల నుండి విడువ బడుచున్నాడు.
నియ మాద్యస్తు కుర్వీత - భక్తిం వాద్రో హమేవ వా ;
తస్యాపి చేత్ప్ర సన్నో సౌ - ఫలం యచ్ఛతి వాంచితమ్ 23
బుద్దిం కించిత్స మాదాయ - క్షుల్లకం జలమేవ నా ,
యోదత్తే నియమేనా సౌ - తస్మై దత్తే జగత్ప్రయమ్ 24
ఏనాడు నియమము తప్ప కుండా పరమ శివుని పై భక్తితో గాని, చెడ్డ తనము చేయకుండగా గాని ఆచరించునో అట్టి భక్తునకు పరమాత్ముడు ప్రత్యక్షమై సంతోషించిన వాడై సర్వాభీష్టములను సఫల మొనర్చును. బిల్వ దళము గాని, జలము గాని, అనన్య భక్తితో సమర్పించునో అతనికి నా పరమశివుడు త్రైలోకాదిపత్యము నొసంగును.
తస్యాప్య శక్తి నియమా - న్నమస్కారం ప్రదక్షిణామ్,
యః కరోతి మహేశస్య - తస్మై తుష్టో భవేచ్చినః 25
ప్రదక్షిణా స్వవక్తోపి - యస్స్వాంతే చింత యేచ్చినమ్,
గచ్చన్స ముపవిష్టో వా - తస్యా భీష్టం ప్రయచ్ఛతి.26
అట్లు చేయుట కవకాశము లేనిచో ప్రదక్షిణ నమస్కారముల మనస్పూర్తిగా సమర్పించినను అందుకు ప్రసన్నుడై మృత్యుంజయు డానం దించును. అందుకును అవకాశముఅధవా సామర్ధ్యము లేని యెడల తానున్న చోటనే పరమ శివుని మనస్సులో ధ్యానించ వలెను. దాన శివుడు కోరిన కోరికల తీర్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 7 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 01:
*🌻 Bhakti Niroopana Yoga - 7 🌻*
22. One whose Shiva Bhakti becomes strong, such people would get all theyr desires fulfilled by it. But for those who are totally submitted in Shiva Bhakti, would get liberated out of the birthrebirth cycle and would attain Salvation.
23. 24. One who is devoted to Paramashiva with veneration, or devoted to him without doing any sins, with such kind of devotee Lord would be highly pleased, would fulfill all his wishes.
One who dedicates Shiva the Bilva leaves, or water with full devotion; with him lord would be so pleased that he can bestow the devotee the empire of the three worlds. (Such a kind hearted Lord is our Lorrd Shiva).
25. 26. One who is unable to worship Shiva (as described in previous slokas), if he circumambulates and offers Namaskara (Salute) to the Lord, the Lord would get pleased and would become happy.
Even to this simple thing as well, if someone doesn't have time or is unable to do, he can simply think of lord Shiva from the same place where he is.
With this insignificantly seeming prayer also Lord Shiva would shower all the boons which the devotee is desirous of!! (That shows the generosity of Lord Shiva. How much he loves us, we can understand from the above Verse!!).
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment