శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 82, 83 / Sri Lalitha Chaitanya Vijnanam - 82, 83

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 45 / Sri Lalitha Sahasra Nama Stotram - 45 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 82, 83 / Sri Lalitha Chaitanya Vijnanam - 82, 83 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :


కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ‖ 33 ‖


🌻 82. 'కామేశ్వరాస్త్ర నిర్దగ్గ సభండాసుర శూన్యకా' 🌻

భండాసురునితో కూడిన శూన్యకమను అతని పట్టణమును కామేశ్వరాస్త్రముతో నిశ్శేషముగ దహించినది. దేవి యని యర్ధము. భండాసురుడు (అహంకార స్వరూపుడు) శూన్యకమను పట్టణమున వసించుచుండును.

ప్రతి జీవుడును తన భార్య, పిల్లలు, గో భూ సంపద, తన కీర్తి, తన ప్రతిష్ఠ, తనవూరు, తన వారు, తన దేశము అని భావించుట కలదు. ఇది నిజమునకు మాయయే. అంతయూ ఈశ్వర స్వరూపమే అయి వుండగ, కామము కారణముగ కల్పింపబడిన ఈ సృష్టియందు కామవశుడై, ఉన్నది చూడక తాను చూచుచున్నది ఉన్నదను కొనుచున్నాడు జీవుడు. ఇది కామ ప్రభావమే.

సృష్టి సమస్తము కామేశ్వర కామేశ్వరీ కల్పితమే. పరమాత్మ నుండి సంకల్పముగ కామేశ్వరీదేవి ఉద్భవించెను. ఆమె సంకల్ప మాత్రముగ సృష్టి ఏర్పడును. కామము సృష్టికి ప్రధాన లక్షణము. కామము లేనిదే సృష్టి లేదు. కామము లేనిదే జీవుడు కదలడు. కామమే ప్రాణముగ అతను జీవించును. అతని జీవనమంతయు కామ పరితృప్తికే. జీవుడు సహజముగ ద్వైత భావమున జీవించును.

త్రిగుణముల నుండి జనించినవాడు కదా ! కావున నేను, నాది అను భావము సహజముగ నుండును. ఇది అహంకారము వలన జనించునది. ఇది అజ్ఞానపు మొదటి ఆవరణము. ఈశ్వర భావము దీనికి ఔషధము వంటిది. ఇది అద్వైత భావము. ఉన్నది అద్వైతమే. చూచువాని కది ద్వైతముగ కనిపించును.

ద్వైతమునబడి సృష్టి సామ్రాజ్యమున తనదైన సామ్రాజ్య మొకటి నిర్మించును. వాటికి ఎల్లలు ఏర్పరచును. ఒక అంగుళము మేర ఎవరైనను ఆక్రమించినచో ఆగ్రహించును. నిజమునకు అతని ఊహా నిర్మితమగు రాజ్యము ఊహయేగాని సత్యము కాదు. కామేశ్వరాస్త్ర మనగా కామమును దహించు అస్త్రము. అపుడు మిగులునది అద్వైతమే. జీవునకపుడు నేను, నాది యని యుండదు.

అహంకారుడుగ నున్నప్పుడు తనకున్న సామ్రాజ్యమపుడు శూన్యమగును. నిజమునకు జీవుని సామ్రాజ్యము శూన్యమే. అందులకే అహంకారుని పట్టణము శూన్యక మనిరి. ద్వైత భావమున ఏర్పడిన మాయా నిర్మిత స్వజన స్వదేశములన్నియు అద్వైత భావమున అదృశ్యమగును. క్లుప్తముగ చెప్పవలెనన్నచో కామేశ్వరాస్త్రము మాయను ఛేదించి జీవుని సత్య మందుంచును. కావున ముక్తిప్రదము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 82 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Kāmeśvarāstra-nirdagdha- sabhaṇḍāsura- śūnyakā कामेश्वरास्त्र-निर्दग्ध-सभण्डासुर-शून्यका (82) 🌻

Śūnyaka is the capital of Bhandāsura. Bhandāsura was burnt along with his capital city by the fire from astrā of Kāmeśvara. The last nāma mentioned about the astrā of Paśupati and in this nāma the astrā of Kāmeśvara is discussed. With this nāma the war with Bhandāsura ends with the killing of Bhandāsura and his warriors along with the destruction of his kingdom.

Kāmeśvara form of Śiva is considered as the supreme form than the Paśupati form of Śiva. Kāmeśvara form is the Brahman. Since the attributes are being discussed in this nāma, possibly the present refers to saguṇa Brahman. When we talk about Brahman, it always means the highest level of consciousness. The supreme form of consciousness is not discussed here as Vāc Devi-s continue to discuss Her attributes thereby referring Her form of saguṇa Brahman.

There is a definition for Kāmeśvara. He is liked by all and all like Him. Thus He becomes both subject as well as object. Object is Śiva and liking is the subject. Generally, Śiva is always referred as the subject. Vāk Devi-s end this part of Sahasranāma with a subtle hint on renunciation. Renunciation is one of the steps to realise the nirguṇa Brahman.

All renunciations are in favour of the Supreme Self (nirguṇa Brahman). This is confirmed in Bṛhadāraṇayaka Upaniṣad (II.4.5) which says, “The Self should be realised, should be heard of, reflected on and meditated upon. By realisation of the Self, all is known.” There is nothing beyond that.

Kāmeśvara is the Supreme Self or the Brahman. Bhandāsura refers to ego. Army refers to the subtle body (mind). When ego and activities of subtle body are removed, what remains is only the Brahman.

Since Bhandāsura has been destroyed along with his army, what remains is the śūnya or void. This means the thought of duality has gone paving way for realization of the Brahman. The destination can be achieved by meditation and internal exploration.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 83 / Sri Lalitha Chaitanya Vijnanam - 83 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :


కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ‖ 33 ‖


🌻 83. 'బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా' 🌻

బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఆదిగాగల దేవతలచే స్తుతింపబడిన వైభవము కలది శ్రీదేవి యని అర్థము.

శ్రీదేవి, ఆమె శక్తి పరివారము భండాసురుని, అతని సోదరులను, అతని పుత్రులను వధించిన విధానము, ముందు నామములలో తెలుపబడినది. భండ సైన్యమును 'నకులీ' శక్తులతో వధించినది. భండ పుత్రులను 'బాల' రూపముతో వధించినది. విషంగుని గేయచక్రమును అధిష్ఠించిన 'శ్యామలగ' వధించినది. విశుక్రుని కిరిచక్ర మెక్కిన 'వారాహిగ' వధించినది. భండాసురుని విఘ్నయంత్రమును 'మహాగణేశుని' అవిర్భవింప చేసి, అతనిచే భిన్నము గావించినది.

భండాసురుడు వదలిన అస్త్రము లన్నింటికిని ప్రత్యస్త్రములను వర్షించినది. నారాయణాస్త్రమును, మహా పాశు పతాస్త్రమును కామేశ్వరాస్త్రమును ప్రయోగించి భండాసురుని, అతని శూన్యక పట్టణమును కూడ నశింప చేసినది. ఇట్టి మహత్తర కార్యములను నిర్వర్తించిన లలితాదేవిని బ్రహ్మాది దేవతలు కీర్తించినారు. ఆమె వైభవమును స్తుతించినారు. బ్రహ్మాది దేవతలు కూడ శ్రీదేవి నుండి దిగివచ్చినవారే. భండాసురుడును అట్టివాడే.

బ్రహ్మాది దేవతలు సృష్టి నిర్మాణము కార్యము చేయుచుండగ తద్భిన్నమగు కార్యములు భండాసురుడు చేయుటచే భండాసురుడు దేవతలకు శత్రువయ్యెను. దైవాసురులు శత్రుత్వమునకు కారణము వారందరూ త్రిగుణాత్మకు లగుటయే. త్రిగుణాతీత శ్రీదేవియే. త్రిగుణాత్మకులు అహంకార రూపులే.

ప్రతి మానవుని యందును మంచి చెడుల ఘర్షణ జరుగుచునే యుండును. అవియును దైవాసుర యుద్ధము వంటిదే. ఈ యుద్ధమున కొన్నిమార్లు దేవతలు, కొన్నిమార్లు అసురులు గెలుచుచుందురు. ఈ యుద్ధము జీవుల యందు నిరంతరము జరుగుచునే యుండును. యుద్ధమున పరిష్కారములు తాత్కాలికములే.

మరల అసురశక్తులు దైవశక్తులు బలమును కూడగట్టుకొనుట, యుద్ధమును చేయుట జరుగు చుండును. దీనికి శాశ్వత పరిష్కారమే గుణాతీత స్థితి. ఇది ఆత్మస్థితి. ఆత్మ నుండి దిగివచ్చినదే చైతన్యము. అట్టి శుద్ధ చైతన్యము నుండి దిగివచ్చినవే త్రిగుణములు. త్రిగుణముల మిశ్రమ రూపమే అహంకారము.

శ్రీదేవి సర్వాత్మిక అనగా అందరి యందు ఆత్మ స్వరూపము. చైతన్య స్వరూపము, అసురలయందు ఉన్నది గాని, ఒకే దైవమగుటచే ఆమె వైభవము అసురులకును లేదు. సురలకునూ లేదు. వారు స్తుతించుచు ఆత్మ తత్త్వమున ప్రవేశింతురు. మానవులకు కూడ నదియే గతి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 83 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Brahamopendra-mahendrādi-devasaṃstuta-vaibhavā ब्रहमोपेन्द्र-महेन्द्रादि-देवसंस्तुत-वैभवा (83) 🌻

The victorious Lalitai is praised by Brahma, Viṣṇu (Upendra means Viṣṇu. Refer Viṣṇu Sahasranāma nāma 57, Mahendra (a form of Śiva) and other gods like Indra, etc.

As She is considered as the Supreme power, Gods like Brahma, Viṣṇu and Śiva praise Her. Saṃstuta means praise. Saṃstuta also means internally. Vaibhava means omnipresence. She is worshiped by all, as She is known as the Supreme Ātman.

As She is the omnipresent Brahman, Her existence is described both internally (through mind) and externally (through senses). Brahman exists everywhere both internally and externally. This aspect is discussed in the next nāma also. The power of the kinetic energy is explained here.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


10 Nov 2020

No comments:

Post a Comment